రానున్న రోజుల్లో గెలుపు గుర్రాలు ఈ 5 షేర్లు ..! | 5 stocks that analysts say can emerge Dark Horses on Dalal Street | Sakshi
Sakshi News home page

రానున్న రోజుల్లో గెలుపు గుర్రాలు ఈ 5 షేర్లు ..!

Published Tue, Jun 30 2020 3:49 PM | Last Updated on Tue, Jun 30 2020 3:49 PM

5 stocks that analysts say can emerge Dark Horses on Dalal Street - Sakshi

ఈ ఏడాది తొలి అర్థభాగం నేటితో ముగుస్తుంది. ఈ తొలిభాగంలో కోవిడ్‌-19 భయాలు బుల్స్‌ను దలాల్‌ స్ట్రీట్‌లో నిలబడనివ్వలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్‌ 14శాతం పతనాన్ని చూసింది. మార్చి కనిష్టస్థాయి నుంచి 35శాతం రికవరీ జరిగినప్పటికీ ఈ స్థాయిలో నష్టాన్ని చవిచూడటం గమనార్హం. అటు అంతర్జాతీయ మార్కెట్లు కోవిడ్‌-19 భయాలతో ప్రథమార్ధంలో భారీ నష్టాలను చవిచూశాయి. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్‌ కనుగోనేంత వరకు ఇదే ట్రెండ్‌ కొనుసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ తరుణంలో నాణ్యమైన షేర్లను ఎంపిక ముఖ్యమని ఈక్విటీ విశ్లేషకులు సలహానిస్తున్నారు. ఈ నాణ్యమైన ఎంపిక మార్కెట్‌ కరెక‌్షన్‌ తర్వాత మంచి రాబడులను ఇవ్వొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు. 

జి.చొక్కాలింగం ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు

1. బాం‍బే బర్మా ట్రేడింగ్‌: కన్సాలిడేటెడ్‌ ఆదాయానికి 12రెట్ల పీ/ఈ వద్ద ఈ షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి. బ్రిటానియాలో ఈ కంపెనీకి ఉన్న పెట్టుబడుల మార్కెట్‌ విలువతో పోలిస్తే స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన ఈ షేర్లు 80శాతం డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. 

2. యూనికెమ్‌ ల్యాబ్స్‌: రుణ రహిత ఫార్మా కంపెనీ. చెప్పుకొదగిన నగదు నిల్వలున్నాయి. ఫార్ములేషన్స్‌ ఎగుమతులు చేస్తుంది. దాని అమ్మకాల విలువల పరంగా చాలా ఆకర్షణీయమైన వ్యాల్యూయేషన్‌తో ట్రేడ్‌ అవుతోంది. ఇది రెండు ఏపీఐ తయారీ యూనిట్లలో కొంత ఈక్విటీ వాటాను తీసుకుంది. వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. 

ఉమేష్‌ మెహతా సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విభాగపు అధిపతి

3. ముత్తూట్‌ ఫైనాన్స్‌: బంగారం ధర బలపడే కొద్ది ఈ షేరు ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు పొందవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

4. ఐసీఐసీఐ బ్యాంక్‌: ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మకమైన లోన్‌ బుక్‌, లయబిలిటీ ఫ్రాంచైజ్, క్యాపిటల్‌ అడ్వకెషీ రేషియోలు లాంటి సానుకూలాంశాలు సహకరిస్తాయి.

5. బజాజ్‌ అటో: కరోనా వైరస్‌ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు సొంతవాహనాల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. కరోనా కాలంలో ప్రత్యర్థి కంపెనీల కంటే అధిక వాహనాలను విక్రయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement