warnings
-
డాలర్‌తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్‌తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్‌తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్‌ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్‌ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్‌తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్‌పై 100 శాతం టారిఫ్‌లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. -
దిమ్మతిరిగేలా బదులిస్తాం
దుబాయ్/టెహ్రాన్: గత నెలాఖరులో ఇజ్రాయెల్ తమ మిలటరీ లక్ష్యాలపై చేపట్టిన దాడులపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ తీవ్రంగా స్పందించారు. దిమ్మతిరిగేలా బదులిచ్చి తీరతామంటూ అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. ‘‘మాకు, హెజ్బొల్లా, హమాస్ వంటి మా మిత్ర గ్రూపులకు హాని తలపెడుతున్నందుకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదు. మాపై, మా మిత్ర దేశాలపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయి. శత్రువులను పూర్తిగా అణగదొక్కేలా మా ప్రతిస్పందన ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ గ్రహించాలి. అనవసరంగా మా జోలికి రావొద్దు. ఇబ్బందుల్లో పడొద్దు’’అని శనివారం టెహ్రాన్ వర్సిటీ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ అధికారిక టీవీ చానల్ ఈ మేరకు తెలిపింది. ‘మా నరాల్లో ప్రవహిస్తున్న రక్తం మా నాయకుడికి బహుమానం’అంటూ ఖమేనీకి మద్దతుగా విద్యార్థులు భారీగా నినాదాలు చేశారు. హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకులు హతమైన నేపథ్యంలో ఇరాన్ అక్టోబర్ ఒకటో తేదీన ఇజ్రాయెల్‌పై పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల్లో ఎవరు ఎవరిపై దాడికి దిగినా పశి్చమాసియా అగి్నగుండం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారడానికి కారణమైన ఘటనకు ఆదివారం 45 ఏళ్లు నిండనుండటం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. 1979 నవంబర్ 4న ఇరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇస్లామిస్టు విద్యార్థులు దిగ్బంధించారు. సిబ్బందిని కార్యాలయంలోని బంధించారు. ఈ సంక్షోభం ఏకంగా 444 రోజులు కొనసాగింది. నాటినుంచే ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇజ్రాయెల్‌కు మరింత సాయం ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత సాయం ప్రకటించింది. అగి్నమాపక ఎయిర్ ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఫైటర్ విమానాలు, లాంగ్ రేంజ్ బి–52 బాంబర్లను పశి్చమాసియాకు తరలించనున్నట్లు శనివారం పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను, భారీగా సైనిక, ఆయుధ సామగ్రిని సమకూర్చడం తెలిసిందే. -
ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది. ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్లోడ్, స్టోర్, అప్డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే. -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
పదో తేదీ వస్తోంది.. కిస్తీ కట్టండమ్మా!
పటమట(విజయవాడ తూర్పు): మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది బుడమేరు వరద ముంపు ప్రాంతంలోని స్వయం సహాయ సంఘాల సభ్యుల పరిస్థితి. బుడమేరు వరద వల్ల ఇళ్లు మునిగి సర్వం కోల్పోయి వారం రోజుల నుంచి కట్టుబట్టలతో అల్లాడుతున్నవారిని ఆదుకోవాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ సాధికారిక విభాగం అధికారులు... మానవత్వాన్ని మరిచి ఇప్పుడిప్పుడే ఇంటికి చేరి బురదను శుభ్రం చేసుకుంటున్న వారి వద్దకు సిబ్బందిని పంపి ‘పదో తేదీ వస్తోంది పొదుపు రుణం కిస్తీ కట్టండి... లేకపోతే వడ్డీ పెరుగుతుంది.తర్వాత ఇబ్బందిపడతారు...’ అని హెచ్చరించడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అనేక సంవత్సరాలుగా పని చేసి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్లన్నీ నాశనమైపోయాయి. ఇప్పుడు తినడానికి తిండికి కూడా లేకుండా అల్లాడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు ఇచ్చే పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నాం. బురదనీటిలోనే బతుకీడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బుక్ కీపర్లు వచ్చి కిస్తీ కట్టాలని చెప్పడం దారుణం. వారికి మనసెలా వచి్చందో అర్థం కావడం లేదు..’ అంటూ అజిత్‌సింగ్‌నగర్ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు మండిపడుతున్నారు. వెంటనే పొదుపు రుణాల చెల్లింపులను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. 1.50లక్షల మందిపై ప్రభావం⇒ విజయవాడలోని మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 12వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ⇒ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సర్కిల్–1, సర్కిల్–2 పరిధిలోని విద్యాధరపురం, భవానీపురం, చిట్టినగర్, పాత ఆర్‌ఆర్‌పేట, కొత్త ఆర్‌ఆర్‌పేట, కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, పాయకాపురం, పైపులరోడ్డు, వాంబేకాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 8వేల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 1.50లక్షల మంది సభ్యులు పొదుపు రుణాలు పొందారు. ⇒ఒక్కో సంఘం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు రుణాలు పొందాయి. ఆయా సంఘాల సభ్యులు రెండు నెలల నుంచి 15 నెలల వరకు వాయిదాలు చెల్లించారు. ⇒ఇప్పటి వరకు తాము తీసుకున్న రుణాలతో చిరువ్యాపారాలు, చేతివృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ప్రతి నెల పదో తేదీలోపు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తీలను పక్కాగా చెల్లిస్తున్నారు. ⇒ప్రస్తుతం ఆకస్మిక వరద వల్ల పనిలేక, ఉన్న వస్తువులన్నీ పాడైపోయి అల్లాడుతున్నారు. వీరు తేరుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. మేం ఇప్పుడు కట్టలేం మా పరిస్థితి చూశారుగా... ఇళ్లన్నీ మునిగిపోయాయి. సామాన్లు కొట్టుకుపోయాయి. ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు వచ్చి పొదుపు రుణం కిస్తీ చెల్లించాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేం కట్టలేం... కట్టం. ఏం చేసుకుంటారో చేసుకోండి. మాలాంటి వారిని ఆదుకోవాల్సింది పోయి అప్పు కట్టమనడం ఎంతవరకు న్యాయం? మేం మళ్లీ మా పాత రోజువారీ జీవితానికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు మేం రుణాలు కట్టలేం. ప్రభుత్వం మాకు కొత్త రుణాలు ఇవ్వాలి. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. – మీనాక్షి, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ బాధితులనే విరాళాలు అడుగుతారా? ఇప్పటి వరకు వాహనాలు, ఎల్రక్టానిక్ వస్తువుల బీమాపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పొదుపు సంఘాల పరిస్థితిని అసలు పట్టించుకోవడం లేదు. పైగా కిస్తీలు కట్టండి... పొదుపు సంఘాలు కూడా విరాళాలు ఇవ్వండి... అని చెబుతున్నారు. మేమే బాధితులమైతే మేం ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలా..? ఇదెక్కడి విడ్డూరం? మాపై ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా రుణాలు మాఫీ చేయాలి. సున్నా వడ్డీకి కొత్త రుణం అందించాలి. – సునీత, ఆంధ్రప్రభ కాలనీ, విజయవాడ -
Israel-Hamas war: యుద్ధమేఘాలు!
టెల్అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మిసైల్ డిఫెన్స్ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్ సమీపంలో భూతల బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్, ఎఫ్–35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్ఎస్ వాస్ప్ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి. మరో హమాస్ నేత హతం శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్ సైనిక విభాగ కీలక నేత హైథమ్ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా: అమెరికా ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గాలంట్‌తో లాయిడ్సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. -
PM Narendra Modi: పొలిమేరల నుంచే హెచ్చరిస్తున్నా...
ద్రాస్ (లద్దాఖ్): కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం ముసుగులో పరోక్ష యుద్ధాలతో ఇప్పటికీ కవి్వంపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులరి్పంచారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా. ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’’ అన్నారు. పాతికేళ్ల కింద కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యునిగా సైనికుల మధ్య గడిపే అదృష్టం తనకు దక్కిందని మోదీ గుర్తు చేసుకున్నారు. భూతల స్వర్గమైన కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు. సైనికులకు ఇవ్వాల్సిన పెన్షన్ నిధులను ఆదా చేసుకునేందుకే అగి్నపథ్ పథకం తెచ్చారన్న విపక్షాల విమర్శలను మోదీ తీవ్రంగా ఖండించారు. అది సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, నిత్యం యువ రక్తం ఉండేలా, సదా యుద్ధ సన్నద్ధంగా ఉండేలా చూసేందుకు తెచి్చన పథకమన్నారు. ‘‘వేల కోట్ల కుంభకోణాలతో సైన్యాన్ని బలహీనపరిచిన వాళ్లే ఇప్పుడిలా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై మతిలేని విమర్శలకు దిగడం సిగ్గుచేటు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై తప్పుడు వాగ్దానాలు చేసింది కూడా వారే. మేం విజయవంతంగా అమలు చేస్తున్నాం’’ అన్నారు. టన్నెల్లో మోదీ ‘బ్లాస్ట్’ లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.‘విజయ్ దివస్’లో ముర్ము న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు కూడా నివాళులరి్పంచారు. మోదీపై విపక్షాల ధ్వజం సైన్యం కోరిన మీదటే అగ్నిపథ్ తెచ్చామంటూ మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని విపక్షాలు విమర్శించాయి. విజయ్ దివస్ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పి అమర జవాన్లను అవమానించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఏ ప్రధానీ ఇలా దిగజారలేదంటూ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రస్తావనతో ఆశ్చర్యపోయామని నాటి ఆర్మీ చీఫే చెప్పారని కాంగ్రెస్ పేర్కొంది. సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు, యువ రక్తం నింపేందుకు అగి్నపథ్ పథకం తెచ్చామనడం ద్వారా మన సైనికులను మోదీ ఘోరంగా అవమానించారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. -
భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ఇరాన్‌తో ఏ దేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్‌తో సోమవారం ఒప్పదం కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘చాబహార్ పోర్టుకు సంబంధించి.. భారత్-ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసు. భారత్ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై ఆలోచించుకోవాలి. కానీ, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ అన్నారు.‘ఇప్పటికే చాలా సార్లు మేము ఆంక్షాల విషయాన్ని ప్రస్తావించాం. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం. అలా కాదని ఇరత దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది’అని ఇరాన్‌తో ఒప్పదం చేసుకున్న భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇక.. సోమవారం ఇరాన్‌లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు భారత్ నిర్వహించేదుకు ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది. -
Narendra Modi: ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే
బాగల్కోట్/షోలాపూర్/సతారా: ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనివారు కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, తనపై, బీజేపీ నాయకులపై బురదజల్లుతున్నారని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు. కృత్రిక మేధను దురి్వనియోగం చేస్తున్నారని, టెక్నాలజీని, సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. అచ్చంగా తన గొంతును పోలిన గొంతుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, తాను అనని మాటలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ధారణ కాని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇది నిజంగా ప్రమాదకరమైన ధోరణి అన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై పోలీసులకు గానీ, బీజేపీకి గానీ ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పనులు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారంతో ఇతరులను అప్రతిష్టపాలు చేయడం మన చట్టం అనుమతించదని తేలి్చచెప్పారు. సోమవారం కర్ణాటకలోని బాగల్కోట్, మహారాష్ట్రలోని షోలార్పూర్, సతారాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే నెల రోజుల్లో దేశంలో ఒక పెద్ద సంఘటన సృష్టించడానికి శత్రువులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపించారు. సామాజిక అశాంతి, అల్లకల్లోలం రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని అన్నారు. తాను చాలా సీరియస్‌గా ఈ ఆరోపణలు చేస్తున్నానని చెప్పారు. ఫేక్ వీడియోల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియోలను తెలిసీ తెలియక సోషల్ మీడియాలో షేర్ చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రిజర్వేషన్ల రక్షణకు ఎంత దూరమైనా వెళ్తా.. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వెంట నడుస్తుండడంతో మైనారీ్టలను మచి్చక చేసుకోవడానికి కాంగ్రెస్ కొత్త కుట్రలకు తెరలేపిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల ను నమ్ముకుందని, అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోనని స్పష్టం చేశారు. దళి తులు, ఆదివాసీ, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఈ మేరకు వారికి గ్యారంటీ ఇస్తున్నానని మో దీ వివరించారు. టెక్నాలజీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్ హబ్‌గా మారిందని ఎద్దేవా చేశా రు. ట్యాంకర్ మాఫియా ప్రజలను దోచుకుంటోందని, ఇందులో కమీషన్లు కాంగ్రెస్ నేతలకు చేరుతున్నాయని దుయ్యబట్టారు. -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్‌దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్‌తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్‌నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్‌సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్‌ను సైబర్‌నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్‌ను సైబర్‌నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్‌ను హెచ్చరిస్తాం. ఐఫోన్‌ను సైబర్‌భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్‌కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్‌ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్‌లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్‌లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది. ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది. -
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?
‘గుడ్ మార్నింగ్ సర్. నా పేరు సురేష్. సాక్షి ఫన్ డే లో వస్తున్న ‘సై కాలం’ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. రకరకాల మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అసలు ఒక మనిషికి మానసిక సమస్య ఉందో లేదో గుర్తించడం ఎలా? అనే టాపిక్ కూడా రాస్తే బాగుంటుంది సర్’ అంటూ మొన్నా మధ్య ఒక కాల్ వచ్చింది. ఆ సూచన విలువైందిగా తోచింది. అందుకే ఈ వారం ఆ అంశం గురించే తెలుసుకుందాం! సమస్య, రుగ్మత వేర్వేరు సురేష్లానే చాలామందికి మానసిక సమస్యల గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. ఎవరి ప్రవర్తనైనా కొంచెం తేడాగా కనిపించగానే గుళ్లూ, గోపురాలకు తిప్పేస్తారు. యజ్ఞాలూ,యాగాలూ, శాంతి పూజలూ చేయిస్తారు. లేదా మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే మానసిక సమస్యలు, రుగ్మతల మధ్య తేడా అర్థం చేసుకోవాలి. రోజువారీ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సర్దుబాటులో సమస్యలు, కోపం, విచారం, చదువులో, ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి మానసిక సమస్యలు. ఇవి తాత్కాలికం. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్, ఫోబియా, స్కిజోఫ్రీనియా లాంటివి మానసిక రుగ్మతలు. ఇవి దీర్ఘకాలం ఉంటాయి. సహానుభూతి ఉంటే చాలు.. మానసిక వ్యాధి ఉందా లేదా అని అంచనా వెయ్యడానికి సరిపడా మానసిక నిపుణులు మన దేశంలో అందుబాటులో లేరు. అందువల్ల సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం ఉన్నవారెవరైనా ప్రాథమిక అంచనా వేయవచ్చు. అయితే మానసిక వ్యాధి ఉన్నవారితో మాట్లాడాలంటే చాలామంది జంకుతారు. కారణం.. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అనగానే చాలామందికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడే, శుభ్రత లేని వ్యక్తి గుర్తొస్తాడు. అతనితో మాట్లాడితే తిడతాడేమో, కొడతాడేమో అని భయపడతారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులే. వారితో మాట్లాడినందువల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని గుర్తించండి. ఎలా మాట్లాడాలి? ‘మీకేదో మానసిక సమస్య ఉన్నట్లుంది’ అని మొదలుపెడితే ఎవరైనా నొచ్చుకుంటారు. కాబట్టి వారితో మాట కలిపేందుకు.. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకుని, అతని బాధను, సామాజిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి. దీన్నే సహానుభూతి అంటారు. వీలైనంత వరకు ఆ వ్యక్తి బంధువులెవరూ అక్కడ లేకుండా చూసుకోండి. కొంతమంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరించండి. శారీరక జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎంత సహానుభూతితో మాట్లాడతామో, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తితో కూడా అంతే సహానుభూతితో వ్యవహరించాలి. ఏం చెయ్యాలి? మానసిక సమస్య లక్షణాలు కనిపించగానే మానసిక వ్యాధి ఉందని నిర్ధారణకు రాకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడి లక్షణాలు ఎన్నాళ్ల నుంచి ఉన్నాయి, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. అతని సామాజిక, ఆర్థిక, సంబంధ బాంధవ్యాల వివరాలు, సమస్యల గురించి ఆరా తీయాలి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎందుకు మానసిక సమస్యతో బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అతనితో మరింత లోతుగా మాట్లాడి, సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. అవసరమైన సహాయం అందిస్తారు. అడగాల్సిన ప్రశ్నలు.. రాత్రిపూట నిద్ర పట్టడంలో ఏదైనా సమస్య ఉందా? · రోజువారీ పనులు చేయడంలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా? కొద్దికాలంగా విచారంగా, జీవితంలో సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా? · దేని గురించైనా భయభ్రాంతులకు లోనవుతున్నారా? మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నారని బాధపడుతున్నారా? · మద్యం లేదా మాదక ద్రవ్యాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? వీటిలో ఏ ప్రశ్నకైనా ‘అవును’ అని సమాధానం చెప్తే, మరింత సమయం వెచ్చించి మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రుగ్మతను గుర్తించే లక్షణాలు.. ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని బాధల్ని చెప్పడం · మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉండటం డిప్రెషన్ లేదా మద్యపాన సంబంధమైన మానసిక సమస్య ఉందని నేరుగా చెప్పడం మద్యపాన వ్యసనం లేదా గృహహింస లాంటి ప్రత్యేక కారణాలు వైవాహిక, లైంగిక సమస్యలు · దీర్ఘకాల నిరుద్యోగం, సన్నిహిత వ్యక్తి మరణం, జీవితం సమస్యలమయం కావడం అతీంద్రీయ శక్తులు ఉన్నాయని అనుమానించడం. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
టీచర్‌పై కాల్పులు.. సోషల్ మీడియాలో పోస్టింగ్
ఆగ్రా(యూపీ): కోచింగ్ సెంటర్ టీచర్‌పై అకారణంగా కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. మరోసారి మరిన్ని బుల్లెట్లు దించుతామని సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఆగ్రాలోని ఖండోలిలో చోటుచేసుకుంది. సుమిత్ సింగ్ గతంలో ఓ కోచింగ్ సెంటర్లో పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న 16, 18 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఓ బాలికతో మాట్లాడుతుండగా సుమిత్ సోదరుడు తరుణ్ అడ్డుకున్నారు. దీనిపై వారు కోపం పెంచుకుని గురువారం సుమిత్‌కు ఫోన్ చేసి, కోచింగ్ సెంటర్‌కు రావాలని కోరారు. రాగానే తెచ్చుకున్న తుపాకీతో సుమిత్ కాలిపై కాల్చారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలోని నటుల్లా పోజులు పెట్టి, ప్రస్తుతానికి ఒక్క బుల్లెట్టే కాల్చామని, ఆరు నెల్ల తర్వాత మిగతా 39 బుల్లెట్లనూ సుమిత్ శరీరంలోకి దించుతామంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
Sikh for Justice: వరల్డ్ కప్ కాదు.. టెర్రర్ కప్
అహ్మదాబాద్: కరడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపట్వంత్ సింగ్ పన్నూపై గుజరాత్ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ ‘ప్రపంచ టెర్రర్ కప్’గా మారతుందంటూ సోషల్ మీడియాలో పన్నూ చేసిన హెచ్చరికలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు పాల్పడినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ముందే రికార్డు చేసిన ఓ వాయిస్ మెసేజ్‌ను విదేశీ ఫోన్ నంబర్‌తో సోషల్ మీడియాలో పన్నూ పోస్టు చేశాడని తెలిపారు. +447418343648 అనే నంబర్‌తో దేశవ్యాప్తంగా చాలామందికి ఈ మెసేజ్ అందిందని పేర్కొన్నారు. మెసేజ్ అందుకున్నవారు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. సబ్ఇన్స్పెక్టర్ హెచ్.ఎన్.ప్రజాపతి ఫిర్యాదు మేరకు పన్నూపై కేసు పెట్టినట్లు వివరించారు. +44 అనేది యునైటెడ్ కింగ్డమ్(యూకే) కోడ్ కావడం గమనార్హం. అయితే, ఇంటర్నెట్ కాల్ టెక్నాలజీతో ఇలా విదేశీ ఫోన్ నంబర్ల నుంచి సందేశం వస్తున్నట్లు తప్పుదోవ పట్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పన్నూ హెచ్చరికల మెసేజ్ ఎక్కడి నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ...ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ విదేశీ ఫోన్ నంబర్‌తో వచి్చన కాల్‌ను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రి–రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీతూ యాదవ్ తెలియజేశారు. ‘‘అమర వీరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కచి్చతంగా ప్రతీకారం తీర్చుకుంటాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లు ఉపయోగిస్తాం. మీరు సాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తాం. అక్టోబర్ 5వ తేదీని గుర్తు పెట్టుకోండి. ఆ రోజు క్రికెట్ ప్రపంచ కప్ కాదు, ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభమవుతుంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో ఖలిస్తాన్ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడిస్తాం.. ఇట్లు గురుపట్వంత్ సింగ్ పన్నూ’’ అంటూ ఆ సందేశంలో హెచ్చరికలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్ నగర ప్రజలకు గత రెండు రోజులుగా ఈ మెసేజ్ వస్తోందన్నారు. ఎవరీ పన్నూ? సిక్కుల కోసం భారత్‌లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఏర్పాటే తన జీవితాశయమని ప్రకటించుకున్న గురుపట్వంత్ సింగ్ పన్నూ పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలోని ఖంజోత్ అనే గ్రామంలో జని్మంచాడు. న్యాయ విద్య అభ్యసించాడు. అనంతరం కెనడాకు వలస వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. కెనడా పౌరసత్వం కూడా సంపాదించాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను స్థాపించాడు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో ర్యాలీలు నిర్వహించాడు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగట్టడానికి లాబీయింగ్ చేస్తున్నాడు. హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై పన్నూ తీవ్రంగా రగిలిపోయాడు. కెనడాలోని హిందువులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కొన్ని రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశాడు. 2020 జూలైలో పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో అజ్ఞాతంలో ఉన్నాడు. -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్‌ను ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
దొందూదొందే ! సౌండ్ ఎక్కువ మ్యాటర్ తక్కువ
-
బ్యాంక్‌లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్‌లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌లు నూతనతరం ఫిన్‌టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
బీజింగ్: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది. -
అమెరికాలో భీకర వర్షాలు.. పిడుగులు
వాషింగ్టన్: అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూహ్యాంప్‌షైర్, న్యూయార్క్, రోడ్ఐలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భీకర వర్షాలకుతోడు పిడుగుల ముప్పు కారణంగా అమెరికాలో తాజాగా 2,600కుపైగా విమానాల రాకపోకలను రద్దుచేశారు. మరో 8,000 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ప్రధానంగా ఈశాన్య అమెరికాలో వాతావరణం ప్రతికూలంగా మారింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేన్వియా, మసాచుసెట్స్, వెర్మాంట్‌లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా, పశి్చమ, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలిఫోరి్నయా రాష్ట్రంలోని డెత్ వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. -
వరదలపై ముందస్తుగా... హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం జిల్లాల్లో తీవ్ర వరద ప్రభావానికి గురయ్యే జిల్లాలు ఏకంగా 72 శాతం ఉన్నాయి. కానీ, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ వీటిలో కేవలం 25 శాతం జిల్లాల్లోనే ఉంది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈబ్ల్యూ) అనే స్వతంత్ర విధాన పరిశోధనా సంస్థ ఒక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఇక వరదల ముప్పు అధికంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అంతంతేనని తేలి్చంది. దేశంలో 66 శాతం మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కానీ, వీరిలో సగం మంది.. అంటే 33 శాతం మంది మాత్రమే ముందస్తు హెచ్చరికల వ్యవస్థ పరిధిలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 25 శాతం జనాభా తుఫాన్ల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉండగా, వారందరూ సైక్లోన్ వారి్నంగ్ వ్యవస్థ పరిధిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, కర్ణాటక, కేరళ, పశి్చమ బెంగాల్ రాష్ట్రాలు సైక్లోన్ హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో ముందంజలో ఉన్నాయని నివేదిక తెలియజేసింది. తీవ్ర వరద ప్రభావిత రాష్ట్రాలు ఏవంటే.. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, పశి్చమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాకట, గోవా, బిహార్. -
SCO Summit: ఉగ్రపోరులో ద్వంద్వ ప్రమాణాలొద్దు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. పాకిస్తాన్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. కొన్ని దేశాలు ప్రభుత్వ విధానాల్లో భాగంగానే సీమాంతర ఉగ్రవాదానికి నిస్సిగ్గుగా మద్దతిస్తున్నాయని, అలాంటి దేశాలను విమర్శించడానికి ఎవరూ సంకోచించవద్దని సూచించారు. మంగళవారం షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే శక్తులను అణచివేయడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదం ఒక పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముప్పు తొలగిపోవాలంటే ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ అంతం చేయాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓలో సంస్కరణలకు మద్దతు ప్రపంచ దేశాలన్నీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత పెద్ద సవాలుగా మారిందన్నారు. పొరుగు దేశాలతో వివాదాలు, అంతర్గతంగా ఉద్రిక్తతలు, మహమ్మారులతో ఎన్నో దేశాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని తెలిపారు. ఆసియా, ఐరోపా ఖండాల్లో శాంతికి, సౌభాగ్యానికి, అభివృద్ధికి ఎస్సీఓ అనేది ఒక కీలకమైన వేదికగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలతో సహకారం మరింత పెంపొందించుకుంటామని అన్నారు. స్టార్టప్‌లు, నవీన ఆవిష్కరణలు, సంప్రదాయ వైద్యం, యువజనం సాధికారత, డిజిటలీకరణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటామని వెల్లడించారు. ఎస్సీఓలో సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో ఇరాన్ సైతం సభ్యదేశంగా చేరుతుండడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీఓ వర్చువల్ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. భారత్ 2005లో ఈ సంస్థలో పరిశీలక దేశంగా చేరింది. 2017లో పూర్తిస్థాయి సభ్యదేశంగా మారింది. ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వద్దు: జిన్‌పింగ్ బీజింగ్: ఆసియా ప్రాంతంలో కొత్తగా ప్రచ్ఛన్న యుద్ధాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎస్సీఓ వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ప్రాంతీయంగా శాంతిని కాపాడుకోవడానికి ఎస్సీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ... ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటును రష్యా సమాజం మొత్తం ఒక్కటై వ్యతిరేకించిందని చెప్పారు. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. వాగ్నర్ గ్రూప్ యత్నాలను ఆయన ప్రస్తావించారు. -
సభ్యత్వ వ్యవహారాన్ని కవర్ చేసుకోవడానికి బాబు, లోకేష్ పాట్లు
-
CBN: నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆయనకు ఏదో మానసిక సమతుల్యత కోల్పోతున్నారా? అని అనుకున్నవారికి మరింత ఆశ్చర్యం కలిగించేలా దురహంకారంతో డైలాగులు విసురుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దారుణమైన ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఈయన గెలుస్తారట. ఆ తర్వాత జగన్‌కు ట్రీట్ మెంట్ ఇస్తారట. జగన్ బట్టలూడదీస్తారట. కొద్ది రోజులుగా ఈయన చేస్తున్న ప్రసంగాలలో కొన్ని మాటలు ఇవి. ఉడత ఊపులకు చింతకాయలు రాలతాయా? అనే సామెత ఒకటి ఉంది. చంద్రబాబుకు సరిగ్గా ఇది వర్తిస్తుంది. ఒకవైపు తాము ఒంటరిగా గెలవలేమన్న భయంతో జనసేన వైపు చూస్తున్నారు. మరోవైపు డాంబికంగా మాటలు విసురుతున్నారు. టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఆయన ఇలా ఆవేశపడాల్సిన అవసరం ఏముంటుంది?. ఓటమి భయం తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ఇంతకీ ఆయనకు కోపం ఎందుకు వస్తోంది?.. 👉 తన ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాల ఎదుట ఆయన కూడా విచారణకు హాజరుకావల్సి రావొచ్చు. ఆ భయంతో ఆయన ఏవేవో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. దూషణలకు దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. నిజానికి ఇంతకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి నోట ఇలా.. ట్రీట్మెంట్ ఇస్తాం, బట్టలూడదీస్తాం.. అంటూ మరో రాజకీయ నేతను పట్టుకుని అనొచ్చా?. ఆయన ఇంకో మాట కూడా అన్నారు.'ఏభైసార్లు జైలుకు పంపితే వారు ఊరుకుంటారా?’ అని ప్రశ్నిస్తున్నారు. వారు మనుషులేగా" అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని అర్దం ఏమిటి? ముఖ్యమంత్రి జగన్ పై ఏదో కుట్ర జరుగుతున్నట్లు కనిపించడం లేదు. 👉 అసలు ఎవరిని ఏభై సార్లు జైలుకు పంపారు?. నీచంగా ముఖ్యమంత్రిని దూషించిన తెలుగుదేశం చోటా, మోటా నేతలు కూడా మీ అండతో బెయిల్ పొంది, మళ్లీ మళ్లీ చెలరేగిపోతున్నారే!. రాజకీయాలను గబ్బు పట్టిస్తున్నారే!. చండాలపు పోస్టింగ్‌లు పెట్టినవారికి, స్కామ్‌లు చేసినవారికి, అల్లర్లు చేస్తున్నవారికి.. చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి. అది ఆయన రాజకీయ మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఇలాంటివారిని కదా సైకో రాజకీయవేత్తలు అనవలసింది. పైగా తాను ముఖ్యమంత్రిని అయితే కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేస్తానని నిస్సిగ్గుగా చెబుతున్నారే!. ఇప్పుడు ఏకంగా మరో నేతను పట్టుకుని ట్రీట్ మెంట్ ఇస్తానని అంటారా?. ఇదన్నమాట ఈయన ప్రజాస్వామ్యం. 👉 చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా జగన్ ప్రభుత్వంలో ఎవరిపైన అయినా అక్రమంగా కేసులు పెడితే.. ఆ విషయం సోదాహరణంగా చెప్పి ప్రజల సానుభూతి పొందవచ్చు. అలా చేయలేకపోతున్నారు. ఏదో విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి వారిని కేసులలో ఇరికించి, తద్వారా వారు పార్టీలోనే కొనసాగేలా వ్యూహం అమలు చేస్తున్నది చంద్రబాబు కాదా?. నిజానికి ఇలాంటి మాటలు అంటున్న చంద్రబాబుకు ట్రీట్మెంట్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ నేతలు గనుక అంటే.. అదిఎంత ఇబ్బందిగా ఉంటుంది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తను చేసే ప్రతి కార్యక్రమానికి నెగిటివ్‌గా వార్తలు రాస్తున్న మీడియానే జగన్ ఏమీ అనడం లేదు కదా!. కాకపోతే దుష్టచతుష్టయం అని చెప్పి ప్రజల మద్దతు కూడగడుతున్నారు అంతే. అయినా చంద్రబాబు శాంతించలేకపోతున్నారు. 👉 అందుకు కారణం ఆయన్ని ఏపీ ప్రజలు కేవలం 23 సీట్లకు పరిమితం చేసి ఘోరంగా ఓడించడమే. ఆ అక్కసులో నిత్యం ఏదో ఒక అలజడి సృష్టించడానికి ఆయన యత్నిస్తున్నారు. అయినా ఏపీలో శాంతిభద్రతలు సజావుగా ఉండడంతో ఏమీ చేయలేక నోటికి వచ్చిన కూతలు కూస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు బరి తెగించి, బట్టలూడదీసుకుని మరీ చండాలంగా ప్రవర్తిస్తున్నాయి. పచ్చి అబద్దాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. 👉 మార్గదర్శి కేసులో రామోజీరావును సీఐడీ విచారించడం తప్పు అనిపిస్తే దైర్యంగా చెప్పాలి. అలాగే ఆయన మార్గదర్శి చిట్స్ ద్వారా చట్ట విరుద్దంగా డబ్బు మళ్లించారా? లేదా? అనేది కూడా చెప్పాలి. అనుమతి లేకుండా డిపాజిట్లు తీసుకోవడం తప్పా?రైటా? అనే దానికి సమాధానం చెప్పాలి. అవేమీ చెప్పని చంద్రబాబు, రామోజీరావులు సీఎం జగన్‌పై ద్వేషం వెళ్లగక్కుతున్నారు. 👉 రామోజీకి సంబంధించి వచ్చిన తాజా వీడియో లో ఆయన సానుభూతి కోసం అన్నారో లేదంటే ఇంకే ఉద్దేశంతో అన్నారో గానీ.. తన వద్దకు సీఐడీ రావడం కాలమహిమో, జగన్ మహిమో అని అన్నారు. అంతే తప్ప సీఐడీ అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు. ఆయన చేతిలో పత్రిక, టీవీ ఉందని ఇష్టం వచ్చినట్లు పచ్చి అబద్దాలను వండి వార్చుతున్నారు. నాలుగేళ్లుగా రామోజీ ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నారు. ఆ రకంగా జగన్‌ను వేధిస్తున్నామని రామోజీ సంతృప్తి చెందితే.. చంద్రబాబేమో తనపై వచ్చిన స్కాముల ఆరోపణలకు జవాబు ఇవ్వలేక ట్రీట్మెంట్ డైలాగులు వదులుతూ భయపెట్టాలని చూస్తున్నారు. తద్వారా తనవరకు విచారణ రాకుండా చూసుకోవాలన్న ఎత్తుగడను ఆయన అనుసరిస్తున్నట్లుగా ఉంది. 👉 చంద్రబాబు, రామోజీలు ఒకరకంగా పిరికితనంతో వ్యవహరిస్తుంటే.. గతంలో తనపై కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని తమ పనిముట్టుగా వాడుకుని కేసులు పెట్టినా.. వైఎస్ జగన్ తొణకలేదు.. బెణకలేదు. ఆయా కేసుల్లో తన వాదన ఏమిటో వినిపించారే తప్ప ఇలా బీద ఏడుపులు చేయలేదు. అప్పుడు చంద్రబాబు, సోనియాగాంధీ, సీబీఐ లక్ష్మీనారాయణ కలిసి ఎన్ని కుట్రలు పన్నింది అందరికీ తెలుసు. ఆనాడు రామోజీ ఎలాంటి దారుణమైన పాత్ర పోషించింది తెలియదా?. జగన్ పై ఎన్ని కుట్రపూరిత వార్తలు రాశారు. ఎన్నిసార్లు జగన్‌ను వీరు తమ పత్రికలో తీహారు జైలుకు పంపించారు? మరి అవన్నీ రామోజీ మహిమ అనాలా? లేదంటే ఇంకొకటి అనాలా?.. 👉 ఇప్పటికీ అనేక తప్పుడు వార్తలు రాస్తున్నారు. మరి అవి రామోజీ మహిమ కాదా!. తామేమి చేసినా, తాము దొరికిపోయినా.. ఎవరూ ఏమీ అనకూడదు. తాము మాత్రం ఎదుటివారిపై ఎంత బురదైనా చల్లుతాం అన్నట్లు వ్యవహరిస్తే ఎవరైనా సహించగలుగుతారా?. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మార్గదర్శి కేసుకు సంబంధించి ఆయా సదస్సుల్లో, సందర్భాల్లో మాట్లాడుతూ చెబుతున్న సంగతులలో ఒక్కదానికి రామోజీ లేదంటే చంద్రబాబు సమాధానం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారా?.. మరి ఇదే తరహా కేసులో టీడీపీ నేత అప్పారావు, ఆయన కుమారుడు వాసులు ఎలా అరెస్టు అయ్యారు?. రామోజీ గానీ, ఆయన మనుషులు గానీ సురక్షితమైన ఆర్డర్లు ఎలా పొందగలిగారని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి పలు సూటి ప్రశ్నలు ఆయన సంధించారు. వాటికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఆ వ్యవస్థలో ఉందని ఎవరూ అనుకోవడం లేదు. ఏదిఏమైనా చంద్రబాబు నాయుడులో పెరిగిన అసహనం, మానసిక ఉద్రిక్తత తదితరాల కారణంగా.. ట్రీట్మెంట్, బట్టలూడదీస్తానంటూ.. వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయినా కూడా ఆయనకు వచ్చే నోటీసులు రాకుండా ఆగుతాయా?.. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: బిల్డప్ బాబూ బిల్డప్..! -
వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు IBM వార్నింగ్...
-
పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త!
ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మిడ్ క్యాప్ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: సాధారణంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్‌లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అంతంత మాత్ర బిజినెస్‌లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతాయి. అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్‌లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ తీరు గతేడాది నవంబర్ నుంచి సాఫ్ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్ షేరు 1,823 శాతం జంప్‌చేసింది. గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్ ఇండస్ట్రీస్ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కన్ను కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు. సాధనా బ్రాడ్‌క్యాస్ట్, షార్ప్‌లైన్ బ్రాడ్‌క్యాస్ట్ యూట్యూబ్ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్‌అండ్‌టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్‌ఆర్ రైల్ ఇంజినీరింగ్, టేలర్‌మేడ్ రీన్యూ, ఆస్కమ్ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!! -
రష్యాకు సహకరిస్తే ఆంక్షలు తప్పవు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు చైనా ఆయుధపరమైన సాయం అందించడం, అమెరికా భూభాగంపైకి నిఘా బెలూన్ను పంపించడంపై అమెరికా తీవ్ర నిరసన తెలిపింది. రష్యాకు సాయమందిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా ఉన్నతస్థాయి దౌత్యవేత్త వాంగ్ యీతో శనివారం భేటీ అయ్యారు. ‘మా గగనతలంలోకి నిఘా బెలూన్ను పంపించడం అంతర్జాతీయ చట్టాలకు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటన పునరావృతం కారాదు’ అని బ్లింకెన్ స్పష్టం చేశారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధ, ఇతరత్రా సాయం అందజేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని కూడా బ్లింకెన్ చెప్పారు. అయితే ఇలాంటి చర్యలతో అమెరికా తన బలం చూపాలనుకుంటే విరుద్ధ ఫలితాలే వస్తాయని వాంగ్ యీ బదులిచ్చారు. -
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్‌కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్‌కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్‌కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్‌గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్‌పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్‌లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్‌లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
కశ్మీర్లో హిమపాతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు. 21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్ హపట్‌ఖుడ్ కాంగ్డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. -
చైనాలో వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?
బీజింగ్: చైనా జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేయడంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేస్తుందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2023లో కరోనాతో ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యుయేసన్ (ఐహెచ్ఎంఈ) హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చైనాలో కరోనా తారా స్థాయికి చేరుకుంటుందని దేశ జనాభాలో మూడో వంతు మంది కరోనా బారిన పడతారని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. చైనా అనుసరించిన కఠినమైన జీరో కోవిడ్ విధానాలపై ప్రజా నిరసన వెల్లువెత్తడంతో ప్రభు త్వం వాటిని పూర్తిగా ఎత్తేసింది. రోజుకి లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం వ్యాపిస్తు న్న ఒమిక్రాన్ వేరియెంట్‌కు చాపకింద నీరులా విస్తరించే గుణం ఉండడంతో ఎన్ని కఠినమైన నిబంధనలు విధించినా మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యంకాదని ముర్రే పేర్కొన్నారు. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
రంగంలోకి యూఎస్ సూపర్సోనిక్ బాంబర్లు
సియోల్: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్సోనిక్ బాంబర్ బీ–1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్–35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం సైతం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, ద.కొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించడం గమనార్హం. -
Moonlighting: మూన్‌లైటింగ్... తప్పా, ఒప్పా?
మూన్‌లైటింగ్. ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు. విప్రో సంస్థ ఇటీవల ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మరోసారి ఈ పేరు బాగా తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మెయిల్స్ పంపింది. మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని సుతరామూ ఆమోదించబోమని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా స్పష్టం చేసింది. స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ టీసీఎస్ కూడా పేర్కొంది. బడా ఐటీ సంస్థలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది... అనైతికమా? ఒక సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. నిజానికి అదనపు ఆదాయం కోసం పని వేళల తర్వాత చాలామంది ఇతర పనులు చేయడం కొత్తేమీ కాదు. బడుగు జీవులు వేతనం చాలక ఇలా చేస్తే ఏమో గానీ భారీ జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇతర సంస్థలకు, అదీ తమ ప్రత్యర్థులకు పని చేయడం అనైతికమన్నది ఐటీ సంస్థల వాదన. బెంగళూరులో ఓ ఐటీ సంస్థ ఉద్యోగికి ఏకంగా ఏడు పీఎఫ్ ఖాతాలున్నట్టు తేలడం సంచలనం సృష్టించింది. చిన్నాదా, పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా పీఎఫ్ ఖాతా తప్పనిసరి కావడం తెలిసిందే. విప్రో కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న తమ ఉద్యోగులను పీఎఫ్ ఖాతాల ద్వారానే గుర్తించిందని స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాజీవ్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఒరవడి మనకు కాస్త కొత్తగా అన్పించినా అమెరికాలో మాత్రం 2018లోనే బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 7.2 శాతం పెరిగిందట. అక్కడ మహిళలు అధికంగా మూన్‌లైటింగ్ చేస్తున్నట్టు తేలింది. సమర్థకులే ఎక్కువ... మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమే గాక సంస్థ పట్ల పచ్చి మోసమేనంటారు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. టీసీఎస్ అధిపతి గణపతి సుబ్రమణ్యం దీన్ని నైతిక సమస్యగా అభివర్ణించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాత్రం ఇందులో మోసమేముందని ప్రశ్నస్తున్నారు. ‘‘నిర్ణీత సమయం పాటు సంస్థలో పని చేస్తానంటూ ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ పని చేస్తే సంస్థకేంటి?’’ అన్నది ఆ్న ప్రశ్న. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ అయితే ఓ అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఓ విధానమే రూపొందిస్తామని ప్రకటించారు. మూన్‌లైటింగ్‌కు అనుమతించిన తొలి సంస్థగా ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ నిలిచింది. ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. మింట్ సర్వేలో 64.5 శాతం మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. అనైతికమన్న వారి సంఖ్య కేవలం 23.4 శాతమే. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ముంబైను పేల్చేస్తాం.. పోలీసులకు హెచ్చరిక
ముంబై: భారత వాణిజ్య రాజధాని ముంబైని పేల్చేస్తామంటూ అందిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి 26/11 తరహా దాడులకు పాల్పడతామన్న హెచ్చరిక మెసేజీలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెసేజీలు పాకిస్తాన్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు తేలిందని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ శనివారం మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు శనివారం విరార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వర్లిలోని ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో పలు మెసేజీలు అందాయి. ‘ముంబైని పేల్చేస్తాం. 26/11 తరహా దాడులను మరోసారి గుర్తుకుతెచ్చేలా చేస్తాం. భారత్‌లోని మా సహచరులు ఆరుగురు రంగంలోకి దిగారు. ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి’అని అందులో ఉంది. 26/11 దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, అల్ ఖైదా నేత అయ్మన్ అల్ జవహిరి పేర్లను కూడా ప్రస్తావించారు. చదవండి: భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని ఈ మేసేజీలు పాక్ కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ముంబై పోలీసులను, తీర ప్రాంత రక్షణ దళాలను అలెర్ట్ చేసి, ఆపరేషన్ కవచ్‌ను ప్రారంభించామని కమిషనర్ వివేక్ పేర్కొన్నారు. ‘మెసేజ్‌లలో పేర్కొన్న నంబర్లు, వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ నంబర్లు భారతీయులవిని తేలింది. అయితే, మెసేజీలు ఉర్దూలో కాకుండా హిందీలో ఉన్నాయి. పాకిస్తానీ నంబర్ నుంచి ఈ మెసేజీలు వచ్చినట్లు కనిపించేలా నకిలీ ఐపీని సృష్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లాహోర్‌కు చెందిన తోటమాలి ఫోన్ నంబర్ హ్యాకైందన్న అక్కడి మీడియా కథనాలను కూడా పరిశీలిస్తున్నాం’ అని కమిషనర్ చెప్పారు. ముంబై సమీపంలోని రాయగడ్ వద్ద ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవను బలగాలు స్వాధీనం చేసుకున్న మరునాడే ఈ హెచ్చరికలు రావడంతో యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 2008 నవంబర్ 26వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో జరిపిన దాడుల్లో 166 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. -
తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు
బీజింగ్: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్ పింగ్ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం. 140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది. గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. -
గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్‌గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ.. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్‌లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటారు. రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి. మూడో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు. రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే.. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్‌గా చెప్పవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తొలిదశలో గోదావరి నదికి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది. కాళేశ్వరం టూ ధవళేశ్వరం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్‌ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది. గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు. గాంధీ గడియారం... పేపర్ బాల్స్ ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్‌ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్చార్జి ఎస్ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది
మాస్కో: ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పుతిన్ శుక్రవారం దేశ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్యప్రాంతాలతో పాటు ఆక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్ను రష్యా డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయం వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో రూ.3,100 కోట్ల విలువైన ఆయుధ సాయం అందజేసింది. ఇందులో అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు తదితరాలున్నాయని అధికారులు చెప్పారు. -
ఖబడ్దార్! ఆ సంగతి మర్చిపోవద్దు.. పుతిన్ తీవ్ర హెచ్చరికలు
ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ లక్ష్యాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. ఆదివారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని పుతిన్ హెచ్చరించారు. -
అనుకరణ ఆమోదమేనా?!
ఉదయం నిద్ర కళ్లతోనే సోషల్ మీడియాను చూడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పని. ‘ఎంత బాగుంది...’ అనుకునే ఫొటోలు మన కళ్ల ముందు కుప్పలు తెప్పలు. వాటిని చూసి ‘నేనెందుకిలా ఉన్నాను’ అనే నిరుత్సాహంతో తమ శరీరంతో పోలిక. తర్వాత ‘నేనూ అలా ఉంటే బాగుండు’ అనే ఆలోచన. ఆ మరు నిమిషం ‘ఎలాగైనా సరే, నేనూ అంత అందంగా, ఫిట్‌గా మారిపోవాలి’ అనే నిర్ణయం... ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంటుంది. దీంతో ఏమవుతుంది!? తినే ఆహారంలో మార్పులు వచ్చేస్తాయి. చేసే వ్యాయామాల్లో మార్పులు. ప్రయత్నాలలో లోపం, సరిపడని ఆహారం.. అన్నీ ఒక్కోసారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సోషల్ మీడియా లో ఫిట్‌నెస్‌కు సంబంధించిన క్లిక్‌లు, ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయడంలో ఈ రెండేళ్లలో విపరీతం గా పెంచినట్టు ప్రముఖ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. సోషల్‌మీడియా కారణంగా ఫిట్నెస్ పట్ల ప్రభావితమైనవారు ఎలాంటి అనర్థాలకు లోనవుతున్నారో, వారి భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతూ అమెరికాలోని ఫ్లోరిడా మానసిక విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి, కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఇతరులతో పోలికలు శరీరాకృతి అందంగా ఉండాలని న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో గట్టి నిర్ణయమే తీసుకుని ఉంటారు. అందుకు మీ చేతిలోని ఫోన్ యాప్‌లలో పోస్ట్ అయ్యే అందమైన శరీరాకృతి గల మహిళలు, వారు చేస్తున్న ఫిట్నెస్ చర్యల గురించి తెలుసుకోవడానికి తెగ తనిఖీ చేస్తుంటారు. ఈ విషయంపై నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో బాడీ, మైండ్ ల్యాబ్‌ను నడుపుతున్న మనస్తత్వవేత్త రెనీ ఎంగెల్న్ –‘సాధారణంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చుకునే స్వభావం మనిషిలో ఉంటుంది. గతంలో తక్కువ స్థాయిలో ఉన్న ఈ స్వభావం సోషల్ మీడియా వల్ల ఈ పోలికలు వేగంగా ఎన్నడూ లేనంత గా అవకాశాలను అందిస్తోంది’ అంటారామె. నిరుత్సాహానికి 7నిమిషాలు ఎంగెల్స్, ఇతర మనస్తత్వవేత్తలు వ్యక్తుల మెదడు వారి చర్యలపై సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించడానికి 2020 నుంచి సామాజిక పోలిక సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. స్ఫూర్తిదాయకమైన హ్యాష్‌ట్యాగ్‌లను ట్రోల్ చేయడం లేదా తమ సొంత ఆరోగ్య ఆకాంక్షలకు కొంచెం మసాలాను జోడించడానికి ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం ఉత్సాహం కలిగిస్తుంది. అయితే, అవన్నీ తమ స్వీయ భావాన్ని దెబ్బతీస్తాయి. కాలేజీ అమ్మాయిలు కేవలం ఏడు నిమిషాలు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయడం వల్ల వారిలో తమ శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఫేస్‌బుక్‌ని ఉపయోగించిన దానికంటే ఎక్కువ బాడీ ఇమేజ్ పోలికలు, వారి రూపం గురించి ఎక్కువ ఆలోచించారని కనుక్కున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన సెలబ్రిటీ హెవీ కంటెంట్ ఆ పోలికలను పెంచడానికి కారణమైందని గుర్తించారు. అసూయతో స్క్రోలింగ్ చేసే అసంతృప్తి కేవలం మొదటి దశ మాత్రమే. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన మనస్తత్వవేత్త పమేలా ఎస్. కీల్ ఈ విషయంలో తినే రుగ్మతలు, శరీర ఇమేజ్ను ప్రభావితం చేసే సామాజిక అంశాలను పరిశోధించారు. 2020 అధ్యయనంలో కీల్, ఆమె సహోద్యోగులు ఎడిట్ చేసిన వారి ఫోటోలను పోస్ట్ చేసే వారి కంటే ఎక్కువగా తినే క్రమ రహిత ప్రవర్తనను ప్రదర్శించారని కనుక్కున్నారు. అన్ని రకాల డిజిటల్ వ్యూహాలు ఫొటోలను ఎడిట్ చేయడం అనే అంశాన్ని పార్టిసిపెంట్స్ ముందుకు తీసుకువచ్చారు. ఫోటోలను ఎడిట్ చేసిన పార్టిసిపెంట్స్ కి ఎలాంటి సూచన లూ చేయలేదు. వారు సోషల్ ‘మీడియాలో పోస్ట్ చేసేవి మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయమని మాత్రమే వారికి చెప్పాం. దీంతో అన్ని ఫిల్టర్లు, ఫేస్‌టైమ్ వంటి అనేక ఇతర డిజిటల్‌పరంగా తారుమారు చేసే వ్యూహాలన్నీ ఉపయోగించినట్టు మా ముందుకు వచ్చిన ఫొటోలు చూపాయి. ఈటింగ్ డిజార్డర్ లక్షణాలను ఎవరూ పెద్దగా పేర్కొనలేదు. కానీ వారు తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థుల ఇష్టాలు, వ్యాఖ్యలపై ఎక్కువ సమయాన్ని ఖర్చు చేశారని నిరూపించారు. చెడు సమాచారం మీకు నప్పని, హాని కలిగించే సమాచారం నుంచి సోషల్ మీడియా మిమ్మల్ని రక్షించదు. నిర్ణయాల అమలు, ఆందోళన రేకెత్తిస్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశ ఉంది. ‘ఆరోగ్యకరమైన ఆహారం‘పై 1.2 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్లను విశ్లేషించిన 2020 అధ్యయనం ఏం చెబుతుందంటే అలాంటి సమాచారం వెలిబుచ్చినవారిలో నిపుణులు ఎక్కువ మంది లేరని కనుక్కున్నారు. 8.5 శాతం కంటెంట్ తమకు తెలిసిన సమాచారాన్ని రీ పోస్ట్ చేయడం పైనే శ్రద్ధ చూపినట్టు తెలుస్తోంది. దీని కారణంగా ‘సులభం గా ప్రభావితమైన వ్యక్తులు‘ ఆహారం, ఆరోగ్యం గురించి రకరకాల ఉబుసుపోని కబుర్లు సృష్టిస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన ఉత్పత్తులు, సేవలను అందించే వాణిజ్య సంస్థల ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇతరులనూ చేయమని ప్రేరేపిస్తారు. ‘అందుకని ఒక పోస్ట్ నాణ్యతను ఎలా అంచనా వేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం’ అంటారు కీల్. అలాంటిదేదైనా గమనిస్తే ‘వాడద్దు’ అనే హెచ్చరికకు సంకేతం’ అని గుర్తించాలంటారు ఆమె. ఎందుకంటే, ఏ ఒక్కరికీ మిగతావారికి సరిపడే పోషకాలలో పోలిక ఉండదు. ఏం చేయాలంటే.. ‘మీరు మరొకరిని చూసి వారిలాగే అవాలనుకునే నిర్ణయాన్ని ఈ క్షణమే వదిలేయండి. ఒక వ్యక్తిగా ఎదగడం గురించి ఎదుటివారిని అనుసరించవచ్చు. ఆ విలువలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. కానీ, ఆహార– ఫిట్నెస్ తీర్మానాల్లో కాదు’ అంటారు కీల్. తోటివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ మీ కోసం ఓ మార్గాన్ని రూపొందించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వద్దు. ఆచరించే నియమాలివి.. నిరుత్సాహపరిచే సోషల్ మీడియా కంటెంట్ నుండి దూరం అవ్వాలనుకుంటే ఎంగెల్న్, ఆమె సహచరులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ► మొదటి దశగా మిమ్మల్ని తమ శరీరాకృతితో పోలిక తెచ్చే సోషల్ మీడియా అకౌంట్లను తీసేయండి. దానికి బదులుగా మిమ్మల్ని ఉత్తేజిత పరిచే సమాచారాన్ని తీసుకోండి. మరొక సులువైన పరిష్కారం కూడా ఉంది. అలాంటి ఫొటోలను పదే పదే చూస్తున్నాం అనుకుంటే ఆ యాప్‌ను పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియా నుండి విరామం మీ మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ► సోషల్ మీడియా వ్యక్తులు మీ సొంత లక్ష్యాలను ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తే, మీరు ఓటమికి లేదంటే కనీసం నిరుత్సాహానికి లోనవుతారు. ► మీ శరీరాకృతిని మార్చడానికి సంబంధించిన ఇతరుల నిర్ణయాలు ఏ మాత్రం విలువైనవి కావు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. -
ఆయన హెచ్చరికలు సజీవ సత్యాలు
ఆధునిక రాజకీయవ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే స్ఫూర్తి కావాలని నినదించిన మహోన్నత రాజ్యాంగం మనది. ప్రజా స్వామ్యం కేవలం రాజ కీయ పాలనా పద్ధతి మాత్రమే కాదు, సంపదలో సమాన పంపిణీ ఆవశ్యక తను చర్చించిన భావనగా రాజ్యాంగ రచనా సంఘం ఆవిష్కరించింది. అందుకు భారతీయ బౌద్ధం నుంచి ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని నిపుణులు వెలికి తీశారు. ఉత్పత్తి కులాల అణచివేతకు కారణాలను ఆనాడే గుర్తించారు. వీటిని అధిగమించాలంటే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థే దివ్యఔషధమనే ప్రతిపాదన ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య మూలాలున్న బౌద్ధం భారతీయుల వారసత్వ సంపదగా ప్రశంసలం దుకుంది. దీనిలో అభిప్రాయాల పరస్పర మార్పిడి, చర్చావిధానం రాజ్యాంగసభను సమ్మో హనపరిచాయని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడుతూ అన్నారు. ప్రజాస్వామ్య మన్నికకు వర్గరహిత సమాజం ఎంతో అవసరమని అంబేడ్కర్ పేర్కొన్నారు. అలాగే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు అవకాశం వుండాలన్నారు. ప్రభుత్వం గరిష్ఠ సామాజిక జీవనం ప్రాతిపదికగా బాధ్యత తీసుకోవాలి. సమాజం ప్రజాస్వామ్య బద్ధంగా లేనప్పుడు, ప్రభుత్వం కూడా అలా ఉండ టానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఉద్యోగుల మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆ ఉద్యోగులు వచ్చిన సామాజిక నేపథ్యం అప్రజాస్వామిక లక్షణాలు కలిగివుంటే ప్రభుత్వం కూడా అప్రజా స్వామికంగా మారిపోతుంది. ఈ సందర్భంలోనే ‘ప్రభుత్వం’ అనే పదాన్ని అంబేడ్కర్ నిర్వచించారు. ప్రభుత్వం అంటే మంచి చట్టాలు, మంచి పరిపాలన. ముఖ్యమైన విధులు న్యాయవ్యవస్థ చేతికి చేరాలి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు నిర్లక్ష్యానికి గురికాకూడదు. దీనిని విస్మ రించి పాలకులు తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తే, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కుంటువడుతుంది. తోటి మనిషి మీద గౌరవం, సమభావం కలిగి ఉన్నప్పుడే నిజమైన సమాజం ఏర్పడుతుందని, అదే పరిపూర్ణ ప్రజా స్వామ్యానికి పునాది కాగలుతుందనే విషయాన్ని తేటతెల్లం చేశారు. ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని, దీని కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. లేకుంటే భారత సమాజం పాలక వర్గం, పాలిత వర్గంగా విభజన చెంది, వ్యక్తి శ్రేయస్సుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రధానంగా రెండు విషయాలు మూలస్తంభాలుగా నిలవాలనేది రాజ్యాంగ నిర్దేశం. అవి ఒకటి సమర్ధ మైన పాత్ర పోషించగల ప్రతిపక్షం, రెండు నిజాయితీతో కూడిన ఎన్నికల నిర్వహణ. అప్పుడే అధికారమార్పిడి ప్రక్రియ సులభతరంగా జరుగు తుంది. ఈ వ్యవస్థ ద్వారానే అణగారిన ప్రజానీకం విముక్తి సుసాధ్యమవుతుంది. పరిపూర్ణ ప్రజా స్వామ్య మనుగడకు అడ్డంకిగా ఎన్ని అవరోధాలు ఎదురయినా జనబాహుళ్యం కలిగిన భారత దేశా నికి ప్రజాస్వామ్యమే శరణ్యంగా నిలిచింది. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలు చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లితేనే దాని ఫలాలు ప్రజల అను భవంలోకి వస్తాయని అంబేడ్కర్ అన్నారు. ప్రజా స్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరు గారిపోతాయన్న ఆయన హెచ్చరికలు ఎప్పటికీ సజీవసత్యాలుగా నిలుస్తాయి. -డాక్టర్ జి.కె.డి.ప్రసాద్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విశాఖపట్నం -
నన్ను దింపాలనుకుంటే మరింత డేంజర్!
ఇస్లామాబాద్: ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తనపై ఒత్తిడి తెస్తే తాను మరింత ప్రమాదకారిగా మారతానని పాకిస్తాన్ ప్రతిపక్షాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఇమ్రాన్ దిగిపోవాలని కోరుతూ పాకిస్తాన్ ప్రతిపక్ష కూటమి పీడీఎం మార్చిలో చేపట్టదలిచిన లాంగ్‌మార్చ్‌పై ఆయన స్పందించారు. ఈ యాత్ర విఫలమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ‘‘నేను వీధుల్లోకి వస్తే మీకు (ప్రతిపక్షాలు) దాక్కునేందుకు చోటు దక్కదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా దాదాపు డజను పార్టీలు పీడీఎంగా కూటమి కట్టాయి. ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మని, ఆర్మీ సహకారంతో అక్రమంగా ఇమ్రాన్ గద్దెనెక్కారని పీడీఎం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ జాతిద్రోహిగా తనకు కనిపిస్తున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. షరీఫ్ కుటుంబం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బాటలో లండన్ పారిపోకతప్పదన్నారు. మాజీ మిలటరీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్పై కూడా ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాయని, కానీ తాను అందుకు అవకాశమివ్వనని చెప్పారు. ఇమ్రాన్ బెదిరింపులు తాటాకు చప్పుళ్లని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలన్నీ ఆయన ఓటమికి సంకేతంగా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న ధరలు మాత్రమే తనకు అశాంతిని కలిగిస్తున్నాయని అంతకుముందు ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రపంచవ్యాప్త పరిణామమని, తామొక్కరి సమస్య కాదని వివరించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా, అఫ్గాన్ యుద్ధం తదితరాలు పాక్ రూపీపై నెగిటివ్ ప్రభావం చూపాయన్నారు. -
జీనియస్.. లెక్కలేనంత ఇష్టం!
వాషింగ్టన్: పాకిస్తాన్‌ను కేంద్రంగా చేసుకున్న ఉగ్ర ముఠాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రసంస్థలపై తగు కఠిన చర్యలు తీసుకోకుండా పాక్ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తోందని తన తాజా నివేదికలో అమెరికా తీవ్రంగా విమర్శించింది. మసూద్ అజర్, సాజిద్ మీర్ లాంటి ఉగ్రవాద నేతలు స్వేచ్ఛగా పాక్‌లో సంచరిస్తున్నా, వీరిని పాక్ అదుపులోకి తీసుకోవడంలేదని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదానికి సంబంధించిన 2020–నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం విడుదలచేశారు. అఫ్గానిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్ తాలిబన్లు, వాటి అనుబంధ హక్కానీ నెట్వర్క్ దాడులు చేస్తూనే ఉన్నాయని, మరోవైపు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో కోర్టులు జైలు శిక్షను విధించాయని తెలిపింది. ఎఫ్ఏటీఏ గ్రేలిస్టు నుంచి తప్పించుకునేందుకు పాక్ కొన్ని చర్యలు చేపట్టిందని, కానీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని మదర్సాలో తీవ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారని నివేదిక తెలిపింది. ఐసిస్‌లో 66 మంది భారతీయ సంతతి! అంతర్జాతీయ ఉగ్రసంస్థ ఐసిస్‌లో 66మంది భారతీయ సంతతికి చెందినవారున్నారని ఉగ్రవాదంపై అమెరికా నివేదిక శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ, స్థానిక ఉగ్ర మూకలను గుర్తించి నిర్మూలించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏలాంటి భారత ఉగ్రవ్యతిరేక దళాలను నివేదిక ప్రశంసించింది. ఎయిర్‌పోర్టుల్లో కార్గో పరీక్షకు రెండు తెరల ఎక్స్రేతెరలను వాడేందుకు భారత్ అంగీకరించిందని నివేదిక తెలిపింది. అలాగే వాయుమార్గంలో ప్రయాణించే వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించే ఐరాస ప్రతిపాదన అమలకు కూడా ఇండియా సుముఖంగా ఉందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ తెలిపారు. పలు ఒప్పందాల ద్వారా ఉగ్రపోరులో భారత్‌తో బలమైన భాగస్వామ్యం పెంచుకుంటున్నామని వెల్లడించా రు. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసులను ఎన్ఐఏ విచారించిందని, 160మందిని అరెస్టు చేసిందని, వీరిలో 10మంది ఆల్‌ఖైదా ఆపరేటర్లని నివేదిక తెలిపింది. ఉగ్రసమాచారం అందించాలన్న యూఎస్ అభ్యర్థనకు భారత్ సానుకూలంగా స్పందిస్తోందని బ్లింకెన్ తెలిపారు. టెర్రరిస్టుల్లో టెక్నాలజీ వాడకంపై భారతీయ అధికారులు ఆందోళనగా ఉన్నారన్నారు. పలు దేశాలతో భారత్ ఉగ్ర కట్టడికి కలిసి పనిచేస్తోందని నివేదిక వెల్లడించింది. -
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
Xi Jinping: తైవాన్ విలీనం తప్పనిసరి!
బీజింగ్: తైవాన్ను చైనాతో విలీనం చేసితీరతామని ఆదేశాధ్యక్షుడు జీ జింగ్పింగ్ మరోమారు స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అవసరం లేదంటూ పరోక్షంగా యూఎస్, జపాన్‌కు హెచ్చరికలు పంపారు. ఇటీవల కాలంలో తైవాన్ గగనతలంలోకి పలుమార్లు చైనా విమానాల చొరబాట్లు జరిగాయి. ఎప్పుడైనా చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. మరోవైపు తైవాన్‌కు అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఇందుకోసం తైవాన్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా తనను తాను భావిస్తుండగా, చైనా మాత్రం అది తమ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తిఉన్న ప్రాంతంగా భావిస్తోంది. చైనా విముక్తి వార్షికోత్సవాల్లో జింగ్పింగ్ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనాతో తైవాన్ విలీనానికి తైవాన్ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకన్నారు. తమతో కలవడంతో కలిగే ప్రయోజనాలను తైవాన్ భవిష్యత్‌లో గ్రహిస్తుందన్నారు. తైవాన్ విలీనం చైనీయులందరి కోరికగా అభివరి్ణంచారు. చదవండి: చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం వివాదం ఎందుకు? 1911 తిరుగుబాటు అనంతరం చైనా పాలన కిందకు తైవాన్ వచ్చింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్య్రం కోసం పోరాడుతోంది. అయితే బలప్రయోగం ద్వారానైనా తైవాన్ను కలుపుకోవాలన్నది చైనా యోచనగా నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ అగ్రిమెంట్‌ను చైనా గౌరవిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధిపతి బైడెన్ చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్యలుండవని ఆశిస్తున్నామన్నారు. చైనా మాత్రం తైవాన్ అంశంలో బయటివారి ప్రమేయం అక్కర్లేదని ఘాటుగా బదులిచి్చంది. ఇది తమ అంతర్గత వ్యవహారమని చెప్పింది. హాంకాంగ్లాగానే వన్ కంట్రీ, టూ సిస్టమ్స్ విధానాన్ని తైవాన్‌తో కుదుర్చుకుంటామని చైనా చెబుతోంది. కానీ హాంకాంగ్ విషయంలో చివరకు చైనా పెత్తనమే అంతిమమైంది. పైగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని చైనా పేర్కొంటోంది. తైవాన్ అధ్యక్షుడు సైఇంగ్ వెన్ మాత్రం తమకు స్వాతంత్య్రమే అక్కర్లేదన్నారు. జింగ్పింగ్ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. అయితే సవరణలతో జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయన యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా -
కాబూల్ దాడి: ముందే హెచ్చరించిన బైడెన్
అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయంపై ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వచ్చే 24 లేదంటే 36 గంటల్లో దాడి జరుగుతుందన్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరించాల్సిన నేపథ్యంలో గడువులోగా ఉగ్రవాదులు మళ్లీ దాడులకు తెగబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ‘‘మా కమాండర్లు నాతో చెప్పారు. 24–36 గంటల్లో మళ్లీ దాడులు జరిగే అవకాశం అత్యధికంగా ఉంది. కాబూల్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి’’అని బైడెన్ చెప్పారు. కాబూల్‌లో ఉన్న ప్రతీ అమెరికన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఉన్న సైనిక బలగాలను ఆదేశించినట్టుగా బైడెన్ వెల్లడించారు. ఐసిస్–కె ఉగ్రవాద సంస్థపై తాము చేసిన డ్రోన్ దాడి ఆఖరిది కాదని బైడెన్ అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న వారిని విడిచిపెట్టమని, పేలుళ్ల వెనుక హస్తం ఉన్న ప్రతీ ఒక్కరినీ మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంటామని బైడెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ నుంచి తరలింపును గడువులోగా పూర్తి చేస్తామన్నారు. ఇంకా అక్కడ మిగిలి ఉన్న∙వారిని సురక్షితంగా తీసుకువచ్చే పనిలో ఉన్నామని బైడెన్ వివరించారు. విమానాశ్రయం దగ్గర దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఆ చుట్టు పక్కలకు ఎవరూ రావొద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది. అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ 300 మంది పౌరులను గడువులోగా తీసుకొస్తామని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. -
Kabul Airport Attack: ఐసిస్–కె అంటే తెలుసా?
కాబూల్ విమానాశ్రయాన్ని రక్తమోడించిన ఐసిస్–కె సంస్థ అఫ్గాన్‌లో తన పట్టు మరింత బిగించాలని చూస్తోంది. అటు అమెరికా, ఇటు తాలిబన్లకు గట్టి హెచ్చరికలు పంపడానికే ఈ దారుణానికి ఒడిగట్టింది. తాలిబన్లతో ఇప్పటికే ఆధిపత్య పోరాటంలో ఉన్న ఈ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లతో అమెరికాకి పక్కలో బల్లెంలా మారింది. అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది? ఏమిటీ ఐసిస్–కె? ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో కార్యకలాపాలు సాగిస్తున్న కరడుగట్టిన భావజాలం ఉన్న ఉగ్రవాదులు కొందరు 2014లో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాకిస్తానీ తాలిబన్ ఫైటర్లు మొదట్లో ఈ గ్రూపులో చేరారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లో తొలిసారిగా వీరి కదలికలు కనిపించాయి. ప్రస్తుత అఫ్గానిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్‌లో భాగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలిచేవారు. వీరి ప్రధాన కార్యాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. పాకిస్తాన్‌కి మాదకద్రవ్యాలు, అక్రమంగా మనుషుల్ని రవాణా చేయాలంటే ఈ మార్గంలోనే వెళ్లాలి. ఈ ప్రాంతానికి గుర్తుగా వీరిని ఐసిస్–కె లేదంటే ఐఎస్–కె అని పిలుస్తారు. మధ్య, దక్షిణాసియాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమే వీరి లక్ష్యం. ఇక్కడ చదవండి: ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు! ఎన్నో అరాచకాలు తాలిబన్లు కేవలం అఫ్గానిస్తాన్‌కు పరిమితమైపోతే ఐసిస్–కె ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులపై జీహాద్‌కు పిలుపునిచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనాల ప్రకారం ఐసిస్–కెలో 2017–18 సంవత్సరంలోనే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా 100కి పైగా దాడులు చేసింది. ఇక అమెరికా–అఫ్గాన్, పాకిస్తానీ బలగాలపై 250 దాడులు జరిపింది. 2020లో కాబూల్ విమానాశ్రయం, , కాబూల్ యూనివర్సిటీపై దాడులు, అధ్యక్ష భవనంపై రాకెట్లతో దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. ఇవే కాకుండా అమ్మాయిలు చదువుకునే పాఠశాలలపై దాడులకు దిగడం, ఆస్పత్రుల్లో మెటర్నటీ వార్డులపై దాడులకు పాల్పడి గర్భిణిలను, నర్సులను నిర్దాక్షిణ్యంగా కాల్చేయడం చేశారు. షియా ముస్లింలపై అధికంగా దాడులకు చేస్తున్నారు. చదవండి:Donald Trump: దేశం శోకంలో మునిగిపోయింది.. ట్రంప్ భావోద్వేగం ఇంకా ఎలాంటి ప్రమాదాలున్నాయ్? తాలిబన్ల క్రూరత్వమే భరించలేనిదిగా ఉంటే ఐసిస్–కె మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. షరియా చట్టాలను పూర్తిగా మార్చేసి తాము సొంతంగా రూపొందించిన నియమ నిబంధనలను అఫ్గాన్ ప్రజలపై రుద్దాలని ఈ సంస్థ చూస్తోంది. తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం లేదన్నది వీరి భావన. తాలిబన్లు, ఐసిస్–కె మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అమెరికాతో తాలిబన్లు శాంతి చర్చలకు వెళ్లడం కూడా ఈ సంస్థకి అసలు ఇష్టం లేదు. శాంతి ఒప్పందాల వల్ల జీహాద్ లక్ష్యాలను చేరుకోలేమని వీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడీ దాడులతో అమెరికాకు కూడా పక్కలో బల్లెంలా మారింది. హక్కానీ నెట్వర్క్ అండ తాలిబన్లతో వీరికి ఏ మాత్రం సరిపడదు కానీ తాలిబన్లకు అత్యంత సన్నిహితంగా మెలిగే హక్కానీ నెట్‌వర్క్‌తో సత్సంబంధాలున్నాయి. ఐసిస్–కె, హక్కానీ నెట్వర్క్, పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఇతర సంస్థలు ఉమ్మడిగా పన్నాగాలు పన్ని ఎన్నో దాడులకు దిగారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత జైళ్లలో ఉన్న వారిని చాలా మందిని విడుదల చేశారు. వారిలో ఐఎస్, అల్ ఖాయిదా ఉగ్రవాదులు ఐసిస్–కెతో చేతులు కలిపారు. హక్కానీ నెట్వర్క్ సభ్యులే ఈ సంస్థకి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారన్న అనుమానాలున్నాయి. బలమెంత? 2014లో ప్రారంభమైన ఈ సంస్థ 2016 నాటికి అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. ఆ సమయంలో ఈ సంస్థలో 3 వేల నుంచి 8,500 మంది వరకు ఉగ్రవాదులు ఉండేవారు. కానీ అమెరికా, అఫ్గాన్ బలగాలతో పాటు తాలిబన్లు జరిపిన దాడుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. 2019 నాటికి ఈ సంస్థలో సభ్యుల సంఖ్య 2,000–4,000కి పడిపోయింది. మన దేశంలోని కేరళ యువకులు 100 మందిపై ఈ సంస్థ వల వేసి లాగేసుకుంది. గెరిల్లా పోరాటంలో ఈ సంస్థ ఉగ్రవాదులకి అత్యంత నైపుణ్యం ఉంది. పలుమార్లు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ సంస్థ ఏర్పడినప్పుడు పాకిస్తానీ తాలిబన్ హఫీజ్ సయీద్ ఖాన్ ఈ సంస్థకు చీఫ్‌గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా ఉన్న అధుల్ రాఫ్ అలీజా అమెరికా చేసిన దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం షహాబ్ అల్‌ముజీర్ ఈ సంస్థకి చీఫ్‌గా ఉన్నాడు. అతను సిరియాకి చెందినవాడని భావిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బెదిరింపులకు భయపడం..తైవాన్‌పై మా నిర్ణయం మారదు
బీజింగ్: చైనాను బెదిరించాలనుకునే విదేశీ శక్తులు 140 కోట్ల దేశ ప్రజలు, శక్తిమంతమైన దేశ మిలటరీలతో కూడిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాను వ్యతిరేకించే దేశాలకు జిన్‌పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షిక ఉత్సవాలను గురువారం ప్రతిష్టాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మావో జెడాంగ్ భారీ చిత్రపటం నేపథ్యంలో.. తియానన్మెన్ గేట్ బాల్కనీ నుంచి వేలాది దేశభక్తులను ఉద్దేశించి జిన్‌పింగ్ ప్రసంగించారు. చైనాలో తైవాన్ పునఃవిలీనం తమ చరిత్రాత్మక లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అమెరికా పేరును ప్రస్తావించకుండా.. చైనాను భయపెట్టే అవకాశం ఏ విదేశీ శక్తికి ఇవ్వబోమని సీపీసీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ కూడా అయిన జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య చర్యలకు పాల్పడుతోందని అమెరికా సహా ఇండో పసిఫిక్ దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చైనాతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడం, ఆ దిశగా వాణిజ్య ఆంక్షలు విధించడంతో పాటు, మానవహక్కులు, కరోనా పుట్టుక.. తదితర అంశాలపై చైనాను విమర్శించడం తెలిసిందే. ‘విదేశాల బెదిరింపులకు భయపడం. మనం ఇంతవరకు ఏ దేశాన్ని భయపెట్టలేదు.. అణచివేయలేదు.. వేధించలేదు. ఇకపై కూడా అలా చేయబోం. అలాగే, ఏ దేశం కూడా మనల్ని భయపెట్టే, అణచివేసే, వేధించే చర్యలకు పాల్పడితే సహించబోం’ అని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. 3ఒకవేళ ఏ దేశమైనా అందుకు తెగిస్తే.. 140 కోట్ల మందితో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్‌ను ఢీ కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో దాదాపు 70 వేల మంది పార్టీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కార్యక్రమంలో అత్యాధునిక జే 20 ఫైటర్ జెట్స్ సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేత విన్యాసాలు చేశాయి. ఉత్సవాల్లో మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీలో మావో తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ ఎదిగారు. పార్టీ శతవార్షిక ఉత్సవాల్లో 100 ఏళ్ల క్రితం పార్టీ వ్యవస్థాపకుడు మావో తరహాలో గ్రే కలర్ సూట్‌ను ధరించి జిన్‌పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తైవాన్ విలీనంపై రెండో ఆలోచన లేదని ఈ సందర్భంగా జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ‘దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే విషయంలో దేశ ప్రజల ప్రతిన, పట్టుదల, అసాధారణ సామర్ధ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు’ అని వ్యాఖ్యానించారు. తైవాన్ను స్వతంత్ర దేశంగా ఆ దేశస్తులు భావిస్తారు. కానీ చైనా మాత్రం అది చైనా భూభాగమేనని వాదిస్తోంది. ఒకవేళతైవాన్‌ను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నిస్తే.. తైవాన్‌కు మిలటరీ సాయం అందించాలని అమెరికా చట్టాల్లోనే ఉంది. రెండు పర్యాయాలు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను తొలగిస్తూ రాజ్యాంగ సవరణ చేసి, నచ్చినంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా జిన్‌పింగ్ ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా సాయుధ దళాలను ఆధునీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సి ఉందని జిన్ పింగ్ పేర్కొన్నారు. సాయుధ దళాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను 1921 జులై 1 న మావో ప్రారంభించారు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నుంచి సీపీసీ అధికారంలో కొనసాగుతోంది. సీపీసీని చైనా ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమవడం ఖాయమని ఈ సందర్భంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. 95 లక్షల మంది పార్టీ సభ్యులు, 140 కోట్ల దేశ ప్రజలు ఆ పరిస్థితిని రానవ్వరన్నారు. సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్‌లను ఏరివేస్తామని, పార్టీలో అసమ్మతిపై పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, హాంకాంగ్‌లో చైనా నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడాన్ని జిన్‌పింగ్ సమర్థ్ధించారు. ‘మనకు చెప్పే హక్కు తమకే ఉందని భావించే వారి నీతులను వినే ప్రసక్తే లేదు’ అని అమెరికాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థి క వ్యవస్థపై మాట్లాడుతూ.. మైలురాళ్ల వంటి సంస్కరణలతో కేంద్రీకృత ఎకానమీని సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా విజయవంతంగా మార్చగలిగామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. -
చైనా నేత నన్ను హెచ్చరించేందుకు ప్రయత్నించారు
లండన్: అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌తో కూడిన క్వాడ్ కూటమిని బలోపేతం చేయవద్దంటూ చైనా అగ్రనేత ఒకరు తనను హెచ్చరించేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఇండో–పసిఫిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాడన్నారు. సదరు నేత పేరును మాత్రం బయటపెట్టలేదు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఇది జరిగిందని తెలిపారు. క్వాడ్ పేరుతో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ను ఒకే ఛత్రఛాయలోకి తీసుకురావద్దని చైనా నాయకుడు కోరాడని గుర్తుచేసుకున్నారు. 4 దేశాలు కూటమి కట్టకుండా, కలిసి పని చేయకుండా ఉండాలన్నదే ఆ నాయకుడి ఉద్దేశమని వివరించారు. -
కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి మూలాలపై ఎడతెగని చర్చ కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మరో కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మూలాలు పూర్తిగా అర్థం చేసుకోకపోతే కోవిడ్-26, కోవిడ్-32 కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలియకపోవడం వల్ల భవిష్యత్తులలో వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోడైరెక్టర్ పీటర్ హోటెజ్ తెలిపారు. కోవిడ్-19 ఆనవాళ్లు కనుక్కోలేకపోతే విలయాలు తప్పవని అమెరికా శాస్త్రవేత్త , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా ఉన్న స్కాట్ గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరిన్ని విలయాలను నివారించేందుకు చైనా ప్రభుత్వ సహకారం అవసరమని ఆయ పేర్కొన్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైనట్లు ఆధారాలు బలపడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా సహకారం కావాలని, భవిష్యత్తు మహమ్మారులను అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవని స్కాట్ తెలిపారు. చైనాలో సుదీర్ఘ కాలం విచారణ చేపట్టేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలన్నారు. అలాగే అక్కడి మనుషులు, జంతువుల నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు శాస్త్రవేత్తలను అనుమతించాలని హోటెజ్ తెలిపారు. సైంటిస్టులు, ఎపిడమాలజిస్ట్‌లు, వైరాలజిస్టులు, బ్యాట్ ఎకాలజిస్ట్ పరిశోధకులు హుబే ప్రావిన్సులో సుమారు ఆరు నెలలు ఉండాలని హోటెజ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆంక్షలు, బెదిరింపులతో సహా, చైనాపై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి మూలాలు చైనాలోనే ఉన్నాయనే, నిజాలు చెప్పకుండా ప్రపంచాన్ని మోసం చేసిందని ట్రంప్ మొదటినుంచి చైనాపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే వుహాన్‌లో చేపల మార్కెట్లో తొలుత వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకి ఉండి ఉంటుందని చాలామంది వైరాలజిస్టులు అంచనా వేశారు. దీనిపై బిన్న వాదనల మధ్య కొనసాగుతున్న ఈ చర్చ దాదాపు ఏడాదిన్నర తరువాత మే 23న వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో మరింత రాజుకుంది. వుహాన్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు పేర్కొనడంతో కరోనా ఆనవాళ్లపై అంతర్జాతీయంగా చర్చ తిరిగి మొదలైంది. మరోవైపు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండే లీక్ అయ్యిందా అనే దానిపై తమ నిఘా విభాగం కీలక అంచనాలు తమ వద్ద ఉన్నాయనీ, దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆదేశించారు. దీనిపై 90 రోజుల్లో తనకు నివేదించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. చదవండి : వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్ చేసుకోవాలన్న తృణమూల్ కాంగ్రెస్ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు. -
సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్డౌన్ దిశగా..?
ముంబై: ‘మాస్క్ పెట్టుకోండి. భౌతికదూరం పాటించండి. పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ప్రభుత్వం విధించిన అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించండి లేదంటే మరోసారి లాక్‌డౌన్‌కి సిద్ధం కండి’ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబై వాసులకి చేసిన హెచ్చరిక ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ నెమ్మది నెమ్మదిగా సాధారణ జన జీవనం నెలకొంటూ ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు ఇంకా భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందని శివసేన పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో 14శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్ సిగ్నల్ పడకపోయినా, ఎల్లో వార్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదు అని రాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఠాక్రే లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌనే శరణ్యమని హెచ్చరించారు. కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే.. ► కరోనా కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివేవీ ప్రజలు చేయడం లేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న 15 లక్షల మందికి జరిమానాలు వేయడంతో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. ► ముంబైలో స్థానిక రైళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంక్షల మధ్య తిరుగుతున్నాయి. మొదటి పదిహేను రోజుల్లోనే ఏకంగా 3 వేల మంది ప్రయాణికులు మాస్కులు లేకుండా తిరగడంతో జరిమానాలు విధించారు. గత వారంలో ముంబైలో రోజుకి సగటున వెయ్యి వరకు కేసులు పెరుగుతున్నాయి. ► ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. విదర్భ, మరఠ్వాడా వంటి ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అదే ప్రాంతంలోని అమరావతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల రేటు 33శాతం పెరిగిందని రాష్ట్ర కోవిడ్ బృందం అధికారి డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కేవలం 199 మంది మాత్రమే ఉన్న ససుర్వె గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత 62 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ► గత ఏడాదంతా కోవిడ్ కారణంగా వివాహాలు, ఇతర కుటుంబ వేడుకల్ని వాయిదా వేసిన ప్రజలు కొత్త ఏడాదిలో కరోనా కేసులు కాస్త తగ్గడంతో పెద్ద ఎత్తున ఫంక్షన్లు నిర్వహించడం, సమూహాల్లో తిరగడం కేసుల్ని పెంచి పోషించాయి. కరోనా ఆంక్షలివే ► పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు 50 మందికి మించి అతిథుల్ని ఆహ్వానించకూడదు ► నిరసన ప్రదర్శనలు, ర్యాలీలపై తాత్కాలిక నిషేధం ► ఒక భవనంలో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే రాకపోకలు పూర్తిగా నిషేధిస్తారు ► మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా భారీగా జరిమానాలు -
సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్!
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలపై ట్విటర్లో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారి అకౌంట్లు బ్లాకింగ్ వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సామాజిక మాధ్యమాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఎఫ్‌డీఐలు తెచ్చి, భారత చట్టాలను గౌరవించాలని చెప్పారు. ట్విట్టర్లో విద్వేషపూరిత ట్వీట్లు పెడుతున్న వారందరి ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ ఆ సంస్థ సంపూర్ణంగా ఆ పని నిర్వహించకపోవడంతో రవిశంకర్ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా, ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ట్విట్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు అండగా ఉండి విద్వేషాన్ని వెళ్లగక్కేవారి ఖాతాలను సస్పెండ్ చేసిన సామాజిక మాధ్యమాలు ఎర్రకోట ఘటన సమయంలో అదే తరహాలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు తమ దగ్గర కుదరవని అన్నారు. ‘తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు. మీరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చారు. అదే చేసుకోండి. చట్టాలకు కట్టుబడి వ్యవహరించండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం’అని హెచ్చరించారు. -
డిస్టర్బ్ చేశావు, ఎలా నిద్రపోనిస్తాను?
సాక్షి, అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్‌కుమార్‌పై ఓ ఉద్యోగి బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను మాజీ వీసీ శ్రీనివాస్‌కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. జేఎన్టూయూ అనంతపురం సూపరింటెండెంట్ ఎం.డీ నాగభూషణం తనను వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా బెదిరిస్తున్నారని చెప్పారు. ‘మీ జాతకంలో ఏమైనా గండాలు ఉన్నాయా? ఉంటే చూసుకోండి... నీకు.. నాకు వ్యక్తిగత కక్షలు లేవు.. మరి ఎందుకు నన్ను బదిలీ చేశారు? నేను అక్కడికి రావాలా.. వద్దా....? ఆన్సర్ చెప్పండి సార్.. మౌనంగా ఉంటే ఎలా? నిన్ను ఎలా నిద్రపోనిస్తాను?' అంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి ఇటీవల సూపరింటెండెంట్ నాగభూషణంను కలికిరికి బదిలీ చేశారన్నారు. జేఎన్టీయూ అనంతపురం నుంచి కలికిరి బదిలీకి తానే కారణమన్నట్లు తనను బెదిరిస్తున్నారని చెప్పారు. అతని బదిలీ జరిగిన కొద్ది రోజులకే అంటే గతేడాది డిసెంబర్ 8న వీసీ పదవీ విరమణ పొందానన్నారు. వీసీ పదవిలో లేననే ఉద్దేశంతో సదరు సూపరింటెండెంట్ వార్నింగ్‌లు ఇస్తున్నాడన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే ఉన్న ఉద్యోగం చేసుకోలేక మాజీ అధికారికి సూపరింటెండెంట్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. (చదవండి: వాట్సాప్‌లో పెళ్లి పిలుపు, ఫేస్బుక్లో లైవ్) -
ట్రంప్‌కు కరోనాపై సెటైర్లు : ట్విటర్ హెచ్చరిక
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విటర్ వేదికగా సెటైర్లు, అనుచిత కమెంట్ల వెల్లువ కురుస్తోంది. దీనిపై స్పందించిన ట్విటర్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌పై నోటి దురుసును ప్రదర్శించిన యూజర్ల ఖాతాలను నిలిపివేస్తామని ట్వీట్ చేసింది. మరణం, తీవ్రమైన శారీరక హాని, ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి రావాలని కోరుకోవడం లాంటి ట్వీట్లను సహించం. తక్షణమే వాటిని తొలగిస్తామని వెల్లడించింది. ఒక వ్యక్తి మరణం కోరుకునే ట్వీట్లు తమ నిబంధనలకు విరుద్ధమని, ఈ విధానం వినియోగదారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్నింటిని సస్పెండ్ చేస్తున్నట్లు ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా : ట్రంప్‌నకు మరో దెబ్బ) కరోనా సోకిన ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి జోబైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ట్రంప్ త్వరగా కోలుకోవాలని అభిలషించారు. అయితే ట్విటర్ యూజర్లు మాత్రం తరచూ నోటి దురుసు ప్రదర్శించే ట్రంప్‌పై అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యోక్తులతోపాటు మీమ్స్ షేర్ చేస్తూ చాలామంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ హ్యాజ్ కోవిడ్ హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. అటు ట్రంప్ దంపతులకు కరోనా సోకిన విషయానికి చైనా అధికారిక మీడియా కూడా భారీ ప్రధాన్యమే ఇస్తోందట. (త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ) ‘అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కొత్త నాటకానికి (సర్కస్)కు తెరతీశారు’ అంటూ ఒకరు, మొత్తానికి ట్రంప్ ఒక పాజిటివ్ వార్తను ట్వీట్ చేశారంటూ గూనర్ అనే మరొకరు చేయగా, ‘దేవుడా.. దేవుడా.. మీరు మాకు కావాలి.. ఆయన్ని కాపాడండి, ప్లీజ్’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. ప్రధానంగా కోల్ గోర్మన్ అనే నెటిజన్ చేసిన ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కొవిడ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ వైరస్‌కు చివరికి ఎలాంటి గతి పట్టింది. అది త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కరోనా రూపంలో ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బపడింది. ట్రంప్, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడటమే కాదు, ప్రధాన సలహదారు, ఒక సెనేటర్, ఆయన ప్రధాన ప్రచార నిర్వాహకుడికి కూడా వైరస్ సోకింది. దీంతో ప్రచార కార్యక్రమాలకు వీరు తాత్కాలింగా దూరంకానున్నారు. Is it still a “Democrat hoax?” Are you still going to mock people for wearing masks? Are you sorry for lying to the American people for months? I ask these b/c I assume you’ll get the best taxpayer funded gov’t healthcare avail + genuinely hope you recover. But you owe us answers https://t.co/cOvMX7eElq — Sophia Bush (@SophiaBush) October 2, 2020 Shit happens#Memes #Trump #TrumpHasCovid pic.twitter.com/sQl36O79Q7 — stay for the memes (@strator) October 2, 2020 😉 Live ....from "Walter Reed" #WalterReed #WalterReedHospital #Trump #TrumpHasCovid #MichaelMoore 😷please be good & safe & healthy, everyone. pic.twitter.com/gKF3qgDd6o — A.Silver-MeMEs & GIFs (@SilverAdie) October 3, 2020 -
అమెరికాను కాదంటే పన్నుల మోత
వాషింగ్టన్: అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలను ఎంపిక చేసుకుంటే వాటిపై పన్నుల మోత మోగుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కరోనా వైరస్ చైనాలో వెలుగు చూసి అక్కడి పరిశ్రమలన్నీ మూతపడడం.. ఆ దేశ సరఫరా వ్యవస్థపై ఆధారపడిన దేశాలు ఇబ్బందులు పడడం తెలిసిందే. దీంతో పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా, తయారీలో కొంత వరకు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాలకు తరలించాలని అమెరికాతోపాటు ఇతర దేశాల కంపెనీలు యోచిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ తన తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలనుకుంటున్నట్టు న్యూయార్క్‌పోస్ట్ కథనం పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్ స్వదేశానికే రావాలంటూ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నులు అనేవి తయారీ కేంద్రాలను అమెరికాకు తరలించే కంపెనీలకు ప్రోత్సాహకమని ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి తెలివి తక్కువ సరఫరా వ్యవస్థ ప్రపంచమంతటా భిన్న ప్రదేశాల్లో ఉంది. ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే మొత్తం వ్యవస్థ గందరగోళంలో పడుతుంది. కనుక ఈ సరఫరా వ్యవస్థ మొత్తం అమెరికాలోనే ఉండాలి. ఈ పని చేయడానికి మాకు కంపెనీలు ఉన్నాయి’’ అన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరికలకు కొత్త వాటిని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత తయారైన, దిగుమతి చేసుకున్న, ప్యాక్ అయిన పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై మొదటి సెట్ హెచ్చరికలను, రెండో సెట్ హెచ్చరికలను వచ్చే ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ముద్రించాలి. వీటి తయారీ, సరఫరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించే వారు ఈ హెచ్చరికలను ప్యాకేజీలపై ముద్రించాలంటూ సవరించిన ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలను ఆ నోటిఫికేషన్లో వివరించింది. వీటిని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం జైలుశిక్ష, జరిమానా ఉంటాయి. ప్యాకేజీలపై ముద్రించాల్సిన హెచ్చరికలు.. ‘పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లే సంభవిస్తున్నాయి. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే’. ఈ హెచ్చరికలతో కూడిన రెండు చిత్రాలను 12 నెలలకు ఒకటి చొప్పున అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపైన ముద్రించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. -
ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలపై హింసాత్మక చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ విమానాన్ని గత బుధవారం పొరపాటున కూల్చేశామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ ప్రమాద మృతులకు నివాళిగా టెహ్రాన్‌లోని ఆమిర్ కబీర్ వర్సిటీలో శనివారం ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో పాల్గొ న్న ఇరాన్‌లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్ని అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బ్రిటన్ మండిపడింది. ఆమిర్ కబీర్ యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, ఇటీవల అమెరికా దాడిలో చనిపోయిన జనరల్ సులైమానీ పోస్టర్లను చింపేశారని ఇరా న్ మీడియా తెలిపింది. మరోవైపు, ఆందోళనలను అణచేయడంపై ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. గత నవంబర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపడాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ ‘శాంతియుత నిరసనకారులపై మరో ఊచకోత జరగకూడదు. ఇంటర్నెట్పై ఆంక్షలను సహించం. ఇరాన్ ప్రజలారా! మీకు నా సహకారం కొనసాగుతుంది’ అన్నారు. ఆందోళనలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాల్లో ఇరాన్ బలగాలను మోహరించింది. కాగా ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి తమదే బాధ్యతని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఆ విమానాన్ని క్షిపణిగా భావించడంతో తమ మిస్సైల్ ఆపరేటర్ సొంతంగా నిర్ణయం తీసుకుని కూల్చేశాడని పేర్కొంది. సమాచార వ్యవస్థలో 10 సెకండ్ల పాటు అడ్డంకి ఏర్పడటంతో ఉన్నతాధికా రుల నుంచి ఆ ఆపరేటర్ ఆదేశాలు తీసుకోలేకపోయాడని, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ పొరపాటు చేశాడని వివరించారు. -
బీజేపీ అధినాయకత్వంపై ఏక్నాథ్ ఖడ్సే కినుక
జల్గావ్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటానంటూ బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అధినాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ‘అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో నా కుమార్తెతో పాటు మరికొందరు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కారణాలపై ఆధారాలు చూపాను. సంబంధీకులపై చర్యలు తీసుకోవాలని కోరాను’అని తెలిపారు. ‘పార్టీని వీడి వెళ్లాలనుకోవడం లేదు. పార్టీలో ఇవే రీతిగా అవమానాలు కొనసాగుతుంటే మరో మార్గం ఆలోచిస్తా’అని తెలిపారు. -
‘ప్రయోగాలు’ ఫలించలేదు!
విరాట్ కోహ్లికి చిన్నస్వామి స్టేడియం అంటే తన ఇంటి పెరడు లాంటిది! పన్నెండు ఐపీఎల్ సీజన్లలో పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అతనికంటే ఆ మైదానం గురించి మరెవరికీ తెలీదు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేయడం కంటే లక్ష్య ఛేదన సులువైన విషయం. కానీ టాస్ గెలిచిన కోహ్లి ‘సాహసం’ పేరుతో ముందుగా బ్యాటింగ్‌కు సిద్ధపడ్డాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కావాలంటూ టి20 జట్టుతో ప్రయోగాలకు ప్రయత్నిస్తున్నాడు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి టీమిండియా వ్యూహాలపై కొత్త చర్చకు దారి తీసింది. కొత్త ప్రయోగం విఫలమైనట్లా... ఇది ఇలాగే కొనసాగుతుందా! సాక్షి క్రీడా విభాగం బెంగళూరులో ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఆరు సార్లు కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంది. మొదటిసారి కోహ్లి దీనికి భిన్నంగా వెళ్లాడు. చిన్న బౌండరీలతో పాటు సాయంత్రం మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు పట్టు చిక్కదనే విషయం కూడా కోహ్లికి బాగా తెలుసు. కానీ టాస్ సమయంలోనే దీని గురించి మాట్లాడిన కోహ్లి మ్యాచ్ తర్వాత కూడా తన మాటకు కట్టుబడ్డాడు. ‘వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి కాబట్టి ఈ వ్యూహం కూడా అందులో భాగమే. మేం అన్ని రంగాల్లో బలంగా ఉండాలనుకుంటున్నాం. ఛేదనలో అంతా బాగుంటోంది కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఆటగాళ్లకు తెలియాలి. మ్యాచ్ ఫలితం ముఖ్యమే అయినా కొంత సాహసం కూడా చేయాల్సిందే. లేదంటే అనుకున్నది సాధించలేం. ప్రపంచ కప్‌కు ముందు అన్ని రకాల పరిస్థితులకు అలవాటు పడాలనేదే మా ప్రయత్నం’ అని కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేయడంపై వివరణ ఇచ్చాడు. సుదీర్ఘ లైనప్ ఉన్నా.. అయితే కెప్టెన్ ఆలోచనను అమలు పర్చడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఒక్క ధావన్ మినహా అంతా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 9, 10వ స్థానాల్లో ఆడుతున్న సుందర్, దీపక్ చహర్‌లకు కూడా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా... కోహ్లి ఆశించినట్లు వారేమీ పరుగులు చేయలేకపోయారు. నిజానికి రెండేళ్ల పాటు వరుసగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లను బ్యాటింగ్ చేయలేరనే కారణంతోనే జట్టు పక్కన పెట్టింది. కాబట్టి పేరుకు పదో స్థానం వరకు బ్యాట్స్‌మెన్ ఉన్నారని చెప్పుకున్నా అది పనికి రాలేదు. ‘భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ తీసుకున్నాం. గతంలో టి20ల్లో 20–30 పరుగులు తక్కువ చేసి ఓడిపోయాం. దాంతో కనీసం 9వ నంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ చేసే వారు ఉంటే భారీ స్కోరు చేయవచ్చని ఆశించి ఈ ప్రయత్నం చేశాం. అయితే ఈ పిచ్‌పై అది సాధ్యం కాలేదు’ అని విరాట్ విశ్లేషించాడు. 134 పరుగులే చేశాక ఎలాంటి బౌలర్లయినా మ్యాచ్‌ను కాపాడలేరంటూ తన బౌలర్లకు మద్దతు పలికాడు. నిజాయితీగా ఆలోచిస్తే ఒక 20 ఓవర్ల మ్యాచ్‌లో టాప్–6 బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించలేకపోతే తర్వాతి వారి నుంచి ఆశించడంలో అర్థం లేదన్నాడు. పంత్, అయ్యర్ నువ్వా నేనా..! వన్డేల్లో సుదీర్ఘ కాలంగా భారత నంబర్–4 ఆటగాడిపై అనిశ్చితి కనిపిస్తోంది. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారో చెప్పలేని స్థితి. కానీ ఆదివారం మ్యాచ్‌లో ఇది మరీ పరిధి దాటినట్లు అనిపించింది! నేను ముందు వెళ్తానంటే లేదు లేదు నేను వెళతాను అన్నట్లుగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ముందుకు రావడం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఎనిమిదో ఓవర్లో ధావన్ అవుటయ్యాక పంత్, అయ్యర్ ఇద్దరూ ఒకేసారి మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అంటే ఎవరు ఆ స్థానంలో వెళ్లాలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా టీమ్ మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వలేదంటే దీనిని చిన్న తప్పుగా చూడలేం. సమాచారం లోపం అంటూ కోహ్లి సర్ది చెప్పుకున్నా అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఎప్పుడూ చూడని వైనం. కోహ్లి క్రీజ్‌లో ఉన్నాడని అనుకున్నా... అటు కోచ్, బ్యాటింగ్ కోచ్‌లకు కూడా ఇది తెలియకపోవడం విశేషం. ‘చిన్న సమాచార లోపంతో తప్పు జరిగింది. పది ఓవర్ల తర్వాత వికెట్ పడితే పంత్, పది ఓవర్ల లోపయితే అయ్యర్ రావాలనేది వ్యూహం. దీని గురించి విక్రమ్ రాథోడ్ వారిద్దరితో మాట్లాడారు. అయితే దానిని అర్థం చేసుకోవడంలో ఇద్దరూ పొరపడ్డారు. ఇంకా వారిద్దరు క్రీజ్‌కు చేరుకొని ఉంటే ఆ దృశ్యం ఎలా ఉండేదో’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ప్రయోగాలు ఏ రూపంలో చేసినా ఫలితం సానుకూలంగా ఉండటమే ముఖ్యం. టి20 వరల్డ్ కప్‌కు చేరువవుతున్న కొద్దీ కోహ్లి బృందం ఇంకా ఎలాంటి కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతుందో చూడాలి. పంత్ స్థానం మార్చాలి: వీవీఎస్ లక్ష్మణ్ రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అతని ఆట శైలికి ఆ స్థానం సరైంది కాదని అతను విశ్లేషించాడు. ‘పంత్ సాధారణంగా దూకుడుగా ఆడతాడు. అతని స్వభావానికి నాలుగో స్థానంలో సఫలం కాలేకపోతున్నాడు. అక్కడ ఎలా పరుగులు చేయాలో అతనికి తెలియడం లేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలనే ఒత్తిడి కూడా అతనిపై ఉంది. కాస్త దిగువకు 5 లేదా 6 స్థానాల్లో ఆడించే స్వేచ్ఛనిస్తే పంత్ చెలరేగిపోగలడు’ అని వీవీఎస్ సూచించాడు. కోహ్లికి ఐసీసీ శిక్ష ప్రత్యర్థి ఆటగాడిని దురుద్దేశపూర్వకంగా ఢీకొట్టినందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు. దీంతో పాటు అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ శిక్షగా విధించారు. చివరి టి20 మ్యాచ్ ఐదో ఓవర్లో హెన్డ్రిక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడి పరుగు తీసే సమయంలో ఎదురుగా వస్తున్న బౌలర్ భుజానికి కోహ్లి భుజం బలంగా తగిలింది. దీంతో కలిపి ప్రస్తుతం కోహ్లి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. -
ఎవరినీ ఉపేక్షించం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కైలాశ్ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే. ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం. -
ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది: ట్రంప్
వాషింగ్టన్: 2015 నాటి అణు ఒప్పందం లోని నిబంధనలను ఉల్లంఘించి యురేనియం నిల్వలను అనుమతించిన స్థాయికి మించి పెంచి ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. యురేనియం నిల్వలను పెంచుకోవడాన్ని ఆపాలంటూ అమెరికా విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు. అణు ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ తొలిసారిగా గత సోమవారం ఉల్లంఘించింది. ‘ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది. నేను కొత్తగా ఇరాన్‌కు చెప్పదలచుకున్నది ఏదీ లేదు. అయితే తాము నిప్పుతో ఆడుకుంటున్నామన్న విషయాన్ని ఇరాన్ గుర్తెరగాలి’ అని ట్రంప్ శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. అనంతరం శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘యూరేనియంను చిన్న మొత్తంలో నిల్వ చేసుకునేలా అణు ఒప్పందంలో ఇరాన్‌కు అవకాశం కల్పించడమే తప్పు. అసలు ఏ స్థాయిలోనూ యురేనియం నిల్వలను కలిగి ఉండేందుకు ఇరాన్‌ను అనుమతించి ఉండాల్సింది కాదు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు అమెరికాతోపాటు మా మిత్రదేశాలు కూడా ఎప్పటికీ అనుమతించవు’ అని అన్నారు. అణు ఒప్పందం ప్రకారం 300 కేజీల వరకు యురేనియంను నిల్వచేయొచ్చు. -
కశ్మీర్లో అలజడికి ఉగ్ర కుట్ర
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమైనట్లు పాకిస్తాన్ హెచ్చరించింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో ఉగ్రవాదులు దాడికి ప్రణాళిక రచించినట్లు తమ నిఘావర్గాలు గుర్తించాయని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తరహాలోనే కారులో అత్యాధునిక పేలుడు పదార్థాలను(ఐఈడీ)లను పేర్చుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయబోతున్నారని పేర్కొంది. షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు కొన్నిరోజుల ముందు ఈ సమాచారాన్ని భారత్, అమెరికాలతో పంచుకున్నట్లు పాక్ చెప్పింది. ఉగ్రవాదం విషయంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన విమర్శలు, నిందలను తప్పించుకునేందుకే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలన్నీ హైఅలర్ట్‌గా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది జకీర్మూసాను భద్రతాబలగాలు కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయని వ్యాఖ్యానించారు. పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు, ఓ పోలీస్ అధికారి అమరులయ్యారు. -
మాతో పెట్టుకుంటే మటాష్!
వాషింగ్టన్: తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ మాతో యుద్ధం చేయాలనుకుంటే అధికారికంగానే ఆ దేశాన్ని తుడిచిపెట్టాల్సి వస్తుంది. మరోసారి అమెరికాను బెదిరించే సాహసం కూడా చేయలేదు..’ అని ట్రంప్ ఆదివారం ట్వీట్లో హెచ్చరించారు. ఇటు ఇరాన్ మిలిటరీ చర్యలపై ట్రంప్ అధికారులతో చర్చించారు. ఆదివారం ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఒకరిలా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో మంది మరణించాల్సి వస్తుంది..’ అని చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జవద్ జరీఫ్ స్పందిస్తూ...ట్రంప్ యుద్ధ హెచ్చరికలకు జంకేది లేదన్నారు. ఇరాన్‌ను ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ‘ఇరానియన్లు దురాక్రమణలను దాటుకొని వేలకొలది మైళ్లు విస్తరించారు. ఆర్థిక ఉగ్రవాదం, యుద్ధ బెదిరింపులతో ఇరాన్‌ను అంతం చేయలేరు.. ఇరానియన్లను గౌరవించే ప్రయత్నం చేయండి.. దాంతో ఏదైనా ఫలితముంటుంది..’ అని అన్నారు. -
గతితప్పిన రుతురాగం.. పెరుగుతున్న వేసవి నిడివి
సాక్షి, హైదరాబాద్: మొన్నటి శీతాకాలంలో ఎన్నడూ లేనంత చలిని రాష్ట్ర ప్రజలు చవిచూశారు. మూడు, నాలుగు రోజులపాటు తీవ్ర చలిగాలులతో జనం అసౌకర్యానికి గురయ్యారు. మార్చి మధ్యలో ప్రారంభం కావాల్సిన వేసవి.. ఫిబ్రవరి నుంచే ఎండలతో ఠారెత్తిం చింది. ఎండలు దంచుతుండగానే వాతావర ణంలో మార్పులతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు కురిశాయి. అంతలోనే పరిస్థితి మారి ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా జూన్ నుంచే వర్షాకాలం షురూ కావాల్సి ఉండగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలా రుతువులు గతి తప్పి జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వాతావరణం ఎప్పు డెలా మారుతుందో అంతుబట్టడం లేదు. ఈ పరిస్థితి వాతావరణ అధికారులను కూడా తికమక పెడుతోంది. వారిచ్చే హెచ్చరికలు ఒక్కోసారి అటు–ఇటు అవుతున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. తీవ్రమైన కాలుష్యం, చెట్లను తెగ నరకడం, పట్టణీకరణ తదితర కారణాల వల్లే పరిస్థితి మరింత దిగజారిందనేది వారివాదన. రెండు, మూడు దశాబ్దాలుగా వాతావరణంలో ఊహించలేని మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అకాలవర్షాలు (గాలివానలు, వడగండ్లు) ఇబ్బందికరంగా మారాయి. వాతావరణంలో వేడి ఎక్కువవడం కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీజన్లో వచ్చే మార్పులు పంట కాలంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు జూన్ నుంచే సాగుకు సిద్ధమవుతుంటారు. కానీ వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్లలో పడుతుండటంతో అప్పటికే పంట చేజారిపోతోంది. రబీ కాలాన్ని ఖరీఫ్ ఆక్రమిస్తుంది. గతి తప్పిన రుతువులతో పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. దీంతో తెలంగాణలో వ్యవసాయం అదుపుతప్పింది. ఎండలు, అకాల వర్షాలతో రైతన్న కుదేలు వాతావరణ మార్పుల వల్ల ఒక్కోసారి అధిక ఎండలు, ఆ వెంటనే అకాల వర్షాలు తెలంగాణ వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. సీజన్లు సరైన సమయాల్లో రానందున ఎప్పుడేం జరుగుతుందో రైతుకు అంతుబట్టడంలేదు. 2018–19 వ్యవసాయ సీజన్‌ను పరిశీలిస్తే జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక చివరి రెండు వారాల్లో సాధారణం కంటే 15% అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అవి మొక్క దశలో ఉండగా జులైలో 30% లోటు వర్షాపాతం నమోదైంది. దీంతో వేసిన పంటలు ఎండ తీవ్రతకు మాడిపోయాయి. ఆగస్టులో మళ్లీ 18% అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు వరి నాట్లకు ఉపక్రమించారు. కానీ అప్పటికే వేసిన పత్తి పంటపై తీవ్రమైన ప్రభావం పడింది. సెప్టెంబర్ నాటికి సరికి మళ్లీ వర్షాలు 35% అధికంగా కురిశాయి. దీంతో తెలంగాణలో దాదాపు సగం విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి పంటకు గులాబీరంగు పురుగు సోకింది. అసందర్భంగా కురుస్తున్న వర్షాలతో పత్తి దిగుబడి 30% తగ్గింది. మొత్తంగా చూస్తే 2018–19లో 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రబీ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. పైగా సాగునీటి వనరులున్న చోట.. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వరిపంటను నాశనం చేశాయి. రబీ మొదలయ్యాక గత 4నెలల కాలంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. గత డిసెంబర్లో పెథాయ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 42 మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జనవరిలో వచ్చిన అకాల వర్షాలతో కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వివిధ జిల్లాల్లో కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు 12,990 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తాజాగా ఈ నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇవన్నీ వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన పరిణామాలే కావడం గమనార్హం. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అకాల వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొన్నిచోట్ల 47–49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్ల 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వడగాడ్పులు వచ్చే రోజుల సంఖ్య పెరుగుతోంది. వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే.. ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే వాటిని వడగాడ్పులు అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. కొన్నిసార్లు 45 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే కూడా వడగాడ్పులుగానే పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులుగా గుర్తిస్తారు. ఇలాంటి వడగాడ్పులు తెలంగాణలో ఈసారి 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముంది. 2016 వేసవిలో ఏకంగా 27 రోజులుపాటు తెలంగాణలో వడగాడ్పులు ప్రతాపం చూపించాయి. వీటి కారణంగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు. తేమశాతం పెరగడంతోనే భగభగ ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదై, గాలిలో తేమ 75% ఉంటే, దాని ప్రభావం 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. 31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కాబట్టి ఉష్ణోగ్రత సాధారణమైన తేమ శాతాన్ని బట్టి కూడా వేసవి తీవ్రతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పట్టణీకరణ వల్ల కాలుష్యం, కాంక్రీటు, తారు రోడ్లు, సిమెంటు భవనాలు, ఇతరత్రా నిర్మాణాల వల్ల కూడా వేడి తీవ్రత మరింత పెరుగుతుంది. ఎంత ఎండాకాలమైనా ఒకప్పుడు హైదరాబాద్ చల్లగానే ఉండేదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎండలతో మండిపోతుంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలుంటాయి. అంటువ్యాధుల విజృంభణ 2030 నాటికి వాతావరణఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకందదని ఐక్యరాజ్యసమితి గతేడాది స్పష్టం చేసింది. దాని ప్రభావం వల్ల భారత్‌లో వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల కీటకాలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయని హెచ్చరించింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా లక్షలాది మంది మృత్యువాతపడతారు. అంతేకాదు ఎండ తీవ్రతకు కిడ్నీ వ్యాధులు పెరుగుతాయి. చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఎండల నుంచి, వడగాడ్పుల నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు, పెద్దల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి. పంట దిగుబడులపై పెను ప్రభావం వాతావరణ మార్పులు, భూతాపం వల్ల వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెను విపత్తు ముంచుకురానుంది. కొన్ని దశాబ్దాలుగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో వ్యవసాయ పంట దిగుబడులు, పంటల ఉత్పాదకత, పశు సంపద, పాల దిగుబడిపై ప్రభావం పడిందని కేంద్రం ఒక నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి దేశంలో వరి, గోధుమ దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదికలో ప్రస్తావించిన ముఖ్యంశాలు.. ఖరీఫ్‌లో వర్షానికి, వర్షానికి మధ్య ఎక్కువ రోజుల అంతరాయం (డ్రైస్పెల్) ఏర్పడటం, రబీ సీజన్లో సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగితే వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 10 క్వింటాళ్ల వరకు తగ్గుతుంది. వడగాడ్పులు వీచే ప్రాంతాల్లో పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గి రైతులు ఆదాయం కోల్పోతారు. వడదెబ్బ కారణంగా కోళ్లు చనిపోయి పౌల్ట్రీ రంగంలో నష్టాలు పెరుగుతాయి. వాతావరణకాలాలు మారే కొద్దీ సముద్రంలో చేపల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుంది. కరువు, వరదల వల్ల ఉద్యాన పంటలైన పళ్లు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. కోస్తా, తీరప్రాంతాల్లో సముద్రమట్టం పెరగడం, తుఫాన్లు, పెనుతుఫాన్ల వల్ల ఉప్పునీరు సారవంతమైన భూముల్లోకి వచ్చి చౌడు నేలలుగా మారుస్తోంది. పంటలకు వచ్చే చీడపీడల బాధ అంతకంతకు పెరుగుతుంది. చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పుదినుసుల దిగుబడి గణనీయంగా తగ్గనుంది. చిరుధాన్యాల కొరత 2025 నాటికి 33%, 2050 నాటికి 43 శాతానికి పెరగనుంది. పప్పుధాన్యాల కొరత 7శాతానికి పెరగనుంది. 2050 నాటికి దేశంలో సగటున ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీల వరకు పెరుగుతాయి. 2020 నాటికి అనేక పంటల ఉత్పాదకత స్వల్పంగా తగ్గుతుంది. 2100 నాటికి 10 నుంచి 40 శాతానికి తగ్గుతుంది. పదేళ్లలో మరిన్ని మార్పులు గత పదేళ్లలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. ప్రతీ ఏడాదీ మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సాధారణం కంటే కనీసం మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో వడగాడ్పుల దినాలు మరింతగా పెరిగే అవకాశముంది. వాతావరణంలో వేడి పెరగడం వల్లే గాలివానలు, వడగండ్లు పెరుగుతున్నాయి. సీజన్లలో మార్పులు వస్తున్నాయి. అయితే ఏమేరకు వచ్చాయన్న దానిపై పరిశీలించాలంటే వందల ఏళ్ల వాతావరణ మార్పులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
మాజీ మంత్రి కుమారుడికి బెదిరింపులు..?
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కుమారుడిని పలువురు శనివారం ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఓ హత్యతో సంబంధం ఉందని దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, బయటకు తెలియకుండా ఉండాలంటే తమకు రూ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని సమాచారం. దీనిపై పోలీసులకు మాజీ మంత్రి తనయుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
సాక్షి ప్రతినిధి, చెన్నై/కన్యాకుమారి: ఉగ్రవాదులపై పోరాటం విషయంలో భారత్ ఇకపై నిస్సహాయంగా ఉండబోదని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. తమిళనాడు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు. ఎవరివైపు ఉన్నారో స్పష్టం చేయండి.. ఐఏఎఫ్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్ల దేశమంతా గర్వపడుతోందని మోదీ తెలిపారు. భారత తొలి మహిళా రక్షణమంత్రిగా తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ ఉండటంపై నేను గర్వపడుతున్నానని వెల్లడించారు. బాలాకోట్ జైషే స్థావరంపై వైమానిక దాడి, పాక్‌కు చెందిన ఎఫ్–16ను కుప్పకూల్చడం ద్వారా భారత సాయుధ బలగాల సామర్థ్యం మరోసారి తేటతెల్లమయిందన్నారు. కానీ కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలు దేశానికి చేటు చేసేలా, పాకిస్తాన్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నేతలు భారత బలగాలవైపు ఉన్నారా? లేక స్వదేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారి తరఫున ఉన్నారా? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎఫ్ సిద్ధమైనా యూపీఏ ఒప్పుకోలేదు మోదీ తాత్కాలికమనీ, దేశమే శాశ్వతమని ప్రధాని అన్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాదులను శిక్షిస్తారని దేశమంతా భావించినప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అప్పట్లో భారత వాయుసేన సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం అనుమతించలేదని ఆరోపించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేత విషయంలో సాయుధ బలగాలకు పూర్తిస్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 1.1 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. -
పాక్‌కు అమెరికా హెచ్చరిక
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఆశ్రయం కల్పించడాన్ని తక్షణం మానుకోవాలని పాకిస్తాన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. పుల్వామా ఉగ్రదాడిని అగ్ర దేశం ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ శాండర్స్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండడాన్ని పాక్ విరమించుకుని ఆ దేశంలో ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతును నిలిపేయాలి. పుల్వామాలో దాడి వల్ల అమెరికా, భారత్‌ల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం, సమన్వయం మరింత పెరుగుతాయి’ అని తెలిపారు. బాధిత కుటుంబాలు, భారత ప్రభుత్వం, ప్రజలకు తాము సానుభూతి తెలుపుతున్నామన్నారు. -
గగనంలో ఉత్కంఠ
ముంబై: ఢిల్లీ గగనతల సమాచార ప్రాంతంలో(ఎఫ్ఐఆర్)లో ఘోర ప్రమాదం తప్పింది. సమీపంగా వచ్చిన మూడు విమానాలు ఢీకొనకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), ఇతర ఆటోమేటిక్ హెచ్చరికలు నిలువరించాయి. ఆ సమయంలో 3 విమానాల్లో కలపి వందలాది ప్రయాణికులు ఉన్నారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) విచారణ ప్రారంభించింది. డచ్ విమానం కేఎల్ఎమ్, తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్, అమెరికా విమానం నేషనల్ ఎయిర్‌లైన్స్ ఎన్సీఆర్ 840 దాదాపు ఢీకొనేంత దగ్గరికొచ్చాయి. తొలుత ఎన్సీఆర్ 31 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా.. ఇవా విమానం ఎన్సీఆర్కు చేరువగా వచ్చింది. రెండు విమానాల్లో అంతర్గత హెచ్చరికలు జారీచేయడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కేఎల్ఎమ్ 33 వేల అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరికల నేపథ్యంలో ఎన్సీఆర్ 35 వేల అడుగుల ఎత్తుకు ఎగిరి చక్కర్లు కొట్టింది. తర్వాత ఎడమ వైపు తిరగాలని ఏటీసీ ఆదేశించింది. ఈ మధ్యలో ఇవా.. కేఎల్ఎం ఎగురుతున్న 33 వేల అడుగుల ఎత్తుకు చేరడంతో మరో హెచ్చరిక జారీ అయింది. దీంతో ఇవాను పైలట్లు కేఎల్ఎం నుంచి దూరంగా నడిపారు. అదే సమయంలో ఎన్సీఆర్ 33 వేల అడుగుల స్థాయికి దిగిరావడంతో ఇవాకు సమీపంగా వచ్చింది. దీంతో మరోసారి హెచ్చరిక పంపి ప్రమాదాన్ని తప్పించారు. -
మరో సునామీ రావచ్చు
కార్టియా: ఇండోనేసియాపై మరోసారి సునామీ విరుచుకుపడే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. గతవారం విస్పోటనం చెందిన ఆనక్ క్రకటోవా అగ్ని పర్వతం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరో భారీ సునామీకి సంకేతంగా వారు భావిస్తున్నారు. దీని కారణంగానే రెండో తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా అనేక విస్పోటనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. ఇప్పటివరకు ఆనక్ క్రకటోవా అగ్ని పర్వత ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం(నో గో జోన్)గా ఉండగా.. తాజాగా దీనిని ఐదు కిలోమీటర్లకు పెంచారు. గత శనివారం విస్పోటనం ధాటికి భారీగా ఎగిసిన బూడిద, వేడి వాయువులు, ఇతర అగ్ని పర్వత మిశ్రమాలు అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. బూడిద, ఇసుక ఎగిసిపడుతున్న నేపథ్యంలో సిలేగాన్, సెరాంగ్ పట్టణ ప్రజలు మాస్కులు, కళ్లద్దాలు ధరించాలని అధికారులు తెలిపారు. -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు