
మహానుభావుడు సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచిన హను.. శర్వా సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
కొల్‌కతా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలో నేపాల్ లో జరగనున్న షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశాల్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ గెస్ట్ రోల్‌లో అలరించనున్నారు.