
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పడి పడి లేచే మనసు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలని భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం పడి పడి లేచే మనసు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కారణాలేంటన్నది బయటకు రాకపోయినా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ వాయిదా పడితే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా లేక ఇంకాస్త ఆలస్యంగా జనవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment