ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్‌ సాధన | st reservation with united moments | Sakshi
Sakshi News home page

ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్‌ సాధన

Published Sun, Dec 18 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్‌ సాధన

ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్‌ సాధన

– సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు
కర్నూలు(అర్బన్‌): రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఐక్యంగా ఉద్యమాలను నిర్వహిస్తే ఎస్టీ రిజర్వేషన్‌  సాధ్యమవుతుందని బళ్లారి జిల్లా సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు అన్నారు. ఈ నెల 16వ తేది నుంచి స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్‌లో వీఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్దకు ఆయన ఆదివారం చేరుకుని  సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్‌ చంద్రబోస్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న కారణంగా 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మంత్రులు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే ఆయా కులాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెపా​‍్పరు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాల్మీకులు జిల్లా పరిషత్‌ నుంచి దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమాలను మరింత ఉద​‍్ధృతం చేస్తామని సుభాష్‌ చంద్రబోస్‌ ప్రభుత్వానికి హెచ్చరించారు కార్యక్రమంలో వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబీంనాయుడు, గూడురు గిడ్డయ్య, నాగరాజు, నరసింహులు, జిల్లా అధ్యక్షుడు డి. రామాంజనేయులు, వీజీఆర్‌ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement