నల్లగొండ ,నకిరేకల్ : సంచార జాతుల్లో భాగమైన మొండివారి కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వండూరి ఇమానియేల్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన మొండివారి కుల హక్కుల సాధన సమితి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. సమాజంలో వివక్షకు గురవుతూ దుర్భరమైన జీవనం గడుపుతున్న తమ కులస్తులను ఎవ్వరు పట్టించుకోవడం లేదన్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసి జీవనోభృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
అనంతరం సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎడ్ల చిన్నవెంకయ్య, జిల్లా అధ్యక్షుడిగా ఆవుల కృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎడ్ల కవిత, ఆవుల రాములు, జవ్వాది మధు, శ్రీను, గోపగాని సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా నండూరి ఇమానియేల్, సహాయ కార్యదర్శులుగా నాగిల్ల బక్కయ్య, ఆవుల రాములు, ప్రచారకార్యదర్శిగా ఎడ్ల మల్లయ్య, గోపగాని వెంకన్న, ఆవుల ముత్యాలు, కోశాధికారిగా ఎడ్ల లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా ఆవుల వెంకన్న, నండూరి గోపాల్, ఎడ్ల సురేష్, రాజ, పెద్దులు, బాలరాజు, మల్లయ్య, శంకర్ సోములు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment