మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు | dont step out from noon to 3 pm avoid: telangana | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు

Published Sat, Apr 6 2024 6:16 AM | Last Updated on Sat, Apr 6 2024 12:37 PM

dont step out from noon to 3 pm avoid: telangana - Sakshi

ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచనలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్‌ వేవ్‌ అలర్ట్‌ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. 

జాగ్రత్తలు... 

► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి.  
► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్‌ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా 
లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్‌ ఉన్న సీజనల్‌ పండ్లు, కూరగాయలు తినాలి. 
► సన్నని వదులుగా ఉండే కాటన్‌ వ్రస్తాలు ధరించడం మంచిది. 
► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్‌ వంటి వాటిని ధరించాలి.  
► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్‌ వేసుకోవాలి. 

► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి.  
► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి.  
► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.  మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.  
► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి.  

► అధిక ప్రోటీన్‌ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. 
► పార్క్‌ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. 
► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. 

► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. 
► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.  
► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్‌లు, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement