valmiki
-
Sakshi Little Stars: డాటర్ ఆఫ్ డైరెక్టర్ సుకుమార్
పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్హ్యాండ్లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.ఈ బాధ్యత మనందరిదీ...‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది. – సుకృతిలైబ్రరీ... కల్చరల్ టూర్మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం. – హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులుస్ఫూర్తిదాయకమైనదినేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది. – డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలుఎప్పుడూ చిల్డ్రన్స్ డేనేమాకెప్పుడూ చిల్డ్రన్స్డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను. – మారుతిమాదో కుటుంబంమేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం. – గౌతమ్ సాయిఇదే గురుకులానికి హెల్ప్ చేస్తానేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను. – అనిల్ప్రేమ, తోడ్పాటు కావాలిఅప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను. – భాను ప్రసాద్ -
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
వాల్మీకి మహర్షికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు వాల్మీకి మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వాల్మీకి మహర్షికి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు.వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత @ysjagan గారు.#ValmikiJayanti#YSJagan#AndhraPradesh pic.twitter.com/ebb2fghyRO— YSR Congress Party (@YSRCParty) October 17, 2024 -
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
కనుడు కనుడు రామాయణ గాథ
విజయనగరం రూరల్: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మికి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మికి రామాయణ రీసెర్చ్ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామనారాయణం ఒక ఆధ్యాతి్మక కేంద్రం మాత్రమే. వాల్మికి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.12 వేల గ్రంథాలు ఏర్పాటు వాల్మికి రామాయణం రీసెర్చ్ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాతి్మక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.యువత రావాలి ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కలి్పంచిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.వైష్ణవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి పూర్వజన్మ సుకృతంమా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేశంలో పలు మార్గాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువుల సలహాలు, ఆశీస్సులతో ఈ కేంద్రం ఏర్పాటుచేసి సమాజ శ్రేయస్సుకు మా వంతు కృషి చేస్తున్నాం – నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం -
కాంగ్రెస్ ప్రచారానికి వాల్మీకి స్కామ్ డబ్బు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన సొమ్మును కాంగ్రెస్ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం వాడుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌గా చెప్తున్న ఈ కుంభకోణంలో నిధులను దారి మళ్లించి వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని బుధవారం ‘ఎక్స్’వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ‘వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రను కీలక సూత్రధారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిïÙట్లో నిర్ధారించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన రూ.187 కోట్లు కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లాయి. ఆ సొమ్మును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగించిన రూ.20 కోట్ల నగదు కాంగ్రెస్ కీలక నాయకుడి అనుచరుడిదే అని తేలింది. ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ సత్యనారాయణ వర్మ ప్రధాన నిందితుడు.తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. అవినీతిని పెంచి పోషించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాంగ్రెస్ అసలు సిసలు నైజం. దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్‌లో నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. లోతుగా విచారణ జరి పితే తెలంగాణ కాంగ్రెస్‌లోని పెద్ద నాయకుల పేర్లు బయటకు వస్తాయని అన్నారు. ‘నారీ న్యాయ్’కు ఇదేనా నిర్వచనం? ‘సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ప్రకటించడం సిగ్గుచేటు. నారీ న్యాయ్ అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ రేపిస్టులను సమర్థించిన వ్యక్తికి సీటును కేటాయించింది. ‘నారీ న్యాయ్’కు కాంగ్రెస్ చెప్పే నిర్వచనం ఇదేనా?’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ‘వాల్మీకి’ కుంభకోణంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం(సెప్టెంబర్11) కేటీఆర్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్నలోక్సభ ఎన్నికల్లో వాడింది. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలి. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో పేర్కొంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది’ కేటీఆర్ ట్వీట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి.. కబ్జాదారులకు సీఎం రేవంత్ తాజా వార్నింగ్ -
ఆ స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింకేంటి?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?. "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?.’’ అంటూ కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నగదు విత్‌డ్రా చేయబడిన బార్లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?. హైదరాబాద్‌కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!✳️ హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?✳️ "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?✳️… pic.twitter.com/0X1DiQIh4b— KTR (@KTRBRS) August 25, 2024 -
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
రాజంపేటలో వాల్మికి విగ్రహావిష్కరణ
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ వాల్మీకి సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిలు ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ వాల్మికుల సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. వాల్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన వాల్మికి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి సీతారామ,లక్ష్మణ, ఆంజనేయులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, రామాయణం సృష్టికర్త వాల్మీకి మహర్షి అని కొనియాడారు. -
Lord Ram: రాముడిపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. #WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1 — ANI (@ANI) April 15, 2022 -
మన సంప్రదాయాలకు వాల్మీకీ రామాయణం ఆదర్శం
సింగపూర్ : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ‘వాల్మీకి రామాయణ సందేశం‘ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఉపన్యాసకులుగా ఇండోనేషియా నుంచి రామాయణ హరినాథ్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా అంతర్జాల సదస్సును అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని స్పష్టం చేశారు. భగవంతుడు స్వయంగా మానవునిగా అవతరించారని, ఎలా జీవించాలనే చూపారని తెలిపారు. త్రేతాయుగం నాటి శ్రీ రామ చంద్రుడు కుటుంబ ధర్మం, పితృ వాక్ పరిపాలన, రాజ్య పాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు. నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముని గుణగణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ అన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి నాడు ఆయన రాసిన రామాయణం వినడం పుణ్యఫలం అన్నారు. వాల్మీకి రామాయణ సందేశం ఉపన్యాసకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మప్రవర్తనా పరుడైన శ్రీ రాముని చరిత్ర వింటేనే జన్మ తరిస్తుందన్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ విశిష్టతను తెలియజేసేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు దాదాపు 25 దేశాల నుంచి ప్రతినిధులు వెబినార్ కు హాజరయ్యారు. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పిలిప్పైన్, ఇండోనేషియా, యుఎస్ఎ తదితర దేశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రతినిధులకు టీటీడీ ఈ సర్టిఫికెట్ ను అందజేయనుంది. -
కర్నూలులో వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు
కర్నూలు (అర్బన్): కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శనివారం వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో ఇప్పటికే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వాలీ్మకి కార్పొరేషన్ చైర్మన్ డా.బి. మధుసూదన్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య చర్చించారు. వాల్మీకి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం కర్నూలుకు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్లో ఉన్న వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి కారి్మక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన వాల్మీకి నేతలు హాజరుకానున్నారు. -
వందే వాల్మీకి కోకిలమ్
శ్రీరామరామరామేతి రమే రామో మనోరమేసహస్ర నామ తత్తుల్యం రామనామవరాననే..విష్ణుసహస్రనామాలు చదవలేని వారు రామ అనే రెండు అక్షరాలు జపిస్తే చాలని సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతితో అన్నాడు. అంతటి మహిమాన్వితమైన రాముడిని వాల్మీకి ఒక ఆదర్శ మానవుడిగా మనసులో భావించి రామాయణ రచన చేశాడు. ‘ర’ అనే ఒక్క అక్షరాన్ని మాత్రమే రేఫం అంటారు. ర వర్ణానికి శరీర శుద్ధి చేసే లక్షణం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. రాముడు అందరివాడు.. అంతా రామమయం..పాలు మీగడల కన్న పంచదారల కన్న తియ్యనైన నామం..అందరినీ బ్రోచే నామం.. అంటూ రాముడిని ఎవరెవరుఏ విధంగా స్మరించుకున్నారో ఒక్కసారి మనం కూడా వారిని తలచుకుందాం.ఆది కవి వాల్మీకి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి నేల కూలటం చూసి, మనసు చలించి, రామాయణ కావ్యం రచించాడు. రామాయణం ఆదికావ్యం అయింది. నాటి నుంచి కలం పట్టిన ప్రతి కవీ రామాయణాన్ని వారి వారి భావాలతో అక్షరీకరించారు. రంగనాథ రామాయణాన్ని రచించిన గోన బుద్ధారెడ్డి, రామాయణాన్ని ఆ కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేశాడు. లక్ష్మణ రేఖ, సీతమ్మవారిని భూమి పెకలించి రావణుడు ఎత్తుకు వెళ్లటం, శబరి ఎంగిలి పండ్లను ఇవ్వటం, రావణుడి కడుపులో అమృతభాండాన్ని సృష్టించటం.. ఇలా ఎన్నో. తరవాత భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామచరిత మానస్... ఇలా అనంతకోటి రామాయణాలు వచ్చాయి. కాళిదాసు ‘రఘువంశ’ కావ్యాన్ని భారతీయులకు అందించాడు. వాల్మీకి రామాయణం తరవాత తెలుగువారు తరవాత ప్రసిద్ధిగా చెప్పుకోదగ్గది విశ్వనాథ రచించిన ‘రామాయణ కల్పవృక్షం’. 30 సంవత్సరాలు ఈ యజ్ఞం సాగింది. రాముడి మీద ఉండే చనువుతో కొద్దిగా స్వేచ్ఛ తీసుకుని, రామాయణ మూల కథ చెడకుండా, మరిన్ని అందాలు సమకూర్చారు, జ్ఞానపీఠాన్ని అందుకున్నారు. రాముడిని తెగనాడినవారూ లేకపోలేదు. ఆ రాముడి ద్వారానే సదరు రచయితలు ప్రసిద్ధి పొందారు. ఇక సినిమా రచయితలు సైతం రాముడు సీతమ్మను అగ్నిపరీక్షకు గురి చేశారంటూ వారి సొంత కలాన్ని ఉపయోగించారు. సీతమ్మ తనకు తాను అగ్ని ప్రవేశం విధించుకుందని వాల్మీకి ఘోషించాడు. పురిపండా అప్పలస్వామి, బేతవోలు రామబ్రహ్మం, పుల్లెల శ్రీరామచంద్రుడు... గణింపలేనంత మంది రామాయణాన్ని రచించారు. ఇదంతా సాహిత్యం.. భాగవతాన్ని రచిస్తూ పోతన..‘పలికెడిది భాగవతమట/పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట/పలికెద వేరొండు గాథ పలుకగనేలా!’అన్నాడు.రామనామంతో కంచర్ల గోపన్న రామదాసు అయ్యాడు. ‘శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభి రామ.......... భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!’ అంటూ వందకు పైగా పద్యాలతో శ్రీరామచంద్రుడిని ఆరాధించుకున్నాడు. వందలకొలదీ శ్రీరామ కీర్తనలు రచించాడు. ‘నను బ్రోవమని చెప్పవే’ అంటూ సీతమ్మను అర్థించాడు. సంకీర్తనలు... త్యాగరాజు తన కృతులతో, కీర్తనలతో రామనామాన్ని గానం చేసి పరవశించిపోయాడు. ‘బ్రోచేవారెవరే రఘుపతే’ అంటూ రాముడి ఔన్నత్యాన్ని చాటాడు. ఒకటా రెండా వందల కొలదీ కీర్తనలు రామనామాన్ని ప్రతిధ్వనించాయి. నీ దయ రాదా రామా.. అని విలపించాడు. త్యాగరాజుతో పాటు ఇతర వాగ్గేయకారులు కూడా రాముని స్తుతించారు. సినిమాలలో... రాముడి సినిమా అనగానే బాపురమణల జంట గుర్తుకు వస్తుంది. రాముడిని అన్నిరకాల కోణాలలో చూపేశారు బాపు. రాముడిని ఎన్నో రకాలుగా తన కలంతో ముద్దాడారు ముళ్లపూడి వెంకట రమణ. సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, సీతారామవనవాసం, శ్రీరామాంజనేయ యుద్ధం... లాంటి పౌరాణికాలే కాకుండా, సాంఘిక చిత్రాలలోనూ రాముడికి అగ్రస్థానం కల్పించారు. ముత్యాలముగ్గు, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు లాంటి సినిమాలన్నీ రామాయణాన్ని సాంఘికంగా చూపినవే. ఎక్కడ కుదిరితే అక్కడ రాముడిని తెచ్చేస్తారు ఈ జంట. కమ్యూనిస్టుగా పేరుబడ్డ ఆరుద్ర కీర్తించినంతగా రాముడిని మరి ఏ ఇతర సినిమా కవి పొగడలేదేమో. మాధ్యమాల ద్వారా.. శ్రీరామనామం డా. మంగళంపల్లి బాలమురళి గొంతు నుండి అమృతవర్షిణిగా కురిసింది. రామదాసు కీర్తనలను బాలమురళి తన గళం ద్వారా తెలుగు సంగీత ప్రపంచానికి అందచేశారు. విజయవాడ ఆకాశవాణిæ కేంద్రం ద్వారా ఇంటింటినీ అయోధ్యగా మలిచారు ఉషశ్రీ. తన గళంతో వాల్మీకి రామాయణాన్ని ప్రతి ఆదివారం తెలుగు శ్రోతలకు వీనులవిందు చేశారు. దూరదర్శన్‌లో రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచారు రామానందసాగర్. దువ్వూరి వెంకటరమణశాస్త్రి ‘జానకితో జనాంతికం’ అంటూ సీతమ్మతో స్వయంగా మాట్లాడినట్లు చేసిన రచన, ఆయన గొంతులో తెలుగు శ్రోతలను అలరించింది. ప్రస్తుత కరోనా సమయంలో రాములోరి కల్యాణాన్ని అందరం ఇంటి దగ్గరే ఏకాంతంగా చేసుకుందామని పెద్దలందరూ చెబుతున్న విషయాన్ని పాటిద్దాం. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అని ఆ తల్లిని ప్రార్థిద్దాం.– వైజయంతి పురాణపండ -
మాతా... వందనం
95 ఏళ్ళు వచ్చాయి. ఒళ్ళు బాగా ముడతలు పడిపోయింది. బొమ్మలా చిన్నదిగా మంచంలో ముడుచుకుని పడుకుని ఉంది. రాత్రి 11 గంటలకు కొడుకు ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుని రెండు నిమిషాల్లో లేచి పోయాడు. పక్కగదిలో పడుకుని ఉన్న అమ్మ కొడుకుని పిలిచి ‘‘నాన్నా, రెండుమూడు రోజుల్నించి ఇలాగే వస్తున్నావురా, రెండు మూడు నిమిషాల్లో భోజనం ముగించేస్తునావురా... ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా?’’ అంటుంది. వడ్డించక్కరలేదు. వాడు కంచం దగ్గరినుంచి లేచిపోయిన సమయాన్ని బట్టి తల్లి తల్లడిల్లిపోతుంది. దురదృష్టం అంటే... జీవితంలో అమ్మ పోయిననాడే. అమ్మ ఉన్నన్నాళ్ళూ ఓదార్పుకు లోటులేదు. 60 ఏళ్ళు దాటిన కొడుకయినా జ్వరం వచ్చిందని తెలిసి వాడిని దగ్గరికి పిలిచి బొటన వేలితో విభూతి పెట్టి ‘‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం’’ అంటూంటే అమ్మ దగ్గర లభించిన ఆ ఓదార్పు ప్రపంచంలో మరెక్కడయినా లభిస్తుందా? అమ్మ శరీరం పడిపోయిన తరువాత అమ్మ కట్టి విప్పిన చీరలను బొంతగా కుట్టుకుని పడుకున్నా సేదదీరుతుంది. అమ్మ కట్టివిప్పిన బట్టకు కూడా అంత ప్రేమ. అది కూడా అంత ఓదార్పునిస్తుంది. అమ్మవేసుకుని విప్పిన చెప్పులు, కళ్ళజోడు వాటిని చూసేటప్పటికి మనసు ఆర్ద్రతను పొందుతుంది. అమ్మలాంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడా తల్లిని తీసేయవలసి వస్తే బెంగపెట్టుకుంటుందట. వీడు ఇక అమ్మా అని పిలిస్తే నేనేమని జవాబు చెప్పాలి. అలాగని అమ్మచేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డచేతిలో అమ్మే వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మను నేను నీ నుండి తీసేయాల్సి వస్తే ముగ్గురు అమ్మలను చూపించి అప్పుడు తీసేసుకుంటానంటుందట. ‘ఒరేయ్, నేను నీకు భూమాతనిచ్చాను. ఈ తల్లి కూడా తల్లే. నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మ ఒడిలోనే ఉంటావ్’ అని ఈ అమ్మనిచ్చింది. తరువాత దేశమాత. ఈ దేశానికంతటికీ అధిష్ఠానం ఉంది. అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశ రుషి సంప్రదాయం. ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. ‘వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ అన్నాడు బంకించంద్ర ఛటర్జీ. ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో నా దృష్టిలో బంకించంద్ర ఛటర్జీ కూడా అటువంటివాడే. అలా దేశాన్నంతటినీ కూడా ఒక తల్లిరూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. అలా భూమాతను, దేశమాతను, గోమాతను ఇచ్చాను. అంత వృద్ధాప్యంలో కూడా పుట్టినరోజునాడు వణికిపోతున్న చేతుల్తో తలమీద చెయ్యిపెట్టి అక్షింతలు వేసి లడ్డు చేతిలో పెట్టి తిను అనడం కాదు, ఏదీ నోరు తెరు అని నోటిలో పెట్టి నువ్వు తింటూ ఉంటే సంతోషపడే అమ్మ లేదని రేప్పొద్దున నన్ను నింద చేస్తావేమో, అందుకే నీకు గోమాతని ఇస్తున్నాను’’అంటుందట జగన్మాత. ‘‘పుట్టినరోజునాడు ఆవుపాలు తాగు. అవి తాగితే ఎప్పటికీ నీవు అమ్మ చేతి ముద్ద తిన్నవాడివే అవుతావు’’అని ఒక్క అమ్మను తీసుకోవలసి వస్తే ముగ్గురు అమ్మల్ని చూపించి... ఆ పైన...‘మీ అమ్మ ఎక్కడో లేదు.. నాలోనే చేరింది. నా దగ్గరకు వచ్చి నీవు చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తా’ అంటుందట. అమ్మ అన్నమాట అంత గంభీరం. -
ఘనంగా గద్దల కొండ గణేష్ విజయోత్సవ సభ
-
వాల్మీకి.. టైటిల్లో ఏముంది?
పేరులో ఏముంది అని షేక్స్పియర్ అన్నాడు. కాని జనం ‘పేరులోనే ఉంది అంతా’ అంటున్నారు. ‘మా సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయ్’ అని హెచ్చరిస్తున్నారు. ‘వినోదం ఇవ్వండి.... కాని గమనించుకొని టైటిల్ పెట్టండి’ అని సలహా ఇస్తున్నారు. టైటిల్ దగ్గర పేచీ వస్తే సినిమా కష్టాల్లో పడుతుంది. సర్దుబాట్లు చేసుకుని అడ్డంకిని దాటాల్సి వస్తుంది. ‘వాల్మీకి’ టైటిల్ ‘గద్దలకొండ గణేష్’ అయ్యింది.కాని ఇలా జరగడం మొదలూ కాదు. బహుశా తుదీ కాబోదు. సినిమా అంతా ఏమిటో ఒక్క మాటలో చెప్పేదే ‘టైటిల్’. ప్రేక్షకుడు గోడ మీద ఉన్న పోస్టర్‌ను చూసి, ఆ పోస్టర్ మీద ఉన్న టైటిల్‌ను చూసి సినిమా మీద ఒక అంచనాకు వస్తాడు. ఆసక్తి పెంచుకుంటాడు. తాను ఇష్టపడే సినిమా అయితే మొదటి రోజు మొదటిఆట క్యూలో నిలబడతాడు. అందుకే టైటిల్స్ పెట్టే విషయంలో మొదటి నుంచి నిర్మాత, దర్శకులు శ్రద్ధ పెట్టేవారు. విజయవారి సినిమా టైటిల్స్ ఆ విషయంలో ముందుండేవి. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘జగదేక వీరుని కథ’ ఇలాంటి టైటిల్స్‌తో వారు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులెత్తించేవారు. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’, ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ వంటి పొడవు పేర్లు కూడా వారే పెట్టారు. అయితే అన్నీసార్లు సినిమావారి ఆలోచన ప్రేక్షకుల ఆలోచన ఒకేలా ఉండకపోవచ్చు. సినిమా వారు చేసిన ఆలోచనను సెన్సార్ వారు ఒప్పుకోకపోవచ్చు. దానివల్ల గతంలో చాలా టైటిల్స్ చివరి నిమిషంలో మారాయి. గొల్లభామ – భామా విజయం ఎన్.టి.ఆర్ హీరోగా సి.పుల్లయ్య దర్శకత్వంలో దేవిక హీరోయిన్గా ‘గొల్లభామ’ సినిమా మొదలైంది. పూర్తి కావచ్చింది. పేపర్లలో పబ్లిసిటీ కూడా వచ్చింది. అయితే అలా టైటిల్ ‘గొల్లభామ’ అని పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఎన్.టి.ఆర్ వంటి పెద్ద హీరో కూడా జనం నుంచి వచ్చిన అభ్యంతరాన్ని గౌరవించాల్సి వచ్చింది. ఆ సినిమా ‘గొల్లభామ’ నుంచి ‘భామా విజయం’గా మారింది. అయితే ఇది జరిగిన చాలా రోజులకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా వరుణ్ తేజ్‌తో తీసిన సినిమాకు మొదట ‘గొల్లభామ’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కాని అప్పుడు వచ్చినట్టే ఇప్పుడూ వ్యతిరేకత రావడంతో దానిని ‘ముకుంద’గా మార్చారు. రాముడు – సీత ‘రామాయణం’తో ముడి పడ్డ టైటిల్స్ కొన్ని పాసయ్యాయి. కొన్ని ప్రశ్నను ఎదుర్కొన్నాయి. ‘రాముడే రావణుడైతే’ వంటి టైటిల్స్ పాస్ అయి పోయాయి. అయితే వి.ఎస్.ఆర్. స్వామి నిర్మాతగా జయసుధ హీరోయిన్గా తీసిన ‘కలియుగ సీత’ అనే టైటిల్ మాత్రం సెన్సార్ అభ్యంతరాన్ని ఎదుర్కొంది. కలియుగ సీత అనడంలో సీతకు అవమానం జరిగే ప్రమాదం ఉందంది. దాంతో నిర్మాత ఆ టైటిల్‌ను ‘కలియుగ స్త్రీ’ అని మార్చి రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలాగే కృష్ణ డబుల్ యాక్షన్‌తో ‘రామరాజ్యంలో రక్తపాతం’ అని సినిమా సిద్ధమైంది. కాని సెన్సార్ వారి అభ్యంతరంతో ‘రామరాజ్యంలో రక్తపాతమా?’ అని మార్చి రిలీజ్ చేశారు. పోలీసోడి పెళ్లాం – పోలీసు భార్య నరేష్ హీరోగా, సీత హీరోయిన్గా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తయారైన సినిమా ‘పోలీసోడి పెళ్లాం’. కన్నడంలో సూపర్ హిట్ అయిన సినిమాకి తెలుగు రీమేక్ ఇది. అయితే తీరా రిలీజ్‌కు ముందు పోలీసు సంఘాల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. ‘పోలీసోడి పెళ్లాం’ అనే టైటిల్ స్త్రీలను కించపరిచేలా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఆ టైటిల్‌ను ‘పోలీసు భార్య’గా మార్చారు. సినిమా ఘనవిజయం సాధించింది. ఇటీవల తమిళంలో విజయం సాధించిన విజయ్ సినిమా ‘తేరి’ తెలుగులో ‘పోలీసోడు’గా విడుదలైంది. అయితే విడుదయ్యే రెండు మూడు రోజుల ముందు పోలీసు సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో దానిని ‘పోలీసు’గా మార్చాల్సి వచ్చింది. ఈ టైటిల్ వివాదం వల్ల సినిమా ప్రమోషన్ సరిగ్గా జరక్క, టైటిల్ సరిగ్గా రిజిస్టర్ కాక ఊహించిన కలెక్షన్లు రాలేదు. సామ్రాట్– సాహాస సామ్రాట్ టైటిల్ కోసం చిన్నస్థాయి నిర్మాతలు, హీరోలు పోటీ పడితే నష్టం ఉండదు. కాని దిగ్గజాలు తలపడితే టెన్షన్ వస్తుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా మొదలైంది. కృష్ణ కుమారుడు రమేశ్‌బాబును హీరోగా పరిచయం చేస్తూ బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బేతాబ్’ రీమేక్‌గా మరో సినిమా విడుదలైంది. ఇద్దరూ తమ సినిమాలకు ‘సామ్రాట్’ టైటిల్ అనౌన్స్ చేశారు. అభిమానులు ఆ టైటిలే ఉండాలని పట్టుబట్టారు. ఇరువర్గాలు కూడా అలాగే హోరాహోరికి దిగాయి. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు కృష్ణ అంటే ఇండస్ట్రీలో పెద్ద న్యూస్ కింద లెక్క. చివరకు రాఘవేంద్రరావు తమ సినిమా టైటిల్‌కు ముందు ‘సాహస’ చేర్చి ‘సాహస సామ్రాట్’గా మార్చడంతో గొడవ సద్దుమణిగింది. రెండు సినిమాలు విడుదలయ్యాక ‘సాహస సామ్రాట్’ కంటే ‘సామ్రాట్’ మెరుగైన కలెక్షన్లు సాధించింది. రాసలీల– రాగలీల జంధ్యాల దర్శకత్వంలో రెహమాన్–తులసి జంటగా ‘రాసలీల’ నిర్మాణమైంది. పోస్టర్లతో సహా సినిమా అంతా ‘రాసలీల’గా ప్రచారమైంది. అయితే సెన్సార్‌వారు ఈ టైటిల్‌కు అభ్యంతరం చెప్పారు. ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తూ టైటిల్‌ను మార్చమన్నారు. జనసామాన్యంలో శృంగార చేష్టలను రాసలీలలుగా పేర్కొడం పరిపాటి. అయినప్పటికీ సెన్సార్‌వారు ఊరుకోలేదు. దాంతో జంధ్యాల విధిలేక సినిమా పేరును ‘రాగలీల’గా మార్చారు. అయితే దీని ప్రభావం సినిమా మీద పడింది. రాగలీల అనే టైటిలే జనానికి అర్థం కాలేదు. వారిని ఆ సినిమాలోని కంటెంట్‌కు తగినట్టుగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా బిలో యావరేజ్‌గా నిలిచింది (ఇదే సినిమాను పోలిన కథతో ఆ తర్వాత ఇ.వి.వి ‘చిలక్కొట్టుడు’ అనే సినిమా వెంకటేష్ హీరోగా ‘ప్రేమతో’ అనే సినిమా తయారయ్యాయి). చింతామణి – శ్రీదేవి కొన్ని సినిమాలు టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. తెలుగునాట గతంలో ప్రఖ్యాతమైన తెలుగు నాటకం (రచన: కాళ్లకూరి నారాయణరావు) సినిమాగా తీయాలని దాసరి నారాయణరావు అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు. అయితే అందులోని ‘సుబ్బిశెట్టి’ పాత్ర వ్యవహారశైలి అభ్యంతరకరమని ఆ సినిమాను వ్యతిరేకిస్తామని నిరసన వ్యక్తం కావడంతో మానుకున్నారు. అలాగే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక ‘కవ్వింపు చిత్రాన్ని’ తీయబోతున్నట్టుగా దానికి ‘సావిత్రి’ అని టైటిల్ పెట్టారు. సావిత్రి తెలుగువారి ఆరాధ్యనటి. అలాంటి నటి పేరు పెడతారా అని నిరసన రావడంతో ఆ టైటిల్ తీసి ‘శ్రీదేవి’ అని పెట్టారు. ఈ పని అసలుకే ఎసరు తెచ్చింది. ఒక ‘చవకబారు’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మ ‘శ్రీదేవి’ అనే టైటిల్ పెట్టాడని కొంతమంది బోనికపూర్‌కు, శ్రీదేవికి ఆ విషయం చేరవేశారు. శ్రీదేవి చాలా నొచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. బోనికపూర్ కోర్టునోటీసులు పంపి మరీ రామ్‌గోపాల్ వర్మను హెచ్చరించారు. ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. మహేష్ ఖలేజా – నాని గ్యాంగ్‌లీడర్ సినిమా టైటిల్స్ ముందే రిజిస్టర్ అయి ఉంటాయి. అయితే కొన్ని సినిమాల కథలు సిద్ధమయ్యాక ఆ ఫలానా టైటిలే కావాలనిపిస్తుంది. రిజిస్టర్ చేసినవారిని అడిగినప్పుడు కొందరు ఇస్తారు. కొందరు ఇవ్వరు. అప్పుడు కొంత మాయ చేయాల్సి వస్తుంది. మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ తీసిన ‘ఖలేజా’కు టైటిల్ దొరక్కపోవడంతో దానిని ‘మహేష్ ఖలేజా’గా మార్చారు. తాజాగా నాని సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్ యధాతథంగా దొరక్కపోవడంతో దానిని ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’గా మార్చాల్సి వచ్చింది. గతంలో రవితేజా హీరోగా నటించిన ‘ఆటోగ్రాఫ్’ టైటిల్ దొరకనే దొరకలేదు. దాంతో సినిమాను ‘మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’గా విడుదల చేయాల్సి వచ్చింది. ‘దాదార్ ఎక్స్‌ప్రెస్’ ఒకప్పుడు ఒక రేప్ కేస్ కారణంగా వార్తలకెక్కింది. నాగబాబు హీరోగా అదే టైటిల్‌తో తీసినప్పుడు సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’గా విడుదలైంది. రాజశేఖర్ హీరోగా కన్నడ ‘ఓం’ను రీమేక్ చేసినప్పుడు ‘ఓం’ టైటిల్ దొరకలేదు. దాంతో ‘ఓంకారం’గా విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ హీరోగా ‘కొమరం పులి’ నిర్మించినప్పుడు గట్టి వ్యతిరేకత ఎదురవడంతో టైటిల్ నుంచి ‘కొమరం’ తీసేయాల్సి వచ్చింది. రామ్‌గోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ కాస్త ‘బెజవాడ’గా రిలీజ్ అయ్యింది. పిచ్చి అనడం కూడా తప్పే ఇటీవలే హిందీలో ‘మెంటల్ హై క్యా’ అనే సినిమా కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావులతో విడుదలైంది. అయితే ఈ సినిమా టైటిల్ చూసి దేశంలోని సైకియాట్రీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘మెంటల్’ అని అనడం మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని అవమానించడమే అన్నాయి. దాంతో సినిమా పేరు ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’గా మార్చారు. సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘రామ్–లీల’ కాస్త ‘గలియోంకా రాస్లీల– రామ్‌లీల’గా మారింది. ఆయనే తీసిన ‘రాణి పద్మావతి’ కేవలం ‘పద్మావత్’గా విడుదలైంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘బిల్లు బార్బర్’ సినిమాలో ‘బార్బర్’ అనే మాట ఉండటం పట్ల క్షురక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘బిల్లు’ గా సినిమా విడుదల చేశారు. కొందరు టైటిల్స్ పెట్టాక కాంట్రవర్సీ అవుతుంది. కొందరు కాంట్రవర్సీ చేయడానికే టైటిల్స్ పెడుతుంటారు. సినిమా అనేది వ్యాపారం. ఎలాగోలా చేసి నాలుగు డబ్బులు సంపాదించాలన్న తపన తప్పు లేదు. కాని ఈ తపనలో తెలిసో తెలియకో ఒకరికి కష్టం కలిగించే, మనోభావాలు దెబ్బ తీసే సినిమాలు తీసే హక్కులేదని ఆయా ఉదంతాలు తెలియచేస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఇటువంటి వివాదాలు ఎదురుకావని ఆశిద్దాం.– సాక్షి సినిమా ప్రతినిధి -
‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో రిలీజ్
-
'వాల్మీకి' ప్రీ రిలీజ్ వేడుక
-
‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద, కంచె, అంతరిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దిట్ట. వైవిధ్యమైన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపే వరుణ్ తేజ్, ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయాలని భావించినా.. ఆగస్టు 30 న సాహో ఉండటంతో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
అనంతపురంలో ‘వాల్మీకి’
‘ఎఫ్2’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్లో వరుణ్ లుక్ ఫ్యాన్స్‌కు షాక్‌నిచ్చింది. సెలబ్రెటీలు సైతం వరుణ్ లుక్కు ఫిదా అయ్యారు. డీజే లాంటి చిత్రం తరువాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగెటివ్ రోల్ చేస్తుండగా.. మరో కీలకపాత్రలో అథర్వా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మూవీకి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘వాల్మీకి’ ఎప్పుడొస్తున్నాడంటే..?
‘ఎఫ్2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. వరుణ్ తేజ్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రీమేక్‌ను హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
అసలు ఆట అప్పుడే!
మొన్నామధ్య వరుణ్ తేజ్ కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. విదేశీ మాజీ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్. మరి.. బాక్సింగ్ బరిలోకి వరుణ్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఆగస్టులో అట. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను చేయనున్న బాక్సర్ రోల్ కోసం వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్ ప్రారంభించి హైదారాబాద్, వైజాగ్, ఢిల్లీలో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. -
కామెడీ టు సీరియస్
‘పెళ్లాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు మస్తు తెలుసు’ అంటూ వెంకటేశ్‌తో కలసి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) లో కామెడీ పండించారు వరుణ్ తేజ్. ఇప్పుడు ‘వాల్మీకి’ సినిమా కోసం సీరియస్ మూడ్‌లోకి మారిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం స్టార్ట్ అయింది. తమిళ చిత్రం ‘జిగర్తండా’కి ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో వరుణ్ తేజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్. -
డిఫరెంట్ లుక్‌లో వరుణ్
వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ మూవీ జిగర్తాండను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్రయూనిట్.. నేడు షూటింగ్‌ను ప్రారంభించింది. నేడు వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. వరుణ్ లుక్కు సంబంధించిన ఓ పిక్‌ను హరీష్ శంకర్ పోస్ట్ చేస్తూ.. ‘వెల్కమింగ్ మై వాల్మీకి.. మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది.. ఇంకా ఇలాంటి రోజుల గురించి చూస్తుంటాను.. దేవీ శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్ సమ్మర్లో టెర్రఫిక్ వర్క్ చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. Welcoming My VALMIKI to the board ... @IAmVarunTej ... such a great first day shoot with you .... looking forward for many more ..... 🤗🤗🤗🤗 and special thanks to @DoP_Bose for the terrific work in this hot summer 🙏🙏🙏 pic.twitter.com/8Pxx6WH5LA — Harish Shankar .S (@harish2you) April 18, 2019 -
‘వాల్మీకి’లో అడుగుపెట్టిన వరుణ్
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మెగాహీరో వరుణ్ తేజ్. తాజాగా సంక్రాంతి బరిలో దిగి ‘ఎఫ్2’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. మెగా హీరోలందరిలో డిఫరెంట్‌గా స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ను తెలుగులో వాల్మీకి పేరుతో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో పూర్తి హాస్యభరితంగా ఉండే ఈ చిత్రంలో వరుణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. ఈరోజు ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించినట్లు.. వరుణ్ ట్వీట్ చేశాడు. గబ్బర్‌సింగ్‌లాంటి అదిరిపోయే రీమేక్‌ను తెరకెక్కించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. Day 1 of shoot for #Valmiki Super kicked about this one! 📽🎬 — Varun Tej Konidela (@IAmVarunTej) April 18, 2019 -
ఒలింపిక్ విన్నర్ ట్రైనింగ్‌లో వరుణ్ తేజ్
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ బాక్సర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మెగా ప్రిన్స్. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ వస్తున్న వరుణ్ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండ రీమేక్‌గా వాల్మీకీ సినిమాను స్టార్ట్ చేసిన వరుణ్ ఈ సినిమాను కూడా ప్యారలల్‌గా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. -
యత్ర నార్యస్తు పూజ్యంతే
అరుంధతిని వివాహమాడాడు వశిష్ఠుడు. వివాహ కాలంలో అరుంధతి నక్షత్రం చూపుతారు. అది ఒక స్త్రీకి భారతీయ సంస్కృతి ఇచ్చిన స్థానం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు. ఋగ్వేదంలోని దేవీ సూక్తం, స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. ‘నేను మహారాణిని, సంపదను సేకరిస్తాను, ఆలోచిస్తాను, తొలి వందనం స్వీకరిస్తాను, అందువల్లే భగవంతుడు నన్ను ప్రతి ఇంట్లోను నెలకొల్పాడు. నా కారణంగానే ఇంటిల్లిపాదీ ఆహారం తీసుకుంటారు, గాలి పీలుస్తారు, వింటారు, మాట్లాడతారు’ అంటుంది స్త్రీ. దేవీ సూక్తం స్త్రీని అగ్రస్థానాన నిలబెట్టింది. బ్రహ్మమానసపుత్రిక దేవి అని, ఆమె నుంచే ప్రకృతి, పురుషుడు ఉద్భవించారని చెబుతోంది. ఉపనిషత్తులకు సంబంధించిన చర్చలలో గార్గి, మైత్రేయి వంటి వారు పాల్గొని విజయం సాధించారు. భవభూతి ఉత్తర రామచరితలో ఆత్రేయి... దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారతానికి ప్రయాణించిందని, భారతీయ వేదాంతం చదివిందని ప్రస్తావించాడు. శంకరాచార్యునితో ఉభయభారతి జరిపిన చర్చలో వేదాల ప్రస్తావన తెస్తుంది. ఇతిహాసాలు... రామాయణంలో సీతను అత్యున్నతంగా చూపాడు వాల్మీకి. వేదకాలంలో ఏ పురుషుడూ ఎంత కోపం వచ్చినా స్త్రీని ఒక్క మాట కూడా పరుషంగా పలికేవాడు కాదని, తన సంతోషం, సౌఖ్యం, ఆనందం, సుగుణవంతుడిగా నిలబడటం కోసం భార్య మీదే ఆధారపడేవాడని తెలుస్తోంది. ఋషులు సైతం స్త్రీలు లేకుండా సంతానాన్ని సృజియించలేమని పలికారు. (ఆదిపర్వం మహాభారతం). మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కూతురు కొడుకుతో సమానమని భీష్ముడు అంటాడు.శివపార్వతుల సంవాదంలో స్త్రీలకు ఏయే బాధ్యతలు ఉంటాయని శివుడు పార్వతిని ప్రశ్నిస్తాడు. మంచితనంతో పాటు, మృదు భాషణం, సత్ప్రవర్తన, మంచి లక్షణాలు కలిగి ఉండాలి స్త్రీలు అంటుంది పార్వతి. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే ఒక అతీత శక్తి అని అర్థం. స్త్రీ రూపం కాని, పురుష రూపం కాని భగవంతునికి లేదు. పంచభూతాలలో నీరు, భూమి ఈ రెండింటినీ స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాత అని వారిని గౌరవంగా, ఆప్యాయంగా పిలుచుకున్నారు. భారతీయ సంప్రదాయం స్త్రీకి పెద్దపీట వేసి గౌరవించింది. స్త్రీలు వేదాలు చదవాలని చెప్పింది. బ్రహ్మచర్యంలో ఉన్న యువతి పట్టా పుచ్చుకుని, తనకు సరైన వరు ని ఎంచుకోవాలని అధర్వ వేదం చెబుతోంది. వరుడిని ఎంచుకునే హక్కు వధువుదే. అందుకే స్వయంవరం ప్రకటించి, వచ్చిన వారిలో నుంచి తనకు నచ్చినవారిని ఎంచుకుంటుంది వధువు. – డా. వైజయంతి పురాణపండ -
హీరో అక్కడ...షూటింగ్ ఇక్కడ!
వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గత నెలలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైనట్లు తెలిసింది. కానీ వరుణ్ తేజ్ ఈ షెడ్యూల్లో పాల్గొనడం లేదు. ఎందుకంటే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో చేయబోతున్న బాక్సర్ పాత్ర కోసం శిక్షణ తీసుకోవడానికి లాస్ఏంజిల్స్లో వెళ్లారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కాలిఫోర్నియాలోఉన్నట్లు తెలిసింది. ‘‘వాల్మీకి’ చిత్రం ఫస్ట్ డే షూటింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ కొత్త టీమ్‌తో జాయిన్ అవ్వడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. సూపర్ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని వరుణ్‌తేజ్ ట్వీట్ చేశారు. తమిళంలో వచ్చిన ‘జిగర్తండా’కి ‘వాల్మీకి’ రీమేక్ అని టాక్. ఒరిజినల్లో బాబీసింహా నటించిన పాత్రలో వరుణ్‌తేజ్ కనిపిస్తారట. అలాగే సిద్ధార్థ్ నటించిన పాత్ర కోసం ఇప్పటి వరకు నాగశౌర్య, శ్రీ విష్ణు, తమిళ నటుడు అథర్వ పేర్లు తెరపైకి వచ్చాయి. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
వాల్మీకి కోసం కోలీవుడ్ హీరో..!
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇటీవల అంతరిక్షం సినిమాతో ఆకట్టుకున్న వరుణ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకిలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు తమిళ నటుడ్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు నాగశౌర్య, శ్రీ విష్ణులలో ఒకర్ని హీరోగా తీసుకోనున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు తమిళ హీరో అధర్వను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా అధర్వ ఈ వాల్మీకి తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం కాయంగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. -
గడియారం శ్రీరామ అంది
సకల సద్గుణాల వల్ల రాముడు దేవుడయ్యాడు ప్రతి గుణం ఒక రామాయణం నలుగురిని నడిపించేది రామాయణం అందరినీ చూసేలా చేసింది అందరినీ నడిపించింది రామానందసాగర్ రామాయణం బుల్లితెరపై ప్రత్యక్షమైన ఇంటింటా రామాయణం. టైమ్ మిషన్‌లో మూడు దశాబ్దాల వెనక్కి వెళితే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఓ అందమైన దృశ్యం కళ్లకు కడుతుంది. టీవీ ఉన్న ప్రతి ఇల్లు నిండుకుండలా కనిపిస్తుంది. భక్తిగా చేతులు జోడించి టీవీ తెరకు కళ్లప్పగించే జతల జతల కళ్లు రామరసాన్ని గ్రోలుతూ పారవశ్యం చెందుతుండటం చూస్తాం. ఆ అద్భుతాన్ని చవి చూపినవాడు రామానంద్ సాగర్. 78 ఎపిసోడ్లలో రామాయణాన్ని దృశ్యీకరించిన బుల్లితెర వాల్మీకి ఇతడు. జనవరి 25, 1987లో ప్రారంభమైన ఈ సీరియల్ జులై 31, 1988 వరకు వచ్చింది. అప్పట్లో ఈ సీరియల్ టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీసెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు పలికేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని వీక్షించింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ విద్యాభ్యాసం చేయించింది. అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటిలా వందల చానెల్స్ లేవు. కానీ, రామాయణం ఇంకా జీవించడానికి తాను కూడా ఉడతసాయం చేశానని బుల్లితెర ఒళ్లంతా కళ్లు చేసుకొని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం వరకుసీరియల్ స్టార్ట్ అవడమే..పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, భర్త పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి.. బ్రహ్మాది దేవతలంతా .. ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం..’ అంటూ స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా పరిఢవిల్లుతోంది. పాప నాశనం చేసి, ధర్మసంస్థాపన చేయండి.. అని వేడుకుంటారు. తాను ఇచ్చిన వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చిందని చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. సత్యమేవ జయతే అంటారు దేవగణం. అక్కడి నుంచి రాముడు పుట్టడం,విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. ఈ సీరియల్ మొత్తానికి కీలక పాత్రధారులు దశరథుడు, అతని ముగ్గురు భార్యలు, వీరితో పాటు దుష్టవనితగా పేరొందిన మంధర మొదటి ఎపిసోడ్‌లోనే కనిపిస్తారు. యజ్ఞం చేయగా వచ్చిన పాయసాన్ని దశరథుని ముగ్గురు రాణులు సేవిస్తారు. విష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంఖుచక్రాలు భరత, శత్రుఘ్నులుగా జన్మిస్తారు. ఇక రెండవ ఎపిసోడ్లో రామలక్ష్మణ, భరత శత్రుఘ్నుల విద్యాభ్యాసం గురుకులంలో జరుగుతుంది. అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడితో సీరియల్‌ని భక్తిగా చూసే ప్రేక్షకుల హృదయాలు రామ రామ అంటూ రామ జపం చేస్తూ కథలో లీనమయ్యాయి. బుల్లితెర వాల్మీకి ప్రయాణం రామానంద్ సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టారు. రచయితగా ఎన్నో మారుపేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబం వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు అతని ప్రొడక్షన్ నుండి వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం బుల్లితెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని చెప్పుకునే రామానంద సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో మాత్రం అపార ప్రతిభను కనబరిచాడని విమర్శకుల మెప్పును పొందారు. పట్టాభిషేకం తర్వాత...? రామానంద్ సాగర్ వాల్మీకి రామాయణ్, తులసీదాస్ రామచరిత మానస్‌లను తన సీరియల్‌కి మూలకథగా ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు అంటే రాముడు పట్టాభిషేకం వరకు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రామాయణాలలో సీతను రాముడు వదిలేయడం, లవకుశుల చాప్టర్లను ఇందులో తీసుకోలేదు. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్‌సాగర్ మాట్లాడుతూ– ‘చాలామంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు’ అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు. పౌరాణికాలకు దారిచూపిన సీరియల్ రామాయణం తర్వాత సాగర్ ఇండస్ట్రీ నుంచి శ్రీ కృష్ణ, లవ్ ఔర్ కుష్, అలిఫ్ లైలా.. వంటి సీరియల్స్ వచ్చాయి. అంతేకాదు, రామాయణ్ ప్రేరణతో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి టీవీ ఒక మాధ్యమంగా సాగింది. లెక్కలేనన్ని పౌరాణిక సీరియల్స్ ఆ తర్వాతి కాలంలో బుల్లితెరమీద బొమ్మకట్టాయి. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. అలాగే, సాగర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి 2008లో మరో రామాయణం వచ్చింది. ఆ తర్వాత 2015లో మరో రామాయణ్ సీరియల్ టీవీలో వచ్చింది. అయితే, 1986లో తీసిన రామాయణ్ 2015లో వచ్చిన రామాయణ్ సీరియల్‌ను చూస్తే రూపకల్పనలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి. పూజలందుకున్న నటీనటులు రామాయణ్ సీరియల్లో రామ పాత్రధారి ‘అరుణ్ గోవిల్’ రూపం, వాయిస్ ఆ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్‌గా మారింది. చూపులకు ప్రశాంతంగా కనిపిస్తూ వీనులకు విందు చేసే రాముడి పాత్రధారి పలుకులు విన్న వారి కళ్లు ఆర్ధ్రమయ్యేవి. ఆ తర్వాత అతను ఎక్కడకు వెళ్లిన ప్రజలు అరుణ్‌గోవిల్‌ను రాముడిగా కొలిచారు. సీత క్యారెక్టర్ గురించి మాటల్లో చెప్పలేం. వాల్మీకి రామాయణంలోని సీత తమ నట్టింటికే నడిచి వచ్చిందన్నంత తన్మయత్వం చెందారు ప్రేక్షకులు. ఇప్పటివరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికితే ‘దీపికా చిఖాలియా’ రూపమే నిలుస్తుంది. ఈ సీరియల్లోని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే ఆమె కళ్లతో పలికించిన భావాలు ప్రేక్షకుల మనసు నుంచి చెదిరిపోవు. ఆమె ఒక అందమైన మహారాణి మాత్రమే కాదు తన తండ్రితోపాటు ప్రతి ఒక్కరికీ సాయం చేసే స్వభావం కలదిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్ర హనుమాన్. ఇప్పటిదాకా వచ్చిన రామాయణ్ సీరిస్‌లలో హనుమాన్ పాత్రధారులను గమనిస్తే సాగర్ రామాయణ్‌లో హనుమాన్‌గా నటించిన ‘దారాసింగ్’ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే దారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటైనది రావణాసురుడి పాత్ర. సీరియళ్లు, సినిమాలలో చాలామంది రావణాసురుడి పాత్ర పోషించారు. వారంతా మంచి నటులే. అయితే, ‘అరవింద్ త్రివేది’ రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా ఉంటుంది. ఒక సీరియల్లోని నటీనటులు రాజకీయంగా ఎదగడం అనేది రామాయణం నుంచే మొదలైంది. అరుణ్‌గోవిల్‌ను మొదట బిజెపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాయి. దీపికా చిఖాలియా (సీత), అరవింద్ త్రివేది(రావణుడు) ఇద్దరూ ఎంపీలుగా ఓ వెలుగు వెలిగారు. రామాయణం విన్నా, కన్నా జన్మ తరిస్తుందని చెబుతారు పెద్దలు. అలా రామాయణం తీసి జన్మ చరితార్ధం చేసుకున్నది రామానంద్‌సాగర్ అయితే, ఆ ధారావాహికను కన్నులారా వీక్షించిన ప్రతి గుండే చరితార్థమే అయ్యింది. రంగుల రామాయణం రామానంద్‌సాగర్ బుల్లితెరకు రామాయణం ఇస్తే దానికి ఊపిరిలూదినవారు కంపోజర్ రవీందర్ జైన్. ఆ తర్వాత చెప్పుకోదగినవి కాస్ట్యూమ్ కలర్స్. దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరువవుతోంది. ఈ చిన్న తెరమీద గులాబీ, ఎరుపురంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్‌బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షోగా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. -
జోడీ కుదిరిందా?
వెండితెర ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ తేజ్‌కి జోడీ కుదిరిందట. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. రేస్‌లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ముందు వరుసలో ఉన్నారని సమాచారం. ఈషా కాకుండా ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటారట. ఇటీవల వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ, సుబ్రహ్మణ్యపురం’ సినిమాల్లో మంచి నటనను కనబరిచారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘వాల్మీకి’ చిత్రం కోలీవుడ్ హిట్ ‘జిగర్‌దండా’కి రీమేక్ అని సమాచారం. ఆ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్య పేర్లు తెరపైకి వచ్చాయి. అధికారిక సమా చారం అందాల్సి ఉంది. ‘వాల్మీకి’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. -
‘వాల్మీకి’ హీరోయిన్‌పై నో క్లారిటీ!
ఒక చోట సక్సెస్ అయిన చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి మరోచోట హిట్ కొట్టడం ఈజీనే అయినా.. ప్రతిసారీ ఆ ఫార్మూలా వర్కౌట్ కాదు. బాలీవుడ్ ‘దబాంగ్’ను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి(గబ్బర్‌సింగ్) బ్లాక్ బస్టర్హిట్ కొట్టాడు హరీష్ శంకర్. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మరో రీమేక్‌పై కన్నేశాడు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తీయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో బాబీసింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తుండగా.. సిద్దార్థ్ పాత్రకు శ్రీవిష్ణును తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్గా డబ్స్మాష్ స్టార్ మృణాలినీ రవిని తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బాను తీసుకున్నారని వినిపిస్తోంది. మరి ఏది నిజమో తెలియాలంటే.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘వాల్మీకి’లో శ్రీ విష్ణు
తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’.. తెలుగులో ‘వాల్మీకి’గా రాబోతోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌తోనే వివాదంలోకి వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. తమిళ్లో బాబీ సింహా, సిద్దార్థ్‌లు ముఖ్య పాత్రలు పోషించగా.. ఈ రీమేక్‌లో బాబీ సింహా పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ మిగతా నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ చేస్తున్న నెగెటివ్ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో మరో ప్రముఖ పాత్ర కూడా ఉండగా.. ఈ పాత్రకు శ్రీవిష్ణును పరిశీలిస్తున్నట్లు టాక్. కథా పరంగా శ్రీవిష్ణు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి శ్రీవిష్ణు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. దబాంగ్‌ను ‘గబ్బర్‌సింగ్’గా రీమేక్ చేసి సంచలనం సృష్టించిన హరీష్ శంకర్ ‘వాల్మీకి’ని తెరకెక్కిస్తున్నాడు. -
వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
-
కొత్త చాప్టర్ షురూ
సినిమాల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు వరుణ్ తేజ్. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. వరుణ్ నటించనున్న తాజా చిత్రానికి ‘వాల్మీకి’ అనే పేరును ఖరారు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నా తర్వాతి చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ ఖరారు చేశాం. కొత్త చాప్టర్ మొదలైంది’’ అని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ‘‘మా ‘వాల్మీకి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. డైరెక్టర్ సుకుమార్, నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. కాగా, తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’ కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. -
అక్కడ ‘జిగర్తాండ’.. ఇక్కడ ‘వాల్మీకి’
కోలీవుడ్‌లో ‘జిగర్తాండ’ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచే సరికి.. ఇక్కడ రీమేక్‌చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. బాలీవుడ్ దబాంగ్ మూవీని ఇక్కడి జనాలు మెచ్చే విధంగా రీమేక్(గబ్బర్ సింగ్) చేసి రికార్డులు సృష్టించిన హరీష్ శంకర్ ఈ మూవీని రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘ఎఫ్2’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ వర్షెన్‌లో ప్రతినాయకుడిగా బాబీ సింహా మెప్పించగా.. అదే పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. Here is the title poster of my next!!!#Valmiki with @harish2you pic.twitter.com/7EyZbbgwBF — Varun Tej Konidela (@IAmVarunTej) January 27, 2019 -
మన్యం కదిలింది!
మన్యం కదిలింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చొద్దంటూ వేలాది మంది గిరిజనం కదం తొక్కారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు నుంచి కలెక్టర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని నినదించారు. కలెక్టరేట్‌ను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ 57 రోజులుగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతోపాటు నిప్పటించడంతో కలకలం రేగింది. కలెక్టర్, ఎస్పీ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గిరిజనం గళమెత్తింది. తమకు అన్యాయం చేయవద్దంటూ నినదించింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సోమవారం చలో కలెక్టరేట్‌కు పిలుపునివ్వడంతో గిరిజనలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి వాంబే కాలనీ, వృద్ధాశ్రమం ప్రాంతాలు గిరిపుత్రులతో నిండిపోయాయి. ఆదివాసీ ఉద్యోగ, విద్యార్ధి, మహిళా సంఘాలు, హక్కుల పోరాట సమితిలు భాగస్వాములయ్యాయి. తరలివచ్చిన జనం కంచిలి, సోంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల నుంచి వివిధ వాహనాల్లో సుమారు పది వేల మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌కు ర్యాలీ గా వచ్చారు. జనం భారీగా ఉండడంతో పో లీసులు సైతం వీరిని అడ్డుకోలేదు. కలెక్టరేట్‌ను ముట్టడించిన గిరిజనులు తమ డి మాండ్లను పరిష్కరించాలని నినదించారు. టీడీపీ ప్రభుత్వం తమపై కక్షకట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎస్టీ జాబితాలో మరిన్ని జాతులను కలిపి ఎస్టీలను మరింత వెనుకబాటు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ఈ కారణంతోనే బోయ, వాల్మీక కులాలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అ సెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని జేఏసీ నేతలు దుయ్యబట్టారు. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పించాలని చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. 1952 నాటి గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిం చారని, అయితే ప్రస్తుత జనాభా పెరిగినందున దీనికి అనుగుణంగా రిజర్వేషన్ పది శాతానికి పెంచాలని నినాదాలు చేశారు. జిల్లాలో గిరిజనుల పేరుతో వందలాది మంది నకిలీ కుల ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని వెంటనే తొలగించాని, ఆ ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారిని, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ అధికారిగా పనిచేస్తున్న నకిలీ గిరిజన ఉద్యోగి కుమార్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు గిరిజనులకు అన్యాయం చేసేం దుకే బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు చేయడం తగదని గిరిజన జేఏసీ ప్రతినిధులు నినదించారు. ముఖ్య మంత్రి, టీడీపీ నాయకులు కలిసి ఎస్టీలపట్ల కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ.. ఏ రాజకీయ పార్టీ కూడా వారి ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టరాదన్నారు. అలా వాగ్దానాలు చేస్తే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గడిచిన 60 రోజులుగా మన్యంలో దీక్షలు చేస్తు న్నా ముఖ్యమంత్రి, మంత్రుల్లో చలనం లేదన్నారు. దీంతో ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకురావాల్సి వచ్చిందని ఆదివాసీ జేఏసీ నాయకులు వాబ యోగేశ్వరరావు, సవర రాంబాబు తదితరులు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో 32 తెగలు ఉన్నాయని, రాష్ట్రంలో 28 లక్షల మంది, జిల్లాలో 1.82 లక్షల మంది గిరిజన జనాభా ఉందన్నారు. ప్రభుత్వం తీరుతో సవర, కాపుసవర, జాతాపు, మలే సవర, చెంచులు, కొండదొరలు, కొండ రెడ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉద్యమంలో ఆదివాసీల సంక్షేమ పరిషత్, వికాస్ పరిషత్, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, హక్కుల పోరాట సమితి, పీడీఎస్యుల ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల జాయింట్ ఎక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, సంఘాల ప్రతినిధులు గూడ ఎండయ్య, సవర జగన్నాథం, వి.భానుచందర్, ఎం.భాగ్యలక్ష్మి, కె.శ్రీను, ఎస్.చిరంజీవులు, ఎ.రామారావు, కృష్ణారావు, గణ్వేరరావు, బి.సింహాచలం, దుర్యోధన, సిద్ధేశ్వరరావు, మాధవయ్య, ఎస్.షణ్ముఖరావు, జి. మోహనరావు, జి.అప్ప న్న, ఆర్.పోతయ్య, ఎస్.నారాయణరావు పాల్గొన్నారు. 200 మందిపై కేసు నమోదు శ్రీకాకుళం సిటీ: కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల శిబిరంపై సోమవారం కొంతమంది దాడి చేసిన ఘటనలో 200 మంది ఆదివాసీలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒకటో పట్టణ ఎస్సై ఈ. చిన్నంనాయుడు తెలిపారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కలెక్టర్, ఎస్పీల సందర్శన భారీగా గిరిజనులు తరలి రావడం.. ముఖ్యమంత్రికి, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్టీ త్రివిక్రమవర్మ స్పందించారు. గిరిజనులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడారు. తొలుత జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకుల నుంచి తీసుకున్నారు. అయితే గిరిజనులు శాంతించలేదు. కలెక్టర్ రావాలని పట్టుపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వచ్చారు. గిరిజన సమస్యల పరిష్కారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ కూడా వచ్చి మత్స్యకారులు నిరసన దీక్షలు చేస్తున్నారని.. వారికి ఇబ్బంది లేకుండా మెలగాలని సూచించారు. ఏఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు పెంటారావు, భీమారావు, సీఐలు నవీన్ కుమార్, ప్రదసాద్, తిరుపతిరావు బందోబస్తును పర్యవేక్షించారు. గిరిజన ఉద్యమం ముసుగులోమత్య్సకార శిబిరం ధ్వంసం గిరిజన ఉద్యమం ముసుగులో ఉన్న కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు మత్స్యకారుల రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఎస్టీలో జాబితాలో చేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద మత్య్స కారులు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని చూసిన అధికార పార్టీకి చెందిన కొంతమంది గిరిజన ముసుగులో రెచ్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినా శిబి రాన్ని ఎత్తివేయడం లేదని, మత్స్యకారులపై చర్యలు తీసుకోలేక, గిరిజన ఉద్యమం నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు భంగం కలిగించేందుకు కొంతమంది అధికార పా ర్టీకి చెందిన వారు శిబిరానికి నిప్పంటించినట్టు తెలిసింది. శిబిరానికి కట్టిన పోస్టర్లు, కర్టన్లను పీకేశారు. టెంట్‌ను కూల్చివేసి.. నిప్పంటించారు. ఈ క్రమంలో రిలే నిరా హార దీక్షలో ఉన్న సోంపేట మండలం ఇసకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నిట్ట లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో పది మంది స్వల్పం గా గాయపడ్డారు. ఈ సంఘటనతో కొద్దిసేపు కలకలం రేగింది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది. -
రాష్ట్ర వేడుకగా మహర్షి వాల్మీకి జయంతి
సాక్షి, హైదరాబాద్: మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణను బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
రిజర్వేషన్ కోసం ఆత్మహత్యాయత్నం
– కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకున్న ఇద్దరు యువకులు – అడ్డుకున్న పోలీసులు - తీవ్ర ఉద్రిక్తతల మధ్య వీఆర్పీఎస్ నేతల అరెస్టు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుండా సీఎం చంద్రబాబు మూడేళ్ల నుంచి తమ జాతిని అవమానపరుస్తున్నారనే ఆవేదనతో ఇద్దరు వీఆర్పీఎస్ కార్యకర్తలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు. వివరాలిలా ఉన్నాయి.. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో వీఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతుండగా పెద్దపాడుకు చెందిన మహేష్, కర్నూలుకు చెందిన బోయ మధు ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నంతో వీఆర్పీఎస్ నాయకులు ఆగ్రహించారు. కలెక్టరేట్ గేటును తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన పోలీసులను సైతం తోసేసి వెళ్లారు. వెంటనే తేరుకున్న పోలీసులు ప్రధాన ద్వారంలోకి వెళ్తున్న వీఆర్పీఎస్ నాయకులను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, వీఆర్పీఎస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో సుభాష్ చంద్రబోస్ సహా 20 మంది కార్యకర్తల చొక్కాలు చిరిగి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వీఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే జైలుకు వెళ్లేందుకైనా వెనుకాడమని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. చివరకు సొంతపూచికత్తుపై వారిని విడుదల చేశారు. మా జాతిని సీఎం మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో తమ జాతి ఓట్లను వేయించుకొని ఎస్టీ రిజర్వేషన్‌ను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో ఆవేదన కలిగింది. మా జాతికి సీఎం అన్యాయం, మోసం చేస్తున్నారనే బాధతో మా ప్రాణాలు అర్పించి సాధించుకోవాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి వెంటనే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. – పెద్దపాడు మహేష్, మధు -
మృతదేహంతో ఆందోళన
బండి ఆత్మకూరు: యర్రగుంట్ల గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఎలకి్ట్రషియన్ ముసుగు సుబ్బరాయుడు (35) కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, వాల్మీకి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రైతు నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి తన పొలంలో విద్యుత్ మోటారు పని చేయకపోవడంతో ఎలకి్ట్రషియన్ సుబ్బరాయుడిని పిలిపించాడు. అయితే ఎల్సీ తీసుకోకుండానే స్తంభం ఎక్కి తీగలు సరి చేస్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం మృతదేహంతో మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా వాల్మీకి సంఘం రాష్ట్రనాయకులు శేఖర్, శివ వచ్చి బాసటగా నిలిచి ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న ఎస్ఐ విష్ణు నారాయణ అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. తమ నిర్లక్ష్యం ఏమి లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. అయితే రైతు నుంచి పరిహారం ఇప్పించాలని బంధువులు కోరారు. దీనికి రైతు సుబ్బారెడ్డి కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగే దాకా ఇక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఎస్ఐ మరోసారి వాల్మీకి సంఘం నాయకులతో కుటుంబ సభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాల్మీకి సంఘం నాయకులు శేఖర్, శివ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అన్నివిధాలా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్సీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైతు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధంకండి
– మార్చి 6న విజయవాడలో యుద్దభేరి దీక్షలు కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వం యుద్ధానికి చేసేందుకు సిద్ధం కావాలని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. మార్చి 6వ తేదీన విజయవాడలో చేపట్టనున్న వాల్మీకుల యుద్ధ భేరి దీక్షలను విజయవంతం చేయాలని కోరుతు జిల్లాలో వీఆర్పీఎస్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సుభాష్ మాట్లాడుతూ 2016 మార్చి 5వ తేదీన జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేస్తామని ప్రకటించి ఏడాది పూర్తయినా చర్యలు లేవన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలనే డిమాండ్‌పై విజయవాడలోని అలంకార్ సర్కిల్ వద్ద వాల్మీకుల యుద్దభేరి దీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయమైన డిమాండ్ సాథన కోసం రాజకీయాలకు అతీతంగా వాల్మీకులు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ జిల్లా నాయకులు శ్రీనివాసులు, మల్లేష్, లోకేష్, గణేష్, ప్రకాష్, మద్దయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్ సాధన
– సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఐక్యంగా ఉద్యమాలను నిర్వహిస్తే ఎస్టీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని బళ్లారి జిల్లా సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు అన్నారు. ఈ నెల 16వ తేది నుంచి స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్దకు ఆయన ఆదివారం చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న కారణంగా 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మంత్రులు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే ఆయా కులాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెపా్పరు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాల్మీకులు జిల్లా పరిషత్ నుంచి దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి హెచ్చరించారు కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబీంనాయుడు, గూడురు గిడ్డయ్య, నాగరాజు, నరసింహులు, జిల్లా అధ్యక్షుడు డి. రామాంజనేయులు, వీజీఆర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
– ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన వాల్మీకుల నిరవధిక సత్యాగ్రహానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడచిపోయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై ఇంతవరకు కార్యాచరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై వీఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమాలకు రాజకీయాలకు అతీతంగా వాల్మీకులందరూ మద్దతు ప్రకటించాలన్నారు. జాతి శ్రేయస్సు కోసం చేపట్టే ఉద్యమాలకు తాను ఎల్లప్పడు అండగా ఉంటానని చెప్పారు. -
వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాటం
– ఆరు నెలల్లో ఎస్టీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి – లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం –స్పందించకపోతే టీడీపీని పాతరేస్తాం – వీఆర్పీఎస్ సత్యాగ్రహ దీక్షలు ప్రారంభంలో సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వాల్మీకి బిడ్డల బంగారు భవిష్యత్తుకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత కల్పన, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లపై శుక్రవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఆ సమితి మూడు రోజుల నిరవధిక సత్యాగ్రహ దీక్షలను ప్రారంభించింది. ముందుగా వందలాది మంది వాల్మీకులు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుంచి దీక్ష వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతు సత్యాగ్రహ దీక్షలు ముగిసేలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే జూన్‌లో రాయలసీమ బంద్‌కు కూడా వెనుకాడమన్నారు. సీమలోని నాలుగు జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఆందోళనలను చిన్నచూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వాల్మీకుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి ఫెడరేషన్‌కు వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని వాల్మీకులకు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నారన్నారు. హింసాయుత ఉద్యమాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేస్తున్నట్లు ఆయన చర్యలను బట్టి అర్థమవుతుందన్నారు. తాము ఆగ్రహిస్తే రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, ఉపాధ్యక్షుడు జి. రాంభీంనాయుడు, ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా.మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి పరమటూరు శేఖర్, ప్రచార కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా నాయకులు మురళీ, రాముడు, వీజీఆర్ కొండయ్య, మహిళా నాయకురాలు ఎం. వాణిశ్రీ, న్యాయవాది తిమ్మప్ప, విద్యార్థి నాయకులు మహేంద్ర, బాబు, శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
వాల్మీకుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం
– భారతీయ వాల్మీకి సేన ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర – ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య కల్లూరు: వాల్మీకుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. ఆదివారం పందిపాడు గ్రామంలో భారతీయ వాల్మీకి సేన (బీవీఎస్) ఆధ్వర్యంలో పేద వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్ర ప్రారంభించారు. కార్యక్రమానికి అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ వాల్మీకి సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో పేదలు, నిరక్ష రాస్యులున్నారని తెలిపారు. ప్రతి వాల్మీకి తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఎన్నికల్లో రాజకీయపార్టీలకు ఓటు బ్యాంకుగా మారకుండా సంఘటితంగా ఉండి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఐక్యమత్యంతో ఉండాలన్నారు. బీవీఎస్ అధ్యక్ష కార్యదర్శులు మద్దులేటినాయుడు, రమేష్ నాయుడు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు సైకిల్ యాత్ర జరుగుతుందని, తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్‌లో ముగింపు సభ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు పూల ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శివశంకర్, శ్రీనివాసులు, శేషన్న, శంకరన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు వాల్మీకుల సైకిల్ యాత్ర
కర్నూలు (అర్బన్): హక్కుల సాధనకు డిసెంబర్ 11, 12, 13వ తేదీల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్రలను నిర్వహిస్తున్నట్లు భారతీయ వాల్మీకి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, వాల్మీకి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి మద్దిలేటి నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా వాల్మీకి ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు.. వెంటనే ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయుడు, కల్లూరు మండల కన్వీనర్ ధనుంజయనాయుడు, నాయకులు శంకర్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల్లా ఉద్యమిద్దాం
- ఎస్టీ రిజర్వేషన్ సాధనపై వాల్మీకి నేతల పిలుపు - గుడేకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ ఎమ్మిగనూరురూరల్: ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా సైనికుల్లా పోరాడాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో ఆదివారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహవిష్కరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో గవర్నర్‌తో ప్రసంగం చేయించిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసెత్తడం లేదన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేస్తామని ప్రకటించారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబో‹స్ అన్నారు. రిజర్వేషన్‌కోసం కుప్పం నుంచి 11వందల కిలో మీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబుకు విన్నవించామన్నారు. డిశంబర్ 14న కర్నూలు శ్రీకృష్ణదేవరాయుల సర్కిల్లో 99 గంటల నిరవధిక నిరాహర దీక్ష తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఎవరి పార్టీలో వారు ఉండండి రిజర్వేషన్‌కు మాత్రం పార్టీలకతీతంగా పోరాడండి అంటూ నాయకులకు పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా చేతులు కలపాలని వీఆర్పీఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాంభీంనాయుడు, గూడూరు గిడ్డయ్య, రవి, డాక్టర్ మధుసూదన్, మాధవరం రామిరెడ్డి, కౌతాళం సురేష్, తాలుకా అధ్యక్షులు వీజీఆర్ కొండయ్య, జగ్గాపురం ఈరన్న, గిడ్డయ్య, రఘు, లైన్మెన్ రాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై వీఆర్పీఎస్ పోరు
– వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం వీర్‌పీఎస్ పోరాటం చేస్తోందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకులను ఆరు నెలల వ్యవధిలో ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేస్తు చర్యలు తీసుకోవాలని, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కాలయాపన చేస్తూపోతే వాల్మీకులు చూస్తూ ఊరుకోరన్నారు. డిసెంబర్ 14వ తేది నుంచి 18 వరకు 99 గంటల పాటు శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను సమీకరించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, జిల్లా నాయకులు లోకేష్, మల్లేష్, రంగన్న, మహేష్, శివన్న, వీరేష్, విద్యార్థి నాయకులు శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బోయ ఓబులేసుపై దాడి అమానుషం ... అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పోలీసులు పక్కనే ఉన్నా, దాడిని నియంత్రించకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. -
ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – ఘనంగా వాల్మీకి మహర్శి జయంతి ఉత్పవాలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి డీ హుసేన్‌సాహెబ్ అధ్యక్షతన ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వమించారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన అధికారులు, నాయకులు వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫాక్షన్ రాజకీయాలకు ఎంతో మంది బోయలు బలైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వాల్మీకి తన కుటుంబం, పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, త్వరలో పలు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వాల్మీకి కులానికి చెందిన 10, ఇంటర్, డిగ్రీ చదివిన 500 మందికి వారికి వివిధ రంగాల్లో శిక్షణను ఇప్పించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వాల్మీకి జయంతి నాటికి రాష్ట్ర క్యాబినేట్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుందనే ఆశాభావాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, బీసీ కార్పొరేషన్ ఈడీ కే లాలాలజపతిరావు, ఆర్డీఓ రఘుబాబు, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, సాంఘీక సంక్షేమశాఖ డీడీ యు ప్రసాదరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, పలు వాల్మీకి సంఘాలకు చెందిన నాయకులు ఎం సుభాష్ చంద్రబోస్, పద్మజానాయుడు, వలసల రామక్రిష్ణ, బుర్రా ఈశ్వరయ్య, బాల సంజన్న, గూడూరు గిడ్డయ్య, పులికొండన్న, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మాదన్న తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి నేత జూటూరు రమణ వాల్మీకి వేషాన్ని ధరించి ఆకట్టుకున్నారు. వీఆర్పీఎస్ నాయకులు..బీవై రామయ్య..కలెక్టర్ విజయమోహన్ ను సన్మానించారు. వాల్మీకిలందరూ నా బంధువులే: ఎస్పీ జిల్లాలోని 5 లక్షల మంది వాల్మీకులు తన బంధువులేనని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న నేపథ్యంలో వాల్మీకులు తనకు చాలా దగ్గరయ్యారన్నారు. వాల్మీకులకు ఎలాంటి కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయాలని, లేదా తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని కోరారు. గతం కంటే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగు పడిందన్నారు. ఎసీ్ట రిజర్వేషన్ సాధనతోనే మార్పు: బీవై రామయ్య వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేరుస్తేనే వారి జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. రాష్ట్రంలోని వాల్మీకుల పట్ట ప్రాంతీయ విబేధాలు ఉన్న కారణంగా ఎనిమిది జిల్లాల్లోని వాల్మీకులు విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి నేడు నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్‌కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రత్యేక నిధులు రావడం లేదన్నారు. -
9న ఐక్య వాల్మీకి ముఖ్యకార్యకర్తల సమావేశం
కల్లూరు (రూరల్): ఏపీ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈనెల 9 వ తేదీన బీ క్యాంపులోని బీసీ భవన్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బి. ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం చైతన్యపురి కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 తాలుకాల్లోని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను త్వరలో జరిగే సమావేశంలో ఎన్నుకుంటామన్నారు.అలాగే వాల్మీకి జయంతి నిర్వహణపై చర్చించనున్నామని, వివిధ రంగాల్లో స్థిరపడిన వాల్మీకులందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ట్రస్ట్ చైర్మన్ సుబ్రమణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు చిత్రసేనుడు పాల్గొన్నారు. -
ఆ ఆదర్శ దంపతుల అద్భుత గాథ మరోసారి
సత్గ్రంథం లోకపూజ్యమూ, రసరమ్యమూ అయిన రామాయణాన్ని మనకు తొలుత అందించింది వాల్మీకే అయినా, ఈ రమణీయ గాథను వందలాదిమంది కథలుగా, కావ్యాలుగా, పద్యాలుగా, శ్లోకాలుగా, చలనచిత్రాలుగా, కల్పవృక్షాలుగా, ఆఖరికి విషవృక్షాలుగా కూడా రకరకాల నామరూపాలతో అందించారు. అయినప్పటికీ రామకథను ఆస్వాదించేవారికి ఎప్పటికీ కొదవలేదనే చెప్పాలి. రాజమండ్రి వాస్తవ్యులు, ‘సాక్షి’లో ఉపసంపాదకులుగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యాసాలను రచించిన దీక్షితుల సుబ్రహ్మణ్యం ప్రక్షిప్తాల జోలికి పోకుండా, వాల్మీకి రామాయణాన్ని తనదైన శైలిలో, మాటలలో తొలుత ‘సంహిత’ అనే వెబ్ పత్రికలోనూ, తర్వాత ఫేస్‌బుక్‌లోనూ ధారావాహికగా అందించారు. ఆ వ్యాసాలకు లభించిన ఆదరణ, ప్రోత్సాహ ఉత్సాహాలతో, పెద్దలు, పీఠాధిపతుల ఆశీస్సులు, అండదండలతో ‘సీతారామ కథాసుధ’గా పుస్తక రూపమిచ్చారు. వాటిలో ప్రస్తుతానికి బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండలు విడుదలయ్యాయి. సామాన్యులకు కొరుకుడు పడని పదాలు, పెద్ద పెద్ద విశ్లేషణలు, సంస్కృత శ్లోకాలతో నింపకుండా, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే శ్లోకాలను పొందుపరచడం రచయిత పాత్రికేయ పరిణతికి నిదర్శనం. పత్రికలలో ప్రత్యేక కథనాలు రాసినట్లుగా, చక్కటి శైలిలో అంతంత మాత్రం చదువుకున్న వారికి కూడా అర్థం అయేలా ఉండటం ఈ రచనలోని ప్రధాన బలం. ‘లాభాల మాట రాముడెరుగు, ముందు అందరికీ ఈ అమృతాన్ని తలాకాస్త అందిద్దాం’ అనుకున్నట్లు రచయిత, ప్రచురణకర్తలు ధరను అందుబాటులో ఉంచారు. ఈ సంపుటిలోని ‘అరణ్యకాండ’ ఐదుదేశాలలో ఆవిష్కృతం కావడం ఆనందదాయకం. శ్రీమద్రామాయణం బాలకాండము పుటలు: 270; వెల రూ. 150 అయోధ్యాకాండము పుటలు: 300; వెల రూ. 200 అరణ్యకాండ పుటలు: 176; వెల రూ. 100 ప్రతులకు: ఆర్.ఆర్. పబ్లికేషన్స్, షాప్‌నంబర్-2, ప్రెస్‌క్లబ్, గణేశ్ చౌక్, రాజమండ్రి, ఫోన్: 9440451836.ఈ - డి.వి.ఆర్. -
ఐక్యపోరుకు సిద్ధం కావాలి
వాల్మీకుల సమరభేరి సభలో బూటాసింగ్ కర్నూలు, న్యూస్‌లైన్: వాల్మీకులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి బూటాసింగ్ పిలుపునిచ్చారు. వాల్మీకులు ఎదుర్కొంటున్న వివక్షను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో ఆదివారం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన వాల్మీకి సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా పరిగణించబడుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉండటం శోచనీయమన్నారు. ఈ వ్యత్యాసాలతో వాల్మీకులు అన్ని రంగాల్లో నష్టపోతున్నారన్నారు. బల్లారి ఎమ్మెల్యే బోయ శ్రీరాములు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉంటే వాల్మీకులకు న్యాయం జరిగేదన్నారు. అంతకు ముందు నగరంలో వాల్మీకుల భారీ ర్యాలీ నిర్వహించారు. -
వాల్మీకుల అభ్యున్నతికి కృషి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల విషయంలో నెలకొన్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. విషయంపై ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వాల్మీకి మహర్శి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బుధవారపేట సర్కిల్లో జరిగిన ఉత్సవ సభకు మంత్రి అధ్యక్షత వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డీసీసీ అధ్యక్షులు బీవై రామయ్య హాజరయ్యారు. ముందుగా వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతులు వెలిగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేరేందుకు వాల్మీకులు పోరాటం చేస్తున్నారని, అయితే ఇందుకు సంబంధించి రాజ్యాంగపరమైన ఇబ్బందులున్నట్లు తెలిసిందన్నారు. సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జోహరాపురం ప్రాంతంలో వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్వేషణ పూర్తయిందని చెప్పిన మంత్రి త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు మాట్లాడుతూ వాల్మీకులను ప్రత్యేకంగా ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని, ఇందుకు సంబంధించి ప్రాంతీయ వివక్షను తొలగిస్తే చాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా సత్ప్రవర్తనతో జీవిస్తున్న ఎంతో మంది వాల్మీకుల పేర్లు రౌడీషీటర్ల జాబితాలో ఉన్నాయని, ఎక్కడ నేరం జరిగినా ముందుగా వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూవాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన వాల్మీకుల పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్పీతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా మహర్శి వాల్మీకి వేషధారణలో వచ్చిన రమణ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవిచంద్ర, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, సాంఘీక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, డా.భవానీప్రసాద్, డా.టి పుల్లన్న, డా.మోహన్, సీనియర్ పాత్రికేయులు టి మద్దిలేటి, బీసీ హెచ్డ బ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ నాయకులు గడ్డం రామక్రిష్ణ, వాల్మీకి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహా పురుషులు వాల్మీకి, కొమురం భీంలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంది. వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, భూమా శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్, వి.బాలమణెమ్మ, మచ్ఛా శ్రీనివాసరావు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.