మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ షేర్లు క్యాచ్ అప్ ర్యాలీకి సిద్ధమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకుడు వినయ్ రజనీ అంటున్నారు. ఇప్పటికి వరకు లార్జ్ క్యాప్ షేర్లు మార్కెట్ ర్యాలీకి సహకరించాయని ఆయన్నారు. ప్రస్తుత స్థాయిల నుంచి ర్యాలీ చేసేందుకు మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డైలీ ఛార్ట్‌ల్లో నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు కన్సాలిడేషన్ ప్యాట్రన్ నుంచి బయటపడేందుకు రజనీ అన్నారు. నిఫ్టీకి అప్‌సైడ్‌లో 9,970 నిరోధాన్ని, దాన్ని అధగమిస్తే 10,550 వద్ద తదుపరి నిరోధాన్ని కలిగి ఉంది. డౌన్‌సైడ్‌లో 9500, 9580 వద్ద కీలకమైన మద్దతు స్థాయిలను కలిగి ఉన్నాయని రజనీ తెలిపారు. డైలీ ఛార్ట్‌లో 9,889 వద్ద ఉన్న కీలకమైన నిరోధాన్ని అధిగమించింది. ఇది రోజువారీ ఛార్ట్‌లో హయ్యర్ టాప్, హయ్యర్ ఫార్మేషన్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో 3రంగాల నుంచి చెందిన 3 షేర్లు సిఫార్సు చేస్తున్నారు.
1.షేరు పేరు: అపోలో టైర్స్
టార్గెట్ ధర: రూ.118
స్టాప్ లాస్: రూ.96
అప్ సైడ్: 13శాతం
విశ్లేషణ: గత 4వారాలుగా కనిపించిన కన్షాలిడేషన్ ప్యాట్రన్ నుంచి షేరు బయటపడింది. బోలింగర్ ఎగువ బ్యాండ్‌పై ముగిసింది. ఇది అప్‌ట్రెండ్‌లో మూమెంటంకు సంకేతం. అటో రంగానికి చెందిన షేర్లు అవుట్‌ఫర్‌ఫామ్ చేస్తున్నాయి. తాజాగా అటో యాన్సలరీ , టైర్ స్టాకుల ఛార్ట్‌లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఛార్ట్స్‌లో ఇండికేటర్లు, ఓస్కిలేటర్లు బుల్లిష్‌గా మారాయి.
2.షేరు పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
టార్గెట్ ధర: రూ.96
స్టాప్ లాస్: 78
అప్ సైడ్: 11శాతం
విశ్లేషణ: 2020 మార్చి 29 ముగిసిన నెలవారీ ఛార్ట్‌లో బుల్లిష్ హ్యమర్ క్యాండింల్ స్టి్‌క్ ప్యాట్రన్‌ను నమోదు చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం బాటమ్ నుంచి బయటపడింది. అలాగే అయిల్ మార్కెటింగ్ కంపెనీల ఛార్ట్‌ల్లో మరింత పెరిగే సంకేతాలు కన్పిస్తాయి. ఈ షేరు షార్ట్-టర్మ్ మూవింగ్
రిసిస్టెంట్ దాటి ముగిసింది. ఇది రోజువారీ చార్టులలో రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా నమోదైంది.
3.షేరు పేరు: కేడిలా హెల్త్‌కేర్
టార్గెట్ ధర: రూ.375
స్టాప్ లాస్: రూ.333
అప్ సైడ్: 7శాతం
విశ్లేషణ: ఇటీవల మార్కెట్ పతనం నుంచి ఫార్మా షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. అలాగే మార్కెట్ బుల్లిష్ ర్యాలీలో బలమైన ర్యాలీని ప్రదర్శిస్తున్నాయి. చివరి 8వారాలుగా ఈ షేరు చాలా తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌ను చూస్తోంది. వీక్లీ, డైలీ ఛార్ట్స్‌లో మూవింగ్ యావరేజ్, ఓస్కిలేటర్ సెటప్‌లు బలంగా ఉన్నాయి. ఈ స్టాక్ దాని మూమెంటంను తిరిగి పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment