coaching center
-
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
పందెం కోళ్లకూ కోచింగ్ సెంటర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ సెంటర్లున్నాయి. డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు చూశాం. మనుషులకే కాదు.. కోళ్లకు కూడా కోచింగ్ సెంటర్లున్నాయి. ఇదేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండీ.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు లేకుండా సంక్రాంతి పండగే జరగదు కదా. పందెం గెలవాలంటే కోళ్లకూ శిక్షణ ఉండాలి. వాటికీ శరీర దారుఢ్యం, వేగంగా కదిలి శత్రువుపై దాడి చేసి మట్టుపెట్టే సామర్ధ్యం ఉండాలి కదా. అందుకే ఈ కోళ్ల కోచింగ్ సెంటర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలకు మాత్రమే ఇవి ప్రత్యేకం. వీటికి మూడు నెలలు మంచి గిరాకీ ఉంటుంది. దసరాకు మొదలయ్యే శిక్షణ సంక్రాంతికి మూడు రోజుల ముందు ముగిస్తారు.శిక్షణ ఇలా..» రోజూ గాబు (చుట్టూ తెరకట్టి లోపలఉంచుతారు)లో ఉన్న కోళ్లను తెల్లవారుజామునే బయటకు తీసుకువస్తారు. ఉదయం ఆరు గంటల లోపు మౌత్ వాటర్ బ్రీతింగ్ (నోటిలో నీరు పోసి బయటకు వదలడం) చేస్తారు. ముందు రోజు రాత్రి మట్టిలో నోటితో పొడవడంతో మట్టి చేరి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వాటర్ బ్రీతింగ్ చేస్తారు.» శీతాకాలం కావడంతో రోగాలు రాకుండా నిత్యం ఏలూరుకు చెందిన వెటర్నరీ వైద్యుడు ప్రహర్ష ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు.» మూడు నెలల శిక్షణలో ఆరేడుసార్లు ప్రతి పందెం కోడికి స్టీమ్‌బాత్ చేయిస్తారు. సంక్రాంతికి సున్నిపిండితో పిల్లలకు నలుగు పెట్టి స్నానంచేసే మాదిరిగా ఇది ఉంటుంది. వేప, జాజి, కుంకుడు తదితర ఆరు రకాల ఆకులతో నీళ్లను బాగా మరిగించి పందెం కోడి తట్టుకునే ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటితో స్నానం చేయిస్తారు. తరువాత ఎండ తగిలేలా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఆరుబయటే ఉంచుతారు.» కోడి కాళ్లు సాగడానికి పెద్ద డ్రమ్ముల్లో నీటిని పోసి కనీసం గంట పాటు ఈత కొట్టిస్తారు.» మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోళ్లు, గంట్లు, ధాన్యం మిశ్రమాన్ని పెడతారు. దీనివల్ల పందెం కోడి రెండు, మూడు అడుగులు సునాయాసంగా పైకి ఎగురుతుంది. కోడి ఎగిరే ఎత్తునుబట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది.» పందెంకోడి బరిలోకి దిగినప్పుడు మూడున్నర కిలోకు మించి బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతకు మించి బరువు ఉంటే పందెంలో పైకి ఎగరలేక దెబ్బ తగిలిన వెంటనే కిందకు పడిపోయి ఓడిపోతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం బాదం, పిస్తా, ఎండు కర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేక ఆహారం పెడతారు.»పందేనికి మూడు వారాలు ముందు నుంచి రాత్రి ఆహారం మార్చేస్తారు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌తో పాటు మసాలా దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి) సమపాళ్లలో కలిపిన నాస్తా (లడ్డూలు) రోజుకు రెండు ఆహారంగా ఇస్తారు. డ్రైఫ్రూట్స్‌తో స్వీట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వేడి చేసే మసాలాలను సమపాళ్లలో కలిపి పెడతారు.మాస్టర్ ట్రైనర్లతో శిక్షణఈ కోచింగ్ సెంటర్లు గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలోనే ఉన్నాయి. పందెం కోళ్లు పెంచే వారు సొంతంగా నిర్వహించేవి కొన్ని, బయట పందేల రాయుళ్ల నుంచి వచ్చే కోళ్ల కోసం నిర్వహిస్తున్నవి మరి కొన్ని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు అనే చిన్న పల్లెటూళ్లో ఇలాంటి పందెం కోళ్ల కోచింగ్ సెంటర్ పుష్కరకాలంగా నడుస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న కోడి బరిలో దిగిందంటే సత్తా చాటాల్సిందే. అంతటి కఠోర శిక్షణ ఇస్తారు. ఇక్కడ దాదాపు 140 పందెం కోళ్లు శిక్షణలో ఉన్నాయి. సెంటర్ నిర్వాహకుడు కోటిపల్లి శ్రీను పర్యవేక్షణలో నలుగురు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి కోడికి మూడు నెలల శిక్షణ కోసం రూ.30 వేలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తారు.పందెం కొట్టాలంటే శిక్షణ తప్పదుశిక్షణ లేకుండా ఏ పందెం కోడినీ బరిలోకి దింపరు. బరిలోకి దిగేందుకు మూడు నెలల ముందే శిక్షణ మొదలవుతుంది. తినే తిండి నుంచి వాతావరణంలో మార్పులు గమనిస్తుండాలి. కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇక్కడ శిక్షణకు అయ్యే డబ్బు కోసం చూడం. ఖర్చుకు వెనుకాడకుండా పందెం కొడిని అన్ని రకాల శిక్షణతో మెరికల్లా తయారు చేస్తాం. మా సెంటర్లో దాదాపు 140 కోళ్లకు శిక్షణ ఇస్తున్నాం. – కోటిపల్లి శ్రీను, మాస్టర్ ట్రైనర్, ఉండూరు, సామర్లకోట, కాకినాడ జిల్లా -
డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..
డెంటిస్ట్‌గా సాగిన ప్రయాణం అనూహ్యంగా ఐఏఎస్ లక్ష్య సాధన వైపుకి మారింది. పట్టుదలతో ఐఏస్ సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. అంతలోనే ఇది కాదు నా గమ్యం అంటూ ఆ అత్యున్నత పదవికి రాజీనామా చేసేసింది. కేవలం టీచింగ్‌పై ఉన్న అభిరుచితో ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ విస్తుపోయారు. ఇదేంటి అని అంతా నోరెళ్లబెట్టారు..కానీ ఆమె మాత్రం మనసుకు నచ్చింది చేయడంలో కలిగే అనుభూతి వేరేలెవెల్ అంటోంది. ఇంతకీ ఎవరామె..? అంతటి అత్యున్నత హోదాను ఎందుకు తృణప్రాయంగా వదిలేసిందంటే..?ఢిల్లీలోని సదర్ ప్రాంతానికి చెందిన తనూ జైన్ సాహసమే ఊపిరి అన్నట్లుగా ఊహకందని నిర్ణయాలతో అందర్నీ విస్తుపోయేలా చేస్తుంటారామె. ఆమె ప్రతి ఆలోచన వెనుక ఎంతో పెద్ద లక్ష్యం, కృతనిశ్చయాలు ఉంటాయి. అవి ఆలోచింపచేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇక జైన్ పాఠశాల విద్యని కేంబ్రిడ్జ్ స్కూల్లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీని చదువుతూనే సివిల్స్‌పై దృష్టిసారించింది. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌లో విజయం సాధించినప్పటికీ మెయిన్స్‌లో చాలాసార్లు వైఫల్యాలను ఎదుర్కొంది. అయినా.. పట్టుదలతో 2014లో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 648ని సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత జైన్ సివిల్ సర్వీస్‌కి సంబంధించి.. వివిధ హోదాల్లో ఏడేళ్ల పాటు సేవలందించారు. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో అంతటి అత్యున్నత హోదాని వదులుకోవాలనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా తనూ తనలా యూపీఎస్సీ సన్నద్ధమయ్యేవాళ్లు ఎదుర్కొనే సవాళ్లలో.. అండగా నిలబడాలనే దృక్పథంతో ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. "సివిల్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలన్న తన కల నెరవేరిపోయింది. అలాగే తనలా ఇతరులు కూడా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది." జైన్. ఆ నేపథ్యంలోనే ఆమె 'ఐసీఎస్ తథాస్తు' అనే సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించింది. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారికి మార్గదర్శకం చేయడమే గాక ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆచరణాత్మక సలహాలతో ఆకట్టుకుంటారామె. ఆ వైవిధ్యభరితమైన బోధనాపద్ధతుల కారణంగా ఆమెకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేగాదు ఇన్‌స్టాలో ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు జైన్. మాక్ ఇంటర్వ్యూలు, ప్రిపరేషన్ స్టాటజీలను మెరుగుపరుచుకోవడంపై మంచి మంచి సలహలిస్తుంటారు జైన్. తనలా ఇతరులు కూడా సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించే వ్యక్తులు దొరకడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వివాహాల గూఢచారి...భావనా పాలివాల్) -
ఢిల్లీ కోచింగ్ సెంటర్లపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్లపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్యూవీ డ్రైవర్‌కు బెయిల్
ఢిల్లీ : ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్యూవీ డ్రైవర్ మను కతురియాకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 27న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్యూవీ డ్రైవర్ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. [Rajendra Nagar deaths] A Delhi Sessions Court grants bail to Manuj Kathuria, an SUV driver arrested by Delhi Police in connection with the case. Kathuria was denied bail by the Magistrate Court on Wednesday. #UPSCaspirants #RajendraNagar #bail pic.twitter.com/RDOmIdyIAH— Bar and Bench (@barandbench) August 1, 2024జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయడంతో వరద నీరు సెల్లార్లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను కతురియా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
నరకాలుగా నగరాలు..
ఢిల్లీ నడిబొడ్డున పేరొందిన ఒక కోచింగ్ సెంటర్లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. సివిల్ సర్వీసు పరీక్షలకు మంచి కోచింగ్ సెంటర్‌గా ఆ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. రాజధాని నగరంలో ఉన్న ఆ సెంటరు నిబంధనలకు వ్యతిరేకంగా భవనం బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహిస్తోంది. విద్యార్థులు ముగ్గురూ అందులో చిక్కుకుని మరణించిన వారే. ఎన్నో ఆశలతో, ఎంతో ధనం ఫీజుల రూపంలో వెచ్చించి ఆ సంస్థలో చేరిన విద్యార్థులు, సంస్థ నిర్వాహకుల అత్యాశ, అధికారుల అలసత్వం, అవినీతి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవితాల్ని కోల్పోయారు.బేస్‌మెంట్‌ని పార్కింగు కోసం, లేదా స్టోర్ రూమ్‌గా మాత్రమే వినియోగించాలని ఒక నిబంధన. దాన్ని లైబ్రరీగా మార్చి సొమ్ము చేసుకోవడం ఆ సంస్థ కక్కుర్తి. అలా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉన్నా, నిబంధనల్ని అతిక్రమించినా పట్టనట్టు వ్యవహరించడం, లేదా లంచాలు తిని ఉపేక్షించడం నగర పాలక సంస్థ నిర్వాకం. ఆ సెంటరులోకి వరద నీరు ఒక్క ఉదుటున చేరడానికి కారణం యథేచ్చగా అక్రమ కట్టడాల్ని అనుమతించడం. డ్రయిన్ వ్యవస్థ పూడుకున్నంత వరకూ వదిలేయడం. అయితే ఈ సమస్య ఆ ఒక్క కోచింగ్ సెంటర్‌కో, ఆ ప్రాంతానికో పరిమితం కాదు.పుట్టగొడుగుల్లా నగరమంతా వ్యాపించిన కోచింగ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, అక్రమ కట్టడాలు... ఇలా పట్టణ ప్రణాళికల్ని తుంగలో తొక్కేవి కోకొల్లలు. అలాగే ఢిల్లీ ఒక్కటే ఇలా దయనీయంగా లేదు. దేశంలో ప్రతీ పట్టణమూ ఇలా అఘోరిస్తున్నవే. రాష్ట్రాలకు పెరుగుతున్న ఒత్తిడి మేరకు కేంద్రం నిధులు, మార్గదర్శకాలు ఇవ్వాలి. పట్టణాల అభి వృద్ధిని రాష్ట్రాలు దగ్గరగా పర్యవేక్షించాలి. నగర పాలక సంస్థలు సమర్థంగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి రోజులు దగ్గరలో కనబడడం లేదు. – డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ, విజయనగరం -
కోచింగ్ కోళ్ళఫారాలు
వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్మెంట్లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట. కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం. ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్‌శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్‌పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం. నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్‌లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే! వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు. సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు. ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం. కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
-
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
ఐదే నిమిషాల్లో మునక! ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన వీడియోలు వైరల్
ఢిల్లీ: దేశరాజధానిలోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరదనీరు చేరడంతో పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతిచెందారు. ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావ్ స్టడీ సెంటర్లో ఈ ఉదంతం చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రమాదానికి ముందు.. బేస్మెంట్లోకి నీరు ఎలా వేగంగా చేరుతున్నదో చూడవచ్చు. ఆ సమయంలో లోపలున్న విద్యార్థులు వీలైనంత త్వరగా బయటకు రావాలని కోచింగ్ సెంటర్ సిబ్బంది చెప్పడం కూడా కనిపిస్తుంది. అలాగే లోపల ఎవరైనా ఉన్నారా? అని అడగడాన్ని గమనించవచ్చు. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సెల్లార్ నిండా వరద నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గురు విద్యార్థుల మృతదేహాల్ని అధికారులు వెలికి తీశారు. మరోవీడియోలో కోచింగ్ సెంటర్ బయట నడుం లోతు నీరు పేరుకుపోవడం గమనించవచ్చు. మరోవైపు సెంటర్‌కు ఎదురుగా నిల్చొని కొందరు ఆ వరద తాకిడిని వీడియోలు తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: సివిల్స్ కల జల సమాధిమరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లను సీల్ చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ బృందం పాత రాజేంద్ర నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. అదేవిధంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి తెలిపారు. 'कोई नीचे तो नहीं रहा'दिल्ली कोचिंग सेंटर हादसा | बेसमेंट से निकलते छात्रों का एक और वीडियो आया सामने #OldRajinderNagar | #DelhiRains | #UPSCStudents | #Delhi | #coachingcentre pic.twitter.com/BXIHDiXrqw— NDTV India (@ndtvindia) July 28, 2024This is the situation of our Delhi innocent #UPSC aspirants loose life Mazak bana dia h😡May God give familes strength to bear this loss🙏🏻#rajendranagar #RaoIAS #RajenderNagar #UPSCaspirants pic.twitter.com/aiDWOKugcL— CSE Aspirants (@cse_aspirantss) July 28, 2024Another video has surfaced from outside Rajendra Nagar Institute in which it can be seen how the passing of a vehicle increased the flow of water, due to which the gates broke and water entered the basement.#Delhi #CoachingCenter #Flood #HeavyRain #RaoIASCoaching… pic.twitter.com/cZUBkKbNUm— POWER CORRIDORS (@power_corridors) July 28, 2024 సంబంధిత వార్త: సెల్లార్ ప్రమాదం.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్ -
కోచింగ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయి.. శ్రేయ విషాద గాథ
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించిన నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మృతులలో ఒకరే శ్రేయ. ఉన్నత అధికారి కావాలనుకున్న కుమార్తె కలలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రేయ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితమే ఆమెను పోటీ పరీక్షల కోచింగ్ కోసం ఢిల్లీకి పంపించారు.శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్లో ఉంటారు. గత మేనెలో శ్రేయ.. రావ్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుంది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే శ్రేయపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి రాజేంద్ర యాదవ్ తన కుమార్తెను ఐఏఎస్‌గా చూడాలని తపన పడేవాడు. శ్రేయ రెండు నెలల నుంచి కోచింగ్ సెంటర్లోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో లైబ్రరీ ఉంది. శనివారం సాయంత్రం ఆ లైబ్రరీలో శ్రేయతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు.ఉన్నట్టుండి భారీ వర్షం రావడంతో బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి, అది లైబ్రరీని ముంచెత్తింది. దీంతో లైబ్రరీ వరద నీటితో నిండిపోయింది. ఫలితంగా విద్యార్థులంతా లైబ్రరీలో చిక్కుకుపోయారు. బయట నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శ్రేయ కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. శ్రేయ ఇద్దరు తమ్ముళ్లు తమ అక్కను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. కుమార్తెను ఐఏఎస్‌గా చూడాలనుకున్న శ్రేయ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. -
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్‌టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్‌కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్‌టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్ సెంటర్లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. చదవండి: Gujarat: పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి ►శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు. ►విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్ గురించిన సమాచారం వెబ్సైట్లో పొందుపరచాలి. ►కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి. ► అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ► ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది. ► ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలి. ► కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ►న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి. -
కోచింగ్ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి
భోపాల్: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్ హార్ట్ ఎటాక్ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. చదవండి: Tammineni: వెంటిలేటర్‌పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్‌లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్‌పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్‌కు తెలియజేశాడు. ఆలోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్‌కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. Tragic news from #Indore MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC — Nabila Jamal (@nabilajamal_) January 18, 2024 -
టీచర్‌పై కాల్పులు.. సోషల్ మీడియాలో పోస్టింగ్
ఆగ్రా(యూపీ): కోచింగ్ సెంటర్ టీచర్‌పై అకారణంగా కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. మరోసారి మరిన్ని బుల్లెట్లు దించుతామని సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఆగ్రాలోని ఖండోలిలో చోటుచేసుకుంది. సుమిత్ సింగ్ గతంలో ఓ కోచింగ్ సెంటర్లో పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న 16, 18 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఓ బాలికతో మాట్లాడుతుండగా సుమిత్ సోదరుడు తరుణ్ అడ్డుకున్నారు. దీనిపై వారు కోపం పెంచుకుని గురువారం సుమిత్‌కు ఫోన్ చేసి, కోచింగ్ సెంటర్‌కు రావాలని కోరారు. రాగానే తెచ్చుకున్న తుపాకీతో సుమిత్ కాలిపై కాల్చారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలోని నటుల్లా పోజులు పెట్టి, ప్రస్తుతానికి ఒక్క బుల్లెట్టే కాల్చామని, ఆరు నెల్ల తర్వాత మిగతా 39 బుల్లెట్లనూ సుమిత్ శరీరంలోకి దించుతామంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
Kota: మరో ఇద్దరు.. ఈ ఏడాదిలోనే 24 మంది!
రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు ఎంతటి చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరిక్షకు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. పరీక్ష రాసిన వెంటనే.. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అవిశంకర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గత మూడేళ్లుగా తల్వాన్డీ ప్రాంతంలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి అద్దె గదిలో ఉంటూ నీట్ యూజీకి సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోచింగ్ సెంటర్లో పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల్లోనే మరో విద్యార్థి.. వెంటనే ఇనిస్టిట్యూట్ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బిహార్‌కు చెందిన ఆదర్శ్ రాజ్ తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఇతను కూడా పరీక్ష రాయగా.. అనంతరం రూమ్‌కు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్ తన బంధువులతో కలిసి ఉంటుండగా.. అతను కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇద్దరి వద్ద కూడా ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. రెండు నెలలు బంద్ వరుస విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ కోచింగ్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా గదుల్లోని ఫ్యాన్లకు యాంటీ సుసైడ్ డివైజ్‌లను ఇన్స్టాల్ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒకరోజు ఎలాంటి పరీక్షలు, తరగతులు నిర్వహించకుండా హాలీడే ఇవ్వాలని ఆదేశించారు. 24కు చేరిన సంఖ్య పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 24కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది మరణించారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చి దాదాపు మూడు లక్షల మంది వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. హాస్టల్ భనాలకు వలలు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్లను స్ప్రింగ్‌లకు బిగించారు. తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
కోటా: రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లోని గయకు చెందిన 18 ఏళ్ల వయసున్న వాలీ్మకి ప్రసాద్ మంగళవారం రాత్రి అద్దెకి ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. వాలీ్మకి పక్క గదిలోనే ఉంటున్న విద్యార్థులు రాత్రి అతని తలుపు కొడితే తియ్యకపోయే సరికి అనుమానం వచ్చి ఇంటి యజమానికి చెప్పారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను శవమై కనిపించాడు. వెంటనే వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాలీ్మకి రెండేళ్లుగా కోటాలోనే ఉంటున్నాడు. కోటాలో విద్యార్థి ఆత్మహత్యల్లో ఈ నెలలో ఇది నాలుగోది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ప్రతీ విద్యారి్థకి సైక్రియాటిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇప్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్ కోటాలో ఏం జరుగుతోంది?
రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? కోటాలో ఏ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఫైవ్ స్టార్ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యనున్న వారే. మనీష్ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిçÜ్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్స్. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ► కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న సమర్ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది. ► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ? విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్ చెప్పారు. రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్ పాఠక్ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. వారంలో మూడో కేసు
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. మానసిక ఒత్తిడి, చదవు భయంతో బంగారు భవిష్యత్తును చేజేతులారా చిదిమేస్తున్నారు. వారానికి ఒక ఆత్మహత్య కేసు నమోదవ్వడం కలవరపెడుతున్నాయి. తాజాగా కోటాలో గురువారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచాడు. కోటాలో గడిచిన వారం రోజుల వ్యవధిలో విద్యార్ధి ఆత్మహత్య నమోదవ్వడం ఇది మూడోది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌కు చెందిన 17 ఏళ్ల మనీష్ ప్రజాపత్ ఆరు నెలల కిత్రం కోటాకు వచ్చాడు. ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏమైందో ఏమో కానీ గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. కాగా కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 21కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే చదువులో ఒత్తిడి వల్ల అక్కడ విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
టీఎస్పీఎస్సీ ముట్టడి.. గ్రూప్-2 అభ్యర్థుల ధర్నాలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద చేస్తున్న గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల ధర్నాలో కొత్త ట్విస్ట్ నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులను రెచ్చగొట్టారని ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. పరీక్షకు సమయం లేకపోవడంతో కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళనలో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న ఇద్దరూ కోచింగ్ సెంటర్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్, అశోక్ అనే ఇద్దరు కోచింగ్ నిర్వాహకులు తమ దగ్గర కోచింగ్ తీసుకునే విద్యార్థులను రోడ్డుమీదికి తీసుకొచ్చి ధర్నా చేయించినట్లు తేలింది. చదవండి: టీఎస్పీఎస్సీ ముందు కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత.. -
కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ప్రాణాల కోసం విద్యార్థుల పోరాటం!
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్లో గురువారం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో కోచింగ్ సెంటర్లో ఉన్న విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కిటికీల నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఉన్న భవనం పైఅంతుస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రాణాలతో బయటపడేందుకు కోచింగ్ సెంటర్ బిల్డింగ్ కిటికీల నుంచి విద్యార్ధులు తాడు సాయంతో కిందికి దూకారు. ఇక,ఈ ప్రమాదం ఘటనలో నలుగురు విద్యార్ధులు గాయపడ్డారు. అయితే, అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా ప్రాంతానికి 11 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్ధులను బయటకు రప్పించామని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్లడించారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. #WATCH | People escape using wires as fire breaks out in a building located in Delhi's Mukherjee Nagar; 11 fire tenders rushed to the site, rescue operation underway (Source: Delhi Fire Department) pic.twitter.com/1AYVRojvxI — ANI (@ANI) June 15, 2023 ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత.. 400 కార్ల కాన్వాయ్‌తో భారీ ర్యాలీ.. వీడియో వైరల్ -
రాజస్తాన్ గ్యాంగ్‌స్టర్ హత్య.. వెలుగులోకి మరో దారుణం
రాజస్తాన్ గ్యాంగ్ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఐతే ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ రాజు తోపాటు మృతి చెందిన మరో వ్యక్తి తారాచంద్ కద్వాసర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తన కుమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో అతని బంధవు కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ థెట్ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ రాజుతేత్‌కు రాష్ట్రంలో షెఖావతి ప్రాంతంలో మరో మఠాతో వైరం ఉంది. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడు థెట్‌పై కాల్పులు జరిపి.. బాటసారులను, సాక్ష్యులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరుపుకుంటూ వెళ్లిపోతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా హత్య జరిగిన వెంటనే... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకున్న రోహిత్ గోదారా అనే వ్యక్తి ఫేస్బుక్లో ఈ హత్యకు తానే బాధ్యుడునంటు ప్రకటించుకున్నాడు. అంతేగాక ఆనంద్‌పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ రాజుని హతమార్చినట్లు తెలిపాడు. (చదవండి: వీడియో: గ్యాంగ్‌వార్.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్ రాజు దారుణ హత్య) -
టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి
దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో మాత్రం చాలాదూరం వెళ్లాడు ఇక్కడో టీచర్. అతను పెట్టిన హింసతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ విద్యార్థి. ఐదేళ్ల పిలగాడిని ఓ టీచర్ దారుణాతిదారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఓ కర్రతో పిల్లాడిని బాదిన టీచర్.. అది విరిగిపోయినా ఊరుకోకుండా రెచ్చిపోయాడు. చెంపదెబ్బలు కొడుతూ.. జుట్టు లాగేస్తూ పిడిగుద్దులతో స్టూడెంట్‌పై విరుచుకుపడ్డాడు. తనని వదలమని ఆ పిలగాడు రోదిస్తూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. కిందపడిపోయిన ఆ స్టూడెంట్ను.. కనికరం లేకుండా హింసించాడు ఆ టీచర్. ఇదంతా మిగతా పిల్లలు భయంభయంగానే చూస్తూ ఉండిపోయారు. స్పృహ తప్పిపోయిన ఆ పిల్లాడిని.. ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన స్థానికులు కోచింగ్ సెంటర్‌పై పడి టీచర్ చోటూను చితకబాదేశారు. చిన్నతప్పిదానికే అలా హింసించాడని తోటి స్టూడెంట్స్ చెప్తుండగా.. బీపీ వల్లే ఆ టీచర్ అలా దాడి చేశాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సమర్థించడం కొసమెరుపు. బీహార్ రాజధాని పాట్నాలోని Dhanarua బ్లాక్‌లో.. జయ కోటించ్ క్లాసెస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సహనంగా పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో అతనికి అర్హత లేదంటూ మండిపడుతున్నారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టీచర్‌పై చర్యలు తీసుకునేంత వరకు పిల్లల్ని కోచింగ్ సెంటర్‌కు పంపమని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'शिक्षक' नहीं… ये 'हानिकारक' है! वीडियो देखकर सहम उठेंगे. ये पिटाई नहीं...ऐसा लग रहा है कि ये जान लेने के लिए उतारू है.शख्स धनरूआ में एक कोचिंग चलाता है. आरोप है कि बच्चे ने एक लड़की के साथ गलत हरकत की थी.पुलिस कोचिंग संचालक की तलाश कर रही है. वीडियो- जहानाबाद से रंजीत राजन. pic.twitter.com/KPBLMYxEau — Prakash Kumar (@kumarprakash4u) July 3, 2022 -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్‌లోని జాముయ్‌లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్
సాక్షి, మేడిపల్లి(హైదరాబాద్): తల్లిదండ్రులను సంతోషపెట్టేలా యువత తమ భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పీర్జాదిగూడ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల పాటు సినిమాలు, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, క్రికెట్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. సెంటర్లో ప్రొజెక్టర్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని అభినందించారు. 20 సంవత్సరాలు అనుభవిజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ సెంటర్లో 3 నుంచి 4 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత మెటీరియల్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీ తత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తుందని భరోసానిచ్చారు. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! Live: Speaking after inaugurating a Govt Coaching Center in Peerzadiguda Municipal Corporation https://t.co/dXWgZpeKZT — KTR (@KTRTRS) March 14, 2022 టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 13 వేల పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 6వేల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ హరీష్, జిల్లాపరిషత్ చైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
కుప్పకూలిన కోచింగ్ సెంటర్; ఐదుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భవనం కుప్పకూలిన మరో ఘటన విషాదాన్ని నింపింది. భజన్‌పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం కూలిపోయింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. వీరిలో నలుగురు విద్యార్థులుకాగా, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గాయపడిన మరో 13మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తుండటంతో పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. మూడు అంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని, సాయంత్రం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా కూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని రక్షించినట్లు డిఎఫ్ఎస్ అధికారి తెలిపారు. సుమారు 15 మంది శిధిలాలలో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై వచ్చిన ట్వీట్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానీ, మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి వెళ్లబోతున్నానని ట్వీట్ చేశారు. दिल्ली के भजनपुरा इलाके में कोचिंग सेंटर की छत गिर गई है, 11 छात्रों को अस्पताल ले जाया गया है|अभी रेस्क्यू ऑपरेशन जारी है, कई के फंसे होने की आशंका है| pic.twitter.com/tXA006oLjx — Anurag Dhanda (@anuragdhanda) January 25, 2020 -
కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీ శాఖ రూ. 30 కోట్లు స్వాధీనం చేసుకుంది. నీట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు ఈ ఇన్స్టిట్యూట్ శిక్షణ ఇస్తోందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. నమక్కల్ కేంద్రంగా ఉన్న ఈ గ్రూపుకి సంబంధించిన 17 ప్రాంగణాలలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపామని, ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆ గ్రూప్ ఆదాయం రూ. 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిపింది. ఈ బృందం ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం విద్యాసంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లను నడుపుతోంది. ఈ ట్రస్ట్ నియంత్రణలో అనేక భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు ఉన్నారని తెలిపింది. సీబీడీటీ ఆదాయపన్ను శాఖ కోసం వివిధ విధానాలను రూపొందిస్తుంది. శుక్రవారం నమక్కల్, పెరుండురై, కరూర్, చెన్నైలోని గ్రూప్ ప్రమోటర్ల ఇళ్లు, ప్రాంగణాలపై దాడులు జరిగాయి. ఫీజు రశీదులను విడివిడిగా రూపొందించడం ద్వారా సంస్థ గణనీయంగా పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ఐటీ దాడులు చేశామని సీబీడీటీ వెల్లడించింది. ఫీజులో కొంత భాగాన్ని నగదు రూపంలో స్వీకరించడం, రశీదులను సైతం సాధారణ ఖాతాల పుస్తకాలలో నమోదు చేయకపోవడం లాంటి పనులకు సంస్థ పాల్పడిందని వెల్లడించింది. సోదాల సమయంలో డైరీలు, ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పరికరాల్లో లెక్కలేనన్ని ఫీజు రశీదులను గుర్తించినట్లు తెలిపింది. బినామీ ఉద్యోగుల పేర్లతో లాకర్లు తెరిచారని, ప్రధాన బ్రాంచ్‌లోని లాకర్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని బోర్డు తెలిపింది. ఉద్యోగులకు ఆదాయపన్నుకు అందకుండా నగదు రూపంలో జీతాలు చెల్లిస్తున్నారని తెలిపింది. -
ఈ నెల 5 నుంచి కొత్త కాంట్రాక్ట్‌లు
ముంబై: కొత్తగా ఎంపికైన భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్‌లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తాయని బీసీసీఐ వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు సిద్ధమయ్యాయని, గురువారంలోగా లాంఛనం పూర్తవుతుందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కాగా... బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల ఎంపిక జాబితాను సెలక్షన్ కమిటీ బోర్డు ముందుంచింది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్ కొనసాగనుండగా... విక్రమ్ రాథోడ్ కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ కోసం మాత్రం ప్రస్తుతం ఎన్సీఏలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. -
మెరుపు దాడి
చిక్కడపల్లి: నగరవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా అమీర్‌పేట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్పల్లి ప్రాంతాల్లోని పలు కోచింగ్ సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలు పాటించని, నిబంధనలకు విరుద్ధం గా కొనసాగుతున్న పలు సెంటర్లను సీజ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కోచింగ్ కేంద్రాలపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీకాంత్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. బహుళ అంతస్తులు, అగ్గి పెట్టెల్లాంటి గదుల్లో పుట్టగొడుగులను తలపించే ఈ కేంద్రాలపై దృష్టి సారించిన అధికారులు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిచని పలు కేంద్రాలకు గతంలో నోటీసులు జారీ చేశారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడం వాటిని సీజ్ చేశారు. మే 24న సూరత్‌లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అశోక్‌నగర్‌లోని డాక్టర్ పీవీ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, హెచ్‌కె.రాయిడు ఐఏఎస్ స్టడీ సర్కిల్, కెరీర్ ఐఏఎస్ అకాడమి, శైన్ ఇండియా ఐఏఎస్ అకాడమి, డాక్టర్ జగదీష్ అకాడమి, కేరీర్ అకాడమి, విజ్డమ్, త్రివేణి అకాడమి కోచింగ్ సెంటర్లతో సహా 32 కేంద్రాలను సీజ్ చేసిన్నట్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. గతంలో ఫైర్‌సేఫ్టీ, ఎన్వోసీ తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని కోచింగ్ కేంద్రాలను మూసి వేస్తామని హెచ్చరించారు. కాగా తమ కోచింగ్ సెంటర్లకు నోటీసులు ఇవ్వలేదని, ఇచ్చినా సమ యం ఇవ్వకపోవడం దారుణమని ఇలా ఉన్న ఫలంగా సీజ్ చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కొంత సమయం ఇవ్వాలని కోచింగ్ సెంటర్ల యాజమానులు, ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో... భాగ్యనగర్‌కాలనీ: కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్ సేఫ్టీ పాటించని కోచింగ్ సెంటర్లపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పలు సెంటర్లను సీజ్ చేశారు. గతంలోనే అనేక సెంటర్లకు నోటీసులు ఇచ్చినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటు ఫైర్ నిబంధనలు ఇతర భద్రత చర్యలు పాటించని కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గోవర్దన్ రెడ్డి తెలిపారు. సర్కిల్ పరిధిలో 146 కోచింగ్ సెంటర్లు కొనసాగుతుండగా, 46 సెంటర్లకు నోటీసులు అందజేశామని, ఇప్పటివరకు 36 సెంటర్లను సీజ్ చేశామన్నారు. మరో 10 సెంటర్లను కూడా సీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ అనిల్ పాల్గొన్నారు. -
‘సూరత్’ రియల్ హీరో
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 22కు చేరుకున్న మృతులు తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్ ఏసీపీ పీఎల్ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్ సెంటర్లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. భవన యజమాని అరెస్ట్.. పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్ బుటానిని అరెస్ట్ చేశామని ఏసీపీ పీఎల్ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్ వెకరియా, జిగ్నేశ్ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ 69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్ విద్యార్థినులు -
కోచింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం
సాక్షి, సంగెం(పరకాల): కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన సంగెం మండలం లో చోటుచేసుకుం ది. ఎస్సై ఎస్.దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్గూర్‌స్టేషన్ గ్రామపంచాయతీ శివారు రాజ్యానాయక్ తండాకు చెందిన మూడు అనిత(17) రెండు నెలలుగా వరంగల్ నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం 3 గంటల వరకు ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి శిక్షణకు వెళ్తున్నట్లు చెప్పి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లింది. తిరిగి సమయానికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. దీంతో అనిత తండ్రి మూడు వీరన్న శనివారం సంగెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదులో నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన పూర్ణచందర్, రాజ్యానాయక్ భుక్యా శివ, భుక్యా వెంకటేష్, మూడు బాలకృష్ణ, మూడు ప్రశాంత్, గుగులోత్ బాలులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనిత ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఎరుపు రంగు పంజాబి డ్రస్సు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉందన్నారు. ఆచూకీ లభిస్తే సంగెం పీఎస్ 9440700530, 9440904629 నంబర్లలకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
కోచింగ్ సెంటర్లపై 18% జీఎస్టీ: ఏఏఆర్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ కేంద్రాలు 18 శాతం జీఎస్టీ చెల్లించాలని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్(ఏఏఆర్) స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాల సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా అన్న అంశంపై అడ్వాన్స్ రూలింగ్ కోరుతూ మహారాష్ట్ర ఏఏఆర్ బెంచ్ ముందు దాఖలైన దరఖాస్తుకు పైవిధంగా బదులిచ్చింది. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ‘సింపుల్ శుక్లా ట్యుటోరియల్స్’ జీఎస్టీ నిర్వచనం పరిధిలో లేని సంగతిని బెంచ్ గుర్తించింది. ‘ఆ సంస్థకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక లేదు. పరీక్షలు నిర్వహించదు. డిగ్రీలు ప్రదానం చేయదు. ఈ కేసులో 9 శాతం కేంద్ర జీఎస్టీ, 9 శాతం రాష్ట్ర జీఎస్టీ వసూలు చేయాల్సిందే’ అని తెలిపింది. పన్ను సంబంధ కేసులు, వివాదాలను పరిష్కరించడానికి ఏఏఆర్‌లు పనిచేస్తున్నాయి. -
నాడు లెక్కల టీచర్.. నేడు బిలియనీర్
ఈ రోజుల్లో చదువు ఎంతటి లాభదాయక వ్యాపారమో అందరికీ తెలిసిన విషయమే. కోచింగ్‌ల పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బు వసూలు చేసి ధనవంతులైన వారిని నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ కోచింగ్ సెంటర్లో ట్యూషన్లు చెప్తూ కోటీశ్వరుడు అవ్వడమే కాక సంపన్నుల జాబితాలో చేరిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే చైనాకు చెందిన లియు యాచావో. చైనాలో ప్రసిద్ధి చెందిన ‘టాల్’ కోచింగ్ సెంటర్‌కు ముఖ్య అధికారి యాచావో. ఈ కోచింగ్ సెంటర్లో ఒకటి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ట్యూషన్లు చెప్తారు. లియు 2003లో పెకింగ్ యూనివర్సిటీలో మెకానిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2008లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానిక్స్ ఆఫ్ ద చైనీస్ అకాడమీ నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. అనంతరం ఈ కోచింగ్ సెంటర్లో లెక్కల టీచర్ గా చేరాడు. తర్వాత వైస్ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా ఎదుగుతూ ప్రస్తుతం ముఖ్య అధికారి స్థాయికి వచ్చాడు. తనను బిలియనీర్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు లియు. చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఏడాదికి 42,892 డాలర్లను ఖర్చు చేస్తారు. వారిలో 90శాతం కంటే ఎక్కువ మంది ప్రైవేట్ ట్యూషన్ల కోసమే ఖర్చు చేస్తున్నారు. చైనాలో ఈ కోచింగ్ సెంటర్ల మార్కెట్ ఏ విధంగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రసుతం ఈ మార్కెట్ విలువ 21.1 బిలియన్ డాలర్లు. టాల్ కోచింగ్ సెంటర్, దాని అనుబంధ సంస్థల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకూ పిల్లలకు గణితంతో పాటు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, చరిత్ర, భూగోళశాస్త్రం, రాజకీయం సబ్జెక్టులు.. ఇంగ్లీష్, చైనీస్ భాషలు నేర్పిస్తారు. -
అనంతపురం జిల్లాలో టీచకుడికి దేహశుద్ధి
-
సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు
గుంటూరు : నమ్మి మోసపోయాం...మోసగాళ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్బన్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీ విజయారావును వేడుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని అర్బన్‌ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే..... బోర్డు తిప్పేసిన కోచింగ్ సెంటర్ బ్రాడీపేట 4వలైనులో 9నెలల క్రితం ఓ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు ఉదయభానుకు కోచింగ్ నిమిత్తం రూ.20 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాం. నా మాదిరిగానే మరో 19 మంది విద్యార్థులు డబ్బు చెల్లించారు. రాత్రికి రాత్రి బోర్డు తిప్పి పరారయ్యాడు. ఫోన్ చేస్తే సమాధానం లేదు. విచారించి న్యాయం చేయాలి. – తల్లిదండ్రులతో విష్ణుప్రియ, అరండల్‌పేట, గుంటూరు సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు నరసరావుపేటకు చెందిన కాళంగి నాగేశ్వరరావుకు మారుతీ కారును కంటిన్యూ ఫైనాన్స్ పద్ధతిపై ఫైనాన్స్ చెల్లించేలా మాట్లాడుకొని కారును తొమ్మిది నెలల క్రితం విక్రయించాం. ఫైనాన్స్ చెల్లించపోగా, ఫోర్జరీ సంతకాలతో మా ప్రమేయం లేకుండానే కారును అమ్మినట్టు తెలిసింది. గట్టిగా నిలదీస్తే మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫైనాన్స్ వారు డబ్బు చెల్లించాలంటూ మాపై వత్తిడి చేస్తున్నారు. విచారించి నారాయణపై చర్యలు తీసుకోండి. – మేడిపల్లి వెంకటేష్, సునీత దంపతులు, చుట్టుగుంట, గుంటూరు -
ఆ కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది?
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సెంటర్‌పై అనుమానాలు సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీ ఆరోపణల వ్యవహారంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి, పరీక్షకు ఒకరోజు ముందు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను హైదరాబాద్‌కు రప్పించుకుని పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఈ కోచింగ్ సెంటర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న ఆయా విద్యార్థులకు ఎంసెట్-2 ఫలితాల్లో వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయని అదే కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు. నిర్వాహకులు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో తనకు వేల ల్లో ర్యాంకు వచ్చిందని, డబ్బులు చెల్లించడంతో చదువులో తనకంటే బాగా వెనకబడిన విద్యార్థులకు వెయ్యి లోపు ర్యాంకు వచ్చిందని సదరు విద్యార్థి చెబుతోంది. మెడికల్ సీటు కావాలంటే దిల్‌సుఖ్‌నగర్‌లోని ఈ కోచింగ్ కేంద్రంలో సంప్రదించాలంటూ కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఫోన్ కూడా వెళ్లాయి. దీంతో వారి ఫోన్ నెంబర్లు, కాల్ డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మధ్యవర్తులు ఏం మాట్లాడారన్న కోణంలో పరిశీలిస్తున్నారు. మధ్యవర్తులు నిజంగా పేపర్లోని ప్రశ్నలను బయటకు తేగలిగారా? లేదా డమ్మీ పేపర్‌ను రూపొందించి అదే అసలుగా నమ్మించి డబ్బు దండుకున్నారా? అన్న అంశాలను కూడా ఆరా తీస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ ఆస్కారమెంత? ఎంసెట్-2 ప్రశ్నపత్రాల ముద్రణ విజయవాడలో జరిగిందా? లేదా? అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. అయితే ప్రాథమికంగా తేల్చిన దాని ప్రకారం విజయవాడలో పేపర్ ముద్ర ణ జరగలేదని తెలుస్తోంది. పైగా ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నలు మాత్రమే ముద్రిస్తారని, అవి ఏ పరీక్షకు సంబంధించినవో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. ఒక్క ముద్రణ సంస్థ యజమానికి మాత్రం కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు. ఒకవేళ ముద్రణ సంస్థ నుంచి ప్రశ్నలు లీక్ అయితే అది యజమానికి తెలియకుండా జరిగిందా అన్న కోణంలో అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. 15 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ముద్రణ సంస్థ నుంచి ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. అది ముద్రణ సంస్థ యజమాని నిర్లక్ష్యం కారణంగా.. అందులో పని చేసే వ్యక్తి నుంచి మధ్యవర్తులు పేపర్ కాపీని పొందినట్టు పోలీసు విచారణలో తేలింది. అయితే ప్రసు ్తతం ఆ పరిస్థితి లేదని ఎంసెట్ అధికారులు భావిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటన్నది సీఐడీ విచారణలో వెలుగులోకి రానుంది. 25లోగా ప్రాథమిక విచారణ! ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. సీఐడీ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు గురువారం రంగంలోకి దిగాయి. ఈ నెల 25న ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉన్నందున ఆలోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని సీఐడీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఆరోపణలు చేస్తున్న వారిని విచారించాలని నిర్ణయించింది. ఒక బృందం వరంగల్ చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టింది. ఎంసెట్-1లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను బేరీజు వేస్తోంది. వరంగల్ జిల్లాలో ముగ్గురు అమ్మాయిలు ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించారు. సీఐడీ అధికారులు వారి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. అలాగే విజయవాడలో ఆ విద్యార్థులు కోచింగ్ తీసుకున్న కేంద్రానికి మరో బృందం బయల్దేరింది. అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించడంతోపాటు వారు నిర్వహించిన మాక్ టెస్టు పేపర్లను సీఐడీ స్వాధీనం చేసుకుంది. రూ.70 లక్షలు, కోటి ఇస్తే మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ కొందరు తల్లిదండ్రులకు కాల్స్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఐడీ.. వారి సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించే పనిలో నిమగ్నమైంది. ర్యాంకులు సాధించిన వారి తల్లిదండ్రుల కాల్‌డేటాతో పాటు మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ఫోన్‌కాల్స్‌ను విశ్లేషిస్తోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిపై సీఐడీతోపాటు నిఘా ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి, ఎంసెట్-2 నిర్వహణకు ముందు వీరు ఎక్కడ ఉన్నారు, వారి ఆర్థిక వ్యవహారాలపై సమాచారం సేకరిస్తున్నారు. సీఐడీకి మరిన్ని వివరాలు ఎంసెట్-2 పరీక్షకు సంబంధించిన ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు సీఐడీ అధికారులకు గురువారం మరిన్ని వివరాలు అందజేసినట్లు తెలిసింది. విద్యార్థుల వారీగా మార్కులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.వాటితోపాటు ఎంసెట్-1లో ఎక్కు వ మార్కులు వచ్చి ఎంసెట్-2లో తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలను, ఎంసెట్-1లో తక్కువ మార్కులు వచ్చి, ఎంసెట్-2లో ఎక్కువ మార్కులు వచ్చిన వివరాలను కూడా అందజేసినట్లు తెలిసింది. -
పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు
ఫంక్షన్ హాళ్లలో నిర్వహణ అనుమతుల్లేకుండా ఏర్పాటు కనీస సౌకర్యాలు కరువు ధనార్జనే ధ్యేయం సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి కోచింగ్ కోసం వేలల్లో ఫీజులు గుంజుతూ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. త్వరలోనే డీఎస్సీ, టెట్, పోలీసుశాఖలోని కానిస్టేబుల్, ఎక్సైజ్, ఫైర్, రె వెన్యూ. హౌసింగ్ తదితర శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేస్తుందనే సంకేతాలు రావడంతో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చివరకు తమ కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే అభ్యర్థులకు శిక్షణా తరగతులు మరో చోట నిర్వహిస్తున్నారు. దీనికి ఉదాహరణ అన్నట్టుగా బుధవారం పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్ యజమానులు తమ తరగతులను వీరభద్రనగర్ కాలనీలోని కేమింట్రీ భవనంలో నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు నిర్వహించాలంటే ముందుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని గత ఏడాది విద్యాశాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పని సరిగా విద్యాశాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలనే నిబంధనలు విధించారు. కానీ సంగారెడ్డిలో ఉన్న ఏ ఒక్క కోచింగ్ సెంటర్ యజమానీ తమ సంస్థ పేరునే రిజిష్టర్ చేసుకోలేదు. అయినా అధికారులు అటు వైపు చూడడం లేదు. కనీస సౌకర్యాలు కరువు కనీస సౌకర్యాలు లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో వాటిలో చేరిన యువకులు వారి అవసరాలు తీర్చుకునేందుకు బస్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలకు ఉన్నతస్థాయి శిక్షణ ఇస్తామంటూ నెలకు వేల కొద్ది ఫీజులు లాగుతున్నారు. ఇరుకు, చీకటి గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా మహిళా అభ్యర్థులకు శిక్షణ కేంద్రం వద్ద కనీసం భద్రతను సైతం ఏర్పాటు చేయడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక ప్రధాన సంస్థకు చెందిన కోచింగ్ సెంటర్ దగ్గరకు ప్రతి రోజూ కొందరు తమను వేధించేందుకే వస్తున్నారని ఓ మహిళా అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేసింది. లక్షలు దండుకుంటున్న వైనం.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తలు రావడంతో కోచింగ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకపోయినా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్లో 200 మందికి పైగా అభ్యర్థులు టెట్‌లో శిక్షణ పొందేందుకు చేరారు. ఒక్కొకరికి రూ. 6వేల చొప్పున రూ.12 లక్షలను ఫీజుల రూపంలో తీసుకున్న ఆ కోచింగ్ సెంటర్ అభ్యర్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. అంతే కాకుండా సెంటర్ల వద్ద శిక్షణ ఇవ్వకుండా ఫంక్షన్హాల్లో ఇవ్వడం వల్ల మహిళ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్యాకల్టీలకే శిక్షణ... కాగా ఫంక్షన్ హాల్లో ఓ సెంటర్ కోచింగ్ ఇస్తున్న విషయమై ప్రశ్నించగా తాము అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదని, ఫ్యాకల్టీలకు ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియజేయడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు తెలిపారు. -
రెండు వారాల్లో చోరీలు గ్యారంటీ!
‘రెండు వారాల్లో ఇంగ్లిష్ గ్యారంటీ’ అంటూ ఢిల్లీలోని ఆ కోచింగ్ సెంటర్ కూడా ప్రకటనలు ఇస్తుంది. కానీ అందులో చేరేవారు రాంగ్ రూట్లోకి మళ్లినట్లే! అక్కడ ఇంగ్లిష్ మాత్రమే కాదు.. చోరీలూ నేర్పిస్తారు! ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రాజీవ్ సహానీయే ఆ కోచింగ్ సెంటర్ యజమాని. వివరాల్లోకెళితే.. యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన రాజీవ్ నిరుద్యోగి. ఇంగ్లిష్ కోచింగ్ ముసుగులో.. ఏటీఎం చోరీలకు పెద్ద ప్లాన్ వేశాడు. చురుకైన విద్యార్థులను ఎంచుకుని వారిని ప్రలోభపెట్టి చోరీలవైపు మళ్లించడం మొదలుపెట్టాడు. తొలుత థియరీ క్లాస్‌లు బోధించి, తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి మరీ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేవాడు. మహిళలు, వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ మైక్రోచిప్‌ను లేదా పిన్నును కీప్యాడ్లోపలికి చొప్పిస్తే స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. దీంతో యంత్రం పనిచేయడం లేదు. వేరే చోటికి వెళ్లండని చెప్పి.. వారు వెళ్లిపోగానే మైక్రోచిప్‌ను తీసేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇదీ ప్లాన్. ఈ పద్ధతిలోనే చోరీలు చే యిస్తూ.. టీమ్ సభ్యులకు కొన్నాళ్లు నెలజీతం ఇచ్చాడు. చోరీలు పెరగడంతో వారికి వాటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేకుండా రోడ్లపై తిరిగిన రాజీవ్ కొద్దిరోజులకే హోండా సిటీ కారులో తిరిగేంతగా ఎదిగాడు. ఇంటికి వేలకు వేలు పంపేవాడు. కానీ.. ఎక్కడైతే ప్లాన్ వేసుకున్నాడో.. ఇప్పుడు అక్కడికే చేరాడు. 2011లో దొంగతనం కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీ ద్వారా ఏటీఎం చోరీల గురించి తెలుసుకున్నాడు. తాజాగా ఎంత పక్కాగా పనికానిచ్చినా.. పోలీసులకు దొరికిపోవడంతో మరోసారి కటకటాల వెనక్కి చేరాడు. -
కోచింగ్ సెంటర్ల బంద్ ఉద్రిక్తం
హైదరాబాద్‌సిటీ (ముషీరాబాద్) : గ్రూప్ 1, 2లతో పాటు పలు పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్‌లలో రౌడీషీటర్లు, బౌన్సలర్లను పెట్టి కోచింగ్‌లను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) శుక్రవారం ఇచ్చిన కోచింగ్ సెంటర్ల బంద్ ఉధ్రిక్తతలకు దారి తీసింది. పీడీఎస్‌యూ నేపథ్యంలో ముందస్తుగా అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రామయ్య, షైన్, నాగార్జున, ఐఏఎస్ స్టడీ సర్కిల్, హెచ్ఐపీ, ఎమిలీ తదితర కోచింగ్ సెంటర్లు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. కానీ పోలీసుల బందోబస్త్‌తో భోలక్‌పూర్‌లోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో జయశంకర్ కోచింగ్ సెంటర్, అశోక్‌నగర్‌లోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లు యథావిథిగా నడిపిస్తుండటంతో దాదాపు వంద మంది పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆ కోచింగ్ సెంటర్లను బంద్ చేయించడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యక్తులు, పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలతో వాగ్వావాదానికి దిగడంతో కొద్ది సేపు ఉధ్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని జయశంకర్ కోచింగ్ సెంటర్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన పీడీఎస్‌యూ కార్యకర్తలను ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్, ఎసై్స సంపత్‌ల ఆధ్వర్యంలో బలవంతంగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అలాగే అశోక్‌నగర్‌లోని ఆర్సీరెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద కూడా రాజు నేపథ్యంలో పలువురు పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలను అడ్డుకొని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో పీడీఎస్‌యూ అధ్యక్షులు పరశురాం, ప్రధాన కార్యదర్శి ఎ.డి. రాము, నాయకులు రియాజ్, గణేష్, రంజిత్, నాగరాజు, తిరుమల్, హరికృష్ణలతో పాటు పలువురు ఉన్నారు. -
శిక్షణ ‘క్యూ’
లక్ష ఉద్యోగాలు వస్తాయని సంతోషం కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న అభ్యర్థులు కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలపై కోటి ఆశలు ఫంక్షన్ హాళ్లకు మారిన తరగతి గదులు సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నిరుద్యోగ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నగరానికి తరలిస్తున్నారు. దీంతో గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో పంక్షన్ హాళ్లు తరగతి గదులుగా మారాయి. ఒక్కొక్క సెంటర్లో వేలాది మంది శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు తరగతి గదులను పంక్షన్ హాళ్లలోకి మార్చారు. ఈ ప్రాంతాల్లోని అన్ని ఫంక్షన్ హాళ్లు మరో 6 నెలల వరకు కోచింగ్ సెంటర్ల కోసమే బుక్ అయ్యాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు సైతం కోచింగ్ కేంద్రాలకు వేదికలవుతున్నాయి. కళలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేంద్రమైన త్యాగరాయ గానసభ సైతం కోచింగ్ సెంటర్‌గా మారింది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఓ విద్యా సంస్థ 6 నెలల పాటు బుక్ చేసుకుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ చుట్టూ ఉన్న ఫంక్షన్ హాళ్లు కోచింగ్‌లకు వచ్చే అభ్యర్ధులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క తరగతిలో 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తున్నారు. బంగారు భవిత కోసం నిరీక్షణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నాటికి వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న కోచింగ్ సెంటర్లలో సుమారు 50 వేల మంది శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో 1200 మందితో కొత్త బ్యాచ్‌ను ప్రారంభిం చేందుకు దర ఖాస్తులు విక్రయించగా, 4 వేల మందికి పై గా పోటీ పడ్డారు. దరఖాస్తుల కోసం అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు వరకు బారులు తీరారు. అభ్యర్థుల తాకిడితో కొన్ని కోచింగ్ సెంటర్లు శిక్షణ కాలాన్ని 3 నుంచి 4 నెలలకు కుదిస్తున్నాయి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, మెం టల్ ఎబిలిటీ, పాలిటీ, తదితర అంశాలలో ఆరు నెలల శిక్షణతో పాటు, స్టడీ మెటీరియల్‌ను అందించే శిక్షణ సంస్థ లు డిమాండ్ దృష్ట్యా స్టడీ మెటీరియల్‌ను అందజేయలేకపోతున్నాయి. వారం రోజుల్లో ప్రస్తుత బ్యాచ్‌లను ముగించి, కొత్త బ్యాచ్‌ల కోసం కోచింగ్ సెంటర్లు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యోగం వదులుకొని వచ్చాను గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఎలాగైనా సరే గ్రూప్-2 సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. - బాలకృష్ణ, ఎంబీఏ, మెదక్ ఆడపిల్లలకు మంచి అవకాశం కొత్త రాష్ట్రంలో ఎలాగైనా ఉద్యోగా లు వస్తాయనే నమ్మకం ఉంది. ము ఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఎంటెక్ చదువుతున్నాను. ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని పట్టుదలగా చదువుతున్నాను. - వనిత, ఎంటెక్, నల్లగొండ లక్ష ఉద్యోగాల పైనే ఆశలు లక్ష ఉద్యోగాలొస్తాయనే వార్తలు ఎంతో ఆశ కలిగిస్తున్నాయి. కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. కోచింగ్ తీసుకోవడం వల్ల మరింత అవగాహన పెరుగుతుంది. - సోమేష్, పీజీ, నల్లగొండ నమోదు కేంద్రాల్లోనూ రద్దీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు ఉద్యోగార్థులు తరలి వస్తున్నారు. వివిధ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీంతో మెహిదీపట్నంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే ఉద్యోగార్ధులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు అధికారులు చె ప్పారు. తె లంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగాలపై అందరిలోనూ ఆశలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 29వ వరకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 12,204 మంది, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 18,021 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.