అక్టోబ‌ర్ 10న ప‌డిప‌డి లేచే మ‌న‌సు టీజ‌ర్! | Sharwanand And Sai Pallavi Movie Padi Padi Leche Manasu Movie Teaser On 10th October | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 3:55 PM | Last Updated on Mon, Oct 8 2018 3:55 PM

Sharwanand And Sai Pallavi Movie Padi Padi Leche Manasu Movie Teaser On 10th October - Sakshi

శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న ‘పడిపడి లేచే మనసు’ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ ఏర్పడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్‌, పోస్టర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య విజయాలు లేక వేగం తగ్గించిన శర్వానంద్‌, ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సాయి పల్లవి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 

డిఫరెంట్‌ టేకింగ్‌తో సినిమాను తెరకెక్కించే హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. అక్టోబర్‌ 10న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించగా.. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement