ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్‌జైట్లీ మరోసారి కుండబద్ధలు కొట్టేశారు. ఇందుకుగల కారణాలు వివరిస్తూ అంతా పాతపాటే పాడారు. ఏపీకి ఇష్టం లేకుండానే విభజన జరిగిందని, దాంతో వనరుల లేమితో రాష్ట్ర బాధపడుతోందన్న ఆయన కేంద్రం వద్ద మాత్రం నిధులు లేవని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు.