శర్వాతో గొడవ.. సాయిపల్లవి క్లారిటీ! | Sai Pallavi Gave Clarity On Rumours | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 3:44 PM | Last Updated on Wed, Aug 1 2018 6:59 PM

Sai Pallavi Gave Clarity On Rumours - Sakshi

శర్వానంద్‌, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడిందా?

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ సాయి పల్లవి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ, వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. నటిగా మంచి పేరున్న సాయి పల్లవిపై హీరోలతో గొడవ పెట్టుకుంటుందన్న అపవాదు కూడా ఉంది. ఎమ్సీఏ సినిమా సమయంలో నానితో, కణం షూటింగ్‌లో నాగశౌర్యతో సాయి పల్లవి గొడవ పడినట్టుగా వార్తలు వచ్చాయి.

తాజాగా సాయిపల్లవి మరో హీరోతో గొడవ పడట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌ కు బ్రేక్‌ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వటంపై స్పందించారు. ‘శర్వానంద్‌, పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవ’ని ఆమె క్లారిటీ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement