maximum age limit
-
51 ఏళ్ల అర్హతను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్లో మార్పు చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు. దీంతో అనేక మంది గ్రూప్–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు. -
గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్–1996కి అనుబంధంగా ఓ తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తీసుకొచ్చారు. రెండేళ్లపాటు వయోపరిమితి పొడిగింపు అమల్లో ఉండనుంది. పోలీసు, ఎక్సైజ్, ఆబ్కారీ, అగ్నిమాపక, అటవీ, జైళ్ల శాఖ వంటి యూనిఫార్మ్ సర్విసు పోస్టులకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు మాత్రమే. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ 2022 మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల 18తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోనుంది. నిరుద్యోగుల నుంచి మళ్లీ వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని ఈసారి మరో 2 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి పెంపునకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
మళ్లీ పదేళ్లు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మళ్లీ 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. గరిష్ట వయోపరిమితి పొడిగింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వయస్సు మీరిన నిరుద్యోగ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో జనరల్, ఇతర కేటగిరీల నిరుద్యోగుల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మరో రెండు నెలల్లో ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలోగా గరిష్ట వయోపరిమితి పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వంటి శారీరక దృఢత్వం అవసరమైన పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ శాఖల్లోని పోస్టుల మినహా అన్ని శాఖల్లోని ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి పొడిగింపును ప్రభుత్వం మళ్లీ వర్తింపజేయనుంది. టీఎస్పీఎస్సీతో సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఈ పొడిగింపు వర్తించనుంది. గడువు ముగిసి రెండేళ్లు... ప్రత్యక్ష నియామకాల విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు తాత్కాలికంగా ఏడాది కాలం పాటు పొడిగిస్తూ 2015, జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడుగా గరిష్ట వయోపరిమితిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తున్న ప్రత్యేక సడలింపులు యథాతథంగా అమలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదనంతర కాలంలో ఈ ఉత్తర్వుల అమలు గడువును మరో రెండు పర్యాయాలు ప్రభుత్వం పొడిగించింది. చివరిసారిగా 2019, జూలై 26తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోగా, మళ్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అప్పట్లో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి గరిష్ట వయోపరిమితి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక సడలింపులు.. లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ ఏడాది మేతో ముగిసింది. మళ్లీ ప్రభుత్వం గడువు పొడిగించలేదు. త్వరలో మరో ఐదేళ్ల కాలానికి ఈ మేరకు ప్రత్యేక సడలింపులు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
సివిల్స్ గరిష్ట వయోపరిమితి తగ్గింపు?
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు గరిష్ట వయో పరిమితిని ప్రస్తుతమున్న 32 సంవత్సరాల్ని తగ్గించాలంటూ యూపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై సూచనల కోసం ఈ కమిటీని యూపీఎస్సీ ఏర్పాటుచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి బీఎస్ బస్వాన్ చైర్మన్‌గా ఉన్న కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. దాని సూచనలపై కేంద్ర వ్యక్తిగత శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రి త్వ శాఖతో చర్చించాలనే ఆలోచనలో యూపీఎస్సీ ఉంది. వయో పరిమితితో పాటు పరీక్ష నిర్వహణ విధానం, మొత్తం పేపర్లు, వాటి తయారీ, సమయం, వెయిటేజ్ మార్కులు, మూల్యాంకనంపై కూడా సూచనలు చేసింది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షకు కనీస వయసు 21 ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు. -
ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితి సడలింపు పొడిగింపు
2021 మే 31 వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును ప్రభుత్వం మరో ఐదేళ్ల వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ అయిన ఉత్తర్వుల కాలపరిమితి 2016 మే 31తో ముగియడంతో దాన్ని 2021 మే 31 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరమున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి సడలింపును మరో ఐదేళ్లు పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ అవసరమైన సవరణలు చేస్తుందని ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గరిష్ట వయోపరిమితి పెంపు ఐదేళ్లే!
ప్రాథమిక అంచనాకు వచ్చిన సబ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లకు పెంచితేనే మంచిదని సబ్ కమిటీ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అనుసరించాల్సిన పరీక్షల విధానంపై (స్కీం) ఓ నిర్ణయానికి వచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సోమవారం సచివాలయంలో కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశమై పోటీ పరీక్షల విధానం, వయో పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చించింది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించింది. అయితే గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచితే కొన్ని కేటగిరీల వారు ఉద్యోగం చేసే కాలం చాలా తక్కువ ఉండే అవకాశం ఉండడంతో 5 ఏళ్ల పెంపే సబబు అని అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాగా, పరీక్షల విధానంపై టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీసుబ్రహ్మణ్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటిపై ఈనెల 4న మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
ఆశలు ఆవిరి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలా ది పోస్టులను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే చేసిన ప్రకటనలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారుు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 36 ఏళ్లకు పెంచడంతో ఈసారైన తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు ఆశించారు. ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో నిరుద్యోగులు సంబరపడ్డారు. అరుుతే, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటివరకూ విడుదల కాలేదు. మరోవైపు వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు మంగళవారం (డిసెంబర్ 31వ తేదీ)తో గడువు ముగిసిపోతోంది. 950 పోస్టులు.. లక్షమంది అభ్యర్థులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 950 పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వాటి భర్తీ కోసం సుమా రు లక్ష మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గరిష్ట వయో పరిమితి గడువు ముగిసిపోతుండటం, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఊగిసలాటలో ఏపీపీఎస్సీ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ తనకు తానుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉందంటున్నా రు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం, ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపిన తరువాత ప్రకటనల జారీకి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అరుునా, ఏపీపీఎస్సీ అలసత్వం వహించడం తమ పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులు వాపోతున్నారు. మిగిలింది మూడు నెలలే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్నారుు. సాధారణంగా ఎన్నికల ముందు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు 40 రోజులు ముందుగానే ఎన్నికల సంఘం నియమావళి అమలులోకి వస్తుంది. ఆ సమయంలో కొత్త ఉద్యోగాల ప్రకటనల నోటిఫికేషన్లు జారీ చేయడం వీలుకాదు.