ST
-
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్‌ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
ఇల్లు కూల్చి.. శిథిలాలు వాగులో కలిపి..
చిలకలూరిపేట: వైఎస్సార్సీపీకి ఓటు వేశారని కక్షకట్టి.. ఏకంగా ఇల్లు కూల్చి వేయడమే కాక.. ఆ శిథిలాలను వాగులో కలిపి టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు ఉయ్యాల ఏడుకొండలు, కోటమ్మ దంపతుల కథనం మేరకు వివరాలు వారి మాటల్లోనే.. ‘మాది కూలీ నాలీ చేసుకుని బతికే కుటుంబం. ముగ్గురు సంతానం. అందరికీ వివాహాలు చేశాం. గ్రామంలో 2019లో ఖాళీ స్థలం కొనుగోలు చేసి రెండేళ్ల కిందట రేకులతో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం.మీరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు అంటూ టీడీపీ వర్గీయులైన తన్నీరు గోవిందు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు, కుంచెపు ప్రసన్న, శ్రీను, మరికొందరు జేసీబీ, ట్రాక్టర్‌పై ఎక్కి మా ఇంటిపై దాడికి వచ్చారు. కట్టుబట్టలతో ఇంట్లో ఉన్న మమ్మల్ని, మా మూడో కుమారుడు వెంకటేశ్వర్లును బయటకు తోశారు. ప్రభుత్వం మాది.. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.వారిని ఇంట్లో నుంచి బయటకు గెంటి జేసీబీతో ఇల్లు కూల్చారు. అనంతరం ఆ శిథిలాలను ట్రాక్టర్లో తీసుకెళ్లి వాగులో పడేశారు. కాళ్లవేళ్లా బతిమిలాడుకున్నా కనికరించలేదు. అనంతరం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితులు రూరల్ పోలీసుస్టేషన్‌కు వెళితే అక్కడ ఎస్ఐ పట్టించుకోలేదు. దీంతో సోమవారం నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. -
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
-
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్‌కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్‌మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
ఇంఫాల్ లోయ ప్రశాంతం
ఇంఫాల్: మణిపూర్‌లో ప్రశాంతత నెలకొంటోంది. బుధవారం నుంచి మొదలైన హింసాత్మక ఘటనలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి. అయితే, శనివారం ఉదయం ఇంఫాల్ లోయలో దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. మైతి వర్గం ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వరాదంటూ బుధవారం చేపట్టిన ర్యాలీ సందర్భంగా మొదలైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకూ వేగంగా వ్యాపించాయి. హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 54కు చేరుకోగా, క్షతగాత్రులు 200కు పైనేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మరణాలు వందకు పైగానే ఉంటాయని అనధికార వర్గాల సమాచారం. ప్రభుత్వం, ఆర్మీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో సుమారు 13 వేల మంది తలదాచుకోగా కొందరు పొరుగునే ఉన్న మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లకు తరలివెళ్లారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల వద్ద పెద్ద సంఖ్యలో ఆర్మీ జవాన్లు, కేంద్ర బలగాల గస్తీ కొనసాగుతోంది. -
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్‌రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరుణ్‌రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా
రాజౌరీ(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో వెనక బడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ మంగళవారం రాజౌరీలో ఏర్పాటుచేసిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ‘ జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. వీరికి కొత్తగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటా లబ్ధి పొందుతున్న వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదు. మూడేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏ రద్దుచేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం వచ్చింది’ అని షా అన్నారు. ‘ఒక్క పహాడీలకే ఎస్టీ హోదా దక్కుతుందని కొందరు విష ప్రచారం చేసి గుజ్జర్, బకర్వాల్‌లను నిరసనలకు రెచ్చగొట్టారు. కానీ ఆ పాచికలు పారలేదు. గతంలో కేవలం మూడు కుటుంబాలే కశ్మీర్‌ను దశాబ్దాలపాటు ఏలాయి. ఇప్పుడు పంచాయతీ, జిల్లా మండళ్లకు జరిగిన పారదర్శకమైన ఎన్నికల ద్వారా 30 వేల మందికి తమ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అధికారమొచ్చింది’ అని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలను అమిత్ దుయ్యబట్టారు. ‘పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజౌరీ, పూంచ్, దోడా, కిష్ట్వార్లలో సీట్లు పెరుగుతాయి. తర్వాతే రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి. గతంలో రాష్ట్రానికొచ్చే కేంద్ర నిధులతో కొన్ని వర్గాలే లబ్ధి పొందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడింది’ అని షా అన్నారు. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో జనాభాలో 40 శాతం మంది బకర్వాల్, గుజ్జర్లే. పహాడీల జనాభా అతి స్వల్పం. 1991 ఏప్రిల్ నుంచి కశ్మీరీలు, డోగ్రాలకు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతున్నాయి. తమకు రిజర్వేషన్ కల్పించాలని చాన్నాళ్లుగా పహాడీలు డిమాండ్ చేస్తుండగా గుజ్జర్, బకర్వాల్లు వ్యతిరేకిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పహాడీలకు 4 శాతం కోటా కల్పించారు. -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్‌కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 2019 బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఎస్బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐఎస్బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నొవేషన్ స్కీం’ద్వారా ఐఎస్బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
కలవరపెట్టిన పాక్ సబ్‌మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక సబ్‌మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్‌మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్‌పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్‌ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్‌కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్‌ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్‌ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
గిరిపుత్రుల గుండెల్లో వైఎస్
సాక్షి, బుట్టాయగూడెం: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చారు. దీంతో కూలీలు రైతులుగా మారారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం ద్వారా బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించి ఇచ్చారు. దీంతో బీడు భూములు సైతం సాగుకు యోగ్యంగా మారి పచ్చని పంటలతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో 15 వేల ఎకరాల పంపిణీ గిరిజన ప్రాంతంలో తరతరాలుగా భూములు లేక కూలీలుగానే జీవిస్తున్న వారికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల వరకు భూములు పంచి వాటికి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో పంటలు పండించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న గిరిజన చిన్న, సన్నకారు రైతులు వైఎస్సార్‌ను దేవుడుగా కొలుస్తున్నారు. సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు రాజన్న అకాల మరణం తరవాత పేదోడికి సెంటు భూమి పంచి ఇచ్చే నాథుడే లేరంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మందికి పైగా అటవీ హక్కుల చట్టంలో భూముల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జానెడు భూమి పంచలేదని గిరిపుత్రులు విమర్శిస్తున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి రావాలని, ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశరావుపాలెం సమీపంలో గిరిజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులకు అండగా ఉంటానని గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మరింత మారతాయని ఆదివాసీలు ఆశిస్తున్నారు. వైఎస్ చలవతోనే భూమి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాకు 5 ఎకరాల భూమిని పంచి ఇవ్వడంతో పాటు ఆ భూముల్లో బోర్లు వేసి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం వల్ల ఆ భూముల్లో ప్రత్తి, మొక్కజొన్న, బెండ, కంది వంటి పంటలు పండిస్తున్నాను. వ్యవసాయ కూలీగా ఉన్న నేను రైతుగా మారతానని కలలో కూడా అనుకోలేదు. వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – ముచ్చిక బేబి, గిరిజన మహిళా రైతు, మర్లగూడెం ఇందిర ప్రభలో నీటి సదుపాయం రాజశేఖరరెడ్డి పాలనలో మాకు వ్యవసాయ పోడు భూములకు రెండెకరాలకు పట్టా ఇచ్చి హక్కు కల్పించారు. అదేవిధంగా సాగునీటి ఇబ్బందులు రాకుండా ఇందిర ప్రభ పథకంలో నీటి సదుపాయం కూడా కల్పించారు. ఆ భూముల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలు వేసుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నాం. భూమికి హక్కు పత్రం ఇవ్వడం వల్ల వ్యవసాయ రుణం పొందేందుకు కూడా అవకాశం కలిగింది. – మడకం రాజు, గిరిజన రైతు, లంకాలపల్లి, బుట్టాయగూడెం మండలం ఐదేళ్లుగా పట్టాలు రాలేదు మా గ్రామంలోని భూమిలేని 24 మంది గిరిజనులకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వైఎస్ రాజశేఖరరెడ్డి భూములిచ్చారు. ఆ సమయంలో 12 మంది దరఖాస్తులు చేసుకోగా పట్టాలు వచ్చాయి. వైఎస్సార్ మరణం తర్వాత మిగిలిన 12 మంది దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకూ పట్టాలు రాలేదు. వైఎస్సార్ ఉంటే ఎప్పుడో పట్టాలొచ్చేవి. జగన్ ముఖ్యమంత్రి అయితేనే పోడు భూములకు పట్టాలొస్తాయని నమ్ముతున్నాం. – పెనువెల్లి సోమరాజు, రైతు, బండార్లగూడెం, బుట్టాయగూడెం మండలం -
అట్టుడుకుతున్న అరుణాచల్
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎస్టీలు కాని ఆరు సామాజికవర్గాలకు శాశ్వత నివాస పత్రాలు(పీఆర్సీ) జారీచేయాలన్న హైపర్ కమిటీ సిఫార్సుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఆదివారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రైవేటు నివాసంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు అధికారులపై రాళ్లవర్షం కురిపించాయి. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకుముందు డిప్యూటీ సీఎం చౌనా మైన్ ఇంటిపై దాడిచేసి భవనానికి నిప్పుపెట్టారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫీసుపై దాడిచేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. డిప్యూటీ కమిషనర్ ఆఫీసు ప్రాంగణంలోని వాహనాలకు నిప్పంటించారు. ఇటానగర్ పోలీస్‌స్టేషన్‌పై సైతం దాడిచేశారు. నహర్లగున్ జిల్లాలో మార్కెట్ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టడంతో పాటు ఓ షాపింగ్‌మాల్‌ను లూటీ చేశారు. రాష్ట్రంలోని నమ్సాయి, చాంగ్లాంగ్ జిల్లాల్లో ఉంటున్న ఆరు ఎస్టీయేతర సామాజికవర్గాలకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో పీఆర్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని సీఎస్ సత్యగోపాల్ తెలిపారు. -
వరించి వచ్చింది.. సర్పంచ్ కానుంది..
గోవిందరావుపేట : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ గ్రామం ఏజన్సీ పరిధిలో ఉంది.. కానీ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు.. కొద్దినెలల క్రితం గ్రామానికి చెందిన యువకుడు ఎస్టీ యువతి బానోతు లల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామంలో కాపురానికి తీసుకురాగా ప్రియుడిని వరించి వచ్చిన ఆ యువతి నేడు సర్పంచ్ పీఠం ఎక్కనుంది. గోవిందరావుపేటలోని కోటగడ్డ గ్రామాన్ని ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా గుర్తించింది. గతంలో లక్నవరం(దుంపెల్లిగూడెం) గ్రామపంచాయతీలో భాగమైన కోటగడ్డకు సంబంధించిన వార్డు సభ్యులలో ఎస్టీ రిజర్వేషన్ వస్తే దుంపెల్లిగూడెంకు చెందిన వారే పోటీ చేసేవారు. గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయగా ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడం గమనార్హం. ప్రేమించి ప్రియుడితో వచ్చిన ఎస్టీ యువతి జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్ గ్రామానికి బానోతు సోమ్లా, లక్ష్మిల ఏడుగురు సంతానంలో ఐదో సంతానమైన లల్లి గతేడాది వేములవాడకు వచ్చిన క్రమంలో కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్‌కుమార్ దైవదర్శనానికి వచ్చి పరిచయమయ్యాడు. ఇరువురి మనసులు కలిసి వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుని గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. తల్లి పూర్తిగా అంగీకారం తెలుపకపోయినా ప్రియుడిని నమ్మి అతడి వెంట కోటగడ్డకు వచ్చి పూరిగుడిసెలో కాపురముంటుంది. ఈ క్రమంలో కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పడడం, గ్రామంలో ఆమె ఒక్కతే ఎస్టీ మహిళ ఉండడంతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. వార్డు సభ్యులకు తిప్పలే.. ఏజన్సీ గ్రామపంచాయతీ కావడంతో గ్రామంలో మొత్తం ఆరు వార్డులకు గాను మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. అయితే గ్రామంలో మరో ఎస్టీ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అదృష్టం కలిసి వచ్చింది.. మా ఇద్దరి మధ్య ప్రేమతో పెళ్లి చేసుకుని కోటగడ్డకు అత్తగారింటికి వచ్చాను. ఎస్సెస్సీ వరకు చదువుకున్నాను. ఇక్కడ రిజర్వేషన్ వల్ల అదృష్టం కలిసి వచ్చింది. గ్రామ పెద్దలు వచ్చి విషయం చెప్పారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ పెద్దలతో కలిసి గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం. – బానోతు లల్లి, కోటగడ్డ -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
లంబాడాలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్
-
దళితవాడల దరహాసం
కొత్త కోణం పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్. కృష్ణన్‌దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్. దళితులను తాకిన తెమ్మెరలు సైతం మలినమౌతాయని వారి నివాసాల జాడలను ఊరవతలికి తరమికొట్టిన కుత్సితపు కుల వ్యవస్థ మనది. అటు పాలకుల నిర్లక్ష్యానికీ, ఇటు సామాజిక వెలివేతకు గురై నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఆఖరిమెట్టు నుంచి కూడా అగాథాల్లోకి జారిపోతోన్న దళితులను అప్పుడప్పుడూ ఓ ఆపన్నహస్తం ఆదుకుంటూ ఉంటుంది. మలినపడిన జాతుల వేలి కొసలను పట్టుకొని పైకి లాగేందుకు మరపురాని సాహసాలు చేసిన ముగ్గురిని తెలుగు సమాజం ఎప్పటికీ స్మరించుకుంటుంది. నిరాడంబరుడూ, నిత్య దళిత విముక్తి కాముకుడూ ఎస్.ఆర్. శంకరన్ అటువంటి వారిలో ఒకరు. మరొకరు కె. ఆర్. వేణుగోపాల్. ఆ కోవకే చెందిన వారు మాజీ ఐఏఎస్ అధికారి పి.ఎస్. కృష్ణన్. ‘బడుగు బలహీన వర్గాల పట్ల అమిత పక్షపాతం, కులాంతర వివాహాలు జరగాలంటూ పట్టుదలగా వాదించటం, మత మౌఢ్యాలను తిప్పి కొట్టేందుకు తన సంస్కృత పరిజ్ఞానాన్ని వినియోగించడం, గ్రామాధికారులకన్నా గ్రామస్తుల మాటలను విశ్వసించడం, అన్యాయాలను ధిక్కరించే శక్తులకు చేయూతనివ్వడం..’ కృష్ణన్ గురించి ఆయన ఉద్యోగ జీవితపు ఆరంభదశలో పై అధికారి రాసిన రహస్య నివేదికలో మాటలివి. ఎవరీ కృష్ణన్? 1932 డిసెంబర్ 30వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో ఆయన జన్మించారు. పి.ఎల్. సుబ్రహ్మణ్యన్, ఈతల్లి అన్నపూర్ణల కుమారుడు. అక్కడే హైస్కూల్ చదువు కొనసాగించారు. ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో బీఏ పట్టా, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ (మద్రాసు యూనివర్సిటీ) నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకున్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి ముందు తమిళనాడులోని కాంచీపురంలో పచియప్ప కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు నేలకు సుపరిచితులు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికైన కృష్ణన్, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు తెలుగుగడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం కృష్ణన్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టిన కృష్ణన్‌కి కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన కుల వ్యతిరేక భావాల మూలాలు కేరళ సామాజిక ఉద్యమాలవే. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యన్ నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. 1942లో ౖ‘టెమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక చదివి అస్పృశ్యుల గురించి తెలుసుకున్నట్టు ఆయన ఒక సందర్భంగా చెప్పారు. అప్పుడాయన వయసు పదేళ్లు. అప్పుడే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురించి కూడా తెలుసుకున్నారు. అంబేడ్కర్ సామాజిక నేపథ్యం, ఆయన పోరాటాలను గురించి తండ్రిని అడిగి తెలుసుకునేవారు కృష్ణన్. తండ్రి భావాలే తనను అస్పృశ్యతా వ్యతిరేకిగా మార్చినట్టు కూడా ప్రకటించుకున్నారు. కేరళలో సాగిన నారాయణ గురు సాంస్కృతిక ఉద్యమం, అయ్యంకాళి నడిపిన సామాజిక ప్రతిఘటనోద్యమం కృష్ణన్‌ను సామాజిక మార్పు వైపు నడిపించేందుకు ఉపయోగపడ్డాయి. ఆ స్ఫూర్తే భారత ప్రభుత్వ అధికారిగా ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కొనే శక్తిని కృష్ణన్‌కు అందించింది. అది మొదలు సమాజంలో అణచివేతకూ, వివక్షకూ గురౌతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం తపించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తయిన తరువాత కృష్ణన్ మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినది అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలోనే. అక్కడ తహసీల్దారుగా నియమితులయ్యారు. అప్పుడే ఆ తాలూకాలో దళితులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు అందజేశారు. తాటిచర్ల అనే గ్రామంలో దళితవాడలో మూడురోజులు గడిపారు. దేవాలయం ముందర ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేసుకొని దళితులతోనే కలసి తింటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ దళిత కుటుంబాలు ఈయనకు అన్నం పెడితే ఆ ఇళ్లలో ఒకరికి భోజనం ఉండదు. అది గమనించిన కృష్ణన్ భోజనానికి డబ్బులు చెల్లించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్న సమయంలో (1964– 69 మధ్యకాలం) ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. అదే సమయంలో ఆదివాసీ భూముల రక్షణ కోసం, అన్యాక్రాంతమైన భూములను ఆదివాసీలకే అప్పగించడం కోసం ఉనికిలో ఉన్న చట్టాలను కఠినంగా అమలుచేసిన అధికారిగా ఆయనకు పేరుంది. చట్టాలలోని లోపాలను సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. దళిత వాడల్లోనే బస అప్పటివరకు అధికారులు దళిత వాడలకెళ్లడమే విచిత్రం. కానీ కృష్ణన్ దళిత వాడల్లోనే బసచేసి, వారి తిండే తిని ప్రభుత్వాధికారులకు ఆనాడే మార్గదర్శకంగా నిలిచారు. ఈ అనుభవం కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తరువాత ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఎస్సీ కుటుంబాలు, వాడలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కుల అసమానతలతో పాటు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఆ వాడల దరిదాపుల్లోకి చేరడం లేదనే విషయాన్ని ఆయన గ్రహించారు. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రణాళికా బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు గాను ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ రూపకల్పన చేసి, దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చడానికి కృషి చేసిన దార్శనికుడు కృష్ణన్. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు కృష్ణన్ చెప్పారు. అదేకాలంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్థిక సహకార సంస్థలకు అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విధానాన్ని కూడా ఆయన ఆరోజే రూపొందించారు. దాన్నే మనం ఇప్పుడు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని పిలుస్తున్నాం. ఆ రోజు కృష్ణన్ అంకురార్పణ చేసిన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ చాలా కాలం తగినంత ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ 2001 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రగులుకున్న ఉద్యమంతో 2012 నాటికి చట్ట రూపం ధరించింది. అదే ఈరోజు దళిత ఉద్యమానికి ఒక ఆయుధమైంది. దళితుల అభివృద్ధికి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ (2006 నుంచి దాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ సబ్‌ప్లాన్‌గా పిలుస్తున్నారు) ఒక ప్రధాన వనరుగా ఉందనేది దేశంలోని దళితులందరూ గుర్తిం చారు. అందుకే ఈరోజు ఎస్సీ సబ్‌ప్లాన్ ఉద్యమం దళిత ఉద్యమ ప్రధాన ఎజెండాగా మారింది. అత్యాచార నిరోధక చట్టం ఆవిష్కరణకు.... ఎస్సీలు, ఎస్టీలపైన జరుగుతున్న అత్యాచారాలనూ దమనకాండనూ అరికట్టేందుకు రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం రూపకల్పనలో కూడా పిఎస్.కృష్ణన్ భాగస్వామి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ చట్టంలో చేయాల్సిన సవరణల కోసం జరిగిన ప్రయత్నంలో కూడా సైనికుడిలా పాటుపడ్డారు. ఆయనతో పాటు ఎంతోమంది కృషి వలన ఆ చట్టంలో రావాల్సిన సవరణలలో కొన్నైనా రాబట్టుకోగలిగాం. అయితే అదే చట్టానికి మరో ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రాబోయే ప్రమాదాన్ని ఆయన పసిగట్టి దేశవ్యాప్తంగా ఐదువందల సంఘాలతో ఏర్పడిన జాతీయ దళిత సంఘాల ఐక్య కూటమికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అమలులో ఉన్న చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన కృష్ణన్ అనుభవం ఉద్యమానికి ఎంతో ఉపయుక్తం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మండల్ రిజర్వేషన్ల రూపకల్ప నకు కూడా కృష్ణన్ చేసిన కృషి మరువలేనిది. నాటి ప్రధాని వీపీ సింగ్ తీసుకున్న మండల్ అనుకూల నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికి, చట్ట రూపంలోనికి తేవడానికి ఆయన అనుసరించిన ఎత్తుగడలు ఆనాటి నాయకత్వాన్ని విస్మయానికి గురిచేశాయి. కృష్ణన్ లేనట్లయితే మండల్ రిజర్వేషన్లు చట్టపరంగా నిలబడేవి కావని ఎంతో మంది నాయకులు కొనియాడారు. మైనారిటీలకు రిజర్వేషన్లు.... అదేకాలంలో ఎస్సీల నుంచి బౌద్ధులుగా మారిన వారికి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయనే ఆలోచనను ప్రభుత్వానికి తెలియజేసి, ఒప్పించి మెప్పించిన ఘనత కృష్ణన్‌దే. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ముస్లింలలో ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యల పట్ల ఎంతో లోతుగా ఆలోచిం చిన వ్యక్తి కృష్ణన్. అందుకుగాను న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు పదవీ విరమణానంతరం కూడా ప్రభుత్వాలకు సహాయసహకారాలను అందించడం మనకు తెలుసు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వైఎస్‌కి గుర్తుకొచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణన్. ఆ విషయంలో వై.ఎస్. ప్రభుత్వానికి సలహా దారుగా ఉండి, ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కీలక భూమిక పోషించినవారు కృష్ణన్. పదవీ విరమణ అనంతరమూ... పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్. కృష్ణన్‌దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్. పి.ఎస్.కృష్ణన్ స్వాతంత్య్రానంతరం తొలితరం అధికారయంత్రాంగంలో ఒక నమూనాగా చెప్పుకోవచ్చు. మనందరం ఎంతో భక్తిభావంతో గుండెల్లో దాచుకున్న ఎస్.ఆర్. శంకరన్‌కు పిఎస్.కృష్ణన్ సీనియర్ మాత్రమే కాదు. ఆయనకు గురువుకూడా. ఆ తరం మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన కృష్ణన్ జీవితం నేటి తరం అధికారులకు కొంతైనా ఆదర్శం కాగలిగితే అట్టడుగు వర్గాలకు కాస్త అయినా మేలు జరుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
ఏం తమాషా చేస్తున్నారా..!
విజయనగరం పూల్‌బాగ్/ అర్బన్: ఎస్సీ,ఎస్టీ కేసులంటే లెక్కలేదా.. అధికారులు తమాషా చేస్తున్నారా.. అని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా.. ఎస్సీ, ఎస్టీ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఈ నెలాఖరునాటికి ఖర్చుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. పోలీసు యంత్రాంగం, ఎస్సీ,ఎస్టీ బాధితులకు అండగా నిలబడకపోగా వారిపైనే కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు, సాంఘిక సంక్షేమశాఖ, అటవీ, వ్యవసాయ, మత్య్స, పశుసంవర్థక , విద్యుత్, ఉద్యానవన, పంచాయతీరాజ్‌శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు తమ శాఖల ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకీ చర్యలు చేపట్టామన్నారు. దళిత, గిరిజన విద్యార్థులకు సకాలంలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న 126 మందికి రూ.60 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అందించామని వివరించారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కె రాజారావు, సిరివేలు సోమ, సుధారాణి, రవీంద్ర, నరహరి వరప్రసాద్, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, జేసీ–2 కె. నాగేశ్వరరావు, డీఆర్ఓ ఆర్ఎస్ రాజ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కారెం శివాజీ, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పూలమాలలు వేసి నివాaళులర్పించారు. -
‘గిరి’ పుత్రికకు అభయం!
సాక్షి, హైదరాబాద్ : తండాల్లో ఆడపిల్లల విక్రయాలను అరికట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆడ శిశువుకు అభయం ఇచ్చేందుకు ఆర్థిక సహకార పథకాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలో గిరిజన తండాల్లోని పేదింట్లో పుట్టిన ఆడశిశువుకు అభయంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మగపిల్లాడు కావాలనే ఆరాటంతో వరుసగా ఆడపిల్లలు పుట్టడం, పేదరికం కారణంగా వారిని సాకలేమంటూ దూరం చేసుకుంటున్నారు. ఇలా శిశువుల్ని విక్రయించడం, విషయం బయటకు పొక్కితే శిశువిహార్ తరలించడం వంటి సంఘటనలు ఇప్పటికీ తండాలు, గిరిజన ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసే దిశగా గిరిజన సంక్షేమ శాఖ ముందుకు సాగుతోంది. 18 ఏళ్ల వరకూ.. తండాలు, ఏజెన్సీల్లో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉంది. సగటున వెయ్యి మంది పురుషులకు 945 మహిళలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పేదింట్లో ఆడపిల్ల పుడితే శిశువు పేరిట రూ.లక్ష వరకు సమీప బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని 18 ఏళ్ల వరకు విత్‌డ్రా చేసే వీలుండదు. అలా అమ్మాయి పెళ్లి నాటికి డిపాజిట్ మొత్తం రూ.10 లక్షల వరకు పెరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తోంది. దీంతో అమ్మాయి పెళ్లికి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడదని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి పథకం కింద ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా కొత్త పథకాన్ని అమలు చేస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంశంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. 2018–19 బడ్జెట్ ఖరారయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పిస్తామని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ‘సాక్షి’కి తెలిపారు. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
‘పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తాం..’
సాక్షి, అనంతరపురం: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ పవన్ వ్యాఖ్యలపై గిరిజన జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడించడానికి కూడా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక నాగులకట్ట వద్ద విలేకరుల సమావేశంలో గిరిజన జేఏసీ పుట్టపర్తి కన్వీనర్ కే. రవీంద్ర నాయక్, కో కన్వీనర్ కుళ్లాయి నాయక్, జిల్లా యువజన విభాగం కన్వీనర్ ఎస్. నారాయణస్వామి నాయక్ మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. ఇందుకు తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్ చెప్పడం గర్హనీయమన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్ధమవుతోందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లోనే పవన్ నడవటం విచారకరమని గిరిజన నాయకులు అన్నారు. పవన్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు. -
మన్యం కదిలింది!
మన్యం కదిలింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చొద్దంటూ వేలాది మంది గిరిజనం కదం తొక్కారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు నుంచి కలెక్టర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని నినదించారు. కలెక్టరేట్‌ను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ 57 రోజులుగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతోపాటు నిప్పటించడంతో కలకలం రేగింది. కలెక్టర్, ఎస్పీ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గిరిజనం గళమెత్తింది. తమకు అన్యాయం చేయవద్దంటూ నినదించింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సోమవారం చలో కలెక్టరేట్‌కు పిలుపునివ్వడంతో గిరిజనలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి వాంబే కాలనీ, వృద్ధాశ్రమం ప్రాంతాలు గిరిపుత్రులతో నిండిపోయాయి. ఆదివాసీ ఉద్యోగ, విద్యార్ధి, మహిళా సంఘాలు, హక్కుల పోరాట సమితిలు భాగస్వాములయ్యాయి. తరలివచ్చిన జనం కంచిలి, సోంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల నుంచి వివిధ వాహనాల్లో సుమారు పది వేల మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌కు ర్యాలీ గా వచ్చారు. జనం భారీగా ఉండడంతో పో లీసులు సైతం వీరిని అడ్డుకోలేదు. కలెక్టరేట్‌ను ముట్టడించిన గిరిజనులు తమ డి మాండ్లను పరిష్కరించాలని నినదించారు. టీడీపీ ప్రభుత్వం తమపై కక్షకట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎస్టీ జాబితాలో మరిన్ని జాతులను కలిపి ఎస్టీలను మరింత వెనుకబాటు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ఈ కారణంతోనే బోయ, వాల్మీక కులాలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అ సెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని జేఏసీ నేతలు దుయ్యబట్టారు. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పించాలని చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. 1952 నాటి గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిం చారని, అయితే ప్రస్తుత జనాభా పెరిగినందున దీనికి అనుగుణంగా రిజర్వేషన్ పది శాతానికి పెంచాలని నినాదాలు చేశారు. జిల్లాలో గిరిజనుల పేరుతో వందలాది మంది నకిలీ కుల ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని వెంటనే తొలగించాని, ఆ ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారిని, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ అధికారిగా పనిచేస్తున్న నకిలీ గిరిజన ఉద్యోగి కుమార్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు గిరిజనులకు అన్యాయం చేసేం దుకే బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు చేయడం తగదని గిరిజన జేఏసీ ప్రతినిధులు నినదించారు. ముఖ్య మంత్రి, టీడీపీ నాయకులు కలిసి ఎస్టీలపట్ల కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ.. ఏ రాజకీయ పార్టీ కూడా వారి ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టరాదన్నారు. అలా వాగ్దానాలు చేస్తే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గడిచిన 60 రోజులుగా మన్యంలో దీక్షలు చేస్తు న్నా ముఖ్యమంత్రి, మంత్రుల్లో చలనం లేదన్నారు. దీంతో ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకురావాల్సి వచ్చిందని ఆదివాసీ జేఏసీ నాయకులు వాబ యోగేశ్వరరావు, సవర రాంబాబు తదితరులు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో 32 తెగలు ఉన్నాయని, రాష్ట్రంలో 28 లక్షల మంది, జిల్లాలో 1.82 లక్షల మంది గిరిజన జనాభా ఉందన్నారు. ప్రభుత్వం తీరుతో సవర, కాపుసవర, జాతాపు, మలే సవర, చెంచులు, కొండదొరలు, కొండ రెడ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉద్యమంలో ఆదివాసీల సంక్షేమ పరిషత్, వికాస్ పరిషత్, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, హక్కుల పోరాట సమితి, పీడీఎస్యుల ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల జాయింట్ ఎక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, సంఘాల ప్రతినిధులు గూడ ఎండయ్య, సవర జగన్నాథం, వి.భానుచందర్, ఎం.భాగ్యలక్ష్మి, కె.శ్రీను, ఎస్.చిరంజీవులు, ఎ.రామారావు, కృష్ణారావు, గణ్వేరరావు, బి.సింహాచలం, దుర్యోధన, సిద్ధేశ్వరరావు, మాధవయ్య, ఎస్.షణ్ముఖరావు, జి. మోహనరావు, జి.అప్ప న్న, ఆర్.పోతయ్య, ఎస్.నారాయణరావు పాల్గొన్నారు. 200 మందిపై కేసు నమోదు శ్రీకాకుళం సిటీ: కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల శిబిరంపై సోమవారం కొంతమంది దాడి చేసిన ఘటనలో 200 మంది ఆదివాసీలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒకటో పట్టణ ఎస్సై ఈ. చిన్నంనాయుడు తెలిపారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కలెక్టర్, ఎస్పీల సందర్శన భారీగా గిరిజనులు తరలి రావడం.. ముఖ్యమంత్రికి, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్టీ త్రివిక్రమవర్మ స్పందించారు. గిరిజనులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడారు. తొలుత జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకుల నుంచి తీసుకున్నారు. అయితే గిరిజనులు శాంతించలేదు. కలెక్టర్ రావాలని పట్టుపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వచ్చారు. గిరిజన సమస్యల పరిష్కారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ కూడా వచ్చి మత్స్యకారులు నిరసన దీక్షలు చేస్తున్నారని.. వారికి ఇబ్బంది లేకుండా మెలగాలని సూచించారు. ఏఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు పెంటారావు, భీమారావు, సీఐలు నవీన్ కుమార్, ప్రదసాద్, తిరుపతిరావు బందోబస్తును పర్యవేక్షించారు. గిరిజన ఉద్యమం ముసుగులోమత్య్సకార శిబిరం ధ్వంసం గిరిజన ఉద్యమం ముసుగులో ఉన్న కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు మత్స్యకారుల రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఎస్టీలో జాబితాలో చేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద మత్య్స కారులు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని చూసిన అధికార పార్టీకి చెందిన కొంతమంది గిరిజన ముసుగులో రెచ్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినా శిబి రాన్ని ఎత్తివేయడం లేదని, మత్స్యకారులపై చర్యలు తీసుకోలేక, గిరిజన ఉద్యమం నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు భంగం కలిగించేందుకు కొంతమంది అధికార పా ర్టీకి చెందిన వారు శిబిరానికి నిప్పంటించినట్టు తెలిసింది. శిబిరానికి కట్టిన పోస్టర్లు, కర్టన్లను పీకేశారు. టెంట్‌ను కూల్చివేసి.. నిప్పంటించారు. ఈ క్రమంలో రిలే నిరా హార దీక్షలో ఉన్న సోంపేట మండలం ఇసకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నిట్ట లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో పది మంది స్వల్పం గా గాయపడ్డారు. ఈ సంఘటనతో కొద్దిసేపు కలకలం రేగింది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది. -
ఎస్టీల్లో చేర్చాలంటూ మత్స్యకారులు దర్నా
-
ప్రత్యేక ఓటింగ్‌తోనే దళితుల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను అందించడం లేదని, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన ప్రత్యేక ఓటింగ్ ద్వారా మాత్రమే దళితులకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని దళిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు, రాబర్ట్ కెనడీ అవార్డు గ్రహీత మార్టీన్ మెక్వాన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ 7వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్వాన్ స్మారకోపన్యాసం చేస్తూ.. ప్రస్తుత ఎన్నికల విధానంలో నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, అత్య«ధిక ఓట్లు దళితేతరులవే కావడంతో దళితుల సమస్యలను పరిష్కరించడంలో రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని చెప్పారు. దళిత ప్రతినిధులకు దళితులు మాత్రమే ఓటు వేసుకునే విధానాన్ని సపరేట్ ఎలక్టోరేట్ అంటారని, 1932లో అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన కమ్యూనల్ అవార్డును మహాత్మా గాంధీ వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు అమలులో ఉన్న రాజకీయ రిజర్వేషన్ల విధానం వచ్చిందని తెలిపారు. అప్పటికే ముస్లింలకు, ఆంగ్లోఇండియన్లకు ఇటువంటి ప్రత్యేక ఓటింగ్ విధానం అమలులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గుజరాత్లో దయనీయం.. ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న గుజరాత్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో ఉమ్మడి నీటి వనరులను వినియోగించుకునే స్వేచ్ఛ దళితులకు లేదని, వేలాది గ్రామాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని చెప్పారు. దళిత ప్రజాప్రతినిధులు వారి పార్టీ, నాయకత్వానికే విశ్వసనీయంగా ఉంటున్నార ని, దీనికి ఇప్పుడున్న ఓటింగ్ విధానమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి అధికారులు దళితుల కోసం చేసిన సేవలను భవిష్యత్ తరాలు, ప్రస్తుత అధికార యంత్రాంగం మార్గదర్శకంగా తీసుకోవాలని మెక్వాన్ సూచించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారి పాలనా సమయంలో తాము ఉండటం, ఆయనతో సన్నిహితంగా ఉండటం ఒక చక్కటి అనుభూతిగా భావిస్తున్నామని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని, శంకరన్ ఒక్క ఏడాదిలోనే 120కిపైగా జీవోలపై సంతకాలు చేయడం, అవన్నీ దళితుల అభ్యున్నతికి సంబంధించినవే కావడం ప్రపంచంలోనే అరుదైన దృశ్యంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. దళితుల కోసమే ఆయన జీవితం సభకు అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదలు, ఆదివాసీల కోసం, దళితేతర సమాజంలోని చాలా మంది వ్యక్తులు పనిచేసారని, కానీ దళితుల కోసం జీవితమంతా ధారబోసిన ఏకైక వ్యక్తి శంకరన్ అని కొనియాడారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ శంకరన్ గారి స్ఫూర్తి వల్లనే ఐఏఎస్ అధికారిగా నిబద్ధతతో కూడిన కార్యాచరణను కొనసాగించానని, అటువంటి వ్యక్తితో చివరికంటా స్ఫూర్తిని పొందుతూ వచ్చానని చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ వైవీ సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ.. శంకరన్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. ఎస్సీ హాస్టల్లో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన పేద దళిత బాలికకు ఏటా ఇచ్చే లక్ష్మీవేణుగోపాల్ అవార్డును అన్వేషి కార్యదర్శి డాక్టర్ కె.లలిత వనపర్తి జిల్లాకు చెందిన సి.ఆశకు అందజేశారు. -
"కుల"కలం
ఒకప్పుడు వారు గిరిజనులు. ఇప్పుడు కారు. ఒకప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించం పొమ్మంటోంది. అర్హత ఉన్నా గిరిజనులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గిరిజనులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. ఏనేటికోండ్రు కులం గిరిజనుల గోడును నిర్లక్ష్యం చేస్తోంది. విజయనగరం, బలిజిపేట (పార్వతీపురం): నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న ఏనేటి కోండ్రు కులస్తులను ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గ్రామంలో 15 కుటుం బాలు వందేళ్లకు పైగా నివసిస్తున్నాయి. ఎస్టీలైన వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలసలోనూ గుర్తిస్తుండటం విశేషం. 1990 వరకు తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు ఇచ్చారని.. ఆ తర్వాతే నిలిపివేశారని కుల పెద్దలు నాగభూషణరావు, నీలకంఠం తెలిపారు. తమ కులస్తులు కొందరు చదువుకునేటప్పుడు ఎస్టీలుగానే గుర్తించి కులధ్రువీకరణ మంజూరు చేశారని, పాఠశాల టీసీల్లో కూడా ఎస్టీలుగా ధ్రువీకరించి ప్రస్తుతం కాదనడం సమంజసంగా లేదని తెలిపారు. ఎందుకు గుర్తించరు? నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న తమ కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని తమ కులస్తులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాయని ఎం.వెంకటరమణ, ఆర్.ఫకీరు, ఎం.గణపతి, మురళి తెలిపారు. కులపరంగా ఆచార సంప్రదాయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఎస్టీలం ఎలా కాకుండా పోతామని ప్రశ్నిస్తున్నారు. అంధకారంలో పిల్లల భవిత కుల ధ్రువపత్రాలకు నిరాకరిస్తుండటంతో 1990 అనంతరం పిల్లల చదువుల కోసం ఓసీలుగానే బడిలో చేర్పించి చదివిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామన్నారు. నిరుపేదలమైన తమకు జీవనాధారం కష్టమై పిల్లలను చదివించడం భారంగా ఉందని తెలిపారు. వేలకు వేలు చెల్లించలేక తక్కువ చదువులతో మాన్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయా నాకు 2005లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం లేనందున వచ్చిన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నిరుత్సాహానికి గురయ్యాను. నేటికీ మేము ఏ కులస్తులమో అర్థం కావటం లేదు. – ఎం.గణపతి, నారాయణపురం పదోన్నతి రాలేదు అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్న నాకు 2011లో సూపర్వైజర్గా పదోన్నతి లభించింది. కానీ కుల ధ్రువపత్రం లేనందున పదోన్నతి నిలిచిపోయింది. మా పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – ఎం.సరోజిని, నారాయణపురం పరిశీలిస్తా మీసేవలో కుల ధ్రువీకరణ నిమిత్తం దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అవకాశం ఉంటే సహకరిస్తాం. అన్నీ పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తాం.– బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ‘డైట్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా’అనే అంశంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇటీవల పరిశోధన జరిపింది. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చి, కర్ణాటకలోని మైసూర్, బెంగళూరుతోపాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో నిర్వహించిన ఈ పరిశోధనలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహార లోపం అధికమని తేలింది. ఆహార వినియోగం, హెచ్చుతగ్గుల వల్ల సంక్రమించే వ్యాధులు, శరీరంలో ఏర్పడే మార్పులను ఈ పరిశోధనలో కనుగొన్నారు. షెడ్యూల్డ్ కులాల బాలురలో 32.4, బాలికలు 25.2 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టమైంది. ఆదివాసీ బాలురలో 32.6 శాతం, బాలికల్లో 31.7 శాతం, వెనుకబడిన కులాల్లోని బాలురలో 25.8 శాతం, బాలికల్లో 25.8 శాతం మంది పౌష్టికాహారలోపంతో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. తండ్రి నిరక్షరాస్యుడై తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల్లో ఈ పరిణామం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే, దీనికి పేదరికంతోపాటు, నిరక్షరాస్యత, అవగాహనాలోపం, వివక్షలే కారణమని పౌష్టికాహార నిపుణులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. నిజాయితీగా అమలు చేయాలి పేదరికం, ఆకలి, అవమానాలతోపాటు పిల్లల ఆరోగ్యంపై అసమానతలు బలమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని నివారణకు మధ్యాహ్నం భోజనం లాంటి పథకాలను నిజాయితీగా అమలు చేయాలి. – డాక్టర్ కనకరాజు, వైద్యులు అసమానతలే కారణం దేశంలో నెల కొన్న సామాజిక అసమానతలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక విషయాలతోపాటు ఆహారం, ఆరోగ్యాలపై సామాజిక అసమానతలు, వివక్ష తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనమే ఎన్ఐఎన్ సర్వే నివేదిక. – ప్రొఫెసర్ రమామేల్కొటే, భారత ఆహార కమిషన్ మాజీ సలహాదారు ఎదుగుదలపై తీవ్రభావం ఆర్థిక అసమానతలైనా, సామాజిక వివక్షలైనా, బాలలు, మహిళల పైనే ఎక్కువ ప్రభాన్ని చూపుతాయి. ఎన్ఐఎన్ నివేదిక దానికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీల్లో నెలకొని ఉన్న పేదరికం ఆ వర్గాల పిల్లల పెరుగుదలపై, మానసిక వికాసంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తోందనడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. –లలిత, స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త -
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ మార్గదర్శకాలు ఖరారు
- ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్ - ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు.. సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రెండున్నర నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుకు మోక్షం కలిగింది. ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు సంబంధించి మంత్రుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమం అమలుతో పాటు నిఘాపైనా స్పష్టత రానుంది. ఎస్సీ, ఎస్టీలకోసం గతంలో ఉన్న ఉప ప్రణాళికను రద్దు చేస్తూ.. 2017– 18 వార్షిక సంవత్సరం నుంచి కొత్తగా ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిధి కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభిృవృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది. దీంతో పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నిధుల వినియోగంపైనా కఠిన నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా రూల్స్ ఫైలును సీఎం ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వు లు వెలువర్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు కానుంది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై క్షేత్రస్థాయిలో ఎస్డీఎఫ్ అమలు తీరును పర్యవేక్షించాలి. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తున్నా మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో కమిటీ ఏర్పాటు కాలేదు. త్వరలో మార్గదర్శకాలు వెలువడనుండటంతో కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశం కూడా జరగనుందని అధికారులు చెబుతున్నారు. -
కేసీఆర్‌కు ఉత్తమ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై నిరంతరం కొనసాగుతున్న దాడులు, వేధింపులు, అక్రమాల గురించి అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుదనుకున్నాము. కానీ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనగారిన వర్గాల వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో అణగారిన వర్గాలపైన జరుగుతున్న దాడులతోనే గుర్తింపు పొందేలా తయారైందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు దళితుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వవపోవడమో కాకుండా కనీసం వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక చోట అనగారిన వర్గాల వారిపై ఎదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దురగాతాలతో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో ఎక్కువగా గిరిజనులే ఉన్నారు. 2014 నుంచి 2016 డిసెంబర్ నాటికి సెకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1592 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 502 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. 120 హత్యలు జరిగాయి. మొత్తంగా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ కేసులను పరిశీలస్తే 2016 డిసెంబర్ నాటికే 5210 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దళితులు ఆత్మస్థైర్యం కోల్పోయి బతుకీడుస్తున్నారు. వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి అనగారిన వర్గాలకు బతుకు భరోసా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. -
మంత్రిపై అ్రట్రాసిటీ కేసుకు డిమాండ్
నెల్లిమర్ల: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ గంటాన అప్పారావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షురాలు భోగాపురపు మంగమ్మతో కలిసి సోమవారం నెల్లిమర్ల తహసీల్దారు చిన్నారావుకు వినతిపత్రం అందించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో దళితులను కించపరుస్తూ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఎంతకాలం గడిచినా, ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దళితులు అభివృద్ధి సాధించలేరని మంత్రి మాట్లాడటాన్ని ఖండించారు. దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందారని, ఇప్పటికే 450 మంది దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారని అప్పారావు పేర్కొన్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. -
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'
-
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'
నంద్యాల వ్యవసాయం: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటారని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం నంద్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి, క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు. సమావేశంలో సింగనమల నాయకురాలు బండి లలితా కల్యాణి, బ్యాళ్ల శీను పాల్గొన్నారు. -
నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ (అనంతపురం): ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు తమ ఫిర్యాదులను, సమస్యలను అర్జీ రూపంలో సమర్పించుకోవాలని ఆయన వెల్లడించారు. -
ఎస్టీలకు తెలివి ఉండదు: సీఎం
కుప్పం నియోజకవర్గంలోని సభలో చంద్రబాబు వ్యాఖ్య చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు నాయుడు గిరిజనులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితులు, గిరిజనులంటేæ సీఎం చంద్రబాబుకు చులకన అని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో గురువారం ఆయన అన్న మాటలే నిదర్శనమని కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. విమర్శలకు తావిచ్చిన సీఎం చంద్రబాబు గుడుపల్లెలో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘ ఎస్టీలు అడవుల్లో ఉంటారు. ఎక్కడెక్కడోతిరుగుతుంటారు. వారికి తెలివి ఉండదు. వారిని కూడా అభివృద్ధి చేస్తాం. పేదరికాన్ని పారదోలేందుకు యజ్ఞంలా పని చేస్తున్నా. పేదరికంలో ఉన్న వారికి ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. బడుగుబలహీన వర్గాల కోసం రూ. 10 వేలకోట్లు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటాం. అభివృద్ధి పనుల్లో ఏదైనా పొరపాటు జరిగితే అది కార్యకర్తలదే. వారి అవకతవకలకు నాపై కొపం చూపొద్దు. అలా చూపితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. 90 శాతం ప్రజలందరూ టీడీపీకే ఓట్లేసి మరోసారి గెలిపించండి. దేశ చరిత్రలో నదుల అనుసంధానం చేసిన ఘనత నాదే.. గోదావరి, కృష్ణా నదులను కలిపి హంద్రీనీవా ద్వారా సెప్టెంబర్‌లోగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ నీరు అందించే బాధ్యత ప్రభుత్వానిది. పట్టిసీమ నిర్మించడం వల్లే ఇది సాధ్యం అవుతోంది. గోదావరి నీరు ప్రతి సంవత్సరం వేల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 వేల క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. కృష్ణలో నీరు ఈ స్థాయిలో లేదు. పెద్ద వర్షాలు వస్తేనే కృష్ణపై నిర్మించిన డ్యాంలు నిండుతాయి. దీంతో కరువు పరిస్థితుల్లో నీటికి కటకట ఏర్పడుతోంది. దీన్ని మార్చాంటే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. పంట కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించి ప్రతి బొట్టూ భూమిలో ఇంకిపోయేలా చూస్తే.. చేను కిందే చెరువు ఉంటుంది. దీంతో పాటు ప్రతి మహిళకూ నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం కంపోస్టు యార్డులు, తదితర పనులు అçప్పజెప్పుతున్నాం. కరువులో రైతులు ఇబ్బందులు పడకుండా.. వారి ఆదాయం పడిపోకుండా పచ్చగడ్డి, గడ్డి విత్తనాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నాం. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉండేలా వారికి మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు చేయూతనిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ నిధుల ముసాయిదా సిద్ధం
- రూపొందించిన మంత్రుల కమిటీ - ఒకట్రెండు రోజుల్లో సీఎం వద్దకు ఫైలు - ఆమోదముద్ర పడగానే అమల్లోకి.. - అభివృద్ధి నిధి పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాల అంశం కొలిక్కి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ ఆధ్వర్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేÔశమయ్యాయి. సుదీర్ఘ చర్చలు జరిపిన ఈ కమిటీలు తాజాగా నిబంధనలు ఖరారు చేశాయి. ఏడు అంశాలతో రూపొందించిన ముసాయిదాను ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆమోదం పొందగానే ప్రత్యేక అభివృద్ధి నిధి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతంలో ఉన్న సబ్‌ప్లాన్ కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. నిధి కింద చేసే ఖర్చుకు తగిన ఫలితాలు రావాలనే లక్ష్యంతో మంత్రుల కమిటీ కార్యచరణ రూపొం దించింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ.. పలు పథకాలను నిర్దేశించింది. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక స్థితి, ఉపాధి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ఆరు నెలలకోసారి కౌన్సిల్ భేటీ.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ ఆర్నెళ్లకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. వీటితోపాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. మంత్రుల కమిటీ సూచించిన ఏడు అంశాలివే.. ► ఇతర వర్గాలు–ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి ► ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వారి సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► బడ్జెట్ తయారీ ప్రణాళికబద్ధంగా జరగాలి ► సకాలంలో ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ► రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి ► జిల్లా స్థాయిలో నిఘా, పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
త్వరలో ఎస్సీ, ఎస్టీ నిధి నిబంధనలు
వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు సూచనలు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కోరారు. మంగళవారం సచివాలయంలో నిర్వహిం చిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల న్నారు. పథకాల అమలు పర్యవేక్షణకు సీఎం చైర్మన్‌గా కౌన్సిల్ ఏర్పడుతుందన్నారు. పది రోజుల్లోగా డ్రాప్ రూల్స్ సమర్పించాలని అజయ్ మిశ్రా కోరారు. ఈ సందర్భం గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రగతి పద్దులో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధిం చి కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అదనంగా పొందేలా వివిధ శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్కే జోషి, రాజేశ్వర్ తివారి, బీపీ ఆచార్య, సురేశ్ చందా తదితరులు పాల్గొన్నారు. -
‘జానా’ తీరుపై సంపత్ నిరసన
నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరు ♦ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి ♦ తాను మాట్లాడతానన్నా జానారెడ్డి పట్టించుకోలేదని కినుక ♦ వంశీకే మైక్ ఇప్పించడానికి ప్రయత్నించారని ఆరోపణ ♦ ప్రభుత్వం కూడా అవకాశం రాకుండా కుట్ర పన్నిందని ధ్వజం ♦ కాంగ్రెస్ శాసనసభాపక్షం అండగా నిలవకపోవడంపై ఆవేదన సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత జానారెడ్డి తనకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, దానిలోని లోతుపాతులపై అధ్యయనం చేశానని, తనకు అవగాహన ఉందని, అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యా య మని అన్నారు. కాంగ్రెస్‌కే చెందిన వంశీచంద్ రెడ్డికి మైక్ ఇప్పించడానికి జానారెడ్డి పదేపదే ప్రయత్నం చేశారని సంపత్‌కుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తి చూపానని, దాంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం రాకూడదని ప్రభుత్వం కుట్ర చేసిందని, ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారని ఆరోపించారు. అభివృద్ధి నిధిపై సబ్‌కమిటీలో సభ్యునిగా ఉన్న తనకు అవకాశం రాకపోతే కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సంపత్ అన్నారు. అన్ని పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాం లోనే దళితులకు మేలు జరిగిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలును శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చిన తమ పార్టీ సభ్యులు కూడా సరిగా చెప్పలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రచేస్తే, దళిత బిడ్డగా తనకు కాంగ్రెస్ సభ్యులు అండగా ఉండకపోవడంతో రాత్రంతా తీవ్ర ఆవేదన చెందినట్టుగా సంపత్‌కుమార్ వెల్లడించారు. సీనియర్ల బుజ్జగింపులు నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చిన సంపత్ కుమార్‌ను కాంగ్రెస్‌పార్టీ సీనియర్ ఎమ్మె ల్యేలు పలువురు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఆయనకు నచ్చ జెప్పారు. సంపత్‌కుమార్‌తో మాట్లాడటానికి జానారెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చారు. సంపత్ కోసం సీఎల్పీ కార్యాలయం ఎదుట జానారెడ్డి కొంతసేపు వేచిచూశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చెప్పినా సంపత్ పట్టించుకోలేదు. ఇప్పుడు జానారెడ్డితో మాట్లాడేదీ ఏమీ లేదని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడతానని బెట్టు చేశారు. దీంతో జానారెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంపత్ శాసనసభలో జరిగిన అంశాలపై తనకు ఆవేదన ఉందని. అన్ని విషయాలను అంత ర్గతంగానే చెప్పుకునేందుకు సీఎల్పీ సమా వేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరుతారా? టీఆర్ఎస్లోని ఓ ప్రముఖ నేతతో సంపత్ టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో చేరడానికి వ్యూహంలో భాగంగానే నల్లకండువాతో సభకు వచ్చి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సంపత్‌కుమార్ టీఆర్ఎస్లో చేరడానికి సదరు ప్రముఖ నేతతో ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. కాంగ్రెస్ దళి తులకు వ్యతిరేకం అన్న అపవాదు కలిగించే ప్రయత్నంలోనే సంపత్ కుమార్ ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడబోనని సంపత్‌కుమార్ చెప్పారు. తన కుటుంబం యావత్తు మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నదని, భవిష్యత్‌లో కూడా తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని ఆయన విస్పష్టంగా చెప్పారు. -
‘సబ్ ప్లాన్’ చట్ట సవరణకే కాంగ్రెస్ పట్టు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల వెచ్చింపుకు కొత్త చట్టం అవసరం లేదని ప్రస్తుత సబ్ ప్లాన్‌కే చట్ట సవరణ చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ‘ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం’ పేరుతో కొత్త చట్టం అవసరం లేదని, దానికి బదులు సబ్ ప్లాన్ చట్టానికే సవరణ తేవాలని అసెంబ్లీలో పట్టుబ ట్టాలని నిర్ణయించింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉప నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు గురువారం చర్చించారు. సబ్‌ప్లాన్ చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని వారన్నారు. కాంగ్రెస్ చేసిన చట్టంలో ఇంతకంటే మెరుగైన అంశాలు చాలా ఉన్నాయన్నది వారి వాదన. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుంటే బాధ్యులపై కేసులు పెట్టే ఆస్కారం కూడా పాత చట్టంలో ఉందని సభ్యులంటున్నారు. కొత్త చట్టంలో దాన్ని లేకుండా చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేసేలా ఉన్న కొత్త చట్టంపై సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతంతా సభలో గట్టిగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
నిధులు, పథకాలు తేల్చేద్దాం!
నేడు ఎస్సీ, ఎస్టీ కమిటీల మూడో భేటీ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిపై నేడు కీలక భేటీ జరగనుంది. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్ష తన భేటీ కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, సాంఘిక సంక్షేమ మంత్రి జగదీశ్‌రెడ్డి, కమిటీ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాఖాధి పతులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ కమిటీలు సమావేశమై నిధుల వినియోగం గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా జరిగే సమావేశంలో నిధుల కేటాయింపుపై సుదీర్ఘం గా చర్చించనున్నాయి. అంతేకాకుండా శాఖల వారీగా పథకాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత రెండు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. తొలి సమావేశానికి టీడీపీ సభ్యుడొకరు, వామపక్ష సభ్యుడు హాజరు కాగా.. ఆ తరువాతి సమావేశానికి మాత్రం అధికార పార్టీ సభ్యులు మినహా మిగిలిన పార్టీల సభ్యులు హాజరు కాలేదు. దీంతో నేటి సమావేశానికి విపక్ష సభ్యులు హాజరవుతారా, లేదా వేచి చూడాలి. ఈ సమావేశంలో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పథకాలకు కేటాయింపులు ఎలా చేయాలనే అంశంపై చర్చిచనున్నారు. -
ప్రత్యేక అధికారులు విధిగా పర్యటించాలి..
నల్లగొండ : ప్రత్యేక అధికారులు వారంలో ఒక రోజు విధిగా మండలాలను పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ గౌవర్ ఉప్పల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా.. వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి, హరితహారం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి తదితర అంశాలపై తనిఖీ చేయాలన్నారు. యాదవులకు చేయూతనిచ్చేందుకు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సోహించేలా ఎక్కువ మొత్తంలో యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా, చిన్నతరహా చెరువులు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో భారీగా చేప పిల్లలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించానల్నారు. ప్రతి కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి వివిధ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ‘క్లీన్ ఏ విలేజ్’ కింద గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలన్నారు. క్లీన్ ఏ ఏవిలేజ్ కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, జిల్లా రిసోర్స్ మ్యాప్‌లను వివిధ కార్యక్రమాల ద్వారా రూపొందించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులను ప్రోత్సహించడంతో పాటు వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. చేనేత, బీడీ కార్మికులకు గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు చేస్తారని, ఈ మేరకు వారి డేటాను సేకరించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో కీమ్యానాయక్, డీఆర్డీఓ ఆర్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తాం : కలెక్టర్ నల్లగొండ : జిల్లాలోని ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు జిల్లాలోని ఎయిడ్స్ కేంద్రాల్లో లోటుపాట్ల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుతెచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలోని 52 ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పెన్షన్లు, మందులు, పౌష్టికాహారంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు డైరక్టర్ జాన్‌బాబు, ఏపీడీ రాంమోహన్, పాల్గొన్నారు. -
రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల శాతా న్ని పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించ నున్నారు. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితి గతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్, ఎస్టీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ చెల్లప్ప కమిషన్ ఇప్పటికేæ తమ నివేదిక లను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలి సిందే. రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు, అవసరమైన చట్టసవరణ కోరుతూ కేంద్రానికి పంపే ప్రతి పాదనలపై చర్చిస్తారు. మరో 15 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ తయారీపై పరిశీలన.. 2017–18 బడ్జెట్ తయారీతో పాటు బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ రూప కల్పనలో నూతన నిబంధనలకు అనుగుణం గా ఈసారి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాన్ని విలీనం చేయనున్న విషయం తెలిసిందే. అంతే గాకుండా కేంద్రం ఈసారి నెల రోజుల ముం దుగా బుధవారమే పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయో జిత పథకాల నిధులపై స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను పక్కాగా రూపొం దించుకునే వీలు కలుగనుంది. ఫిబ్రవరి మూడో వారంలో లేదా మార్చి మొదటి వారం లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరుగనున్న భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీల ను ఖరారుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టే ఆకర్షణీయ పథకాలు, వాటి ప్రయోజనాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. భవనాల అప్పగింతపై చర్చ! హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలపై గవర్నర్ సమక్షంలో బుధవా రం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సమావేశంకానున్నారు. సచివాల యంతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ కార్యాలయాలు తమకు అప్పగించాలని తెలం గాణ మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసి గవర్నర్‌కు లేఖ రాసింది. అందులో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు సైతం గురువారం జరిగే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న ప్రైవేటు వర్సిటీల బిల్లు, మూసీ రివర్ అథారిటీ, కొత్త నియామకాలు, హోంగార్డుల జీతాల పెంపు, పురపాలక, హోంశాఖలకు సంబంధించిన పలు చట్ట సవరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. సబ్‌ప్లాన్ నిధుల బదిలీకి చట్ట సవరణ ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు, సబ్‌ప్లాన్ చట్ట సవరణపై ఇటీవల అఖిలపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్షిం చిన సీఎం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశా రు. బడ్జెట్లో సబ్‌ప్లాన్‌కు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే పద్ధతి అమలు చేయాలని, సబ్‌ప్లాన్ పేరు మార్చాలనే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ‘క్యారీఫార్వర్డ్ (తర్వాతి ఏడాదికి బదిలీ)’ చేయాలా, వద్దా.. దీనికి చట్టసవరణ చేయాల్సి ఉంటుందా.. అనే అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది. కమిటీలు ఇచ్చే సిఫారసులు ఈ సందర్భంగా కీలకం కానున్నాయి. -
ఎస్టీలకు ప్రత్యేక కమిషన్
- గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ భవన్లో ఆదివారం గిరిజన ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్టీలకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోస్టర్ పాటించడం లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాల వల్ల అనేకమంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. వెనుకబడిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రతి జిల్లాకు ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్టీల కోసం స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్టీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్ గంపన్న, ఉద్యోగుల సంఘం చైర్మన్ ఠాగూర్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రంగానాయక్, జీవీఎస్ఎస్ నాయకులు శివశంకర్‌నాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, ఈ నిధులు పక్కదారి పట్టకుండా పూర్తిగా ఖర్చు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో సబ్‌ప్లాన్ అమలు అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కంటి తుడుపు చర్యగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు కమిటీలు వేసిందని పేర్కొంది. తెలం గాణ ఏర్పడి 31 నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మూడేళ్లుగా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. హక్కుల కోసం పోరాడిన దళితులు, గిరిజనులు.. వాటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూమి లేని దళిత కుటుంబాలు 1.5 లక్షల వరకు ఉండగా, రెండున్న రేళ్లలో కేవలం 3,671 కుటుంబాలకు 9,663 ఎకరాల భూపంపిణీ మాత్రమే జరిగిందన్నారు. ఈ ఏడాది నిధులు ఖర్చు కాకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే బడ్జెట్లో మిగులుగా చూపించాలని.. అయితే ఈ ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు తరలిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని అంశాలను స్వయంగా వివరించిన సీఎం కేసీఆర్ సబ్‌ప్లాన్‌పై చర్చలో మాత్రం పాల్గొనకపోవడాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీల విషయంలో ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని విమర్శించారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏం కావాలో నిర్ణయించండి
-
సారథులు మీరే
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏం కావాలో నిర్ణయించండి - అఖిలపక్ష ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం - ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా దళిత వర్గాల్లో పేదరికం పోవడం లేదు - రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటవ్వాలి - వందశాతం మార్పు తేవాలి.. అందుకు నేను చిత్తశుద్ధితో ఉన్నానిధుల ఖర్చుపై విధానానికి కమిటీలు - కడియం సారథ్యంలో ఎస్సీ కమిటీ.. చందూలాల్ అధ్యక్షతన ఎస్టీ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కలిసికట్టుగా ఆలోచించి ఒక విధానం రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ... ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపుతామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. "ఇంతకాలం ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఇతరులు నిర్ణయించే వారు. కానీ తెలంగాణలో మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఆ వర్గాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులే నిర్ణయించాలి. వారితో ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది" అని అన్నారు. "బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం చేసిన మార్పులకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా బడ్జెట్ రూపకల్పన జరగాలి. మొత్తం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారి నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలి. వారి జనాభా శాతం కంటే కొంచెం అధికంగానే ఖర్చు పెట్టాలి. ఆయా వర్గాలకు నిధులు కేటాయించడం, ఖర్చు చేయడానికి అవసరమైన విధానం ఎస్సీ, ఎస్టీ కమిటీలు రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోవాలి. అదే లక్ష్యం కావాలి" అని సీఎం పేర్కొన్నారు. ఎస్టీ కమిటీ ఇదే.. మంత్రి చందూలాల్ సారథ్యంలో సీఎం ఎస్టీ కమిటీని ప్రకటించారు. ఇందులో రెడ్యానాయక్, సీతారాం నాయక్, నగేశ్, రాము నాయక్, కోవ లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. కడియం ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. నంది ఎల్లయ్య, బాల్క సుమన్, ఎం.ఎస్.ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సంపత్ కుమార్, నల్లాల ఓదేలు, రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, కిశోర్, సంజీవ రావు కమిటీ సభ్యులుగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ శాఖల ద్వారానే ఖర్చు "ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఆయా శాఖల ద్వారానే ఖర్చు చేయాలి. నిధుల ఖర్చు, కార్యక్రమాల రూపకల్పనపై కమిటీæ సూచనలు చేయాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా విధానాలుండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకుంటే.. మరుసటి ఏడాదికి బదలాయించే పద్ధతి అవలంబించాలి. సబ్ ప్లాన్‌కు సవరణలు చేయాలి. అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ రూపొందించాలి. కమిటీ క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలి" అని సీఎం చెప్పారు. "వృద్ధులు, యువకులు, విద్యార్థులు... 10–25, 25–50, 50–75 వయసుల వారీగా అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీలకు ఒక ప్రణాళిక, సెమీ అర్బన్, గ్రామాల్లో ఉండే వారికొక వ్యూహం అనుసరించాలి. మూడు ప్రాంతాల్లో నివసించే వారి జీవన స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలతోపాటు పట్టణాల్లో చదివే అమ్మాయిలకు అన్ని వసతులు కల్పించాలి" అని సీఎం సూచించారు. "దళితులకు భూ పంపిణీ నిరంతర కార్యక్రమం. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఉపయోగంలోకి రావాలి. కమతాల ఏకీకరణ జరగాలి. ఏ ఊరిలో ఎవరి పేరిట భూమి ఉంది? సాగులో ఉందా? లేదా? సాగులోకి రావాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి" అని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో ఉన్నా వంద శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని, అందుకు తాను చిత్తశుద్ధితో ఉన్నానని సీఎం చెప్పారు. "మనం తలుచుకుంటే తప్పకుండా వీరి జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా ఎస్సీ వర్గాలకేం అవసరమో, ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దాం. అంకితభావంతో పనిచేసి ఆ వర్గాల్లో మార్పు తెద్దాం. అప్పుడే ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా మనకు సంతృప్తి" అని అన్నారు. అప్పుడే అభినందనలు వద్దు రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌పై కార్యాచరణకు సీఎం చూపిన చొరవను తాము అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు మంచి నిర్ణయమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి సమావేశం నిర్వహించడం విప్లవాత్మక చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. అందుకు స్పందించిన సీఎం.. అప్పుడే ప్రభుత్వాన్ని అభినందించవద్దని, ఎంతో కొంత మార్పు వచ్చాక అభినందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అజ్మీరా చందూలాల్, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రసమయి బాలకిషన్, పిడమర్తి రవి, నల్లాల ఓదేలు, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎస్.నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్, సీతారాం నాయక్, పసునూరి దయాకర్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. ప్లాన్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే భట్టి, సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు. -
ఎస్టీ జాబితాలోకి ఇతరులను చేర్చితే ఊరుకోం
– 48 గంటల దీక్షను విరమించిన గిరిజన నేతలు – సంక్రాంతికి దూరమైన గిరిజన సంఘాలు – సంఘీభావం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు కర్నూలు(అర్బన్): ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే తాము ఊరుకోమని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఐక్య గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఐక్య గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది ఉదయం 10 గంటల నుంచి చేపట్టిన 48 గంటల దీక్షలు 15వ తేది ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. దీక్షల విరమణ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్‌నాయక్, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటరమణనాయక్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. గోవింద్, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప, వైహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాజు మాట్లాడుతు రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటుంటే తమ సామాజిక వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 48 గంటల దీక్ష చేపట్టామన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, గిరిజనులు మాత్రం విద్య, ఉపాధి తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఇక తమ బతుకులు అడవుల పాలు కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షల్లో పాల్గొన్న వారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి. తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం కార్యదర్శి డాక్టర్ బి. రమేష్ , మార్కెట్‌యార్డు డైరక్టర్ కరివేపాకు నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీక్షల్లో పాల్గొన్న నేతలు.. ఎం వెంకటరమణనాయక్, కైలాస్‌నాయక్, పీ గోవింద్, రాగుల రాముడు, శ్రీరాములు, ఆర్ చంద్రప్ప, వై రాజు, రాజారామ్నాయక్, యోగేష్‌నాయక్, ఎం రాముడు, పీ వెంకటేష్, శంకర్‌నాయక్, పరశురాముడు, గిడ్డయ్య, రమేష్, నాగరాజు, వెంకటరాముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం వ్యక్తం చేసిన సంఘాలు, నేతలు .... ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వై. నారాయణ, బద్దునాయక్, జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి రాముడు నాయక్, దళిత సమాఖ్య కన్వీనర్ కొమ్ముపాలెం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమసుందరం, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసుందరం, ఏపీ ఎస్సీ,ఎస్టీ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌బాబు, సఫాయి కర్మచారి సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, వివిధ సంఘాలకు చెందిన నాయకులు వెంకటస్వామినాయక్, అంజనప్ప, ఈశ్వరప్ప తదితరులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
పెద్దవడుగూరు (తాడిపత్రి) : మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోహన్‌రెడ్డితో పాటు భాస్కర్‌రెడ్డి, సతీష్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.రమణారెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించాడని ఓబులేసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా తాను ఎవరినీ కులం పేరుతో దూషించలేదని ఎంపీటీసీ మోహన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సమస్యలపై జన్మభూమి సభలో అధికారులను ప్రశ్నించగా తనపై కక్ష కట్టి ఇలా ఓబులేసుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సింహ భాగం సంక్షేమ రంగానికే కేటాయించామని, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై స్వల్పకాలిక చర్చను మంత్రి ప్రారంభించారు. నిరుపేద దళితులకు మూడెకరాలు పంపిణీ చేశామని, 3,671 మంది దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమిని పంపిణీ చేశామని తెలిపారు. ఈ భూముల్లో బోర్లు వేయించి పంటకు పెట్టుబడి అందించామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ నిధులను మళ్లించిన కేసీఆర్
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శంకర్ జగిత్యాల రూరల్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఎస్సీ, ఎస్టీ నిధులను మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు మళ్లించి ఎస్సీ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచి సబ్‌ప్లాన్ చట్టం చేసి నిధులు కేటాయిస్తే మూడేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నక్క జీవన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీజీజీ పోర్టల్‌లో ‘స్వయం ఉపాధి’ వివరాలు
పొందుపరచాలని సీఎస్ ఆదేశం సాక్షి,, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌లో పొందుపరచాలని అధికారులను సీఎస్ ప్రదీప్‌చంద్ర ఆదేశించారు. మంజూరైన స్వయంఉపాధి, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. మంగళ వారం సచివాలయంలో సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సీఎస్ సమీక్షించారు. గుడుంబా బాధిత కుటుంబాలకు స్వయంఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆదే శించారు. సంక్షేమానికి సంబంధించి ప్రతి శాఖ ద్వారా హాబిటేషన్లు, లబ్ధిదారుల వారీగా వివరాల సేకరణ, శాఖల వారీగా స్వయం ఉపాధి పథకాల మంజూరీని సమీక్షిస్తూ నెలవారీ కార్యాచరణ రూపొం దించుకోవాలన్నారు. అధికారులు అజయ్ మిశ్రా, సోమేశ్‌కుమార్,జలీల్, సందీప్ కుమార్, అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు. సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్‌నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. -
పరిశీలనలో బీసీ సబ్‌ప్లాన్: జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, పుట్టా మధు, శ్రీనివాస్‌గౌడ్ బీసీల సంక్షేమంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ కులాల కోసం ఆధునికమైన లాండ్రీలు, సెలూన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, బీసీలకు సామాజిక భద్రతపై కమిషనర్‌కు బాధ్యతలు, అధికారాలు, విధులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్ సాధన
– సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఐక్యంగా ఉద్యమాలను నిర్వహిస్తే ఎస్టీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని బళ్లారి జిల్లా సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు అన్నారు. ఈ నెల 16వ తేది నుంచి స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్దకు ఆయన ఆదివారం చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న కారణంగా 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మంత్రులు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే ఆయా కులాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెపా్పరు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాల్మీకులు జిల్లా పరిషత్ నుంచి దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి హెచ్చరించారు కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబీంనాయుడు, గూడురు గిడ్డయ్య, నాగరాజు, నరసింహులు, జిల్లా అధ్యక్షుడు డి. రామాంజనేయులు, వీజీఆర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వీఆర్పీఎస్ దీక్షలు
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌పై ఈ నెల 16వ తేదీ నుంచి స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షలు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. జిల్లాలోని వాల్మీకులందరూ వీఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఈ నెల 18వ తేదీన దీక్షల ముగింపు సందర్భంగా జెడ్పీ నుంచి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. దీక్షల్లో ప్యాపిలి ఎంపీపీ సరస్వతమ్మ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు వాసు, దేవపాల్, శ్రీవాస్తవ తదితరులు..దీక్షలకు మద్దతు ప్రకటించారు. -
వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాటం
– ఆరు నెలల్లో ఎస్టీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి – లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం –స్పందించకపోతే టీడీపీని పాతరేస్తాం – వీఆర్పీఎస్ సత్యాగ్రహ దీక్షలు ప్రారంభంలో సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వాల్మీకి బిడ్డల బంగారు భవిష్యత్తుకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత కల్పన, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లపై శుక్రవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఆ సమితి మూడు రోజుల నిరవధిక సత్యాగ్రహ దీక్షలను ప్రారంభించింది. ముందుగా వందలాది మంది వాల్మీకులు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుంచి దీక్ష వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతు సత్యాగ్రహ దీక్షలు ముగిసేలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే జూన్‌లో రాయలసీమ బంద్‌కు కూడా వెనుకాడమన్నారు. సీమలోని నాలుగు జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఆందోళనలను చిన్నచూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వాల్మీకుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి ఫెడరేషన్‌కు వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని వాల్మీకులకు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నారన్నారు. హింసాయుత ఉద్యమాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేస్తున్నట్లు ఆయన చర్యలను బట్టి అర్థమవుతుందన్నారు. తాము ఆగ్రహిస్తే రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, ఉపాధ్యక్షుడు జి. రాంభీంనాయుడు, ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా.మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి పరమటూరు శేఖర్, ప్రచార కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా నాయకులు మురళీ, రాముడు, వీజీఆర్ కొండయ్య, మహిళా నాయకురాలు ఎం. వాణిశ్రీ, న్యాయవాది తిమ్మప్ప, విద్యార్థి నాయకులు మహేంద్ర, బాబు, శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొమ్మరులే
పాములపాడు: ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొంబర కులస్తులేనని దొంబర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి దొంబర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 1969కి ముందు విముక్తి జాతుల్లో ఉండేదన్నారు. సంచార జాతులకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. గ్రామ స్థాయిలో కుల సమీకరణలు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కుల పెద్దలకు సూచించారు. ఐకమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ దొంబరుల సత్తా ప్రభుత్వానికి చాటాలన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వాటా తమకు కేటాయిండం కూడా పక్కనపెట్టేశారన్నారు. సంచార జాతులన్నింటిని సమీకరించి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక కార్పోరేషన్, రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు, ఈ కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర నాయకులు గుర్రప్ప, నాగన్న, మురళి, రవి, సుబ్బరాయుడు, లక్ష్మణ్, ఆంజనేయులు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కటాక్షం.. ఎవరికో..!
• 6,973 యూనిట్లు - 60,991 దరఖాస్తులు • జిల్లాలో రుణాలకు వేలాదిగా అర్హులు • నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు • అయోమయంలో నిరుపేద • ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, కాపులు • లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యులు, ఎంపీడీఓల కీలక పాత్ర భాగ్యలక్ష్యి బంపర్ డ్రా..రండయ్యా రండి, ,రండమ్మా రండి..టికెట్ ధర కేవలం ఒక రూపాయే..ఆ అదృష్టవంతుడు ఎవరో తెల్లవారితే డ్రా.. సంచి తెచ్చుకోండి.. ఒక లక్ష తీసుకుపోండి అని ఒక వ్యక్తి వచ్చీ రాని తెలుగులో చెప్పేవాడు. చాలా సంవత్సరాల క్రితం జిల్లాలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాలలో ఒక జట్కా బండి నుంచి మైక్‌లో వినిపించే మాటలు అవి. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల పరిస్థితి కూడా లాటరీ టికెట్ లాగే మారింది, కాకపోతే అప్పుడు అదృష్టం ఉండాలి. ఇప్పుడు పాలక నేతలైన కమిటీ సభ్యుల కటాక్షం ఉండాలి. కాగా యూనిట్ల కేటారుుంపులు తక్కువగా, అర్హుల నుంచి అందిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నారుు. దీంతో ప్రస్తుతం ఈ రుణ భాగ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది ఆయా వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది. కడప రూరల్: జిల్లాలో 2016-2017 ఆ ర్ధిక సంవత్సరానికి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాం కుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలను అందించాలి. ఆ మేరకు ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు లక్ష్యాలను నిర్దేశించారు. అరుుతే పాలకులు నామమాత్రంగా యూనిట్లను కేటారుుస్తున్నారు. ఫలితంగా అర్హులు రుణాలు పొందలేక, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం లేక నిరాశకు లోనవుతున్నారు. బీసీల పరిస్థితి దారుణం... ఈ ఏడాది ప్రభుత్వ సబ్సిడీతో పాటు బ్యాంకర్లు తమ వాటాగా ఎస్సీలకు రూ. 47 కోట్లు, ఎస్టీలకు రూ. 27.30 కోట్లు, బీసీలకు రూ. 23.04 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు రూ. 27.30 కోట్లు, కాపులకు రూ. 32 కోట్లు, మైనార్టీలకు రూ. 30.84 కోట్లు, క్రిస్టియన్లకు రూ. 41 లక్షలు అందించాలి. కాగా మొత్తం 6,973 యూనిట్లకు గాను గత ఏడాదిలో రుణాలు పొందగా మిగిలినవి, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులనే కలుపుకుంటే ఆన్లైన్లో 60,991 దరఖాస్తులు ఉన్నారుు. వారంతా రుణాలకు అన్ని విధాలా అర్హత గలవారే. కాగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అరుుతే బీసీలకు కేవలం 1170 యూనిట్లను కేటారుుంచగా 18,000 దరఖాస్తులు వచ్చారుు. అలాగే బీసీ ఫెడరేషన్లు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏటా నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు జరుగుతున్నారుు. దీంతో ఎక్కువ మంది అర్హులు లబ్ధి పొందలేక పోతున్నారు. లబ్ధిదారులకు 111 గండాలు... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అర్హుల ఎంపికకు సంబంధించి 111 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా ఎంపీడీఓలు నాన్ అఫిషియల్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో 10 మంది సభ్యులను నియమించాలి. మొన్నటి వరకు ఉన్న జన్మభూమి కమిటీల తరహాలోనే ఈ కొత్త బోర్డు కూడా ఉండబోతోందనే ఆరోపణలు వస్తున్నారుు. అరుుతే ఈ జీఓ ప్రకారం ఎంపీడీఓలు కీలకంగా మారనున్నారు. అన్ని వ్యవహారాలను ఆ అధికారి చూసుకోవడంతోపాటు ఆయా కార్పొరేషన్లకు నివేదికలను కూడా ఆయనే పంపాల్సి ఉంది. కాగా, ఈనెల 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అనంతరం జనవరి 1వ తేదీ నుంచి రుణాలను ఎంపికై న అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకర్లు బిజీబిజీగా ఉన్నారు. అందువల్ల రుణాల మంజూరుపై ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలాగే కొత్త కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఏడాది అర్హులు 111 గండాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బయో గ్యాస్ ప్లాంట్ నిర్మించుకోవాలి
టేక్మాల్ : పాడిపశువులు ఉన్న ప్రతి ఒక్కరూ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవాలని బయోగ్యాస్ సంయుక్త జిల్లాల మేనేజర్ రామేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని ఎల్లంపల్లి మధిర గ్రామమైన సర్మోనికుంట తండాలో మంగళవారం బయోగ్యాస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ పశువులు ఉన్న రైతులు బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకుంటే ఇంధనవనరులను కాపాడిన వారవుతారన్నారు. వీటి నిర్మాణానికి రూ.20,100 ఖర్చవుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.11వేల సబ్సిడీ ఉందని, ఉపాధిహామీ నుంచి మరో రూ.5వేలు ఇస్తుందని చెప్పారు. నిర్మించుకునే రైతు రూ.1500లను ముందుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విష్ణువర్దన్, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, సర్పంచ్ రామయ్య, నాయకులు రమేశ్‌నాయక్, నరేందర్, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చైర్మెన్ ఎన్నికపై హైకోర్టులో వాదనలు
-
గిరిజనుల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం
– సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని ఏపీజీఎస్ దీక్షలు కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని మరచిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య (ఏపీజీఎస్) నేతలు ధ్వజమెత్తారు. బ్యాంకులతో ప్రమేయం లేకుండా సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఏపీజీఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంక్షేమభవన్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీజీఎస్ జిల్లా అధ్యక్షుడు జి. జయరామ్‌నాయక్ అధ్యక్షతన చేపట్టిన దీక్షలను బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శేఖర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప, ఏపీజీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటరాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదిగో గిరిజనుల అభివృద్ధి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తుందే తప్ప ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిజమైన గిరిజనులకు రుణాలు అందడం లేదని, మధ్య దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కుమ్మక్కై సబ్సిడీని పంచుకుంటున్నారని ఆరోపించారు. దీక్షా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీజీఎస్ నాయకులు బనగానపల్లె రాముడు, జిల్లా గౌరవాధ్యక్షుడు మారెన్న, ఆటో యూనియన్ నాయకులు రామ్‌నాయక్, కె. శ్రీనివాసులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల్లా ఉద్యమిద్దాం
- ఎస్టీ రిజర్వేషన్ సాధనపై వాల్మీకి నేతల పిలుపు - గుడేకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ ఎమ్మిగనూరురూరల్: ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా సైనికుల్లా పోరాడాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో ఆదివారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహవిష్కరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో గవర్నర్‌తో ప్రసంగం చేయించిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసెత్తడం లేదన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేస్తామని ప్రకటించారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబో‹స్ అన్నారు. రిజర్వేషన్‌కోసం కుప్పం నుంచి 11వందల కిలో మీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబుకు విన్నవించామన్నారు. డిశంబర్ 14న కర్నూలు శ్రీకృష్ణదేవరాయుల సర్కిల్లో 99 గంటల నిరవధిక నిరాహర దీక్ష తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఎవరి పార్టీలో వారు ఉండండి రిజర్వేషన్‌కు మాత్రం పార్టీలకతీతంగా పోరాడండి అంటూ నాయకులకు పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా చేతులు కలపాలని వీఆర్పీఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాంభీంనాయుడు, గూడూరు గిడ్డయ్య, రవి, డాక్టర్ మధుసూదన్, మాధవరం రామిరెడ్డి, కౌతాళం సురేష్, తాలుకా అధ్యక్షులు వీజీఆర్ కొండయ్య, జగ్గాపురం ఈరన్న, గిడ్డయ్య, రఘు, లైన్మెన్ రాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై వీఆర్పీఎస్ పోరు
– వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం వీర్‌పీఎస్ పోరాటం చేస్తోందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకులను ఆరు నెలల వ్యవధిలో ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేస్తు చర్యలు తీసుకోవాలని, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కాలయాపన చేస్తూపోతే వాల్మీకులు చూస్తూ ఊరుకోరన్నారు. డిసెంబర్ 14వ తేది నుంచి 18 వరకు 99 గంటల పాటు శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను సమీకరించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, జిల్లా నాయకులు లోకేష్, మల్లేష్, రంగన్న, మహేష్, శివన్న, వీరేష్, విద్యార్థి నాయకులు శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బోయ ఓబులేసుపై దాడి అమానుషం ... అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పోలీసులు పక్కనే ఉన్నా, దాడిని నియంత్రించకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. -
పౌరసేవల అమలులో మార్పు రావాలి
మంత్రి చందూలాల్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: పౌరసేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరులో మార్పు రావాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆకాంక్షించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎస్టీ, బీసీ శాఖల అధికారుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మం త్రులు చందూలాల్, జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ట్యాబ్ లు అందజేశారు. చందూలాల్ మాట్లాడుతూ గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిఘా, పర్యవేక్షణ కొరవడిందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించే బాధ్యత అధికారులదేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. కొత్తగా నియమితులైన జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,బీసీ శాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణపై జేసీ హరికిరణ్ శుక్రవారం విచారణ నిర్వహించారు. జేసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది. రైల్వేలో ఎస్టీ సర్టిఫికెట్‌పై ఉద్యోగం చేస్తున్న తిమ్మప్ప ఇప్పటికే రెండు, మూడు సార్లు విచారణకు రాకపోవడంతో.. ఈ విచారణకు విధిగా హజరు కావాలని ఆదేశించినా గైర్హాజరయ్యారు. కాగా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో బైండర్‌గా పనిచేస్తున్న రాముడు యాదవ్ అయితే సుగాలి సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. దీనిపై రాముడు కులాన్ని నిరూపించుకునేందుకు భార్య తరపు వారిని విచారణకు తీసుకొచ్చారు. అయితే దీనిపై జేసీ సంతృప్తి చెందలేదు. వీటిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. విచారణలో డీఎల్ఎస్సీ కమిటీ సభ్యులు, సి సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు బద్దూనాయక్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎసీ్టల్లో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు
ప్యాపిలి: వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ప్యాపిలిలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని క్యాబినేట్ ద్వారా కేంద్రానికి సిఫారస్ చేస్తామన్నారు. వాల్మీకులు తమ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామనే హామీపై కాలయాపన చేయడం తగదన్నారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరపాలని కేవలం ఒక రోజు ముందు జీవో విడుదల చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. అంతకు ముందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో రిటైర్డు మైనింగ్ ఎండీ రాజగోపాల్, కర్నూలు సీఐడీ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు, మంత్రాలయం జెడ్పీటీసీ సభ్యులు రాంభీం నాయుడు, లక్ష్మయ్య, ప్యాపిలి ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు పత్తికొండ ఎంపీపీ గోవిందు, పామిడి మార్కెట్‌యార్డు చైర్మన్ సుంకిరెడ్డి, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, డోన్ మాజీ జెడ్పీటీసీ వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దొంగ అరెస్టు
మధిర : ఇటీవల పలు మండలాల్లో వరుస చోరీలకు పాల్పడిన కంభంపాటి ఏసోబును బుధవారం మధిర రూరల్ ఎస్సై బండారి కిషోర్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నూనె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఏసోబు ఇటీవల మధిర మండలంలోని మాటూరు, వంగవీడు, నాగవరప్పాడు, వైరా మండలంలోని పాలడుగుతోపాటు బోనకల్, ఎర్రుపాలెం, కొణిజర్లలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. మాటూరు క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్సై కిషోర్ వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన ఏసోబు గంపలగూడెంవైపు తన బైక్‌ను ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. అతడి నుంచి మోటారు సైకిల్, వెండి పట్టీలు, బంగారపు ఉంగరాలు, రూ.17,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై బండారి కిషోర్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులపై సత్వర చర్యలు
– జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చిత్తూరు (కలెక్టరేట్) : ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్‌జైన్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకుని దోషులకు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. అట్రాసిటీ యాక్టును అమెండ్ చేస్తూ ఇన్విస్టిగేషన్ కాలపరిమితి 30 నుంచి 60 రోజులకు పెంచారని, ఈ లోగా చర్యలు తీసుకుని చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు సబ్ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉంటే సత్వర చర్యల కోసం లేఖ రాయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేది మధ్యాహ్నం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో వర్క్‌షాపు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 15 రోజులకు ముందే డివిజన్, మండల స్థాయి కమిటీలను నిర్వహించాలన్నారు. నారాయణవనంలో 30 ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారి క్లైయిమ్లకు ఆధారాలు పొంది పట్టాలివ్వాలన్నారు. కార్వేటినగరం చాకలివానిగుంటలో గిరిజనులకు పట్టాలు అందకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టాలు అందని గిరిజనులుంటే వారి క్లైయిములు పరిశీలించి వారికి పట్టాలిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రగిరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తిరుపతి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, సునీల్‌కుమార్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖల అధికారులు, ఎస్సీ,ఎస్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
తిరుపతి మంగళం: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, పోలీస్, అటవీ శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దళితులపై దాడులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. చంద్రన్న బీమా పథకంలో కార్మికులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే రూ.5లక్షల బీమా సౌకర్యం పొందవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటి పట్టాల సమస్య ఉందని, స్పెషల్ డ్రైవ్ పెట్టి స్థలాల మంజూరుకు కృషి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు చట్ట ప్రకారం భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాపవినాశనం వద్ద నక్కల జాతుల వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో పురోగతిని వివరించారు. -
యాక్షనే.. ప్లానేదీ!
ఆకివీడు : ‘వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. వారి స్వయం సమృద్ధికి రుణాలు అందజేస్తున్నాం’ అని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానిది కపట నాటకమని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీల రుణాల కోసం సర్కారు యాక్షన్ ప్లాన్ రూపొందించలేదు. కాపుల రుణాల మంజూరుకు ప్రకటన చేసినా.. ఇప్పటివరకూ ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. సర్కారు ఏటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందిం చేంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యేది. సెప్టెంబర్‌లో దరఖాస్తుల స్వీకరించేది. ఈ ఏడాది ఇప్పటివరకూ రుణ ప్రణాళిక ఖరారు చేయలేదు. దీంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రుణ ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో ఆన్లైన్లో ఆ వర్గాల సర్వర్లు తెరుచుకోవవడం లేదు. ఫలితంగా ప్రజలు మండల స్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణాల ప్రకటన చేయకపోవడమేమిటని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక మండలస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో సర్వర్ ఓపెన్ కానప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని కంటితుడుపు సమాధానం చెబుతున్నారు. కాపుల ఆందోళన నేపథ్యంలో.. ఇదిలా ఉంటే కాపుల ఆందోళన నేపథ్యంలో 20 రోజుల క్రితం సర్కారు హడావుడిగా రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దరఖాస్తులూ స్వీకరించింది. గత ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లాలో 43 వేల దరఖాస్తులు అందగా, వీరిలో కేవలం కొందరికి మాత్రమే రుణాలు అందజేసింది. ఈ ఏడాది రూ.70 కోట్లు విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాల మంజూరు ప్రారంభించలేదు. ఈ ఏడాది జిల్లాలో 11,776 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా కాపు కార్పొరేషన్ వద్ద గత ఏడాది వచ్చిన 41 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 52వేల దరఖాస్తులు కాపు కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. విడుదల చేసిన రూ.70 కోట్లు వీరందరికీ సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా నిబంధనలు రుణాల మంజూరుకు అడ్డంకిగా ఉన్నాయి. కేవలం కాపుల కన్నీరు తుడవడానికే ప్రభుత్వం రుణాలిస్తామని ప్రకటన చేసిందనే వాదన వినబడుతోంది. ముస్లిం, మైనార్టీలదీ అదే దుస్థితి ఈ ఏడాది ముస్లిం, మైనార్టీ వర్గాల వారికిచ్చే రుణాలకూ కార్యాచరణ ప్రణాళిక విడుదల కాలేదు. దీంతో ముస్లింలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. చిచ్చుపెట్టేందుకే... కులాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చిచ్చుపెడుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. ఏటా విడుదల చేసే యాక్షన్ ప్లాన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటి. కాపులకు రెండవ విడత రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించినా.. మంజూరులో విధించిన నిబంధనలతో ఎవరికీ రుణాలు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే 50 వేలకుపైగా దరఖాస్తులు కాపు రుణాల కోసం కార్పొరేషన్‌కు అందాయి. – నంద్యాల సీతారామయ్య, కాపు సంఘ నాయకుడు పట్టించుకోరే.. మైనార్టీల శ్రేయస్సును ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం, మైనార్టీలకు రుణాల మంజూరులో వివక్ష∙చూపుతోంది. నిరుపేద ముస్లింలు ఎంతోమంది రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. పలావు బండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేందుకు కొటేషన్లు, అంచనాలు ఇవ్వమంటే ఎలా తెస్తారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. – మహ్మద్ జక్కీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, ఆకివీడు బీసీ యాక్షన్ ప్లాన్ ఖరారు కాలేదు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. గత ఏడాది 4200 మందికి రూ.21 కోట్లు రుణాలుగా అందజేశాం. కాపు కార్పొరేషన్ ద్వారా రెండో విడత రుణాల కోసం 11,776 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులనూ పరిశీలిస్తాం. ఈ ఏడాది కాపు రుణాల కోసం రూ.70 కోట్లు మంజూరయ్యాయి. – పెంటోజీరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఏలూరు. -
సెయింట్ లూయిస్‌లో వైఎస్ఆర్ 7వ వర్థంతి
సెయింట్ లూయిస్: మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని సెయింట్ లూయీస్‌లో ఘనంగా నిర్వహించారు. శనివారం మయూరీ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ కన్వినర్ రత్నాకర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో పేదలు, రైతులకు వైఎస్ఆర్ అందించిన సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. మహానేత ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సెంయింట్ లూయిస్ కన్వినర్ శేఖర్ రెడ్డి దండు, భార్గవ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు
హన్మకొండ అర్బన్ : దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చి జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఆర్డీఓపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో జేసీ, ఎమ్మెల్యే కలుగజేసుకుని శాంతిం పజేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. గ్రామంలో 33 ఎకరాలు కొనుగోలు చేసి ఎలాంటి తీర్మానం లేకుండా 11 మందికి కేటాయించారన్నారు. -
దళితులపై దాడులు అమానుషం
హిమాయత్‌నగర్ : నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో దళితులపై అగ్రకులాలు వారు చేసిన దాడి అమానుషమని తెలంగాణ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాస్త దయానంద్ అన్నారు. గురువారం ఈ ఘటనపై మస్త దయానంద్ మాట్లాడుతూ ఉమ్మెడ లక్ష్మి, చిన్న గంగు, పోశన్న, గంగారాంలకు ప్రభుత్వం 42 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఈ భూమిలో రెండు ఎకరాలు మీది కాదంటూ అగ్రకులానికి చెందిన ఎంబారి పెద్దనారాయణ, ఎంబారి చిన్ననర్సయ్య, ముండలి పెద్దరాజన్న, రొడ్డ రాజేశ్వర్, నల్లూరు చెన్నయ్య, ఎంబరి చిన్ననర్సయ్యలు లాక్కున్నారన్నారు. దీనిపై వారు పోరాటం చేయగా గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ఆ రెండెకరాల భూమి కూడా దళితులదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దళితులు తమ భూమిలో పశువులను ఉంచడంతో ఎందుకు ఉంచారంటూ అగ్రకులాల నాయకులు దళిత మహిళలని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. దాడి చేసిన అగ్రకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని దయానంద్ హెచ్చరించారు. -
గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ అభ్యర్థులకు అందించనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎస్టీ అభ్యర్థులకు ఐఏఎస్(ప్రిలిమ్స్), సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (మెయిన్స్), పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణులైతే వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు దాటని వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కు 94910 34198 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి
తమ నివేదికల్లో చెల్లప్ప, సుధీర్ కమిషన్ల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లింలలోని పేద వర్గాలు, షెడ్యూల్డ్ తెగల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెల్లప్ప, సుధీర్ కమిషన్లను తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు రిజర్వేషన్ల పెంపుతోపాటు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిలో సొంతంగా వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీలు అందజేయాలని కమిషన్లు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం, ముస్లింలకు 4 శాతం (బీసీ ఈ కేటగిరీలో) రిజర్వేషన్లు కొనసాగుతుండగా.. వాటిని 12 శాతానికి చొప్పున పెంచుతామని టీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని చూపేందుకు, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు గణాంకాలు, సమాచారం అవసరమైంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా.. దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని రిజర్వేషన్ల పెంపునకు పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలపై అధ్యయనం చేసేందుకు ఎస్టీ, మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను కలిపితే.. రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం, వారి పరిస్థితులతోపాటు కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలిపితే పరిస్థితి ఏమిటనే అంశంపై చెల్లప్ప కమిషన్ పరిశీలన జరిపింది. ఈ వర్గాలను ఎస్టీల్లో కలిపితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాల్లో కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలు నివసించే ప్రాంతాలతో పాటు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ప్రయత్నించింది. జిల్లాల్లో ఈ రెండింటిని ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనను వివిధ ఎస్టీ సంఘాలు, నాయకులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఆయా తెగలు ఏయే జాబితాల్లో ఉన్నాయన్న అంశాన్ని కమిషన్ పరిశీలించింది. ఇతర ఎస్టీ తెగలతో పోల్చితే.. ఈ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతికంగా, సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలకు సంబంధించి చారిత్రక ఆధారాలు, కచ్చితమైన సమాచారం, గణాంకాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఆదుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 % వరకు రిజర్వేషన్లను కల్పించవచ్చునని ప్రతిపాదించింది. ముస్లింల స్థితిగతులు ఘోరం రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని సుధీర్ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది నుంచి 46 అంశాలపై శాంపిల్ సర్వే ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటు ఎక్కువగా ఉందనే అంచనాకు కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. పేద ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదికలో సూచించినట్లు సమాచారం. ముస్లిం పిల్లలకు అన్ని స్థాయిల్లో గురుకుల విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీ అందించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. చదువుకున్న వారికి ఉద్యోగాలు లభించే ఏర్పాటు చేయాలని.. బలహీనవర్గాల గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
హైదరాబాద్ : తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్రి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చట్టం తెస్తామని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్టీలు, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన సుధీర్, చెల్లప్ప కమిషన్లు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నివేదిక అందచేశాయి. కాగా తెలంగాణలోని పది జిల్లాలో ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ చెల్లప్ప, సుధీర్ కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం
కాగజ్‌నగర్ రూరల్ : కాగజ్‌నగర్‌లోని త్రిశూల్పహాడ్పై ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల సమీపంలోని ఒక భవనంలో శుక్రవారం ఎస్టీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు భవన నిర్మాణానికై రూ. 4.25లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే స్థల సేకరణకై అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అనంతరం ఈ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం 5, 6వ తరగతులు బోధిస్తారని, రాబోయే కాలంలో 5నుంచి ఇంటర్మీడియేట్ వరకు బోధిస్తారని తెలిపారు. ప్రస్తుతం 5, 6వ తరగతులల్లో 120 మంది ఎస్టీ బాలికలకు ప్రవేశం కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సీపీ విద్యావతి, డిస్టిక్ కో ఆర్డినేట్ ఆఫీసర్ రమేశ్, ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.మారుతి కుమార్, నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఎసై ్స ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.