చివరి గంటలో అనూహ్యంగా అమ్మకాలు నెలకొనడంతో మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. దీంతో సూచీల 5రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. సెన్సెక్స్ 346 పాయింట్లు పతనమై 36,329 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 10,706 వద్ద ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు 0.6-1 శాతం మధ్య నష్టాలతో ప్రారంభంకావడం, ఐదు రోజుల ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు మార్కెట్లకు షాకిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మధ్యకాలికానికి 3 షేర్లను సిఫార్సు చేస్తుంది. ఆ 3 షేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
1.షేరు పేరు: అపోలో టైర్స్
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.135
విశ్లేషణ: ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంతో దేశీయ రిప్లేస్‌మెంట్ విభాగంలో ప్రధాన కంపెనీ అపోలో టైర్స్ బలమైన పిక్‌అప్‌ను చవిచూస్తుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. టైర్ల దిగుమతులపై కేంద్రం పరిమితులు విధించడంతో దేశీయ టైర్లు లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. టైర్ల తయారీ విడిభాగాల ధరలు దిగిరావడం, యూరోపియన్ నిర్వహణలో వ్యయ నియంత్రణ, మెరుగైన ఉత్పత్తులు తదితర అంశాలు కంపెనీ మార్జిన్లు పెరిగేందుకు దోహదం చేస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కరోనా వ్యాధి వ్యాప్తి జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూరం అంశానికి ప్రాధాన్యత పెరగడంతో ప్రజలు సొంతవాహనాల్లో ప్రయాణాలకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో టైర్లకు డిమాండ్ పెరగవచ్చు. అయితే కంపెనీకి ప్రధాన మార్కెట్లైన భారత్, యూరప్‌లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుండటం, బలహీన వినియోగ సెంటిమెంట్‌లు ప్రతికూలాంశాలుగా ఉన్నాయి.
షేరు పేరు: బజాజ్ అటో
రేటింగ్: కొనవచ్చు.
టార్గెట్ ధర: రూ.3,250
విశ్లేషణ: ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అంచనాలకు మించి పిక్‌అప్ ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇప్పటికీ అటోమొబైల్ రంగంలో బజాజ్ అటో షేరు టాప్‌గా ఉందని బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. గ్రామీణ, పట్టణ మార్కెట్లలో అమ్మకాల్లో వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చేసిన వ్యాఖ్యలను బ్రోకరేజ్ సంస్థ కోట్ చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలు ప్రాంతీయ ప్రాంతాల్లో సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని బ్రోకరేజ్ తెలిపింది. సామాజిక దూరం అంశం నేపథ్యంలో అర్బన్ ప్రాంతంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. అలాగే డాలర్ మారకంలో రూపాయి అస్థిరత ఎగుమతుల మార్కెట్లో ఫైనాన్సియల్ సమస్యలను సృష్టిస్తోంది.
షేరు పేరు: హీరోమోటో కార్ప్
రేటింగ్: కొనవచ్చు.
టార్గెట్ ధర: రూ.2740.75
విశ్లేషణ: దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభకావడంతో అటోమోటివ్ అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మరింత పుంజుకోవాల్సి ఉంది. వచ్చే 2-3 క్వార్టర్‌లోగా అమ్మకాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయాని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. ఇండియాలో కోవిడ్-19 ధీర్ఘకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి క్షీణత, బలహీన వినియోగం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment