Beaten Mercilessly
-
Viral Video: విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..
-
విద్యార్థిని చితకబాదిన టీచర్.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. బుద్దిలేకుండా ప్రవర్తించాడు. ఓ విద్యార్ధిని అత్యంత దారుణంగా చితకబాదాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. నేలపై పడుకోబెట్టి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీచర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. కాగా, ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, రేవాలోని ఖజుమా కాలాలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. సదరు విద్యార్థిపై ఉపాధ్యాయుడు సందీప్ భారతి దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ క్రమంలో విద్యార్థి.. టీచర్ దెబ్బలకు తాకలేక విలవిల్లాడిపోయాడు. ఒకానొక సమయంలో ఎదురుతిరిగే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, కొట్టడం ఆపివేసిన కాసేపటికి విద్యార్థి కింద నుంచిపైకి లేవడంతో అతడి దుస్తులకు బురద అంటుకోవడం వీడియోలో చూడవచ్చు. ఇక, విద్యార్థి లేచి ముందుకు వెళ్తున్న క్రమంలో టీచర్ మరోసారి అతడిని చితకబాదాడు. మెడపట్టుకుని ముందకు నెట్టివేశాడు. ఇదంతా చూస్తున్న మిగతా టీచర్లు, విద్యార్థులు మాత్రం టీచర్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకపోవడం గమనార్హం. కాగా, ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులతో సంప్రదించిన తర్వాత టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. MP: दरिंदा शिक्षक की बेरहमी से छात्र की पिटाई का वीडियो वायरल, रीवा जिले के गुढ़ तहसील क्षेत्र अंतर्गत खजुहा हायर सेकेंडरी विद्यालय का मामला, विद्यालय में कक्षा 8 में अध्ययनरत है छात्र। @KashifKakvi @IG_Rewa @SP_Rewa @CMMadhyaPradesh @KavitaPandeyINC @theobclive @obcricha pic.twitter.com/oWKTbpnrjX — ओबीसी महासभा मध्यप्रदेश (@OBC_MP) September 29, 2022 -
'ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది'
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఇద్దరు దళిత వ్యక్తులు చోరీకి యత్నించారనే కారణంతో స్క్రూ డ్రైవర్‌తో చిత్రహింసలు పెట్టి దుకాణ యజమాని, సిబ్బంది అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు.' ఆ ఇద్దరు యువకులపై చేసిన అమానుష దాడి నన్ను ఎంతగానో బాధించింది. ఆ యువకులపై సిబ్బంది దాడి చేసిన తీరు నా ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించింది. వెంటనే దీనిపై రాజస్తాన్ ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అని పేర్కొన్నారు. (స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెడుతూ..) The recent video of two young Dalit men being brutally tortured in Nagaur, Rajasthan is horrific & sickening. I urge the state Government to take immediate action to bring the perpetrators of this shocking crime to justice. — Rahul Gandhi (@RahulGandhi) February 20, 2020 రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రూ. 50 వేలు దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొడుతూ.. స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం వారి దుస్తులు చించి... పెట్రోల్ పోశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడ్డ బాధితులు.. బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని.. ఆ తతంగాన్ని కెమెరాలో రికార్డు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’) -
అమానుషం: దాడి చేసి నగ్నంగా నడిపించారు
కోల్‌కతా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి ర్యాగింగ్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారెవరైనా సరే విడిచిపెట్టబోమని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ ఆదివారం మీడియాకు తెలిపారు. కాగా, కోల్‌కతాలోని సెయింట్ క్యాథెడ్రల్ కాలేజీలో గత నెల 17 న ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని చితకబాదిన సీనియర్లు.. అందరి ముందు నగ్నంగా నడిపించారు. ఆపై తతంగం అంతా వీడియోలు తీసి వైరల్ చేశారు. బాధిత విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యుడు కావటంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అసలేం జరిగింది... కాలేజీ ఫంక్షన్ పేరుతో సీనియర్లు విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే వసూలు చేసిన మొత్తంపై లెక్కలు చూపాలని సదరు విద్యార్థి సీనియర్లను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్లు అతనిపై దాడి చేసి, అందరి ముందు నగ్నంగా మార్చి అవమానించారు. ఆపై వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. విషయం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు బాధిత యువకుడు విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై టీఎంసీ విద్యార్థి విభాగం గుర్రుగా ఉంది. అధ్యక్షురాలు జయ దత్త స్పందిస్తూ... ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై రాజకీయ విమర్శలకు దిగాయి. -
పట్టపగలు బిజీ మార్కెట్లో మహిళపై దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అది కూడా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్టణం అయిన మెయిన్‌పురిలో. అడ్రస్ అడిగిన మహిళను ఇద్దరు యువకులు అసభ్యంగా తాకడమే కాకుండా నిలదీసిన ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె భర్త ఇద్దరు పిల్లల ముందే వారు పట్టపగలు నడి రోడ్డుపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు వీడియోలు తీసుకుంటూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ దాడి చేసే వారిని ఆపేందుకు ముందుకు రాలేదు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా తలెత్తిన ఈ సంఘటన మరోసారి ఎస్పీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని విపక్షాలు దుమ్మెత్తిపోసేందుకు ఆసరాగా నిలిచింది. పోలీసుల వివరాల ప్రకారం మెయిన్ పురిలోని రద్దీగా ఉండే మార్కెట్లో ఓ మహిళ తన భర్త పిల్లలతో కలిసి వెళుతోంది. అక్కడే ఉన్న ఇద్దరినీ కాస్తంత అడ్రస్ చెప్పాలని అడిగింది. అయితే, ఆ ఇద్దరు అడ్రస్ చెప్పడానికి బదులు చెడుగా ప్రవర్తించారు. దుర్భాషలాడి ఆమె చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నించడంతో ఆమె లాగి పెట్టి కొట్టింది. దీంతో అక్కడే ఉన్న ఓ పెద్ద కర్రను తీసుకొని ఆమెపై విచక్షణ రహితంగా తలపై కొట్టారు. రక్తం కారుతున్నప్పటికీ దాడిని ఆపకుండా వరుస దెబ్బలు కొట్టారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై కూడా దాడి చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి పోలీసులు రాగా.. నిందితులను అరెస్టు చేసి శిక్షించకుంటే తనను తాను కాల్చుకొని చచ్చిపోతానంటూ ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒకరిని అరెస్టు చేశారు. మిగితా వారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.