ఒలింపిక్‌ విన్నర్‌ ట్రైనింగ్‌లో వరుణ్‌ తేజ్‌ | Olympic winner Tony Jeffries Trains Varun Tej in USA | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ విన్నర్‌ ట్రైనింగ్‌లో వరుణ్‌ తేజ్‌

Published Sat, Mar 9 2019 12:27 PM | Last Updated on Sat, Mar 9 2019 12:27 PM

Olympic winner Tony Jeffries Trains Varun Tej in USA - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్‌ బాక్సర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మెగా ప్రిన్స్‌. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో వరుణ్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ వస్తున్న వరుణ్‌ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండ రీమేక్‌గా వాల్మీకీ సినిమాను స్టార్ట్ చేసిన వరుణ్‌ ఈ సినిమాను కూడా ప్యారలల్‌గా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement