
శర్వానంద్, సాయి పల్లవి
ప్రేమలో పడితే మనసు గాల్లో తేలిపోతుందా? ఎంత బరువైనా తేలికగా అనిపిస్తుందా? ఇక్కడ ఫొటో చూస్తే అలానే అనిపిస్తోంది. ప్రేయసి బరువుని శర్వానంద్ ఎంత ఆనందంగా మోస్తున్నారో కదా! శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’లోని లేటెస్ట్ స్టిల్ ఇది. హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కలకత్తా సిటీ నేపథ్యంలో ఉంటుంది. సినిమా అవుట్‌పుట్‌పై చాలా హ్యాపీగా ఉన్నాం. శర్వానంద్ లుక్ కొత్తగా ఉంటుంది. నేపాల్‌లో జరిగే షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నాం’’ అన్నారు. మురళీ శర్మ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి, ప్రియ రామన్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి.
Comments
Please login to add a commentAdd a comment