'అన్నయ్య'కు ఓకే చెప్పిన సునీల్ | Sunil's Comedy With Chiru's 150th Film | Sakshi
Sakshi News home page

'అన్నయ్య'కు ఓకే చెప్పిన సునీల్

Published Tue, Mar 22 2016 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

'అన్నయ్య'కు ఓకే చెప్పిన సునీల్

'అన్నయ్య'కు ఓకే చెప్పిన సునీల్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కథ కోసం ఇంకా కసరత్తు పూర్తవకపోవడంతో ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని టాక్. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని.. కొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారని వినికిడి. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

అయితే హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్ తిరిగి ఈ చిత్రంలో కమెడియన్గా కనిపిస్తారట. అది కూడా ప్రత్యేకించి మెగాస్టార్ అభ్యర్థన మేరకు. చిరు స్వయంగా పిలిచి మరీ సునీల్ను తన 150వ సినిమాలో కమెడియన్ నటించమని అడిగారని సమాచారం. మొదటి నుంచి చిరంజీవికి ఫ్యాన్ అయిన సునీల్.. 'అన్నయ్య' అడగ్గానే నవ్వుతూ ఓకే చెప్పేశారట. ఇదే నిజమైతే తిరిగి మనం సునీల్ కామెడీ టైమింగ్కి కనెక్ట్ అవడం గ్యారెంటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement