
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 66 మంది పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేశారు. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల భర్తీకి మొత్తం 1,058 ఖాళీలకు 990 మందికి నియామక పత్రాలిచ్చారు. తాజాగా రిజర్వ్ జాబితాలో ఉంచిన మరో 66 మందిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో జనరల్ 48, ఓబీసీ 16 మంది ఉండగా, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరి వివరాలు యూపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment