దయనీయం.. పల్లె భారతం | Census 2011 data released: 10 key highlights | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 4 2015 7:53 AM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ‘2011 సామాజిక, ఆర్థిక , కుల జనగణన(ఎస్‌ఈసీసీ)’ వివరాలు గ్రామీణ భారత దయనీయ ముఖచిత్రాన్ని కళ్లకు గట్టాయి. గ్రామాల్లోని ప్రతీ మూడు కుటుంబాల్లో ఒకటి కూలి పనిని జీవనోపాధిగా చేసుకున్న సాగుభూమి లేని నిరుపేద కుటుంబమేనని ఎస్‌ఈసీసీలో తేలింది. 23.52% గ్రామీణ కుటుంబాల్లో చదువుకున్న పెద్దలెవరూ(25 ఏళ్లు పైబడినవారు) లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన జనగణన-2011 వివరాలను శుక్రవారం ఆ శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్‌తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement