డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును ప్రభుత్వం మరో ఐదేళ్ల వరకు పొడిగించింది.
2021 మే 31 వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును ప్రభుత్వం మరో ఐదేళ్ల వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ అయిన ఉత్తర్వుల కాలపరిమితి 2016 మే 31తో ముగియడంతో దాన్ని 2021 మే 31 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరమున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి సడలింపును మరో ఐదేళ్లు పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ అవసరమైన సవరణలు చేస్తుందని ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.