
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. బుద్దిలేకుండా ప్రవర్తించాడు. ఓ విద్యార్ధిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలపై పడుకోబెట్టి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు.
కాగా, ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, రేవాలోని ఖజుమా కాలాలోని హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ క్రమంలో విద్యార్థి.. టీచర్ దెబ్బలకు తాకలేక విలవిల్లాడిపోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం కూడా చేశాడు.
అయితే, కొట్టడం ఆపివేసిన కాసేపటికి విద్యార్థి కింద నుంచిపైకి లేవడంతో అతడి దుస్తులకు బురద అంటుకోవడం వీడియోలో చూడవచ్చు. ఇక, విద్యార్థి లేచి ముందుకు వెళ్తున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడపట్టుకుని ముందకు నెట్టివేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు మాత్రం టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం గమనార్హం. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
MP: दरिंदा शिक्षक की बेरहमी से छात्र की पिटाई का वीडियो वायरल, रीवा जिले के गुढ़ तहसील क्षेत्र अंतर्गत खजुहा हायर सेकेंडरी विद्यालय का मामला, विद्यालय में कक्षा 8 में अध्ययनरत है छात्र। @KashifKakvi @IG_Rewa @SP_Rewa @CMMadhyaPradesh @KavitaPandeyINC @theobclive @obcricha pic.twitter.com/oWKTbpnrjX
— ओबीसी महासभा मध्यप्रदेश (@OBC_MP) September 29, 2022