దేవాలయంలో వీర రాఘవ | aravinda sametha veera raghava shootings hyderabad | Sakshi
Sakshi News home page

దేవాలయంలో వీర రాఘవ

Published Sat, Aug 4 2018 1:11 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

aravinda sametha veera raghava shootings hyderabad - Sakshi

ఎన్టీఆర్‌

ఆలయంలో పూజలు చేస్తున్నారట వీర రాఘవ. ఈ పూజ ఫలం ఎవరికి దక్కుతుంది అనేది వెండితెరపై తెలుస్తుంది. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఓ దేవాలయంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.ఇటీవల పూజాహెగ్డే, సునీల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు టీమ్‌. అలాగే ఈ సినిమాలో నటుడు నాగబాబు ఓ గ్రామ సర్పంచ్‌ పాత్రలో నటిస్తున్నారని, ఈ సర్పంచ్‌ కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తారని టాక్‌. రావు రమేష్‌ ఓ పొలిటికల్‌ లీడర్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. జగపతిబాబు, ఈషా రెబ్బా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement