sun affect
-
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్‌తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్‌ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్‌ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్‌ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. -
భావి ఒలింపిక్స్‌కు వడదెబ్బ!
ఇదీ పారిస్ ఒలింపిక్స్‌తో వాతావరణం ఆటాడుకున్న తీరు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడా వేడుకల నిర్వహణను దేశాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ 2050 నాటికి చాలా దేశాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలగానే మిగలనుంది. ఆయా దేశాల్లో ఎండలు ఇప్పటికే ఠారెత్తిస్తుండటం, 2050కల్లా ప్రమాదకర స్థాయిని దాటేలా ఉండటమే ఇందుకు కారణం. ఒలింపిక్స్ జరిగేదే ప్రధానంగా వేసవిలోనే. కనుక ఉష్ణోగ్రతలు 27.8 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటి నిర్వహణను రద్దు చేయాలన్నది అంతర్జాతీయ క్రీడా నిపుణుల సిఫార్సు. ఆ లెక్కన గతంలో ఒలింపిక్ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా (అమెరికా), బీజింగ్ (చైనా), ఏథెన్స్ (గ్రీస్), టోక్యో (జపాన్) వంటి పలు నగరాలకు ఇంకెప్పటికీ ఆ అవకాశం దక్కబోదు. ఆ నగరాల్లో వేసవిలో ఎండలు మండిపోవడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే (2028) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎండలపరంగా చూసుకుంటే ఏ మేరకు సురక్షితమన్న ఆందోళన ఇప్పట్నుంచే మొదలైంది. ఆదివారం అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటేయడమే ఇందుకు కారణం! పారిస్‌లో ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో, రోజురోజుకూ ప్రమాదం అంచులకు నెడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం మరో తార్కాణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో చాలావరకు 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉండబోవని ప్రఖ్యాత క్లైమేట్ సైన్స్, అనలిటిక్స్ స్వచ్ఛంద సంస్థ ‘కార్బన్ప్లాన్’ హెచ్చరించింది. వాటిలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల ధోరణి ఆధారంగా రూపొందించిన గణాంకాలతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ మేరకు పేర్కొంది.ఎన్నో సమస్యలు... ఎండలు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధిని దాటితే ఒలింపిక్స్ నిర్వహణకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు... → ప్రఖ్యాత అథ్లెట్లు చాలా మంది ప్రధానంగా చలి దేశాల నుంచే వస్తారు. ఈ స్థాయి ఎండలను వాళ్లు అస్సలు తట్టుకోలేరు → దాంతో క్రీడాకారులు ఎండకు సొమ్మసిల్లిపోవడం, వడదెబ్బ బారిన పడటం వంటి సమస్యలు పొంచి ఉంటాయి → ఇవి వారిలో తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. → 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి 100 మంది అథ్లెట్లలో ఒకరు ఎండలకు తాళలేక కళ్లు తేలేశారు! → దాంతో మారథాన్, వాకింగ్ వంటి ఈవెంట్లను పర్వతప్రాంత నగరమైన సపోరోకు మార్చినా లాభం లేకపోయింది. ఆరుగురు వాకర్లు, రన్నర్లు వడదెబ్బ బారిన పడ్డారు.ఇలా కొలుస్తారు... సమస్యలకు దారితీసే స్థాయి ఎండ వేడిమిని వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్‌గా పిలుస్తారు. వేడి, తేమ, గాలి వేగం, సూర్యుని కోణం, మేఘావరణం వంటి పలు అంశాల ప్రాతిపదికన దీన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఒలింపిక్స్ నిర్వహణకు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధి 27.8 డిగ్రీ సెల్సియస్‌గా నిర్ణయించారు. ఎండలు అంతకు మించితే పోటీల వాయిదా, అవసరమైతే రద్దు తప్పనిసరని అంతర్జాతీయ క్రీడా నిపుణులు చెబుతారు. వచ్చే ఒలింపిక్స్ సంగతి ఏమిటీ?2028 ఒలింపిక్స్‌కు వేదిక అమెరికాలోని లాస్ ఏంజెలెస్. అక్కడ పసిఫిక్ గాలుల కారణంగా వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదని భావించారు. కానీ ఒకట్రెండేళ్లుగా లాస్ ఏంజెలెస్‌లో ఎండలు గట్టిగానే ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా ఆదివారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు అక్కడ క్రమంగా పరిపాటిగా మారుతుండటం ఒలింపిక్ కమిటీని ఇప్పటినుంచే ఆందోళనపరుస్తోంది. 2032 ఒలింపిక్స్‌కు ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ వేదిక కానుంది. వేసవిలో అక్కడ కూడా ఎండలు ఠారెత్తిస్తాయి. కానీ ఒలింపిక్స్ నిర్వహించే జూలై చివరి నాటికి శీతాకాలమే ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండబోదని భావిస్తున్నారు. మనకు కష్టమే! 2036 ఒలింపిక్స్ వేదిక ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద పరీక్షగానే మారనుంది. అందుకు బిడ్స్ వేసిన ఆరు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడా సంరంభాన్ని నిర్వహించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఇండొనేసియా నూతనంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రాజధాని నుసంతర, దోహా (ఖతర్), ఇస్తాంబుల్ (తుర్కియే), వార్సా (పోలండ్), శాంటియాగో (చిలీ) కూడా బరిలో ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతల కోణంలో చూస్తే అహ్మదాబాద్, çనుసంతర, దోహాల్లో ఒలింపిక్స్ నిర్వహణ అస్సలు సాధ్యపడకపోవచ్చు. ఇది అంతిమంగా వార్సా, శాంటియాగోలకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. వాటి తర్వాత ఇస్తాంబుల్ కూడా ఉష్ణోగ్రతపరంగా కాస్త అనువుగానే ఉండనుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుమతించే పక్షంలో అహ్మదాబాద్‌కు చాన్సుంటుంది. -
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్‌లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
అమెరికాలో టోర్నడోల బీభత్సం
హూస్టన్: అమెరికాలో పలు ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో 28 మందికి పైగా చనిపోయారు. వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్ సహా 16 రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు టెక్సాస్, ఆస్టిన్, డాలస్, న్యూ మెక్సికో, ఒక్లహామా, అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇలినాయీ, మిస్సోరీ, కెంటకీ, టెన్నెస్సీల్లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
మండుతున్న ఎండలు
నిజామాబాద్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనే అత్యధికంగా మెండోరాలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సీజన్లో జిల్లాలోనూ ఇదే అత్యధికం. ఈ వేసవిలో మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీలకు చేరుకుంటే.. ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. వేకువజామున స్వల్పంగా మంచు పడుతూ చలి పెడుతోంది. శనివారం సగటు ఉష్ణోగ్రతలు 37.2(గరిష్టం), 20.8(కనిష్టం) డిగ్రీలుగా నమోదైంది. ఎండ వేడికి ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో రోడ్లపై జన సందడి తగ్గింది. దుకాణాలు పగటిపూట బంద్ చేసి సాయంత్రం వేళ తెరుస్తున్నారు. – సుభాష్‌నగర్ -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
నిప్పులు కురిపించిన సూరీడు
ఖమ్మం: జిల్లాలో ఎండ వేడి అగ్నిగుండాన్ని తలపించింది. ఉష్ణోగ్రతలు శుక్రవారం తారాస్థాయికి చేరడంతో నేలకొండపల్లి, ముదిగొండ, సత్తుపల్లి మండలాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఇందులో నేలకొండపల్లిలో 46.5, ముదిగొండ మండలం బాణాపురం, పమ్మిలో 46.2, సత్తుపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో వాతావరణంలో మార్పు కనిపించకపోగా, ప్రజలు ఎండ వేడి, వడగాలులతో ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావం చూపుతున్నాయి. పది గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో పగటి వేళ ఎక్కడ చూసినా రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. జిల్లాకు 4.34 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉండగా, వారం రోజులుగా 5 మిలియన్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని అధికారులు తెలిపారు. కాగా, శనివారం పల్లెగూడెం(ఖమ్మం రూరల్ మండలం), పెనుబల్లిలో 44.9, ఖానాపురం(ఖమ్మం అర్బన్), మధిరలో 44.8, తల్లాడలో 44.6, పెద్దగోపతి, ఎర్రుపాలెం, మధిర(ఏఆర్ఎస్), ముదిగొండ, కల్లూరు, సిరిపురంల్లో 44.5, వైరా, తిరుమలాయపాలెం, గేటు కారేపల్లి, గంగారంల్లో 44.3, తిమ్మారావుపేట, బచ్చోడు, కొనిజర్ల, చింతకానిలలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఒకట్రెండు చోట్ల 46 డిగ్రీలకు సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఏకంగా 45.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు నమోదైంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నుంచి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి. సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. మరోవైపు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే! -
ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనావేసింది. ఇది ఈనెల 8న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. -
కోటాకు మించి విద్యుత్ వినియోగం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎండలు మండుతున్న కొద్దీ కరెంటు వినియోగం మరింతగా పెరిగింది. మార్చి మాసం తొలి పక్షం గడవక ముందే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయచ్చు. రానురాను ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగం పెరుగుతున్నా ఇప్పటివరకూ ఎక్కడా కరెంటు కోతలు లేవు. ఈ మాసంలో రోజువారీ వినియోగం దాదాపు మూడు మిలియన్ యూనిట్లు అదనంగా పెరిగింది. కోటా దాటిపోయింది ఉమ్మడి అనంతపురం జిల్లాకు నెలకు 613.986 మిలియన్ యూనిట్ల కోటాగా ఎస్పీడీసీఎల్ కేటాయించింది. ఈ లెక్కన రోజుకు 19.806 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం కావాలి. ఈ కోటా ఎప్పుడో దాటింది. కోటాకంటే రెండు నుంచి మూడు మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగం అవుతున్నట్టు తేలింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య భారీగా లోడు పడుతోంది. ఏప్రిల్, మే నెలల్లో రోజువారీ 30 మిలియన్ యూనిట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోయేపరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగం పెరుగుతోందిలా.. ఫిబ్రవరి 15న పగలు ఓ మోస్తరు ఎండలున్నా రాత్రి పూట చలి వణికించేది. ఆ తర్వాత వాతావరణంలో మార్పు వచ్చింది. ఉక్కపోతకు తట్టుకోలేక చాలామంది ఏసీలు వేస్తున్నారు. కార్యాలయాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో సైతం ఏసీలు మొదలయ్యాయి. ఇక ఫ్యాన్లు 24 గంటలూ పనిచేయాల్సిందే. దీంతో ఒక్కసారిగా గృహ వినియోగంలో రోజూ మిలియన్ యూనిట్లలో తేడా కనిపిస్తోంది. మరోవైపు ఎంఎస్ఎంఈలు, మధ్య తరహా పరిశ్రమలు పెరుగుతున్నకొద్దీ వినియోగం ఎక్కువవుతోంది. అనంతపురం జిల్లా ఉద్యానపంటలకు ప్రసిద్ధి. ఏడాది పొడవునా బోర్లు నడుస్తూనే ఉంటాయి కాబట్టి నిరంతరం కరెంటు అవసరం ఉంటుంది. దీనివల్ల కూడా కరెంటు వినియోగం జిల్లాలో ఎక్కువగా ఉంది. -
రాత్రి చలితో.. పగలు ఎండతో.. జాగ్రత్త సూమా
సాక్షి, అమలాపురం : మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతోంది. శివరాత్రి దాటితే వేసవి ఎండలు వచ్చినట్టు భావిస్తారు. కానీ ఈసారి శివరాత్రి కన్నా ముందే వేసవి వచ్చినట్టుగా వాతావరణం కనిపిస్తోంది. గత 20 రోజుల్లో మధ్యలో మూడు నాలుగు రోజులు మినహా పగటి వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండ చురుక్కుమంటోంది. ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రాత్రి చలి తీవ్రత తగ్గడం లేదు. తెల్లవారు జామున మంచుదుప్పటి కప్పేస్తోంది. మరీ ముఖ్యంగా గడచిన రెండు రోజుల నుంచి జిల్లా మంచుముసుగులో చిక్కుకుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ మంచు కమ్ముకుంటోంది. ఉదయం పది దాటాక భానుడు చుర్రుమనిపించేస్తున్నాడు. జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కోనసీమ కేంద్రమైన అమలాపురం, జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉష్ణోగ్రతల కన్నా విచిత్రంగా ఏజెన్సీలోని రంపచోడవరం, చింతూరుల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. పగటి పూట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీలోని చింతూరులో 35, ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంతోపాటు మైదానంలో రాజమహేంద్రవరంలో 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో 32 డిగ్రీలు నమోదు కాగా, అమలాపురం, కాకినాడల్లో 31 డిగ్రీలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలకు వస్తే జిల్లాలో అతి తక్కువగా మారేడుమిల్లిలో 16 డిగ్రీలు, రంప చోడవరంలో 18, చింతూరు, రాజమహేంద్రవరాల్లో 19, అమలాపురంలో 20, కాకినాడలో 24 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. పగలు, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య వాతావరణం తేడాగా ఉండడం వల్ల ప్రజలు పలు రోగాల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరాలు, దగ్గు వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. ఇక కొబ్బరికి ప్రమాదంగా మారిన రూగోస్ వైట్ ఫ్లై (తెల్లదోమ) ఉధృతి పెరగడానికి ఇదే అనువైన కాలం. ఆరోగ్యం అప్రమత్తం సుమా.. వాతావరణ మార్పులతో వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైరల్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా అనారోగ్య లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ► మంచులో ఎక్కువగా తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వస్తే ► మంచు ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► అతి శీతల నీరు తాగకూడదు. బాగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ► గొంతునొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించి వైద్యం చేయించుకోవాలి. ► డ్రైనేజీల సమీపంలో నివసించే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల బెడద లేకుండా జాగ్రత్త పడాలి. వైద్యులను సంప్రదించాలి ప్రస్తుత వాతావరణ మార్పులతో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మంచులో ఎక్కువగా తిరగకూడదు. దగ్గు, జ్వరం తదితర ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యసాయం పొందాలి. – డాక్టర్ చైతన్య, సూపరింటెండెంట్, మండపేట ప్రభుత్వ ఆస్పత్రి -
నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఏజెన్సీ...
సాక్షి, ఖమ్మం(చర్ల): జూన్ నెలలోనూ ఎండలు మండిస్తున్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే వాటి ప్రతాపాన్ని చూపించేవి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మండించడం ప్రాంభమైన ఎండలు మార్చి, ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్ నెలలోనూ మండిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడిస్తూ ఉండగా సాయంత్రం 6 గంటల వరకూ తీవ్రతను అలాగే కొనసాగిస్తున్నాడు. జూన్ మొదటి నుంచే ప్రారంభం కావాల్సిన పాఠశాలలు వేసవి తీవ్రత నేపధ్యంలో ప్రభుత్వం జూన్ 11 వరకు పొడిగించి 12 నుంచి పాఠశాలలను తెరవాలంటూ ఆదేశించడంతో అదే విధంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. 12 నాటికి కూడా ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గక పోగా రెట్టింపయ్యింది. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు ఎండలతో అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తరువాత ఎండ తీవ్రతతో మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్నీ ప్రధాన గ్రామాలలో రహదారులు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. వివిధ పనుల కోసం భయటకు వచ్చే వారు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. పెంచన్లు కోసం బ్యాంకులకు వస్తున్న వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఈ ఎండలకు బ్యాంకుల వద్ద సొమ్మసిల్లి పడుతున్నారు. ఎండల తీవ్రత తగ్గేంత వరకు పాఠశాలలకు సెలవులు పొడగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో నెహ అనే 14 ఏళ్ల విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన కూడా జరిగింది. పాఠశాలల పునః ప్రారంభమైన రోజు నుంచి కూడా ఎండ తీవ్రత మరింత అధికంగా ఉండడంతో విద్యార్థులు పాఠశాలల్లో తీవ్ర ఆసౌకర్యానికి గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా అలాగే తరగతులను కొనసాగిస్తోంది. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు శాతం చాలా స్వల్పంగానే నమోదవుతోంది. -
పెరుగుతున్న‘భానుడి’.. భగభగలు
సాక్షి, మెదక్‌జోన్: మెతుకుసీమపై సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. పది రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. ఉపాధికూలీలు ఎండలోనే పనులు చేస్తూ ఆందోళనకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మార్చి రెండో వారంలోనే 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వచ్చే ఏప్రిల్‌లో 45డిగ్రీల కు చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతేడాది 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా ఈయేడు మరో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొం టున్నారు. ముఖ్యంగా షుగరు, బీపీ లాంటి వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నపిల్లలు, వయోవృద్ధులు, మహిళలు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. -
బ్యూటిప్స్
►ఎండలో కమిలిన ముఖానికి... ►వేసవి ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ ఎండల్లో కాసేపలా బయటకి వెళ్లి రాగానే ముఖం నల్లబడిపోవడం లేదా కమిలిపోవడం... ఆ తర్వాత ముఖం చూసుకుని ఉష్షోమని నిట్టూర్చడం సహజం. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరిపాలలో దూది ముంచి, దానితో ముఖమంతా సున్నితంగా మర్దనా చేసుకుని ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే తిరిగి ముఖం ఎప్పటిలా కాంతులీనుతుంది. ►బయటినుంచి వచ్చాక కొబ్బరినీళ్లతో ముఖం కడుక్కున్నా కొబ్బరినీళ్లలో దూది ముంచి ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడుక్కున్నా ముఖం తాజాగా కళ కళలాడుతుంది. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
చంద్రగిరి: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురం హరిజనవాడకు చెందిన గంగయ్య(62) ఎండ వేడిమిని తట్టుకోలేక మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై విరోచనాలు, వాం తులతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు పలుచోట్ల చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి వద్ద ఆయన మరోసారి అస్వస్థతకు గురై మృతి చెందాడన్నారు. -
మండుతున్న ఎండలు– అల్లాడుతున్న ప్రజలు
ఎచ్చెర్ల : మార్చి నెల ప్రారంభమే నడినెత్తిన సూరీడు చుర్రు మంటున్నాడు. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండతీవ్రతతో పాటు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మండలంలో చెరువులు, బావులు, తాగునీటి బోర్లలో నీరు అడుగంటుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు, కర్భూజా పండ్లకు గిరాకీ ఏర్పడింది. -
పిట్టల్లా రాలుతున్నారు
* వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 129 మంది మృతి * సాధారణంకంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు * నిజామాబాద్, రామగుండంలో 47, నల్లగొండలో 46 డిగ్రీలు * హైదరాబాద్‌లో గరిష్టం 44.3గా నమోదు * మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ * చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశం * ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 81 మంది మృతి సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం అగ్నిగుండంగా మారింది. మండుటెండలకు వందలాది మంది బలవుతున్నారు. ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడగాడ్పులకు వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం వారే ఉంటున్నారు. వడదెబ్బకు గురువారం ఒక్కరోజే రాష్ర్టవ్యాప్తంగా 129 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో 30 మంది, ఖమ్మంలో 25 మంది, నల్లగొండలో 20 మంది, వరంగల్ జిల్లాలో 22 మంది, మహబూబ్‌నగర్‌లో 11 మంది, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడుగురు చొప్పున,హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నిజామాబాద్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఎండలతో రాష్ర్టం నిప్పుల కొలిమిలా మారింది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువ గా నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా నిజామాబాద్, రామగుండంలో పగటి ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. బుధవారం కొత్తగూడెం లో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానికంగా వార్తలొచ్చినా అధికారులు దాన్ని ఖండించడం తెలిసిందే. నిజామాబాద్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా, రామగుండంలో నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరింది. శుక్రవారానికి 45 డిగ్రీలకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలంతా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి వైపరీత్యాల విభాగం కమిషనర్ బీఆర్ మీనా సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగూడెంలో 50 డిగ్రీలకుపైనే..! ఖమ్మం జిల్లా కొత్తగూడెం భగభగమంటోంది. సూర్యప్రతాపంతో కార్మిక వాడలు బెంబేలెత్తుతున్నారుు. అధికారికంగా నిర్ధారించకున్నా... మూడు రోజులుగా 49.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానికులు కాలు బయట పెట్టేందుకే భయపడుతున్నారు. కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ ఐరన్ వంటి పరిశ్రమలున్న పాల్వంచలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ఓపెన్‌కాస్టుల్లో గురువారం 51 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనా, సెలవు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులను విధులకు అనుమతించకపోవడం గమనార్హం. నెమళ్లు, కోడిపిల్లల మృతి మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో ఎండ తీవ్రతకుతోడు నీళ్లు లేకపోవడంతో 13 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. అటవీ శాఖ అధికారులు వాటిని గుర్తించి అక్కడే దహనం చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాగిబావి గ్రామంలోని కోళ్లఫారంలో వడదెబ్బకు గురై గురువారం 6500 కోడిపిల్లలు మృతిచెందాయి. హైదరాబాద్ శివార్లలో కూడా వేలాది కోళ్లు మృత్యువత పడ్డాయి. కరీంనగర్ జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ) ఆవరణలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు లేచారుు. యంత్ర సామగ్రి మొత్తం కాలిపోయింది. ఏపీ.. నిప్పుల కొలిమి సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం: మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే గురువారం మూడు నుంచి అయిదు డిగ్రీల సెల్సియస్‌కుపైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడలో అత్యధికంగా 46, గుంటూరులో 45.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పెరిగిన వేడికి వడగాల్పులు తోడవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 81 మంది మృతిచెందారు. తిరుమలలో ‘సూర్య’ ప్రతాపం తిరుమలలోనూ భానుడు ప్ర‘తాపాన్ని’ చూపించాడు. పగలు ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీలకు పైగా నమోదైంది. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఉక్కపోత తీవ్రరూపం దాల్చింది. దీంతో మధ్యాహ్నం ఆలయ ప్రాంతం బోసిపోయింది. అలాగే నాలుగు మాడ వీధుల్లో పాదరక్షల నిషేధం ఉండటంతో స్వామివారిని దర్శించుకుని వెలుపలికి వచ్చిన భక్తులు కాళ్లు కాలడంతో పరుగులు తీస్తూ కనిపించారు.