‘ప్రైవేటు’ సిజేరియన్‌కు ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి | Government hospital clearance needed for caesarean deliveries at pvt hospitals under NHPM | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 4:59 AM | Last Updated on Mon, May 28 2018 4:59 AM

Government hospital clearance needed for caesarean deliveries at pvt hospitals under NHPM - Sakshi

న్యూఢిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌–జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్‌(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులు సిఫార్సు చేస్తేనే ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉంటుందని ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం సీఈవో ఇందు భూషణ్‌ తెలిపారు. ఏ కారణం చేత సదరు ప్రభుత్వ ఆస్పత్రి సిజేరియన్‌కు సిఫార్సు చేసిందో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. దేశంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలుత సహజ ప్రసవాలను ఈ పథకం పరిధిలో చేర్చలేదన్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమీ లేదా ఇతర కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తే ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement