ఎస్టీ జాబితాలోకి ఇతరులను చేర్చితే ఊరుకోం
ఎస్టీ జాబితాలోకి ఇతరులను చేర్చితే ఊరుకోం
Published Sun, Jan 15 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
– 48 గంటల దీక్షను విరమించిన గిరిజన నేతలు
– సంక్రాంతికి దూరమైన గిరిజన సంఘాలు
– సంఘీభావం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు
కర్నూలు(అర్బన్): ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే తాము ఊరుకోమని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఐక్య గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్‌లో ఐక్య గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది ఉదయం 10 గంటల నుంచి చేపట్టిన 48 గంటల దీక్షలు 15వ తేది ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. దీక్షల విరమణ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్‌నాయక్, ఏఐబీఎస్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటరమణనాయక్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. గోవింద్, టీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప, వైహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాజు మాట్లాడుతు రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటుంటే తమ సామాజిక వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 48 గంటల దీక్ష చేపట్టామన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, గిరిజనులు మాత్రం విద్య, ఉపాధి తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కులాలను ఎస్‌టీ జాబితాలో చేరిస్తే ఇక తమ బతుకులు అడవుల పాలు కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షల్లో పాల్గొన్న వారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి. తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం కార్యదర్శి డాక్టర్ బి. రమేష్ , మార్కెట్‌యార్డు డైరక్టర్ కరివేపాకు నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
దీక్షల్లో పాల్గొన్న నేతలు..
ఎం వెంకటరమణనాయక్, కైలాస్‌నాయక్, పీ గోవింద్, రాగుల రాముడు, శ్రీరాములు, ఆర్ చంద్రప్ప, వై రాజు, రాజారామ్‌నాయక్, యోగేష్‌నాయక్, ఎం రాముడు, పీ వెంకటేష్, శంకర్‌నాయక్, పరశురాముడు, గిడ్డయ్య, రమేష్, నాగరాజు, వెంకటరాముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం వ్యక్తం చేసిన సంఘాలు, నేతలు ....
ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వై. నారాయణ, బద్దునాయక్, జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి రాముడు నాయక్, దళిత సమాఖ్య కన్వీనర్ కొమ్ముపాలెం శ్రీనివాస్, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమసుందరం, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసుందరం, ఏపీ ఎస్‌సీ,ఎస్‌టీ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌బాబు, సఫాయి కర్మచారి సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, వివిధ సంఘాలకు చెందిన నాయకులు వెంకటస్వామినాయక్, అంజనప్ప, ఈశ్వరప్ప తదితరులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement