Recommends
-
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్! -
దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు -
సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకాల ఆవిష్కరణలపై 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దృష్టిసారించాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు 51 మంది ప్రముఖ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ రాశారు. సామాజిక భద్రతా పెన్షన్లను పెంచాలని, ప్రసూతి ప్రయో జనాలకు తగిన కేటాయింపులను ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో జీన్ డ్రేజ్ (గౌరవ ప్రొఫెసర్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్), ప్రణబ్ బర్ధన్ (ఎమిరిటస్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ), ఆర్ నాగరాజ్ (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐజీఐడీఆర్, ముంబై), రీతికా ఖేరా (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్, ఐఐటీ, ఢిల్లీ), సుఖదేయో థోరట్ (ప్రొ ఫెసర్ ఎమెరిటస్, జేఎన్‌యూ)తదితరులు ఉన్నారు. జైట్లీకీ రాశాం... ‘‘ఇది 20 డిసెంబర్ 2017 అలాగే 21 డిసెంబర్ 2018 (గత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి) నాటి మా లేఖలకు కొనసాగింపు. ఇక్కడ మేము తదుపరి కేంద్ర బడ్జెట్ కోసం రెండు ప్రాధాన్యతలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుదల అలాగే ప్రసూతి ప్రయోజనాల కోసం తగిన కేటాయింపు’’ అని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. ‘‘రెండు ప్రతిపాదనలు గత సందర్భాల్లో విస్మరించినందున, మేము మళ్లీ అదే సిఫార్సులతో తదుపరి బడ్జెట్‌కు చాలా ముందుగానే ఈ లేఖను మీకు రాస్తున్నాము’’ అని కూడా వారు లేఖలో పేర్కొన్నారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఎన్‌ఓఏపీఎస్) కింద వృద్ధాప్య పింఛన్లకు (దాదాపు 2.1 కోట్ల మంది పెన్షనర్లకు) కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం 2006 నుండి నెలకు కేవలం రూ.200గానే ఉందని లేఖలో వారు పేర్కొన్నారు. దీనిని తక్షణం రూ.500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇదే జరిగితే ఈ పథకం కింద అదనంగా రూ.7,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ రూ.300 నుంచి రూ.500కు పెంచాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనికి రూ.1,560 కోట్ల కేటాయింపులు జరపాల్సి వస్తుందని తెలిపారు. మెటర్నటీ ప్రయోజనాల పెంపునకు రూ.8,000 కేటాయింపులు అవసరమన్నారు. 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి విదితమే. -
గ్యాస్ ధరలకు చెక్: కిరీట్ పారిఖ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారణంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) ఈ చర్యలు దేశీయ వినియోగదారులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని కమిటీ వ్యాఖ్యానించింది. అలాగే 2030 నాటికి భారతదేశ ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటాను ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుండి 15 శాతానికి పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దాని సిఫార్సులు సహాయపడతాయని కూడా నొక్కి చెప్పింది. అలాగే దేశీయంగా వినియోగించే సహజ వాయువులో దాదాపు 50 శాతం దిగుమతి చేసుకుంటున్నారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో అడుగు ముందుకు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్, మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్‌కు ట్విటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సంగతి తెలిసింది. తాజాగా డీల్‌కు ట్విటర్ బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేయడంతో మెర్జర్ డీల్‌కు మరో అడుగు ముందుకు పడింది. ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. ప్రత్యేక స్టాక్‌హోల్డర్ల సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించాలా అనేదానిపై ఇన్వెస్టర్లు ఓటు వేయ నున్నారు. షేర్హోల్డర్లు తమ స్టాక్‌లోని ప్రతి షేరుకు 54.20డాలర్ల నగదుకు అర్హులు. ఇది మస్క్ తన తొమ్మిది శాతం వాటా కొనుగోలుకు చివరి రోజు ట్రేడింగ్ విలువను పరగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ట్విటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ సమాచారాన్ని టెక్ క్రంచ్ వెల్లడించింది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉన్నాయని వాదిస్తున్న మస్క్ ఇటీవల ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ డీల్‌కు సంబంధించి మరో ప్రధాన అడ్డంకి వాటాదారుల ఆమోదం కూడా ఒకటని అన్నారు. అయితే గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీల్ విషయంలో ముందుకు సాగాలనే భావిస్తున్నట్టు మస్క్ పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్: అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానుందన్న అందోళనల నేపథ్యంలో అయిదో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వ డ్రగ్ ప్యానెల్ అనుతిమినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా జైకోవ్-డీ నిలవనుంది. అంతేకాదు దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా కూడా ఇదే. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్, 45 రోజుల తర్వాత మూడో డోస్) వ్యాక్సిన్. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 12 ఏళ్ల వారికి కూడా వినియోగించేలా భారీగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ ఏజ్ గ్రూపు వారికి ట్రయల్స్ చేసిన ఏకైక వ్యాక్సిన్ జైకోవ్-డి కావడం విశేషం. కాగా కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్-డోస్ వ్యాక్సిన్ వంటి ఐదు టీకాలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. కోవాక్సిన్ తరువాత జైకోవి-డీ దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్. జైడస్ కాడిల్లా ఏటా 120 మిలియన్ డోస్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. -
షేర్‌ఖాన్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
చివరి గంటలో అనూహ్యంగా అమ్మకాలు నెలకొనడంతో మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. దీంతో సూచీల 5రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 346 పాయింట్లు పతనమై 36,329 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 10,706 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు 0.6-1 శాతం మధ్య నష్టాలతో ప్రారంభంకావడం, ఐదు రోజుల ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు మార్కెట్లకు షాకిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మధ్యకాలికానికి 3 షేర్లను సిఫార్సు చేస్తుంది. ఆ 3 షేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం... 1.షేరు పేరు: అపోలో టైర్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.135 విశ్లేషణ: ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంతో దేశీయ రిప్లేస్మెంట్ విభాగంలో ప్రధాన కంపెనీ అపోలో టైర్స్ బలమైన పిక్అప్ను చవిచూస్తుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. టైర్ల దిగుమతులపై కేంద్రం పరిమితులు విధించడంతో దేశీయ టైర్లు లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. టైర్ల తయారీ విడిభాగాల ధరలు దిగిరావడం, యూరోపియన్ నిర్వహణలో వ్యయ నియంత్రణ, మెరుగైన ఉత్పత్తులు తదితర అంశాలు కంపెనీ మార్జిన్లు పెరిగేందుకు దోహదం చేస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కరోనా వ్యాధి వ్యాప్తి జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూరం అంశానికి ప్రాధాన్యత పెరగడంతో ప్రజలు సొంతవాహనాల్లో ప్రయాణాలకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో టైర్లకు డిమాండ్ పెరగవచ్చు. అయితే కంపెనీకి ప్రధాన మార్కెట్లైన భారత్, యూరప్‌లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుండటం, బలహీన వినియోగ సెంటిమెంట్లు ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. షేరు పేరు: బజాజ్ అటో రేటింగ్: కొనవచ్చు. టార్గెట్ ధర: రూ.3,250 విశ్లేషణ: ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అంచనాలకు మించి పిక్అప్ ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇప్పటికీ అటోమొబైల్ రంగంలో బజాజ్ అటో షేరు టాప్‌గా ఉందని బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. గ్రామీణ, పట్టణ మార్కెట్లలో అమ్మకాల్లో వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చేసిన వ్యాఖ్యలను బ్రోకరేజ్ సంస్థ కోట్ చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలు ప్రాంతీయ ప్రాంతాల్లో సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని బ్రోకరేజ్ తెలిపింది. సామాజిక దూరం అంశం నేపథ్యంలో అర్బన్ ప్రాంతంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి అస్థిరత ఎగుమతుల మార్కెట్లో ఫైనాన్సియల్ సమస్యలను సృష్టిస్తోంది. షేరు పేరు: హీరోమోటో కార్ప్ రేటింగ్: కొనవచ్చు. టార్గెట్ ధర: రూ.2740.75 విశ్లేషణ: దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభకావడంతో అటోమోటివ్ అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మరింత పుంజుకోవాల్సి ఉంది. వచ్చే 2-3 క్వార్టర్‌లోగా అమ్మకాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయాని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
వచ్చే 6నెలల్లో 26శాతం లాభపడే 7స్టాకులు ఇవే..!
ఈ ఏడాది ద్వితీయార్థంలో 26శాతం వరకు ర్యాలీ చేసే 7స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్, టోరెంటో, నాట్కో, ఎంసీఎక్స్, దీపక్ నైట్రేట్, ర్యాలీస్ ఇండియా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఇందులో ఉన్నాయి. ఈ షేర్లన్నీ మిడ్, స్మాల్ క్యాప్ రంగానికి చెందినవి కావడం విశేషం. దాదాపు రెండేళ్ల పాటు బేర్ ఫేజ్‌లో ఉన్న విస్తృత మార్కెట్ ఇప్పుడు బుల్ ఫేజ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైనట్లు అనేక ఛార్ట్లు సూచిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కోంది. జరగబోయే ఈ మార్కెట్ ర్యాలీలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగ షేర్ల హావా కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వచ్చే 6నెలల్లో 26శాతం లాభాలన్ని ఇచ్చే 7 స్టాక్‌లు 1. బాలకృష్ణ ఇండస్ట్రీస్: షేరు టార్గెట్ ధరను రూ.1535గా నిర్ణయించింది. ఈ ఏడాది చివరి కల్లా 22శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మొత్తం రూ.24472 కోట్లుగా ఉంది. 2. టోరెంటో: షేరు ఏడాది ద్వితీయార్థంలో 22శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్ ధర రూ.740గా నిర్ణయించడమైంది. రూ.585-620 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు.కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.23099 కోట్లుగా ఉంది. 3. నాట్కో ఫార్మా: ఈ షేరును రూ.770 టార్గెట్ ధరతో రూ.600-635 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 11470 కోట్లుగా ఉంది. 4. దీపక్ నైట్రేట్: రానున్న 6నెలల్లో 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.570 టార్గెట్ ధరగా రూ.450-485 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్ రూ.6626 కోట్లుగా ఉంది. 5. ఎంసీఎక్స్: షేరు టార్గెట్ ధరను రూ.1515గా నిర్ణయించడమైంది. ఈ ఏడాది చివరి కల్లా 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మొత్తం రూ.6361 కోట్లుగా ఉంది. 6. ర్యాలీస్ ఇండియా: షేరు ఏడాది ద్వితీయార్థంలో 26శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్ ధర రూ.330గా నిర్ణయించడమైంది. రూ.250-272 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5208 కోట్లుగా ఉంది. 7. బజాజ్ ఎలక్ట్రానిక్స్: ఈ షేరును రూ.470 టార్గెట్ ధరగా రూ.370-390 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4489 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 9శాతం, సెన్సెక్స్ 14శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసిన 6 స్టాకులు స్థిరంగా రాణించాయి. అందులో అత్యధికంగా ర్యాలీస్ ఇండియా షేరు 60శాతం లాభపడింది. అలాగే దీపక్ నైట్రేట్ 28శాతం, బాలకృష్ట ఇండస్ట్రీస్ 28శాతం, ట్రెంట్ 17శాతం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ 11శాతం, నాట్కో ఫార్మా ఇండెక్స్ 7శాతం ర్యాలీ చేశాయి. -
రానున్న రోజుల్లో గెలుపు గుర్రాలు ఈ 5 షేర్లు ..!
ఈ ఏడాది తొలి అర్థభాగం నేటితో ముగుస్తుంది. ఈ తొలిభాగంలో కోవిడ్-19 భయాలు బుల్స్‌ను దలాల్ స్ట్రీట్‌లో నిలబడనివ్వలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్ 14శాతం పతనాన్ని చూసింది. మార్చి కనిష్టస్థాయి నుంచి 35శాతం రికవరీ జరిగినప్పటికీ ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూడటం గమనార్హం. అటు అంతర్జాతీయ మార్కెట్లు కోవిడ్-19 భయాలతో ప్రథమార్ధంలో భారీ నష్టాలను చవిచూశాయి. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్ కనుగోనేంత వరకు ఇదే ట్రెండ్ కొనుసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ తరుణంలో నాణ్యమైన షేర్లను ఎంపిక ముఖ్యమని ఈక్విటీ విశ్లేషకులు సలహానిస్తున్నారు. ఈ నాణ్యమైన ఎంపిక మార్కెట్ కరెక్షన్ తర్వాత మంచి రాబడులను ఇవ్వొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు. జి.చొక్కాలింగం ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ రీసెర్చ్ వ్యవస్థాపకులు 1. బాంబే బర్మా ట్రేడింగ్: కన్సాలిడేటెడ్ ఆదాయానికి 12రెట్ల పీ/ఈ వద్ద ఈ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియాలో ఈ కంపెనీకి ఉన్న పెట్టుబడుల మార్కెట్ విలువతో పోలిస్తే స్టాండ్అలోన్ ప్రాతిపదికన ఈ షేర్లు 80శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతున్నాయి. 2. యూనికెమ్ ల్యాబ్స్: రుణ రహిత ఫార్మా కంపెనీ. చెప్పుకొదగిన నగదు నిల్వలున్నాయి. ఫార్ములేషన్స్ ఎగుమతులు చేస్తుంది. దాని అమ్మకాల విలువల పరంగా చాలా ఆకర్షణీయమైన వ్యాల్యూయేషన్‌తో ట్రేడ్ అవుతోంది. ఇది రెండు ఏపీఐ తయారీ యూనిట్లలో కొంత ఈక్విటీ వాటాను తీసుకుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఉమేష్ మెహతా సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగపు అధిపతి 3. ముత్తూట్ ఫైనాన్స్: బంగారం ధర బలపడే కొద్ది ఈ షేరు ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు పొందవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 4. ఐసీఐసీఐ బ్యాంక్: ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మకమైన లోన్ బుక్, లయబిలిటీ ఫ్రాంచైజ్, క్యాపిటల్ అడ్వకెషీ రేషియోలు లాంటి సానుకూలాంశాలు సహకరిస్తాయి. 5. బజాజ్ అటో: కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు సొంతవాహనాల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కరోనా కాలంలో ప్రత్యర్థి కంపెనీల కంటే అధిక వాహనాలను విక్రయించింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ షేర్లను కొనవచ్చు: మోతీలాల్ ఓస్వాల్
ఐటీ, బ్యాంక్, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ వరుస రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికింది. సెన్సెక్స్ 329 పాయింట్లు ఎగసి 35,171 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే ఇది వరుసగా నాలుగో లాభాల ముగింపు వారం. వారం మొత్తం మీద సెన్సెక్స్ 440 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. వచ్చే వారంలో నిఫ్టీకి అధిక గరిష్ట స్థాయిల వద్ద ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ రెండు స్టాకులను సిఫార్సుల చేసింది. 1.షేరు పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.65 కాల పరిమితి: ఒక ఏడాది విశ్లేషణ: కోవిడ్-19 వ్యాప్తితో స్థూల ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు నెలకొనవడంతో వృద్ధి, క్రెడిట్ నాణ్యత అవుట్‌లుక్‌లు ప్రభావితమయ్యాయి. ఆస్తుల వర్గీకరణ కలిసిరావడంతో ఈ త్రైమాసికలో బ్యాంక్ నాణ్యమైన అసెట్ క్వాలిటీ నిష్పత్తులను, మెరుగైన ప్రొవిజనింగ్ కవరేజ్‌లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రుణవ్యయం మరింత అధికంగా ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ నిపుణులు అంచనా వేసింది. షేరు పేరు: గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.110 కాల పరిమితి: ఒక ఏడాది విశ్లేషణ: గెయిల్ ప్రధాన సరఫరా వ్యాపారాలైన పెట్రోకెమికల్స్, ఎల్పీజీ, లిక్విటిడీ హెడ్రోకార్బన్ విభాగాలు ఈ మార్చి త్రైమాసికంలో అంచనాలు మించి ఫలితాలను సాధించినట్లు మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
3రంగాల నుంచి 3స్టాక్ సిఫార్సులు
మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ షేర్లు క్యాచ్ అప్ ర్యాలీకి సిద్ధమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు వినయ్ రజనీ అంటున్నారు. ఇప్పటికి వరకు లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ ర్యాలీకి సహకరించాయని ఆయన్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ర్యాలీ చేసేందుకు మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డైలీ ఛార్ట్‌ల్లో నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కన్సాలిడేషన్ ప్యాట్రన్ నుంచి బయటపడేందుకు రజనీ అన్నారు. నిఫ్టీకి అప్‌సైడ్‌లో 9,970 నిరోధాన్ని, దాన్ని అధగమిస్తే 10,550 వద్ద తదుపరి నిరోధాన్ని కలిగి ఉంది. డౌన్‌సైడ్‌లో 9500, 9580 వద్ద కీలకమైన మద్దతు స్థాయిలను కలిగి ఉన్నాయని రజనీ తెలిపారు. డైలీ ఛార్ట్‌లో 9,889 వద్ద ఉన్న కీలకమైన నిరోధాన్ని అధిగమించింది. ఇది రోజువారీ ఛార్ట్‌లో హయ్యర్ టాప్, హయ్యర్ ఫార్మేషన్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో 3రంగాల నుంచి చెందిన 3 షేర్లు సిఫార్సు చేస్తున్నారు. 1.షేరు పేరు: అపోలో టైర్స్ టార్గెట్ ధర: రూ.118 స్టాప్ లాస్: రూ.96 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: గత 4వారాలుగా కనిపించిన కన్షాలిడేషన్ ప్యాట్రన్ నుంచి షేరు బయటపడింది. బోలింగర్ ఎగువ బ్యాండ్‌పై ముగిసింది. ఇది అప్‌ట్రెండ్‌లో మూమెంటంకు సంకేతం. అటో రంగానికి చెందిన షేర్లు అవుట్ఫర్ఫామ్ చేస్తున్నాయి. తాజాగా అటో యాన్సలరీ , టైర్ స్టాకుల ఛార్ట్‌లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఛార్ట్స్‌లో ఇండికేటర్లు, ఓస్కిలేటర్లు బుల్లిష్‌గా మారాయి. 2.షేరు పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టార్గెట్ ధర: రూ.96 స్టాప్ లాస్: 78 అప్ సైడ్: 11శాతం విశ్లేషణ: 2020 మార్చి 29 ముగిసిన నెలవారీ ఛార్ట్‌లో బుల్లిష్ హ్యమర్ క్యాండింల్ స్టి్క్ ప్యాట్రన్‌ను నమోదు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం బాటమ్ నుంచి బయటపడింది. అలాగే అయిల్ మార్కెటింగ్ కంపెనీల ఛార్ట్‌ల్లో మరింత పెరిగే సంకేతాలు కన్పిస్తాయి. ఈ షేరు షార్ట్-టర్మ్ మూవింగ్ రిసిస్టెంట్ దాటి ముగిసింది. ఇది రోజువారీ చార్టులలో రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా నమోదైంది. 3.షేరు పేరు: కేడిలా హెల్త్‌కేర్ టార్గెట్ ధర: రూ.375 స్టాప్ లాస్: రూ.333 అప్ సైడ్: 7శాతం విశ్లేషణ: ఇటీవల మార్కెట్ పతనం నుంచి ఫార్మా షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. అలాగే మార్కెట్ బుల్లిష్ ర్యాలీలో బలమైన ర్యాలీని ప్రదర్శిస్తున్నాయి. చివరి 8వారాలుగా ఈ షేరు చాలా తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌ను చూస్తోంది. వీక్లీ, డైలీ ఛార్ట్స్‌లో మూవింగ్ యావరేజ్, ఓస్కిలేటర్ సెటప్‌లు బలంగా ఉన్నాయి. ఈ స్టాక్ దాని మూమెంటంను తిరిగి పొందుతుంది. -
ఏంజెల్ బ్రోకింగ్ బ్రోకరేజ్ నుంచి 2స్టాక్ రికమెండేషన్లు
షేరు పేరు: వినతి ఆర్గానిక్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,095 స్టాప్ లాస్: రూ.976 అప్‌సైడ్: 7శాతం విశ్లేషణ: లాక్‌డౌన్‌తో కొద్దిరోజుల పాటు ఒడిదుడుకులను ఎదుర్కోన్న కెమికల్ రంగం ప్రస్తుతం గాడిలో పడింది. ఈ స్టాక్ విషయానికొస్తే.., మార్చి నెలలో భారీ పతనం తర్వాత, రూ.700 స్థాయిల నుండి అద్భుతమైన రికవరీని సాధించింది. ఇటీవల, స్టాక్ ధర దాని 200 రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్ చుట్టూ దాదాపు 3వారాల పాటు కన్సాలిడేట్ అయ్యింది. అయితే చివరి శుక్రవారం, బలమైన కొనుగోళ్లతో మరో మద్దుతు స్థాయికి అధిగమించేందుకు ప్రయత్నం చేసింది. షేరు పేరు: కజారియా సిరామిక్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.378 స్టాప్ లాస్: రూ.316 అప్‌సైడ్: 10శాతం విశ్లేషణ: షేరు జనవరి గరిష్టం నుంచి దాదాపు 50శాతం కరెక్షన్కు లోనవడంతో, ఈ కౌంటర్ గత 4నెలలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. చివరి వారంలో కొన్నేళ్ల మద్దతు స్థాయిల వద్ద ఆగిపోయింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో, స్టాక్ ధరల బలమైన పెరుగుదలను చూసింది. ఇప్పుడు డైలీ ఛార్ట్‌ను పరిశీలిస్తే.., షేరు గడిచిన 3నెలల తర్వాత మొదటిసారి 20 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్‌పై ముగిసినట్లు స్పష్టమవుతోంది. అదనంగా, బలమైన మద్దతు జోన్ వద్ద బుల్లిష్ హ్యామర్ ప్యాట్రన్ నిర్ధారణను సూచిస్తుంది. -
3నెలల్లో 20శాతం వరకు రాబడినిచ్చే 3 షేర్లు ఇవే..!
మార్కెట్ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు వికాస్ జైన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ర్యాలీలో మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్ల ప్రదర్శన తక్కువగా ఉందని, రాబోయే కొద్ది వారాల్లో ఈ షేర్లలో అద్భుతమైన ర్యాలీని చూడవచ్చని జైన్ అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ అప్‌సైడ్‌లో 9,750 వద్ద నిరోధ స్థాయిని కలిగి ఉందని, దాన్ని అధిగమిస్తే 9,800 వద్ద మరో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జైన్ అంచనా వేస్తున్నారు. ఇక్ డౌన్‌సైడ్‌లో 9,250వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని, ఈ స్థాయిని కోల్పోతే 9,050వద్ద మరో కీలక మద్దతు ఉందన్నారు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ప్రదర్శన రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని జైన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జైన్ 3నెలల వ్యవధిలో 20శాతం వరకు రాబడులనిచ్చే 3స్టాకులను సిఫార్సు చేశారు. షేరు పేరు: సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.340 స్టాప్ లాస్: రూ.253 అప్ సైడ్: 20శాతం విశ్లేషణ: ఈ షేరు నెలవారీ ఎక్స్పైరీ ఛార్ట్‌లో హమ్మర్ క్యాండిల్ ప్యాట్రన్ రూపొందించింది. హయ్యర్ సైడ్‌లో బలమైన రివర్సల్ బ్రేక్అవుట్ను ఆశించవచ్చు. బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు 4వారాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్ఎస్ఐ గత కొన్నివారాల నుంచి యావరేజ్ లైన్‌పై ట్రేడ్ అవుతోంది. కాబట్టి ట్రేడర్లు రూ.253ని స్టాప్ లాస్‌గా నిర్దేశించుకొని రూ.340 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.410 స్టాప్ లాస్: రూ.324 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఈ షేరు దాని స్వల్ప మరియు మధ్యకాలిక యావరేజ్‌ల దగ్గర ట్రెండ్ అవుతోంది. ప్రస్తుత స్థాయిల నుండి పైకి బ్రేక్అవుట్ కావొచ్చు. వీక్లీ ఛార్ట్‌లో హయ్యర్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఆశించవచ్చు . షేరు పేరు: టెక్ మహీంద్రా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.595 స్టాప్ లాస్: రూ.491 అప్ సైడ్: 12శాతం విశ్లేషణ: ఈ షేరుకు త్రైమాసికపు సగటు రూ.485 వద్ద కీలక మద్దుత స్థాయిని కలిగి ఉంది. ఇది తక్కువ శ్రేణి నుండి సానుకూల మూమెంటంను అందుకుంది. కీలకమైన ఆర్ఎస్ఐ ఇండికేటర్ దాని యావరేజ్ లైన్‌కు పైన ట్రేడ్ అవుతోంది. ఇది ప్రస్తుత స్థాయిల నుంచి బ్రేక్ అవుట్ అయ్యి తదుపరి ర్యాలీకి సిద్ధమవడాన్ని సూచిస్తుంది. -
సివిల్ సర్వీస్‌లకు మరో 66 మంది
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 66 మంది పేర్లను సిఫారసు చేస్తూ యూపీఎస్సీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల భర్తీకి మొత్తం 1,058 ఖాళీలకు 990 మందికి నియామక పత్రాలిచ్చారు. తాజాగా రిజర్వ్ జాబితాలో ఉంచిన మరో 66 మందిని యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో జనరల్ 48, ఓబీసీ 16 మంది ఉండగా, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. వీరి వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. -
‘ప్రైవేటు’ సిజేరియన్‌కు ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్–జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులు సిఫార్సు చేస్తేనే ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఏ కారణం చేత సదరు ప్రభుత్వ ఆస్పత్రి సిజేరియన్‌కు సిఫార్సు చేసిందో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. దేశంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలుత సహజ ప్రసవాలను ఈ పథకం పరిధిలో చేర్చలేదన్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమీ లేదా ఇతర కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తే ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. -
ఆరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన!
-
మీ బ్యాంకును మారుస్తారా?
సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ నాలుగులో బాగున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేతప్ప ఫ్లాప్ సినిమాకు వెళ్లాలని అనుకోరు. సినిమా బాగుందా? లేదా? అనే విషయం తొలి షో పడ్డ వెంటనే తెలిసిపోతుంది. ఇదంతా ఎందుకంటే... ఇదే విషయాన్ని మీ ఖాతా ఉన్న బ్యాంకులకూ వర్తింపజేసుకోండి. అంటే... ప్రస్తుతం చాలా బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అలాగని అన్నింటి సేవలూ ఒకేలా ఉండవు. తేడాలుంటాయి. కొన్ని బ్యాంకులు మెరుగైన సేవలందిస్తే... మరికొన్ని ఒక మోస్తరు సేవలందిస్తూ ఉంటాయి. బ్యాంకుల సేవలు బ్రాంచీని బట్టి కూడా మారుతుంటాయి. వడ్డీ రేట్లు, సేవలు బాగుంటే ఓకే * పెనాల్టీల మోత ఎక్కువైతే మార్చాల్సిందే * టెక్నాలజీపై దృష్టి లేకుంటే ఆలోచించక తప్పదు మీరు ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకు మంచిదా... కాదా? అనేది ఆ బ్యాంకు మీకు అందిస్తున్న సేవల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన సేవల్ని అందిస్తుంటే ఆ బ్యాంకును మంచి బ్యాంకుగా అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకుల మూలధనం, లావాదేవీల విలువ వంటి అంశాలు సాధారణ ప్రజలకు పెద్దగా తెలియవు. అందుకే వారు ఈ అంశాల ప్రాతిపదికన కాకుండా వారు పొందే సేవల ఆధారంగా బ్యాంకులకు మార్కులు వేస్తారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి ముగ్గురిలో ఒక కస్టమర్ తన బ్యాంకు సేవలపై అసంతృప్తిగా ఉన్నాడనే విషయం వెల్లడైంది. దీంతో బ్యాంకులను మార్చుకోవాలని భావిస్తున్న వారు చాలామందే ఉన్నట్టు వెల్లడయింది. మీరు కూడా ఆ వరుసలో ఉన్నారేమో తెలుసుకోవాలంటే... ఈ కింది అంశాలను ఒకసారి సరిచూసుకోండి. మీ బ్యాంకు మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ను సిఫార్సు చేసిందా? బ్యాంకులు సాధారణంగా సేవింగ్స్ ఖాతాలు నిర్వహించటంతో పాటు రుణాలిస్తూ ఉంటాయి. పిక్స్డ్ డిపాజిట్లు, రెగ్యులర్ సేవింగ్స్ పథకాలను కాకుండా స్వీప్ ఇన్, స్వీప్ ఆప్ సర్వీసులు కూడా అం దిస్తుంటాయి. కొన్ని అందించవు. ఈ సేవలతోపాటు ఇన్వెస్ట్మెంట్/ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను కూడా సిఫార్సు చేస్తూ ఉంటాయి. ఇటీవల ‘ఎకనమిక్స్.కామ్’ నిర్వహించిన ఓ సర్వేలో బ్యాంకులు సిఫార్సు చేసే ప్రొడక్ట్స్ తమ అవసరాలకు అనుగుణంగా లేవని ప్రతి ఐదుగురిలో ముగ్గురు తెలిపారు. కొందరు ఇన్వెస్ట్మెంట్ సంబంధిత ఆర్థిక సలహాల కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు వాటిల్లో చాలా బ్యాంకులు సాంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలను తీసుకోవాలని సూచించాయి. ఇవి తక్కువ రాబడులను అందించేవే. అనువుగాని పాలసీలను విక్రయించడం కూడా నేరమని, కస్టమర్లు దీనికి సంబంధించి న్యాయం పొందొచ్చనేది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) చైర్మన్ ఏసీ మహజన్ మాట. మీకు గనక మీ బ్యాంకు అనువుకాని, సరిపోని ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తే మీరు ఆ బ్యాంకు నుంచి తప్పుకోవటమే మంచిది. ఎందుకంటే బాధాకరమైన బంధాన్ని కొనసాగించాలని ఎవ్వరూ కోరుకోరు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ నివేదిక ప్రకారం... 2014-15లో బ్యాంకులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు 11 శాతం పెరిగాయి. బీసీఎస్‌బీఐ నిర్వహించిన ఒక సర్వేలో 47 బ్యాంకుల్లో కేవలం 14 బ్యాంకులు మాత్రమే హై రేటింగ్‌ను పొందాయి. ఈ 14 బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఒకటి మాత్రమే ఉంది. టెక్నాలజీలో ముందుందా? ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి తదితర అంశాలకు సంబంధించిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కస్టమర్లు బ్యాంకులకు వెళ్లడం చాలా తగ్గింది. టెక్నాలజీతో అన్నీ మారిపోయాయి. భౌతికంగా నగదు డిపాజిట్ చెయ్యటం, ఎఫ్డీలు చెయ్యటంతో పాటు డీడీ వంటివి కావాలనుకున్న కొన్ని సందర్భాల్లో తప్ప కస్టమర్లు బ్యాంకులకు వెళ్లడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం టెక్నాలజీ వినియోగంలో వెనుకంజలో ఉన్నాయని చెప్పొచ్చు. పదేపదే వెబ్సైట్ డౌన్ కావడం, ఏటీఎంలు ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉండటం, పొరపాటున ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ డబ్బు చాలా ఆలస్యంగా అకౌంట్లో జమ కావటం, వారాంతాల్లో నెట్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కస్టమర్లకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ సమస్యలు మీకూ ఎదురయ్యాయేమో చూసుకోండి. టెక్నాలజీ విషయంలో సర్దుకొని పోవాల్సిన పనేమీ లేదు. మీ బ్యాంకులు ఈ విషయంలో వెనుకంజలో ఉంటే దాన్ని మార్చడంలో తప్పులేదు. వడ్డీ రేట్ల సంగతేంటి? ఒక వ్యక్తి బ్యాంకుకు కస్టమర్‌గా మారుతున్నాడంటే ఆ విషయంలో వడ్డీ రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి. సేవింగ్ డిపాజిట్లకు సంబంధించి కొన్ని బ్యాంకులేమో 5-6 శాతం వడ్డీ రేటు ఇస్తుంటే.. కొన్నేమో 4 శాతమే ఇస్తున్నాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ రేట్లు కూడా వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులేమో అవి ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ రేట్లను విధిస్తుంటాయి. ఒక బ్యాంకుతో మరొకదాన్ని పోల్చి చూసుకోండి. ఎక్కడ మీకు అనువైన వడ్డీ రేట్ల ఉంటే ఆ బ్యాంకు కస్టమర్‌గా కొనసాగండి. కొన్ని బ్యాంకులు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలోనూ వెనుకంజలో ఉన్నాయి. వాటిపై కన్నేయండి. అధిక చార్జీలు, పెనాల్టీలు బ్యాంకులు వాటి సేవల మీద కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటాయి. అలాగే మనకు తెలియని చార్జీల్ని కూడా వసూలు చేస్తుంటాయి. క్యాష్ విత్ డ్రాయల్స్‌పై సర్వీస్ చార్జ్ చెల్లింపులు మనకు తె లియకుండానే జరిగిపోతుంటాయి. అలాగే క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనప్పుడు, ఇతర చెల్లింపుల జాప్యాల విషయంలోనూ కొన్ని బ్యాంకులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే చార్జ్ చేస్తూ ఉంటాయి. నిజానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు 3 రోజుల ఆలస్యమైతే పెనాల్టీలను వసూలు చేయరాదని ఆర్బీఐ పేర్కొంది. కానీ బ్యాంకులు మాత్రం వాటి పని అవి చేసుకొని పోతున్నాయి. నెలలో ఏటీఎం విత్‌డ్రాయల్స్ పరిమితి దాటినా కూడా అదనపు చార్జీలను కట్టాల్సిందే. -
పివికి భారతరత్నకై సిఫారసు