సివిల్స్ గరిష్ట వయోపరిమితి తగ్గింపు? | Reduction in civil services upper-age limit, panel gives report | Sakshi
Sakshi News home page

సివిల్స్ గరిష్ట వయోపరిమితి తగ్గింపు?

Published Sat, Aug 13 2016 3:39 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Reduction in civil services upper-age limit, panel gives report

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు గరిష్ట వయో పరిమితిని ప్రస్తుతమున్న 32 సంవత్సరాల్ని తగ్గించాలంటూ యూపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై సూచనల కోసం ఈ కమిటీని యూపీఎస్సీ ఏర్పాటుచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి బీఎస్ బస్వాన్ చైర్మన్‌గా ఉన్న కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. దాని సూచనలపై కేంద్ర వ్యక్తిగత శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రి త్వ శాఖతో చర్చించాలనే ఆలోచనలో యూపీఎస్సీ ఉంది. వయో పరిమితితో పాటు పరీక్ష నిర్వహణ విధానం, మొత్తం పేపర్లు, వాటి తయారీ, సమయం, వెయిటేజ్ మార్కులు, మూల్యాంకనంపై కూడా సూచనలు చేసింది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షకు కనీస వయసు 21 ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement