ఏ మాయ చేశాడో | padi padi leche manasu shootings in hyderabad | Sakshi
Sakshi News home page

ఏ మాయ చేశాడో

Published Mon, Sep 24 2018 5:36 AM | Last Updated on Mon, Sep 24 2018 5:36 AM

padi padi leche manasu shootings in hyderabad - Sakshi

శర్వానంద్‌

హీరోయిన్‌ సాయిపల్లవి అలిగారట. అందుకే ఆమెను బుజ్జగించే పనిలో పడ్డారట హీరో శర్వానంద్‌. మరి.. ఏ మాయ చేసి సాయిపల్లవి ముఖంలో చిరునవ్వు తెప్పించారనేది సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. శర్వానంద్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’.  సాయిపల్లవి కథానాయిక. చుక్కపల్లి ప్రసాద్, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, సాయిపల్లవిలపై లవ్‌ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సినిమా టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అయ్యేలా చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఈ చిత్రం రిలీజ్‌ను ప్లాన్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement