9న ఐక్య వాల్మీకి ముఖ్యకార్యకర్తల సమావేశం
Published Wed, Oct 5 2016 12:51 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
కల్లూరు (రూరల్): ఏపీ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈనెల 9 వ తేదీన బీ క్యాంపులోని బీసీ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు బి. ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం చైతన్యపురి కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 తాలుకాల్లోని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను త్వరలో జరిగే సమావేశంలో ఎన్నుకుంటామన్నారు.అలాగే వాల్మీకి జయంతి నిర్వహణపై చర్చించనున్నామని, వివిధ రంగాల్లో స్థిరపడిన వాల్మీకులందరూ హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ట్రస్ట్ చైర్మన్ సుబ్రమణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు చిత్రసేనుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement