ఆగ్రా(యూపీ): కోచింగ్ సెంటర్ టీచర్‌పై అకారణంగా కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. మరోసారి మరిన్ని బుల్లెట్లు దించుతామని సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఆగ్రాలోని ఖండోలిలో చోటుచేసుకుంది. సుమిత్ సింగ్ గతంలో ఓ కోచింగ్ సెంటర్‌లో పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న 16, 18 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఓ బాలికతో మాట్లాడుతుండగా సుమిత్ సోదరుడు తరుణ్ అడ్డుకున్నారు.
దీనిపై వారు కోపం పెంచుకుని గురువారం సుమిత్‌కు ఫోన్ చేసి, కోచింగ్ సెంటర్‌కు రావాలని కోరారు. రాగానే తెచ్చుకున్న తుపాకీతో సుమిత్ కాలిపై కాల్చారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలోని నటుల్లా పోజులు పెట్టి, ప్రస్తుతానికి ఒక్క బుల్లెట్టే కాల్చామని, ఆరు నెల్ల తర్వాత మిగతా 39 బుల్లెట్లనూ సుమిత్ శరీరంలోకి దించుతామంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment