ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్‌యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
[Rajendra Nagar deaths]
A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case.
Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024
జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో సెల్లార్‌లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్‌యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్‌లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment