
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనావేసింది. ఇది ఈనెల 8న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది.