ప్రసంగిస్తున్న డాక్టర్ ప్రవీణ్ సక్సేనా
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ టీకాలు ప్రజలకు మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయి. టీకాలు తీసుకున్న యువతలో సైతం, రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా గుండెపోట్లతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణహాని కూడా కలుగుతోంది’’ అని పలువురు అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను విధిగా కోవిడ్ టీకాలు తీసుకోవాల్సిందే అని ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గతంలోనే తేల్చి చెప్పిన నేపథ్యంలో.. ఇక మీదటైనా టీకాలు తీసుకోవాలా లేదా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోవాలని వారు సూచించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు తమ దేహాలను సులభమైన హోమియో, ప్రకృతి చికిత్సల ద్వారా డీటాక్స్ చేసుకుంటే మంచిదని పిలుపునిచ్చారు.
అవేకన్ ఇండియా మూవ్‌మెంట్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ‘యువతలో ఆకస్మిక గుండెపోట్లు’ అంశంపై జరిగిన చర్చాగోష్టిలో అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రసంగించారు. చర్చాగోష్టికి అధ్యక్షత వహించిన స్వచ్ఛంద సేవకురాలు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కవుల సరస్వతి మాట్లాడుతూ కోవిడ్‌ను విటమిన్ సి, డి, మెలటోనిన్, యాంటి ఫంగల్ చికిత్సల ద్వారా సులువుగా నయం చేయవచ్చని అల్లోపతి, హోమియోపతి, ప్రకృతి, యునానీ వైద్యులు నిరూపించారని గుర్తు చేశారు.
వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తి కోసం..
ప్రసిద్ధ హోమియో వైద్యులు డా.అంబటి సురేంద్ర రాజు ప్రసంగిస్తూ.. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం కోసం తుజ–30, వాక్సినీనమ్–30, మలాండ్రినమ్–30 అనే హోమియో మందులు వాడుకోవచ్చని సూచించారు. ఈ గుళికలను ఒక్కొక్క రకాన్ని రోజుకు ఒకసారి 6 గుళికల చొప్పున 3 రోజుల పాటు మొత్తం 9 రోజుల పాటు చప్పరించాలన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా, డాక్టర్ సునీల్ డేవిడ్ విధాన విశ్లేషకుడు డా. దొంతి నరసింహారెడ్డి, తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద కార్యకర్త శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: కరోనా కొత్త రూపం దాల్చింది.. జాగ్రత్త సుమా!
Comments
Please login to add a commentAdd a comment