సుధాకర్ చెరుకూరి, ‘దిల్’ రాజు, శర్వానంద్, సునీల్, హను రాఘవపూడి, శత్రు
‘‘తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త నిర్మాతలు వస్తుంటారు. కానీ కొంతమందే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ ఒకరు అనిపిస్తోంది. తను 14 రీల్స్, మైత్రీ మూవీస్‌లో చేస్తున్నప్పటి నుంచి ఐదేళ్లుగా నాకు పరిచయం. తొలి సినిమానే శర్వానంద్, హను వంటి మంచి కాంబినేషన్‌లో నిర్మించడం హ్యాపీ’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘హను ఫస్ట్ సినిమా ‘అందాల రాక్షసి’ చాలా మంచి సినిమా. కానీ, ఎందుకు హిట్ అవ్వలేదో తెలీదు. ప్రేమకథలు తీయడంలో మణిరత్నంగారి టేకింగ్ హను సినిమాల్లో కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ‘పడి పడి లేచె మనసు’తో 100 శాతం హిట్ సాధిస్తాడనే నమ్మకం ఉంది. శర్వానంద్, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా ‘గీతాంజలి, ఫిదా’ సినిమాల్లా హిట్ అవ్వాలి’’ అన్నారు.
‘‘లై’ సినిమా రిజల్ట్ తర్వాత డిప్రెషన్‌లో ఉన్నా. అలాంటి టైమ్‌లో శర్వాని కలిసి లవ్‌స్టోరీ చేద్దామనడంతో ఓకే అన్నాడు. తను చక్కని సపోర్ట్ ఇచ్చాడు. శర్వా, నిర్మాత సుధాకర్ లేకుంటే ఈ సినిమా వచ్చేది కాదు. కోల్‌కత్తా, నేపాల్‌లో షూటింగ్ చేశాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. చాలాకాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు హను రాఘవపూడి. ‘‘మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశాం. సినిమా గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతా’’ అని శర్వానంద్ అన్నారు. ‘‘రెండున్నర గంటల పాటు అందర్నీ అలరించే మంచి లవ్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు నటుడు సునీల్. ఈ కార్యక్రమంలో సుధాకర్ చెరుకూరి, నిర్మాత సునీల్ నారంగ్, నటీనటులు శత్రు, కల్పిక, పాటల రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment