కడప, ప్రొద్దుటూరులో శుక్రవారం ‘భీమవరం బుల్లోడు’ సందడి చేశాడు. హీరోయిన్ ఎస్తేర్‌తో కలిసి స్టెప్పులేశాడు. అభిమానులతో కరచాలనం చేసి ఆటొగ్రాఫ్‌లిచ్చి.. ఫొటో దిగారు. నిజమైన హీరోలు అభిమానులేనని, ప్రొద్దుటూరు అంటే తనకెంతో ఇష్టమని సునీల్ పేర్కొన్నాడు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ‘భీమవరం బుల్లోడు’ సినిమా బృందం శుక్రవారం కడప నగరానికి వచ్చారు. ‘విజయ యాత్ర’ పేరిట వచ్చిన ఈ చిత్రం కథా నాయకుడు సునీల్, నాయిక ఎస్తేర్, దర్శకుడు ఉదయ్ శంకర్, నటుడు ఫృథ్విరాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) తదితరులకు నగర ప్రముఖులు రవీంద్రనాథరెడ్డి (రూ.స్ క్రీం రవి) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఓ హోటల్‌లో వారు విలేకరులతో ముచ్చటించారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి విజయ యాత్ర ప్రారంభించామనీ, ప్రతిచోటా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులందరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవడం బాధ్యతగా భావించి ఈ యాత్ర చేపట్టామన్నారు. కథా నాయిక ఎస్తేర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో, అందునా ఆ సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మించిన ఈ చిత్రంలో తనకు అవకాశం లభించడం అదృష్టమన్నారు. ఉదయ్ శంకర్ లాంటి విజయవంతమైన దర్శకుని సినిమాలో నటించగలగడం గొప్పగా భావిస్తున్నామన్నారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
స్టెప్పులేసి.. సందడి చేసి :
అనంతరం ఈ బృందం కడప నగరంలో భీమవరం బుల్లోడు చిత్రం ప్రదర్శిస్తున్న రవి థియేటర్‌కు వెళ్లి కొద్దిసేపు గడిపారు. అభిమానుల కోరికపై సునీల్ ఒక పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. అభిమానులతో కరచాలనం చేసి ఆటోగ్రాఫ్‌లిచ్చి కలిసి ఫోటోలు దిగారు.
కడపలో భీమవరం బుల్లోడు
Published Sat, Mar 8 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement