దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ | Collegium Recommends Transfer Of 24 High Court Judges | Sakshi
Sakshi News home page

దేశంలో ఒకేసారి 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా..!

Published Sat, Aug 5 2023 5:58 PM | Last Updated on Sat, Aug 5 2023 7:19 PM

Collegium Recommends Transfer Of 24 High Court Judges - Sakshi

ఢిల్లీ : దేశంలో 24 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఈ స్థాయిలో న్యాయమూర్తులను బదిలీ చేయడం బహుశా ఇదే అత్యధికం. ఏపీ, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, అలహాబాద్, పట్నాతో సహా పలు హెకోర్టుల్లో పని చేస్తున్న జడ్జీలను బదిలీలను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. 

న్యాయమూర్తుల బదిలీ అంశం కొన్ని రోజులుగా కొలీజియం ప్రతిపాదిత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉంది. బదిలీకి సంబంధించిన లేఖలు కూడా ఆయా న్యాయమూర్తులకు ఇప్పటికే పంపినట్లు తెలుస్తోంది. బదిలీ అంశాన్ని ఏ న్యాయమూర్తైనా పునపరిశీలించాలని కోరితే.. తుది నిర్ణయం కొలీజియందే ఉంటుంది. సీజేఐ ప్రతిపాదించిన బదిలీ పత్రాలను సంబంధిత కేంద్ర మంత్రి ప్రధానమంత్రికి సమర్పిస్తారు. ప్రధాని ఆయా ప్రతిపాదనలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. 

ఇదీ చదవండి: Anti Sikh Riots Case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యానేరం అభియోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement