‘వాల్మీకి’ ఎప్పుడొస్తున్నాడంటే..? | Varun Tej Valmiki Movie Releasing On 6th September | Sakshi
Sakshi News home page

సెప్టెంబ‌ర్ 6న వస్తోన్న ‘వాల్మీకి’

Published Mon, Jun 10 2019 11:03 AM | Last Updated on Mon, Jun 10 2019 11:03 AM

Varun Tej Valmiki Movie Releasing On 6th September - Sakshi

‘ఎఫ్‌2’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.. డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం.

వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రీమేక్‌ను హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తుండగా.. మిక్కి జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement