bheemavaram bullodu
-
గ్రేట్ క్రియేటర్స్
కల్మషం లేని ఆ పిల్లల నవ్వులు మర్యాదరామన్నను కట్టిపడేశాయి. మనసున మెదిలిన రూపాలను అందంగా తీర్చిదిద్దిన ఆ విద్యార్థులు భీమవరం బుల్లోడి మనసు దోచుకున్నారు. మానసిక వైకల్యాన్ని ఎదిరిస్తూ.. కళలో రాణిస్తున్న బేగంపేటలోని శ్రద్ధ సబూరి స్కూల్ విద్యార్థులతో హీరో సునీల్ సోమవారం సందడిగా గడిపారు. పాఠశాల మాతృ సంస్థ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమర్థ్ వొకేషనల్ స్కూల్లో శిక్షణ పొందిన 200 మంది విద్యార్థులు రూపొందించిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు సునీల్ హాజరయ్యారు. పేపర్ ప్రొడక్ట్స్, జూట్ బ్యాగ్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, జెల్లీ క్యాండిల్స్ వంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. నచ్చే కొంటున్నా... విద్యార్థులు రూపొందించిన ప్రొడక్ట్స్ చూసి సునీల్ ముచ్చటపడ్డారు. అక్కడి ఐటెమ్స్ కొనుగోలు చేశారు. మానసిక వైకల్యాన్ని అధిగమిస్తూ ప్రతిభ చూపిన ఈ విద్యార్థులను చూసిన సునీల్ ఎమోషనల్ అయ్యారు. వాటిని ఎలా తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. ‘వీళ్ల సృజనాత్మకత గొప్పది. నవ్వులో ఎంత ప్యూరిటీ ఉందో.. పనిలోనూ అంతే క్వాలిటీ ఉంది. వారి మీద జాలితో ఈ వస్తువులు కొనలేదు.. ఆ ప్రొడక్ట్స్ నచ్చడంతోనే కొన్నాన’ని చెప్పాడు సునీల్. విద్యార్థులు రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ ప్రతిమలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఎక్స్పో ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. - సిరి -
యాక్టర్ నుంచి కలెక్టర్ అవ్వాలని...
సినిమా నటులు చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. నిజంగా కూడా కొందరు డాక్టర్ చదవాలనుకొని యాక్టర్‌గా వచ్చేసినవారు ఉన్నారు. కొందరైతే డాక్టర్లు అయిన తరువాత యాక్ట్లర్లు అయిన వారు కూడా ఉన్నారు. ఇది మరీ రొటీన్‌గా ఉందని అనుకుందో ఏమో,ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ యాక్టర్ అయిన తరువాత కలెక్టర్ కావాలని అనుకుంటోంది. ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? 1000 అబ్దాలు సినిమాతో హీరోయిన్గా తెలుగుతెరకు పరిచయమైన ఎస్తేర్ నరోన్హ. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ఈ అందాల బొమ్మ నీరసపడిపోయింది. ఫ్లాప్ చిత్రం తరువాత కూడా ఈ చిన్నదానికి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో అవకాశం లభించింది. మంచి దర్శకుడి చేతిలో పడింది. అయినా ఫలితంలేదు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ సునీల్ సరసన నటించింది. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని ఈ భామ భావించింది. ఇది కూడా నిరాశే మిగిల్సింది. టాలీవుడ్‌లోని అందరు హీరోలతో నటించాలనుకున్న ఈ అమ్మడికి నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఏంచేయాలో తోచలేదు. అదీగాక చర్చలు జరుగుతున్న చిత్రాలు కూడా వెనక్కుపోయాయి. తేజ, ఉదయభాస్కర్ వంటి దర్శకులు చిత్రాలలో నటించినప్పటికీ ఎస్తేర్ కు కలిసిరాలేదు. ఈ పరిస్థితులలో తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఆ కోరిక ఏంటని అనుకుంటున్నారా? కలెక్టర్ కావాలన్నది ఈ అందాల ముద్దుగుమ్మ కోరికట. అందుకే ఐఏఎస్ పూర్తి చేయాలని అనుకుంటోంది. నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో వదిలివేసిన పిజి కోర్సును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఎస్తేర్ నరోన్హ ఇంత తొందరగా మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల సినీవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
కడపలో భీమవరం బుల్లోడు
కడప, ప్రొద్దుటూరులో శుక్రవారం ‘భీమవరం బుల్లోడు’ సందడి చేశాడు. హీరోయిన్ ఎస్తేర్‌తో కలిసి స్టెప్పులేశాడు. అభిమానులతో కరచాలనం చేసి ఆటొగ్రాఫ్లిచ్చి.. ఫొటో దిగారు. నిజమైన హీరోలు అభిమానులేనని, ప్రొద్దుటూరు అంటే తనకెంతో ఇష్టమని సునీల్ పేర్కొన్నాడు. కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ‘భీమవరం బుల్లోడు’ సినిమా బృందం శుక్రవారం కడప నగరానికి వచ్చారు. ‘విజయ యాత్ర’ పేరిట వచ్చిన ఈ చిత్రం కథా నాయకుడు సునీల్, నాయిక ఎస్తేర్, దర్శకుడు ఉదయ్ శంకర్, నటుడు ఫృథ్విరాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) తదితరులకు నగర ప్రముఖులు రవీంద్రనాథరెడ్డి (రూ.స్ క్రీం రవి) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఓ హోటల్లో వారు విలేకరులతో ముచ్చటించారు. నటుడు సునీల్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి విజయ యాత్ర ప్రారంభించామనీ, ప్రతిచోటా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులందరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవడం బాధ్యతగా భావించి ఈ యాత్ర చేపట్టామన్నారు. కథా నాయిక ఎస్తేర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో, అందునా ఆ సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మించిన ఈ చిత్రంలో తనకు అవకాశం లభించడం అదృష్టమన్నారు. ఉదయ్ శంకర్ లాంటి విజయవంతమైన దర్శకుని సినిమాలో నటించగలగడం గొప్పగా భావిస్తున్నామన్నారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. స్టెప్పులేసి.. సందడి చేసి : అనంతరం ఈ బృందం కడప నగరంలో భీమవరం బుల్లోడు చిత్రం ప్రదర్శిస్తున్న రవి థియేటర్‌కు వెళ్లి కొద్దిసేపు గడిపారు. అభిమానుల కోరికపై సునీల్ ఒక పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. అభిమానులతో కరచాలనం చేసి ఆటోగ్రాఫ్‌లిచ్చి కలిసి ఫోటోలు దిగారు. -
భీమవరం బుల్లోడి సందడి
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ‘భీమవరం బుల్లోడు’ చిత్రం విజయయాత్రకు వచ్చిన హీరో సునీల్ మంగళవారం రాజమండ్రిలో సందడి చేశారు. స్థానిక శ్యామలా థియేటర్‌కు ఉదయం ఆట జరుగుతూ ఉండగా సునీల్, హీరోయిన్ ఎస్తేర్, యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో ప్రేక్షకులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. భీమవరం బుల్లోడు చిత్రాన్ని విజయవంతం చేసి తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ఇదే ఊపుతో మరో విభిన్నమైన సినిమాతో ముందుకు వస్తానన్నారు. హీరోయిన్ ఎస్తేర్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని అనుకోలేదన్నారు. ‘భీమవరం బుల్లోడు’ టైటిల్‌సాంగ్‌కు సునీల్, ఎస్తేర్ కాసేపు నర్తించి ప్రేక్షకులను హుషారెత్తించారు. అభిమానులు యూనిట్‌పై పూలవర్షం కురిపించారు. థియేటర్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. విలన్ వేషానికీ ఓకే కల్చరల్ (కాకినాడ) : అవకాశం వస్తే విలన్ పాత్రకైనా సిద్ధమేనని నటుడు సునీల్ పేర్కొన్నారు. బీమవరం బుల్లోడు చిత్రం యూనిట్ విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడ వచ్చిన సునీల్ హోటల్ రాయల్‌పార్క్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ీహీరోయిన్ ఎస్తేర్,దర్శకుడు ఉదయశంకర్, మాటల రచయిత శ్రీధర్, కమెడియన్ పృథ్వి తదితరులు పాల్గొన్నారు. తన చిత్రం ఘనవిజయానికిసహకరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమాపై దృష్టి పెట్టడం తనకు ఇష్టం ఉండదని, అందుకే గ్యాప్ ఎక్కువ వస్తోందని సునీల్ అన్నారు. సిక్స్ ప్యాక్ సాధనకు ఆహార నియమాల విషయంలో తనకు ప్రముఖ హీరో మహేష్‌బాబు సలహాలు ఇచ్చేవారన్నారు. పైరసీ వలన పరిశ్రమ నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు తనకు తెలియవని, ఎప్పటికీ అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. ఎస్తేర్ మాట్లాడుతూ సునీల్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మాటల రచయిత శ్రీధర్ మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లోని డైలాగులంటే ఇష్టమన్నారు. ఆ ట్రెండ్‌లోనే ఈ చిత్రానికి మాటలు రాశానన్నారు. సురేష్ మావీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ లక్ష్మణరావు, సురేష్ మూవీస్ మేనేజర్ సురేష్, శ్రీనివాసరావు, దేవి మల్టిప్లెక్స్ థియేటర్ మేనేజర్ నారాయణ పాల్గొన్నారు. -
భీమవరం బుల్లోడు
-
భీమవరం బుల్లోడు
-
భీమవరం బుల్లోడు వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను
‘‘ఈ సినిమా వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత ‘పూలరంగడు’ చూశాక సునీల్‌కి యాప్ట్ అనిపించింది’’ అని దర్శకుడు ఉదయ్‌శంకర్ చెప్పారు. సునీల్, ఎస్తేర్ జంటగా ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉదయ్‌శంకర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నేను ఇంతకు ముందు కలిసుందాం రా’, ‘బలాదూర్’ సినిమాలు డెరైక్ట్ చేశాను. వాటి తరహాలోనే పూర్తి స్థాయి కుటుంబ హాస్య చిత్రమిది. ఇందులో యాక్షన్‌ని కూడా కామెడీ రూపంలోనే చూపించాను. సునీల్ బాగా ఇన్వాల్వ్ అయి పనిచేశారు. ఈ సినిమా విషయంలో అందరికంటే నిర్మాత సురేష్‌బాబు బాగా నమ్మకంతో ఉన్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు
‘‘ఈ సినిమాలో ఓ కోణంలో అమాయకంగా, మరో కోణంలో ధైర్యంగా కనిపిస్తాను. పొట్ట చెక్కలయ్యే కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. నా కెరీర్లో మైలురాయిలా నిలిచే సినిమా ఇది’’ అని సునీల్ అన్నారు. ‘కలిసుందాం రా’ ఫేం ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘భీమవరం బుల్లోడు’. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 22న భీమవరంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవలే తెరకెక్కించిన ప్రమోషనల్ సాంగ్నిత్వరలోనే విడుదల చేస్తాం. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పెళ్లికానీ కుర్రాడు, ప్రేమ జ్వరం ఉన్నోడు, స్నేహమంటే ప్రాణమిచ్చేవాడు... ఇది భీమవరం బుల్లోడి నైజం. సునీల్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అన్నారు. ఇంకా అనూప్‌రూబెన్స్, శ్రీధర్ సీపన, చంద్రబోస్ తదితరులు మాట్లాడారు. కెమెరామేన్ సంతోష్‌రాయ్, కొరియోగ్రఫర్ భాను, సయాజీ షిండే, సామ్రాట్, పృథ్వీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.