న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిపై బదిలీపై వెళ్లనున్నారు. పై పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం జస్టిస్ ప్రచక్‌ను పాట్నా హైకోర్టుకు పంపుతున్నట్లు కొలీజియం తెలిపింది.
గుజరాత్ హైకోర్టు జడ్జి అయిన హేమంత్ ఎమ్ ప్రచక్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలైలో 123 పేజీల తీర్పు వెల్లడించారు.అంతేగాక 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ బీజేపీ మంత్రి మాయా కొద్నానీ తరుపున వాదించిన న్యాయవాదులలో జస్టిస్ ప్రచ్చక్ ఒకరిగా గతంలో ఉన్నారు.
జస్టిస్ ప్రచక్‌తోపాటు 2002 గోద్రా అల్లర్లకు సంబంధించి హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న గుజరాత్ హైకోర్టు జడ్జి మరో జస్టిస్ సమీర్ దవే.. రాహుల్ గాంధీ జైలు శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపి కూడా ఉన్నారు.వీరితోపాటు పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు నుంచి ఒకరు కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తొమ్మిది పేర్ల జాబితాలో ఉన్నారు.
సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈనెల 3న సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన న్యాయం అందించేందుకే బదిలీలు సిఫార్సు చేస్తున్నట్లు కొలీజియం గురువారం పేర్కొంది.
చదవండి: మణిపూర్ అంశం.. మోదీపై అమెరికా సింగర్ మిల్ బెన్ కీలక వ్యాఖ్యలు
కాగా గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ప్రచక్.. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరోవైపు అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్బం దాల్చగా.. అబార్షన్‌కు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సమీర్ దవే ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మనుస్మృతి ప్రకారం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని వ్యాఖ్యానించారు. ‘కావాలంటే మీ అమ్మ.. అమ్మమ్మను అడగండి.. అప్పట్లో వివాహానికి గరిష్ఠ వయసు 14, 15 ఏళ్లే.. 17 ఏళ్లు రాక మునుపే తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు.. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు.. మీరు మనుస్మృతి చదవలేదేమో.. ఓసారి చదవండి’ జస్టిస్ దవే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment