భీమవరం బుల్లోడు వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను
‘‘ఈ సినిమా వెంకటేశ్‌తో చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత ‘పూలరంగడు’ చూశాక సునీల్‌కి యాప్ట్ అనిపించింది’’ అని దర్శకుడు ఉదయ్‌శంకర్ చెప్పారు. సునీల్, ఎస్తేర్ జంటగా ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉదయ్‌శంకర్ హైదరాబాద్‌లో పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నేను ఇంతకు ముందు కలిసుందాం రా’, ‘బలాదూర్’ సినిమాలు డెరైక్ట్ చేశాను.
వాటి తరహాలోనే పూర్తి స్థాయి కుటుంబ హాస్య చిత్రమిది. ఇందులో యాక్షన్‌ని కూడా కామెడీ రూపంలోనే చూపించాను. సునీల్ బాగా ఇన్‌వాల్వ్ అయి పనిచేశారు. ఈ సినిమా విషయంలో అందరికంటే నిర్మాత సురేష్‌బాబు బాగా నమ్మకంతో ఉన్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.