జై సేన విజయం సాధించాలి | Jai sena Teaser Launch by Hero Gopichand | Sakshi
Sakshi News home page

జై సేన విజయం సాధించాలి

Published Sun, Jun 23 2019 3:03 AM | Last Updated on Sun, Jun 23 2019 3:03 AM

Jai sena Teaser Launch by Hero Gopichand - Sakshi

గోపీచంద్‌తో సముద్ర, సునీల్‌...

శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్‌ రోల్‌. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్‌ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్‌ రెడ్డి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement