హీరోయినా..? ఐటమ్‌ గర్లా? | Pooja Hedge And Harish Shankar Still From Valmiki Set | Sakshi
Sakshi News home page

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

Published Sat, Jul 27 2019 10:21 AM | Last Updated on Sat, Jul 27 2019 10:21 AM

Pooja Hedge And Harish Shankar Still From Valmiki Set - Sakshi

కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ్ హీరోగా వాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ నటుడు అధర్వ మురళీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్‌, సెట్ లో తీసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు.

పల్లెటూరి అమ్మాయిల రెండు జడలతో రెడీ అయిన నటి వెనుకకు తిరిగి నిలబడి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన హరీష్ ఈ అమ్మాయి ఎవరో చెప్పుకోండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్న నటి హీరోయిన్ పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డేనే అంటూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే కొందరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న డింపుల్ హయాతి అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో తమిళలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. తమిళ్‌లో బాబీసింహా నటించిన ప్రతినాయక పాత్రలో వరుణ్ తేజ్‌ నటిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆంచటలు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement