సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ | For Relief In Modi Surname Case Rahul Gandhi Goes Supreme Court | Sakshi
Sakshi News home page

చివరగా.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ

Published Sat, Jul 15 2023 5:01 PM | Last Updated on Sat, Jul 15 2023 5:24 PM

For Relief In Modi Surname Case Rahul Gandhi Goes Supreme Court - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసు’లో ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనర్హత వేటుతో ఎంపీ పదవిని సైతం కోల్పోయారు. ఈ శిక్షపై స్టే విధించాలంటూ ఆయన కింది కోర్టులను ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు.  

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్‌ కోర్టు ఈ క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

ఆ మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్‌ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు.   తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. 

అయితే బెయిల్‌ దక్కించుకున్న రాహుల్‌ గాంధీ తన శిక్షపై స్టే విధించడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

► ఈ క్రమంలో సెషన్స్‌ కోర్టు ఆయనకు శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారాయన. 

► జులై 7వ తేదీన గుజరాత్‌ హైకోర్టు ఆయన రివ్యూ పిటిషన్‌పై స్పందిస్తూ.. 

దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి(స్టే విధించడానికి) రాహుల్‌ గాంధీ చూపించిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. అందరుదైన సందర్భాల్లో మినహా శిక్షపై స్టేవ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ఆయనపై ఇప్పటికే 10 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైందే.. అలాగే న్యాయబద్ధమైందే. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం అని తీర్పు ఇచ్చింది

► సెషన్స్‌ కోర్టు, గుజరాత్‌ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. 

ఒకవేళ సుప్రీంకోర్టులోనూ ఆయనకు వ్యతిరేక తీర్పు(ఊరట దక్కకున్నా) వెలువడితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడు అవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement