సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు.
చదవండి: Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్‌బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు.
కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment