జోడీ కుదిరిందా? | Varun Tej Romance to Eesha Rebba | Sakshi

జోడీ కుదిరిందా?

Feb 6 2019 5:51 AM | Updated on Feb 6 2019 5:51 AM

Varun Tej Romance to Eesha Rebba - Sakshi

వరుణ్‌ తేజ్‌, ఈషా రెబ్బా

వెండితెర ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కి జోడీ కుదిరిందట. వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. రేస్‌లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ముందు వరుసలో ఉన్నారని సమాచారం. ఈషా కాకుండా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ ఉంటారట. ఇటీవల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ, సుబ్రహ్మణ్యపురం’ సినిమాల్లో మంచి నటనను కనబరిచారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘వాల్మీకి’ చిత్రం కోలీవుడ్‌ హిట్‌ ‘జిగర్‌దండా’కి రీమేక్‌ అని సమాచారం. ఆ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్‌ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్య పేర్లు తెరపైకి వచ్చాయి. అధికారిక సమా చారం అందాల్సి ఉంది. ‘వాల్మీకి’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement