యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల | UPSC 2024 Civil Services Notification Released | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

Published Wed, Feb 14 2024 3:25 PM | Last Updated on Wed, Feb 14 2024 5:11 PM

UPSC 2024 Civil Services Notification Released - Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుకుల గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించన్నుట్లు యూపీఎస్సీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించేందుకు నిపుణుల మెలకువలు

అర్హత: భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం లేదా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యా సంస్థలు లేదా సెక్షన్-3 ప్రకారం విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతున్నట్లు ప్రకటించబడిన ఏదైనా విశ్వవిద్యాలయాల డిగ్రీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956, లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

వయోపరిమితి (01/08/24 నాటికి): 21 - 32 సంవత్సరాలు

ఎన్ని సార్లు రాయొచ్చంటే:

  • సాధారణ అభ్యర్థులు: 06
  • OBC అభ్యర్థులు: 09
  • SC/ST అభ్యర్థులు: పరిమితి లేదు

పరీక్ష ప్రణాళిక: సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష రెండు వరుస దశలను కలిగి ఉంటుంది.

మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్); మరియు
వివిధ సర్వీసులు మరియు పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (వ్రాత మరియు ఇంటర్వ్యూ).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement