కోచింగ్‌ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి | College Student Collapses In Coaching Class In Indore Dies | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి

Published Thu, Jan 18 2024 4:53 PM | Last Updated on Thu, Jan 18 2024 5:57 PM

College Student Collapses In Coaching Class In Indore Dies - Sakshi

భోపాల్‌: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  18 ఏళ్ల ఓ యువకుడు  గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు  మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్‌ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. 
చదవండి: Tammineni: వెంటిలేటర్‌పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం

ఇండోర్‌లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్‌లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్‌పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్‌ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్‌కు తెలియజేశాడు.

ఆలోపే మాధవ్‌ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్‌ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్‌కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement